Kia India కి కలిసిరాని 2021 డిసెంబర్.. 34.02 శాతం తగ్గిన అమ్మకాలు

సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) ఎట్టకేలకు తన 2021 డిసెంబర్ నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ అమ్మకాలు గత 2021 డిసెంబర్ నెలలో 34.02 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కియా మోటార్స్ యొక్క అమ్మకాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

Kia India కి కలిసిరాని 2021 డిసెంబర్.. 34.02 శాతం తగ్గిన అమ్మకాలు

కంపెనీ విడుదల చేసిన నివేదికల ప్రకారం, 2021 ప్రారంభంలో అమ్మకాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, గత నాలుగు నెలలుగా అమ్మకాలు క్షీణిస్తూ వచ్చాయి. ఇందిలో భాగంగానే డిసెంబర్ నెలలో కంపెనీ 7,797 మాత్రమే విక్రయించింది. అయితే అంతకుముందు సంవత్సరం, అంటే 2020 డిసెంబర్ లో కంపెనీ యొక్క అమ్మకాలు 11,818 యూనిట్లు. కంపెనీ యొక్క అమ్మకాలు 2020 కంటే కూడా 2021 లో 34.02 తగ్గుదలను నమోదు చేసింది.

Kia India కి కలిసిరాని 2021 డిసెంబర్.. 34.02 శాతం తగ్గిన అమ్మకాలు

అదే సమయంలో 2021 మొదటి త్రైమాసికంలో అమ్మకాలను పరిశీలిస్తే, ఆ సమయంలో అమ్మకాలు చాలా పురోగతిని సాధించాయి. అప్పుడు అమ్మకాలు 55,000 యూనిట్ల కంటే తక్కువగా ఉన్నాయి. 2020 సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2021 మొదటి త్రైమాసికంలో అమ్మకాల వృద్ధి 38.26 శాతం ఎక్కువగా ఉంది. ఆ సమయంలో కంపెనీ 39,677 యూనిట్లను విక్రయించింది.

Kia India కి కలిసిరాని 2021 డిసెంబర్.. 34.02 శాతం తగ్గిన అమ్మకాలు

2021 రెండవ త్రైమాసికంలో అమ్మకాలు 42,176 యూనిట్లకు తగ్గాయి. అంతకుముందు సంవత్సరం త్రైమాసికంలో, బేస్ సేల్స్ తక్కువగా ఉన్న దృష్ట్యా అమ్మకాలలో గణనీయమైన పెరుగుదల ఉంది. 2020 సంవత్సరం రెండవ త్రైమాసికంలో, కంపెనీ 8,936 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ సంవత్సరం అమ్మకాల్లో 371.98 శాతం వృద్ధిని సాధించింది.

Kia India కి కలిసిరాని 2021 డిసెంబర్.. 34.02 శాతం తగ్గిన అమ్మకాలు

2021 సంవత్సరం ప్రథమార్ధం అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ 2021 జనవరి నుండి జూన్ 2021 వరకు మొత్తం 97,034 యూనిట్ల వాహనాలను విక్రయించగా, 2020 సంవత్సరం ఇదే సమయంలో 48,613 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ ఏడాది అర్ధ వార్షిక అమ్మకాలు మునుపటికంటే కూడా 99.61 శాతం పెరిగాయి.

Kia India కి కలిసిరాని 2021 డిసెంబర్.. 34.02 శాతం తగ్గిన అమ్మకాలు

మూడవ త్రైమాసిక విక్రయాలను పరిశీలిస్తే, కంపెనీ జూలై మరియు సెప్టెంబర్ మధ్య కాలంలో 46,207 యూనిట్ల కార్లను విక్రయించింది, 2020 ఇదే సమయంలో 38,031 యూనిట్ల హోల్‌సేల్ వాహనాలతో పోలిస్తే. 2021 మూడో త్రైమాసిక విక్రయాల్లో 21.50 శాతం వృద్ధి నమోదైంది. నాల్గవ త్రైమాసిక గణాంకాలను పరిశీలిస్తే, అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య కంపెనీ మొత్తం 38,342 యూనిట్లను విక్రయించింది, 2020 సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ మొత్తం 53,861 వాహనాలను విక్రయించింది. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో కంపెనీ 28.81 శాతం క్షీణతను చూడాల్సి వచ్చింది.

Kia India కి కలిసిరాని 2021 డిసెంబర్.. 34.02 శాతం తగ్గిన అమ్మకాలు

కియా ఇండియా యొక్క 2021 జూలై మరియు 2021 డిసెంబర్ మధ్య 84,549 యూనిట్ల వాహనాలను విక్రయించింది, 2020 ఇదే సమయంలో విక్రయించిన 91,892 యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది ద్వితీయార్థంలో కంపెనీ విక్రయాలు 7.99 శాతం క్షీణించాయి.

Kia India కి కలిసిరాని 2021 డిసెంబర్.. 34.02 శాతం తగ్గిన అమ్మకాలు

ఇక చివరగా కంపెనీ యొక్క మొత్తం సంవత్సర అమ్మకాల విషయానికి వస్తే, 2021 సంవత్సరంలో కంపెనీ మొత్తం 1,81,583 యూనిట్ల వాహనాలను విక్రయించగా, 2020 కాలంలో కంపెనీ మొత్తం 1,40,505 యూనిట్ల వాహనాలను విక్రయించింది. వార్షిక అమ్మకాల పరంగా 2020 కంటే 2021 లో 29.24 శాతం పెరిగాయి. కంపెనీ యొక్క అమ్మకాలు తగ్గడానికి ఒక వైపు కరోనా మరోవైపు సెమికండక్టర్ చిప్ కొరత కారణం అని భావిస్తున్నారు.

Kia India కి కలిసిరాని 2021 డిసెంబర్.. 34.02 శాతం తగ్గిన అమ్మకాలు

ఇదిలా ఉండగా ఇటీవల కియా మోటార్స్ కంపెనీ, తన కొత్త కియా కారెన్స్ MPV ని దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని బుకింగ్స్ 2022 జనవరి 14 నుంచి ప్రారంభం కానున్నాయి, అయితే ఇది త్వరలో మార్కెట్లో విడుదల కానుంది, కానీ ఇది ఎప్పుడు మార్కెట్లో విడుదలవుతుంది అనే సమాచారం మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

Kia India కి కలిసిరాని 2021 డిసెంబర్.. 34.02 శాతం తగ్గిన అమ్మకాలు

కొత్త కియా కారెన్స్ పెట్రోల్ మరియు డీజిల్ రెండింటితో సహా మల్టిపుల్ ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఎంపికలలో అందించబడుతుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు ఇవ్వబడతాయి. మ్యాన్యువల్, ఆటోమేటిక్, డిసిటి గేర్‌బాక్స్ ఆప్షన్‌తో పాటు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఇందులో అందించే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Kia india sales december 7797 units decline by 34 percent details
Story first published: Tuesday, January 4, 2022, 11:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X