జోరు పెంచిన కియా మోటార్స్.. 200 చేరుకున్న ఈవి6 డెలివరీలు

'కియా మోటార్స్' (Kia Motors) దేశీయ మార్కెట్లో తన 'ఈవి6' (EV6) ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసినప్పటినుంచి ఇప్పటివరకు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది.

కంపెనీ ఇప్పటివరకు మంచి స్థాయిలో బుకింగ్స్ పొందుతోంది, అదే సమయంలో 200 యూనిట్ల డెలివరీలను పూర్తి చేసి డెలివరీలో మంచి రికార్డ్ పొందగలిగింది. కియా ఈవి6 డెలివరీలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

200 చేరుకున్న కియా ఈవి6 డెలివరీలు

కియా మోటార్స్ అందించిన సమాచారం ప్రకారం, ఇప్పటికి ఏకంగా 200 యూనిట్ల ఈవి6 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసినట్లు తెలిసింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ధరలను ప్రకటించకముందే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందగలిగింది. కాగా అక్టోబర్ నెలలో డెలివరీలను ప్రారభించి మొదట్లో 152 యూనిట్లను డెలివరీ చేసింది. కాగా ఇప్పటికి ఆ సంఖ్య 200 కి చేరింది.

కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని బుకింగ్స్ అందుకోవడమే కాకుండా కస్టమర్లకు త్వరగా డెలివరీలను చేయడానికి తగిన సన్నాహాలు కూడా సిద్ధం చేస్తుంది. కావున రానున్న రోజుల్లో ఈ డెలివరీ యూనిట్ల సంఖ్య తప్పకుండా పెరుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారుకి మార్కెట్లో ఇప్పటికి మంచి ఆదరణ ఉంది.

భారతీయ మార్కెట్లో కియా ఈవి6 (Kia EV6) ఎలక్ట్రిక్ కారు ధర రూ. 59.95 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదలైంది. కాగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని దేశీయ విఫణిలో విడుదలచేయకముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే మొత్తమ్ అమ్ముడైపోయాయి.

కొత్త కియా ఈవి6 అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో వాలుగా ఉండే రూప్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్ మరియు పెద్ద రియర్ విండ్‌స్క్రీన్‌ వంటివి ఉంటాయి. ఇక్కడ స్పోర్టీ అల్లాయ్ వీల్స్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. రియర్ ప్రొఫైల్ లో డ్యూయెల్ టోన్ బంపర్, బూట్ లిప్ స్పాయిలర్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇవి రెండూ కూడా ఒకే ప్యానెల్ లో అమర్చబడి ఉన్నాయి. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, స్మార్ట్ పవర్ టైల్ గేట్, షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

కియా ఈవి6 ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 528 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని సర్టిఫైడ్ చేయబడింది. దీని కోసం కంపెనీ 77.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చింది. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.

350 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోగలదు.అదే సమయంలో ఇది 50 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 73 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోగలదు. మొత్తం మీద ఇది ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉండటం వల్ల ఎక్కువమంది కొనుగోలుదారులు ఎగబడుతున్నారు.

Most Read Articles

English summary
Kia ev6 200 units delivered details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X