గ్లోబల్ ఎన్‌సిఎపి 'సేఫర్ ఛాయిస్ అవార్డు' విజేత: మహీంద్రా ఎక్స్‌యువి700

భారతీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ దిగ్గజంగా పేరుగాంచిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) యొక్క కొత్త ఎస్‌యువి 'మహీంద్రా ఎక్స్‌యువి700' (Mahindra XUV700) మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యువిగా ప్రసిద్ధి చెందింది. అది మాత్రమే కాకుండా.. ఇప్పటికే మహీంద్రా ఎక్స్‌యువి700 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు తాజాగా గ్లోబల్ ఎన్‌సిఎపి నుంచి 'సేఫర్ ఛాయిస్ అవార్డు'ను కూడా తన ఖాతాలో వేసుకుంది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

భారత్‌లో అత్యంత సేఫెస్ట్ కార్.. ఇదే: ఎందుకంటే?

మహీంద్రా ఎక్స్‌యువి700 అనేది భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న 6 మరియు 7 సీటర్ ఎస్‌యువి. ఈ ఎస్‌యువి ఇప్పటికే గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ లభించింది. ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కలిగిన వాహనాలకు గ్లోబల్ ఎన్‌సిఎపి అందించే అవార్డే ఈ 'సేఫర్ ఛాయిస్ అవార్డు'. ఇప్పుడు మహీంద్రా ఎక్స్‌యువి700 ఈ అవార్డును పొందింది. దీనితో ఎక్స్‌యువి700 అధిక భద్రతా ప్రమాణాలు కలిగిన ఎస్‌యువిగా నిలిచిపోయింది.

భారత్‌లో అత్యంత సేఫెస్ట్ కార్.. ఇదే: ఎందుకంటే?

గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (GNCAP) నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్‌యువి700 అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లు మరియు పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు 41.66 పాయింట్లు పొందింది. మొత్తం మీదుగా ఇది సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొంది బెస్ట్ ఎస్‌యువిగా మారింది.

భారత్‌లో అత్యంత సేఫెస్ట్ కార్.. ఇదే: ఎందుకంటే?

GNCAP క్రాష్ టెస్ట్ లో ఉపయోగించిన మహీంద్రా ఎక్స్‌యువి700 ఎంట్రీ-లెవల్ వేరియంట్. కావున ఇందులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటి బ్రేక్ అసిస్ట్ మరియు ఐసోఫిక్స్ ఎంకరేజ్‌ వంటివి ఉన్నాయి. అయితే ఈ ఎస్‌యువిలో సైడ్ బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు అన్ని సీటింగ్ పొజిషన్‌లలో త్రీ పాయింట్ బెల్ట్‌లు వంటి ఫీచర్లను స్టాండర్డ్ ఫీచర్లుగా జోడించడం ద్వారా మహీంద్రా ఎక్స్‌యువి700 మరింత భద్రతను కల్పిస్తుంది అని టెస్టింగ్ ఏజెన్సీ క్రాష్ టెస్ట్ నిర్వహించినప్పుడే తెలిపింది.

భారత్‌లో అత్యంత సేఫెస్ట్ కార్.. ఇదే: ఎందుకంటే?

మహీంద్రా ఎక్స్‌యువి700 సేఫ్టీ ఫీచర్స్ తో పాటి ADAS ఫీచర్ కూడా పొందుతుంది. ఈ ఫీచర్స్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ SUV గంటకు 80 కిమీ వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. చీకటి రోడ్లలో మరింత కాంతిని అందించడం ద్వారా రాత్రిపూట మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో అత్యంత సేఫెస్ట్ కార్.. ఇదే: ఎందుకంటే?

ఎక్స్‌యువి700 లో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది వాహనం ముందు అమర్చిన వివిధ సెన్సార్లు మరియు రాడార్‌లను ఉపయోగించుకుని పనిచేస్తుంది. ఈ సెన్సార్‌లు SUV కి ఎదురుగా ఏదైనా వాహనాలు ఉన్నాయా, లేదా మనుషులు ఉన్నారా అని గుర్తిస్తుంది. అప్పుడు డ్రైవర్ బ్రేకులు వేయకపోతే, అదే తనకు తానుగా బ్రేక్‌లు వేసి కారుని నిలిపివేస్తుంది. అంతే కాకుండా ఇందులోని అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్ ఫీచర్‌తో స్వయంచాలకంగా వేగాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. మొత్తం మీద అన్ని విధాలుగా అహనా వినియోగదారులకు ఒక పటిష్టమైన భద్రతను అందిస్తుంది.

భారత్‌లో అత్యంత సేఫెస్ట్ కార్.. ఇదే: ఎందుకంటే?

ఇదిలా ఉండగా ఏ వాహనమైన గ్లోబల్ ఎన్‌సిఎపి 'సేఫర్ ఛాయిస్ అవార్డు' ను అందుకోడానికి ఖచ్చితంగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. వాహనానికి ఉండవలసిన ఆ అర్హతలు ఏమిటో ఇక్కడ చూద్దాం.

గ్లోబల్ ఎన్‌సిఎపి నుంచి 'సేఫర్ ఛాయిస్ అవార్డు' పొందటానికి గ్లోబల్ ఎన్‌సిఎపి టెస్ట్ ప్రోటోకాల్ యొక్క లేటెస్ట్ వెర్షన్ కు అనుగుణంగా అడల్ట్ సేఫ్టీ విషయంలో తప్పకుండా 5 స్టార్ రేటింగ్ పొందాలి. అంతే కాకుండా చైల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్ లో కనీసం 4 స్టార్ రేటింగ్ పొంది ఉండాలి. ఈ స్కోరింగ్ మాత్రమే కాకుండా ఆ వాహనాలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కలిగి ఉండాలి.

భారత్‌లో అత్యంత సేఫెస్ట్ కార్.. ఇదే: ఎందుకంటే?

ఐక్యరాజ్యసమితి రెగ్యులేషన్స్ యుఎన్13హెచ్, యుఎన్140 లేదా జిటిఆర్8 కి అనుకూలంగా ఉండాలి. అంతే కాకుండా పాదచారుల యొక్క రక్షణ అవసరాలకు అనుకూలంగా ఉండాలి. గ్లోబల్ ఎన్‌సిఎపి ల్యాబోరేటరీ ద్వారా అప్రూవల్ సర్టిఫికేట్ పొందాలి. అది గ్లోబల్ ఎన్‌సిఎపి ద్వారా తప్పకుండా ద్రువీకరించబడి ఉండాలి. చివరగా ఎలాంటి సమస్యలు లేకుండా మార్కెట్లో మంచి ఆదరణ పొందాలి. ఇలాంటి అన్ని అర్హతలను పొందినప్పుడే గ్లోబల్ ఎన్‌సిఎపి నుంచి 'సేఫర్ ఛాయిస్ అవార్డు' లభిస్తుంది.

భారత్‌లో అత్యంత సేఫెస్ట్ కార్.. ఇదే: ఎందుకంటే?

మహీంద్రా ఎక్స్‌యువి700 ఆధునిక డిజైన్ మరియు అధునాతన పరికరాలను కలిగి ఉండటమే కాకుండా ఇది రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అవి 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

భారత్‌లో అత్యంత సేఫెస్ట్ కార్.. ఇదే: ఎందుకంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మహీంద్రా ఎక్స్‌యువి700 గతంలో 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ను మరియు ఇప్పుడు గ్లోబల్ ఎన్‌సిఎపి నుంచి 'సేఫర్ ఛాయిస్ అవార్డు' ను పొందటం నిజంగా అభినందనీయం. ఎక్స్‌యువి700 పొందిన ఈ అవార్డ్స్ వల్ల కస్టమర్లకు ఈ ఎస్‌యువి మరింత నమ్మికైనదిగా మారింది. కావున మరింత ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ ఎస్‌యువిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra xuv700 gets safer choice award from global ncap details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X