విడుదలకు ముందే Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) దేశీయ మార్కెట్లో తన కొత్త MPV కియా కారెన్స్ (Kia Carens) విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే కంపెనీ ఈ కొత్త MPV ని విడుదల చేయడానికి ముందే ఇందులోని వేరియంట్ల వారిగా ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ వంటి వాటిని గురించిన సమాచారం వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త కియా కారెన్స్ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

అవి:

  • కియా కారెన్స్ ప్రీమియం
  • కియా కారెన్స్ ప్రెస్టీజ్
  • కియా కారెన్స్ ప్రెస్టీజ్ ప్లస్
  • కియా కారెన్స్ లగ్జరీ
  • కియా కారెన్స్ లగ్జరీ ప్లస్
  • ఇవి మొత్తం మూడు ఇంజిన్ అప్సన్లలో అందుబాటులో ఉంటాయి. అవి వరుసగా 1.5-లీటర్ పెట్రోల్ (MT), 1.5-లీటర్ డీజిల్ (MT, AT) మరియు 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ (MT, DCT).

    Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    కియా కారెన్స్ ప్రీమియం (Kia Carens Premium):

    కియా కారెన్స్ విడుదల చేయనున్న ఈ కొత్త వేరియంట్ 16-ఇంచెస్ స్టీల్ వీల్స్ (టర్బో-పెట్రోల్ మరియు డీజిల్) మరియు 15-ఇంచెస్ స్టీల్ వీల్స్ (1.5-లీటర్ పెట్రోల్) మరియు రియర్ స్పాయిలర్‌లు ఉన్నాయి. అంతే కాకూండా ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది.

    Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    ఈ వేరియంట్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది స్టోరేజ్‌తో కూడిన ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్‌లు, కప్‌హోల్డర్‌లతో రెండవ వరుస ఫోల్డింగ్ ఆర్మ్‌రెస్ట్‌లు, 60:40 స్ప్లిట్ ఫోల్డ్ సెకండ్ రో, 50:50 స్ప్లిట్ ఫోల్డ్ థర్డ్ రో మరియు సెమీ-లెదర్ సీట్లు ఉన్నాయి. అంతే కాకూండా.. ఇది అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్, రూమ్ ల్యాంప్స్, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఇండిగో యాసెంట్‌తో నలుపు మరియు లేత గోధుమరంగు థీమ్, రెండవ వరుస వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్, రెండవ మరియు మూడవ వరుస సీట్లకు రూఫ్-ఇంటిగ్రేటెడ్ AC వెంట్లు ఉన్నాయి.

    Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    ఇది ఆధునిక ఫీచర్స్ మాత్రమే కాకుండా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటర్ వంటివి అందుబటులో ఉంటాయి, కావున వాహన వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి.

    Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    కియా కారెన్స్ ప్రెస్టీజ్ (Kia Carens Prestige):

    కియా కారెన్స్ యొక్క రెండవ వేరియంట్ అయిన కియా కారెన్స్ ప్రెస్టీజ్ విషయానికి వస్తే, దీని వెలుపలి భాగంలో ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్, ORVMలపై LED టర్న్ సిగ్నల్స్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటివి ఉన్నాయి. అంతే కాకూండా ఇంటీరియర్‌లో ముడుచుకునే ట్రే మరియు కప్ హోల్డర్, ప్యాసింజర్ సీట్‌బ్యాక్ పాకెట్, లగేజ్ ల్యాంప్, సన్ గ్లాసెస్ హోల్డర్‌తో కూడిన కన్సోల్ ల్యాంప్, పవర్-అడ్జస్టబుల్ ORVMలు, డ్రైవింగ్ రియర్ వ్యూ మానిటర్ మరియు 4.2 TFT డిస్‌ప్లేతో కూడిన 12.5 ఇంచెస్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది.

    Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    అంతే కాకుండా రానున్న ఈ కొత్త MPV లో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, హెడ్‌ల్యాంప్ ఆటో లైట్ కంట్రోల్ మరియు వన్-టచ్ అప్/డౌన్ డ్రైవర్ విండో వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

    Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, డైనమిక్ మార్గదర్శకాలతో రియర్ వ్యూ కెమెరా మరియు ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్‌ల వంటివి ఉన్నాయి. వీటితో పాటు 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 6 స్పీకర్లు మరియు బ్లూటూత్ & వాయిస్ రికగ్నిషన్‌ను వంటి వాటిని పొందుతుంది.

    Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    కియా కారెన్స్ ప్రెస్టీజ్ ప్లస్ (Kia Carens Prestige Plus):

    కియా కారెన్స్ ప్రెస్టీజ్ ప్లస్ విషయానికి వస్తే, ఇది ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ DRL లు మరియు 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఇంటీరియర్‌ విషయానికి వస్తే, రియర్ సన్‌షేడ్ కర్టెన్‌లు, ఆటో ఏసీ, రిమోట్ ఇంజిన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ మరియు క్రూయిజ్ కంట్రోల్‌ వాణి వాటిని పొందుతాయి.

    Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    పైన తెలిపిన ఆ ఫీచర్స్ మాత్రమే కాకుండా, ఇది మొదటి మరియు రెండవ వరుసలలో పుష్-బటన్ స్టార్ట్, పవర్ ఫోల్డింగ్ ORVMలు, డ్రైవ్ మోడ్, కూలింగ్ కప్ హోల్డర్‌లను కూడా పొందుతుంది. ఈ వేరియంట్‌లో రియర్ వైపర్, వాషర్ మరియు డీఫాగర్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

    Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    కియా కారెన్స్ లగ్జరీ (Kia Carens Luxury):

    కియా మోటార్స్ యొక్క కియా కారెన్స్ లగ్జరీ వేరియంట్ విషయానికి వస్తే, ఇది ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఐస్ క్యూబ్ ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్‌లు మరియు టర్న్ సిగ్నల్స్‌తో కూడిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ వంటి వాటితో పాటు LED హెడ్‌ల్యాంప్‌లు, ఐస్ క్యూబ్ LED ఫాగ్ ల్యాంప్స్, LED DRLలు టర్న్ సిగ్నల్స్ మరియు కియా కనెక్ట్ బటన్‌తో ఆటో డిమ్మింగ్ IRVM వంటి వాటిని పొందుతుంది.

    కేవలం ఈ ఫీచర్స్ మాత్రమే కాకుండా, లెదర్ చుట్టిన స్టీరింగ్ వీల్ మరియు సీట్ ట్రే కింద స్లైడింగ్ ఫీచర్‌ను పొందుతుంది. అంతే కాకుండా ఈ వేరియంట్ ఇంటీరియర్ ఎయిర్ ప్యూరిఫైయర్, టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌తో కియా కనెక్ట్ మరియు OTA మ్యాప్ మరియు సిస్టమ్ అప్‌డేట్‌లను పొందబోతోంది. ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

    Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    కియా కారెన్స్ లగ్జరీ ప్లస్ (Kia Carens Luxury Plus):

    కియా మోటార్స్ విడుదల చేయనున్న అధునాతన MPV కియా కారెన్స్ లో ఇది చిట్ట చివరి వేరియంట్. ఇది అద్భుతమైన ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌ ఫీచర్స్ పొందుతుంది. ఈ వేరియంట్ సన్‌రూఫ్ ఫీచర్‌ను పొందుతుంది. అంతే కాకూండా రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు (6-సీట్ల ఆప్సన్), LED క్యాబిన్ ల్యాంప్స్ మరియు డ్రైవింగ్ మోడ్‌తో అనుసంధానించబడిన క్యాబిన్ యాంబియంట్ లైటింగ్ వంటి వాటిని పొందుతుంది.

    Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    ఇది కాకుండా, ఈ వేరియంట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కూలింగ్ ఫంక్షన్‌తో వైర్‌లెస్ ఛార్జింగ్, పాడిల్ షిఫ్టర్స్ (DCT, AT) మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్‌లను కూడా కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈ కారులో 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

    Kia Carens వేరియంట్ వారీగా డిజైన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    అయితే కంపెనీ ఈ MPV కోసం 2022 జనవరి 14 నుంచి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు ప్రకటించింది. కొత్త కియా కారెన్స్ MPV దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత 6/7 సీట్ల MPV విభాగంలో ప్రవేశిస్తుంది. ఈ విభాగానికి దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. కావున కియా యొక్క కొత్త కార్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశించవచ్చు. ఈ కొత్త MPV భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత టయోటా ఇన్నోవా క్రిష్టా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Kia carens mpv variant wise features revealed expected launch soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X