భారత్‌లో సంచలన ధర వద్ద విడుదలైన కొత్త 'జీప్ గ్రాండ్ చెరోకీ': పూర్తి వివరాలు

ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న 'జీప్' (Jeep) కంపెనీ యొక్క 'గ్రాండ్ చెరోకీ' (Grand Cherokee) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది.

జీప్ కంపెనీ విడుదక చేసిన ఈ ఆధునిక SUV గ్రాండ్ చెరోకీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కొత్త SUV గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భారత్‌లో విడుదలైన కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'జీప్ గ్రాండ్ చెరోకీ' ప్రారంభ ధర రూ. 77.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇప్పటికే కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో లేదా కంపెనీ డీలర్షిప్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి.

కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో సెవెన్ స్లాట్ గ్రిల్‌తో పాటు సొగసైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. అంతే కాకుండా కింది భాగంలో సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్‌లతో క్రిందికి నెంబర్ ప్లేట్ హౌసింగ్ మరియు చంకీ రియర్ బంపర్‌ వంటివి చూడవచ్చు.

భారత్‌లో విడుదలైన కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ

ఫీచర్స్ విషయానికి వస్తే, కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. దానికి కింది భాగంలో ఎయిర్ కండిషనింగ్ మరియు హీటింగ్ వెంటిలేషన్ కోసం బటన్స్ & డయల్‌ వంటివి ఉన్నాయి. ఇందులోని డ్యాష్‌బోర్డ్ లేయర్డ్ ఎఫెక్ట్‌ను కలిగి ఉంటుంది. కావున ఇది ఇప్పుడు చాలా ప్రీమియంగా కనిపిస్తుంది.

పైన చెప్పిన ఫీచర్స్ తో పాటు ఇందులో 10.25 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కూడా ఉన్నాయి. వెనుక సీటులో ఉండే ప్రయాణికుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు అందుబాటులో ఉంటాయి. ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ అపోల్స్ట్రే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు పవర్డ్ టెయిల్‌గేట్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

భారత్‌లో విడుదలైన కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ

కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ ఇప్పుడు కేవలం 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్ మాత్రమే పొందుతుంది. ఇది 272 హెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఆటో, స్పోర్ట్, మడ్, సాండ్ మరియు స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

జీప్ గ్రాండ్ చెరోకీ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, యాక్టివ్ లేన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇంటర్‌సెక్షన్ కొలిజన్ అసిస్ట్ సిస్టమ్, పాసివ్ పెడెస్ట్రియన్ డ్రైవ్ ప్రొటెక్షన్, 3-పాయింట్ సీట్ బెల్ట్‌, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు బ్లైండ్ స్పాట్ వంటివి ఉన్నాయి. ఇందులో లెవెల్ 2 ADAS ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త గ్రాండ్ చెరోకీ కేవలం 5 సీటర్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఇది గ్లోబల్ మార్కెట్లో 7 సీటర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది. ఈ 7 సీటర్ 3 వరుసల సీటింగ్ ఆప్సన్ పొందుతుంది. దేశీయ మార్కెట్లో ఈ 7 సీటర్ వేరియంట్ లాంచ్ అయ్యే అవకాశం లేదు. కాగా గ్రాండ్ చెరోకీ దేశీయ విఫణిలో మెర్సిడెస్ జిఎల్ఈ, బిఎండబ్ల్యు ఎక్స్5 మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Jeep grand cherokee launched in india at rs 77 50 lakh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X