రూ. 54,000 వరకూ పెరిగిన కియా (Kia) కార్ల ధరలు.. సెల్టోస్, సోనెట్ మోడళ్లపై ఎంత పెరిగాయంటే..

కొరియన్ కార్ కంపెనీ కియా ఇండియా (Kia India) కొత్త సంవత్సరంలో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఈ కంపెనీ దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ మూడు మోడళ్ల (సోనెట్, సెల్టోస్ మరియు కార్నివాల్) ధరలను భారీగా పెంచింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ ని బట్టి కియా కార్ల ధరలు రూ. 54,000 వరకు పెరిగాయి. ఏయే మోడల్ మరియు వేరియంట్ లపై ఎంత మేర ధరలు పెరిగాయో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రూ. 54,000 వరకూ పెరిగిన కియా (Kia) కార్ల ధరలు.. సెల్టోస్, సోనెట్ మోడళ్లపై ఎంత పెరిగాయంటే..

కియా భారతదేశంలోకి ప్రవేశించిన అతికొద్ది కాలంలోనే ఘన విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. దేశీయ విపణిలో కంపెనీ తయారు చేస్తున్నది రెండు మోడళ్లే (సోనెట్, సెల్టోస్) అయినప్పటికీ, వీటికి ఇప్పుడు విస్తృతమైన డిమాండ్ ఏర్పడింది. సెల్టోస్ (Kia Sletos) ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించిన కియా ఆ తర్వాత కార్నివాల్ (Kia Carnival) ఎమ్‌పివిని విదేశాల నుండి దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయించడం ప్రారంభించింది. ఆ తర్వాత సోనెట్ (Kia Sonet) విడుదలతో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని తీవ్రతరం చేసింది.

రూ. 54,000 వరకూ పెరిగిన కియా (Kia) కార్ల ధరలు.. సెల్టోస్, సోనెట్ మోడళ్లపై ఎంత పెరిగాయంటే..

కియా సెల్టోస్ విషయానికి వస్తే, ఇదొక బెస్ట్ సెల్లింగ్ 5-సీటర్ మిడ్-సైజ్. కియా అనుబంధ సంస్థ అయిన హ్యుందాయ్ తయారు చేస్తున్న క్రెటా ఎస్‌యూవీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి సెల్టోస్ ను తయారు చేశారు. కియా సెల్టోస్ మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో మొదటిది 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (113.45bhp మరియు 250Nm టార్క్‌), రెండవది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (113.18bhp మరియు 144Nm టార్క్‌) మరియు మూడవది 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ (138.12 bhp పవర్ మరియు 242Nm టార్క్‌).

రూ. 54,000 వరకూ పెరిగిన కియా (Kia) కార్ల ధరలు.. సెల్టోస్, సోనెట్ మోడళ్లపై ఎంత పెరిగాయంటే..

ఈ కారులోని అన్ని ఇంజన్ ఆప్షన్లు కూడా ఆటోమేటిక్ లేదా మాన్యువల్ గేర్‌బాక్స్ తో అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల అవసరం మరియు ఉపయోగాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. ఇక ఈ కారులో లభించే ప్రధానమైన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM) మరియు హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), ప్రీమియం బోస్ 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

Seltos P 1.5 New Price Old Price Difference
HTE ₹9.95 Lakh ₹9.95 Lakh 0
HTK ₹10.95 Lakh ₹10.84 Lakh ₹11,000
HTK+ ₹11.99 Lakh ₹11.89 Lakh ₹10,000
HTK + iMT ₹12.39 Lakh ₹12.29 Lakh ₹10,000
HTX ₹13.85 Lakh ₹13.75 Lakh ₹10,000
HTX IVT ₹14.85 Lakh ₹14.75 Lakh ₹10,000
Seltos P 1.4 New Price Old Price Difference
GTX (O) ₹15.55 Lakh ₹15.45 Lakh ₹10,000
GTX+ ₹16.85 Lakh ₹16.75 Lakh ₹10,000
GTX+ DCT ₹17.65 Lakh ₹17.54 Lakh ₹11,000
X-Line DCT ₹17.85 Lakh ₹17.79 Lakh ₹6,000
Seltos D 1.5 New Price Old Price Difference
HTE ₹10.75 Lakh ₹10.65 Lakh ₹10,000
HTK ₹12.09 Lakh ₹11.99 Lakh ₹10,000
HTK+ ₹13.29 Lakh ₹13.19 Lakh ₹10,000
HTK+ AT ₹14.25 Lakh ₹14.15 Lakh ₹10,000
HTX ₹15.05 Lakh ₹14.95 Lakh ₹10,000
HTX+ ₹16.09 Lakh ₹15.99 Lakh ₹10,000
GTX+ AT ₹17.95 Lakh ₹17.85 Lakh ₹10,000
X-Line AT ₹18.19 Lakh ₹18.10 Lakh ₹9,000
రూ. 54,000 వరకూ పెరిగిన కియా (Kia) కార్ల ధరలు.. సెల్టోస్, సోనెట్ మోడళ్లపై ఎంత పెరిగాయంటే..

ఓవరాల్ గా చూస్తే కియా సెల్టోస్ ధర రూ. 11,000 మాత్రమే పెరిగింది, అయితే ఇది కేవలం HTK మరియు GTX ఆటోమేటిక్ వేరియంట్‌లకు మాత్రమే పరిమితం చేయబడింది. అలాగే, కియా సెల్టోస్ యొక్క X-line DCT వేరియంట్ ధర రూ. 6,000 పెరిగింది. కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు ఎమ్‌జి ఆస్టర్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

రూ. 54,000 వరకూ పెరిగిన కియా (Kia) కార్ల ధరలు.. సెల్టోస్, సోనెట్ మోడళ్లపై ఎంత పెరిగాయంటే..

కియా ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్ (Kia Sonet) విషయానికి వస్తే, ఇందులో GTX+ వేరియంట్‌ల ధరలు రూ. 24,000 వరకూ పెరిగాయి. అయితే, ఇందులోని కొన్ని వేరియంట్‌ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం, భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో లభిస్తున్న అత్యుత్తమ మోడళ్లలో సోనెట్ ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ విభాగంలో లభిస్తున్న మోడళ్లలో కెల్లా అధిక ఫీచర్లు ఈ కారులో అందుబాటులో ఉన్నాయి.

రూ. 54,000 వరకూ పెరిగిన కియా (Kia) కార్ల ధరలు.. సెల్టోస్, సోనెట్ మోడళ్లపై ఎంత పెరిగాయంటే..

ఈ చిన్న కారులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్-అడ్జస్టబుల్ రియర్‌వ్యూ మిర్రర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో కీలెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

Sonet P 1.2 New Price Old Price Difference
HTE 5MT ₹6.95 Lakh ₹6.89 Lakh ₹6,000
HTK 5MT ₹7.95 Lakh ₹7.89 Lakh ₹6,000
HTK+ 5MT ₹8.79 Lakh ₹8.75 Lakh ₹6,000
Sonet P 1.0 New Price Old Price Difference
HTK+ iMT ₹9.89 Lakh ₹9.89 Lakh 0
HTX iMT ₹10.49 Lakh ₹10.39 Lakh ₹10,000
HTX 7 DCT ₹11.09 Lakh ₹10.09 Lakh 0
HTX+ iMT ₹11.89 Lakh ₹11.85 Lakh ₹4,000
GTX+ iMT ₹12.35 Lakh ₹12.29 Lakh ₹6,000
GTX+ 7DCT ₹12.99 Lakh ₹12.99 Lakh 0
Sonet D 1.5 New Price Old Price Difference
HTE 6MT ₹8.65 Lakh ₹8.55 Lakh ₹10,000
HTK 6MT ₹9.59 Lakh ₹9.49 Lakh ₹10,000
HTK+ 6MT ₹10.09 Lakh ₹9.99 Lakh ₹10,000
HTX 6MT ₹10.89 Lakh ₹10.69 Lakh ₹20,000
HTX 6AT ₹11.69 Lakh ₹11.49 Lakh ₹20,000
HTX+ 6MT ₹12.39 Lakh ₹12.19 Lakh ₹20,000
GTX+ 6MT ₹12.89 Lakh ₹12.65 Lakh ₹24,000
GTX+ 6AT ₹13.69 Lakh ₹13.45 Lakh ₹24,000
రూ. 54,000 వరకూ పెరిగిన కియా (Kia) కార్ల ధరలు.. సెల్టోస్, సోనెట్ మోడళ్లపై ఎంత పెరిగాయంటే..

కియా సెల్టోస్ మాదిరిగానే సోనెట్ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడినప్పుడు 99bhp పవర్ మరియు 250Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడినప్పుడు 114bhp పవర్ ని జనరేట్ చేస్తుంది. ఇందులో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 118bhp పవర్ మరియు 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ క్లచ్‌లెస్ iMT లేదా 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

రూ. 54,000 వరకూ పెరిగిన కియా (Kia) కార్ల ధరలు.. సెల్టోస్, సోనెట్ మోడళ్లపై ఎంత పెరిగాయంటే..

కొరియన్ కార్ కంపెనీ అందిస్తున్న ప్రీమియం లగ్జరీ ఎమ్‌పివి కార్నివాల్ (Kia Carnival) విషయానికి వస్తే, ఇందులో బేస్ ప్రీమియం వేరియంట్ ధర రూ. 54,000 మేర పెరగగా, మిగిలిన అన్ని వేరియంట్‌ల ధరలు రూ. 50,000 మేర పెరిగాయి. కియా కార్నివాల్ ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. ఇందులోని 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 198bhp పవర్ ను మరియు 440Nm టార్క్‌ ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

రూ. 54,000 వరకూ పెరిగిన కియా (Kia) కార్ల ధరలు.. సెల్టోస్, సోనెట్ మోడళ్లపై ఎంత పెరిగాయంటే..

కియా కార్నివాల్ లో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. ఈ కారు వివిధ రకాల కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇందులో 7-సీటర్ VIP సీటింగ్, 8-సీటర్ మరియు 9-సీటర్ కాన్ఫిగరేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ లగ్జరీ ఎమ్‌పివిలో డ్యూయల్ సన్‌రూఫ్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

Carnival New Price Old Price Difference
Premium 7S AT ₹25.49 Lakh ₹24.95 Lakh ₹54,000
Prestige 7S AT ₹29.99 Lakh ₹29.49 Lakh ₹50,000
Limousine 7S AT ₹32.49 Lakh ₹31.99 Lakh ₹50,000
Limousine+ 7S AT ₹34.49 Lakh ₹33.99 Lakh ₹50,000
Prestige 6S AT ₹29.49 Lakh NA -
రూ. 54,000 వరకూ పెరిగిన కియా (Kia) కార్ల ధరలు.. సెల్టోస్, సోనెట్ మోడళ్లపై ఎంత పెరిగాయంటే..

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతం కియా సెల్టోస్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా మారింది. కియా భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే 1 లక్ష యూనిట్ల వాహన విక్రయాల మైలురాయిని చేరుకుంది. కియా అందిస్తున్న సోనెట్ మరియు సెల్టోస్ మోడళ్లకు అధిక డిమాండ్ ఉంది, ఇవి రెండూ హాట్ కేకుల్లా అమ్మడుపోతున్నాయి. అయితే, తాజాగా పెంచిన ధరలు స్వల్పంగానే ఉన్నాయి కాబట్టి, ఈ ధరల పెంపు వీటి అమ్మకాలను ప్రభావితం చేయబోదని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Kia india increases the prices of its entire model lineup new price list details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X