రీకాల్ అలెర్ట్: కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివిలో ఎయిర్‌బ్యాగ్ సమస్య.. 47,174 యూనిట్లను రీకాల్ చేసిన కియా!

మీరు ఇటీవల కియా కారెన్స్ ఎమ్‌పివిని కొనుగోలు చేశారా? అయితే, బహుశా మీ కారులో ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌కి సంబంధించిన సమస్య ఉండే అవకాశం ఉంది. కియా ఇటీవలే తమ కార్లలో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించింది. ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్‌లో ఏవైనా సంభావ్య లోపాలను తనిఖీ చేయడానికి మరియు వాటిని సరిచేయడానికి కియా ఇండియా మొత్తం 44,174 యూనిట్ల కారెన్స్ ఎమ్‌పివిలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

రీకాల్ అలెర్ట్: కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివిలో ఎయిర్‌బ్యాగ్ సమస్య.. 47,174 యూనిట్లను రీకాల్ చేసిన కియా!

అయితే, ఈ సమస్యకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, తామే తనిఖీ కోసం వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేయడాన్ని ఎంచుకున్నామని, అవసరమైతే సాఫ్ట్‌వేర్ ని కూడా ఉచితంగా అప్‌డేట్ చేస్తామని కియా ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ స్వచ్ఛంద రీకాల్ గురించి తమ వినియోగదారులకు తెలియజేయడానికి, కియా డీలర్లు సంబంధిత వాహనాల యజమానులతో వ్యక్తిగతంగా మాట్లాడతామని కంపెనీ తెలిపింది.

రీకాల్ అలెర్ట్: కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివిలో ఎయిర్‌బ్యాగ్ సమస్య.. 47,174 యూనిట్లను రీకాల్ చేసిన కియా!

ఈ స్వచ్ఛంద రీకాల్‌కు వర్తించే కియా కారెన్స్ కస్టమర్లు తమ స్థానిక కియా అధీకృత డీలర్‌ను సంప్రదించడం ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని, ఈ సమస్యను సరిచేయించుకోవచ్చు. కొరియన్ కార్ బ్రాండ్ కియా, గడచిన ఫిబ్రవరి నెలలో కేవలం రూ.8.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే సరికొత్త కారెన్స్ ఎమ్‌పివిని (Kia Carens) భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఈ ఎమ్‌పివి అత్యధికంగా అమ్ముడవుతున్న కియా కారుగా మారింది.

రీకాల్ అలెర్ట్: కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివిలో ఎయిర్‌బ్యాగ్ సమస్య.. 47,174 యూనిట్లను రీకాల్ చేసిన కియా!

సరసమైన ధర, ఎక్కువ సీటింగ్ (6-సీట్లు లేదా 7-సీట్లు) సామర్థ్యం మరియు అధునాతన ఫీచర్ల కారణంగా కియా కారెన్స్ అతి తక్కువ కాలంలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచింది. హై డిమాండ్ కారణంగా ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోయింది. కియా కారెన్స్ ఈ విభాగంలో మారుతి సుజుకి ఎక్స్ఎల్6 మరియు ఎర్టిగా కస్టమర్లను తన వైపుకు ఆకర్షిస్తోంది. కియా కారెన్స్ చూడటానికి ఎమ్‌పివిలా ఉన్నప్పటికీ, ప్రాక్టికాలిటీ పరంగా ఇది మార్కెట్లోని అనేక 7-సీటర్ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది.

రీకాల్ అలెర్ట్: కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివిలో ఎయిర్‌బ్యాగ్ సమస్య.. 47,174 యూనిట్లను రీకాల్ చేసిన కియా!

కియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కియా సెల్టోస్ (Kia Seltos) మాదిరిగానే కియా కారెన్స్ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. సెల్టోస్‌లో ఉపయోగించిన ఇంజన్లనే కియా కారెన్స్ లో కూడా ఉపయోగించారు. ఇది మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. ఇది 6-సీటర్ లేదా 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది.

రీకాల్ అలెర్ట్: కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివిలో ఎయిర్‌బ్యాగ్ సమస్య.. 47,174 యూనిట్లను రీకాల్ చేసిన కియా!

గడచిన ఫిబ్రవరి నెలలో కియా కారెన్స్ ను విడుదల చేసినప్పుడు దాని ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. అయితే, గడచిన సెప్టెంబర్ నెలలో కియా సైలెంట్‌గా కారెన్స్ ధరలను పెంచేసింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి కియా కారెన్స్ ధరలు గరిష్టంగా రూ.70,000 వరకూ పెరిగాయి. తాజా ధరల పెంపు అనంతరం కియా కారెన్స్ బేస్ వేరియంట్ ధర రూ. 9.59 లక్షల (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది.

రీకాల్ అలెర్ట్: కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివిలో ఎయిర్‌బ్యాగ్ సమస్య.. 47,174 యూనిట్లను రీకాల్ చేసిన కియా!

కియా కారెన్స్ ఎమ్‌పివిలో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఫుల్-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ముందు భాగంలో వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, 2వ మరియు 3వ వరుస ప్రయాణీకుల కోసం రూఫ్-మౌంటెడ్ ఏసి వెంట్స్, యాంబియంట్ లైటింగ్, 8-స్పీకర్లతో కూడిన బోస్ ఆడియో సిస్టమ్ మరియు కూల్డ్ కప్ హోల్డర్‌లు వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

రీకాల్ అలెర్ట్: కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివిలో ఎయిర్‌బ్యాగ్ సమస్య.. 47,174 యూనిట్లను రీకాల్ చేసిన కియా!

అంతేకాకుండా, ఇందులో కియా బ్రాండ్ యొక్క UVO కార్ కనెక్ట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. కియా కనెక్ట్ సిస్టమ్ లో భాగంగా జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ పొజిషనింగ్ మరియు ట్రాకింగ్ వంటి 66 రకాల ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, ఇంజన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ మరియు డోర్ లాక్/అన్‌లాక్ వంటి కొన్ని రిమోట్ కంట్రోల్డ్ ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి. కారు లోపల వైరస్ మరియు బ్యాక్టీరియా రక్షణ కోసం ఇందులో సరికొత్త స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

రీకాల్ అలెర్ట్: కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివిలో ఎయిర్‌బ్యాగ్ సమస్య.. 47,174 యూనిట్లను రీకాల్ చేసిన కియా!

అలాగే, సేఫ్టీ విషయానికి వస్తే, కియా కారెన్స్‌లో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC) , ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, హిల్-హోల్డ్ అసిస్టెన్స్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే, 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. ఇవన్నీ వివిధ రకాల గేర్‌బాక్స్ కాన్ఫిగరేషన్లతో లభిస్తాయి.

Most Read Articles

English summary
Kia india recalls 44174 unit carens mpvs due to airbag control software issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X