2022 స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించిన మహీంద్రా.. ఇప్పుడు కొత్త డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

మహీంద్రా కంపెనీ యొక్క చరిత్రను తిరగరాసిన 'స్కార్పియో' (Scorpio) ఇప్పుడు ఆధునిక అప్డేట్స్ తో 'స్కార్పియో క్లాసిక్' పేరుతో భారతీయ మార్కెట్లో ఆవిష్కరించబడింది. ఇది ఇప్పుడు రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి 'క్లాసిక్ ఎస్' మరియు 'క్లాసిక్ ఎస్11' వేరియంట్స్. ఈ కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

2022 స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించిన మహీంద్రా.. కొత్త డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

గత 20 సంవత్సరాలుగా తిరుగులేని SUV గా కంపెనీకి అత్యధిక అమ్మకాలు కల్పించిన మహీంద్రా స్కార్పియో ఇప్పుడు తన వినియోగదారుల కోసం కొత్త అవతార్ లో తీసుకురాబడింది. ఇది మునుపటికంటే కూడా ఆధునిక డిజైన్ కలిగి ఉంది. ఈ కొత్త SUV ముందు భాగంలో కొత్త 'మహీంద్రా లోగో' ఉంది. అదే సమయంలో ఫ్రంట్ డిజైన్ కూడా చాలా వరకు అప్డేట్ చేయబడి ఉంది.

2022 స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించిన మహీంద్రా.. కొత్త డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

మొదటి సారి మహీంద్రా స్కార్పియో క్లాసిక్ చూసిన వెంటనే, మునుపటి మోడల్ ని గుర్తుకు తెస్తుంది. కానీ ఇందులోని రిఫ్రెష్డ్ ఫ్రంట్ గ్రిల్‌ దీనిని స్పష్టంగా కొత్తది అని చూపించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో పాటు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ కోసం కొత్త డిజైన్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ కూడా ఇక్కడ చూడవచ్చు.

2022 స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించిన మహీంద్రా.. కొత్త డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, కొత్త స్కార్పియో క్లాసిక్ 5 స్పోక్ 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది, అయితే ఇవి మునుపటి మోడల్ ని గుర్తుకు తెస్తాయి. కానీ డైమండ్-కట్ ఫినిషింగ్ పొందుతాయి. డోర్‌లపైన డ్యూయల్ టోన్ క్లాడింగ్‌ కూడా దీనికి మరింత ఆకర్షణను అందిస్తుంది. రియర్ ప్రొఫైల్ దాదాపు మునుపటి మోడల్ మాదిగానే ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్‌ పొందుతుంది. మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

2022 స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించిన మహీంద్రా.. కొత్త డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది 'బ్లాక్ అండ్ బేజ్' కలర్ ఇంటీరియర్ పొందుతుంది. అయితే మునుపటి మోడల్ 'గ్రే అండ్ బ్లాక్' కలర్ లో ఉంది. ఇందులో స్టీరింగ్ వీల్ లెథెరెట్ ఫినిషింగ్ పొందుతుంది, కావున మంచి పట్టును అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ ఇప్పుడు వుడ్ ఇన్‌సర్ట్‌లను పొందుతాయి.

2022 స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించిన మహీంద్రా.. కొత్త డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

కొత్త స్కార్పియో క్లాసిక్ లో 9.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి మద్దతు ఇస్తుంది. రెండవ వరుస ప్యాసింజర్ ల కోసం ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటివి ఉన్నాయి. ఇది 7 సీటర్ మరియు 9 సీటర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. 7 సీటర్ వేరియంట్ లో రెండవ వరుసలో రెండు కెప్టెన్ సీట్లు మరియు మూడవ వరుసలో ఒక బెంచ్‌ ఉంటుంది. 9 సీటర్ విషయానికి వస్తే, ఇందులో రెండవ వరుసలో ఒక బెంచ్ మరియు వెనుకవైపు నలుగురికి జంప్ సీట్లు లభిస్తాయి.

2022 స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించిన మహీంద్రా.. కొత్త డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ యొక్క కొలతలు విషయానికి వస్తే, దీని పొడవు 4,456 మిమీ, వెడల్పు 1,820 మిమీ, ఎత్తు 1,995 మిమీ మరియు వీల్‌బేస్ 2,680 మిమీ వరకు ఉంటుంది. అయితే ఇందులో వాటర్ వాడింగ్ కెపాసిటీ 500 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది ఆఫ్ రోడింగ్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది.

2022 స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించిన మహీంద్రా.. కొత్త డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.2-లీటర్, టర్బో-డీజిల్, mHawk ఇంజిన్‌ ఉంటుంది. ఇది 132 హెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా దాదాపు 55 కేజీలు తక్కువ బరువును పొందుతుంది. కావున ఈ కారణంగా 14 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

2022 స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించిన మహీంద్రా.. కొత్త డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

2022 మహీంద్రా స్కార్పియో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ప్రస్తుతం రెండు ఎయిర్ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. అయితే భవిష్యత్ లో మరిన్ని అందించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మునుపటి మోడల్ లోనే సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది.

2022 స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించిన మహీంద్రా.. కొత్త డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

మహీంద్రా స్కార్పియో యొక్క మునుపటి మోడల్ మొత్తం 5 వేరియంట్స్ (S3 ప్లస్, S5, S7, S9 మరియు S11) లో అందుబాటులో ఉంది. కానీ ఈ 2022 స్కార్పియో క్లాసిక్ మాత్రం కేవలం 2 వేరియంట్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. కంపెనీ ఈ కొత్త స్కార్పియో క్లాసిక్ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, అయితే ధరలు ఆగష్టు 20 న వెల్లడించనున్నట్లు తెలిపింది.

2022 స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించిన మహీంద్రా.. కొత్త డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఇప్పుడు 5 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి పెర్ల్ వైట్, నాపోలి బ్లాక్, రెడ్ రేజ్, డి'సాట్ సిల్వర్ మరియు గెలాక్సీ గ్రే కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

2022 స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించిన మహీంద్రా.. కొత్త డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదలై ఇప్పటికే మంచి బుకింగ్స్ పొందుతోంది. ఈ సమయంలో కంపెనీ 2022 మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ని దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే దీని ధరలు ఇంకా అధికారికంగా వెల్లడవ్వలేదు. కొత్త స్కార్పియో క్లాసిక్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజి ఆస్టర్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra scorpio classic revealed design features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X