మెర్సిడెస్ బెంజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్ EQB లాంచ్.. ఒక్క ఛార్జ్‌తో 423 కిమీ రేంజ్

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) మరో కొత్త ఎలక్ట్రిక్ కారుని అధికారికంగా విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క మూడవ ఎలక్ట్రిక్ కారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసిన కొత్త ఎలక్ట్రిక్ కారు 'ఈక్యూబి' (EQB). మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి ధర రూ. 74.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ కూడా స్వీకరిస్తుంది. కావున ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 1.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న EQC మరియు ఇటీవల ప్రారంభించబడిన EQS సెడాన్ దిగువన ఉంటుంది.

బెంజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్ EQB లాంచ్

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి మంచి డిజైన్ పొందుతుంది. ఇది GLB మాదిరిగానే సేమ్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. కావున బ్లాంక్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, ట్వీక్ చేయబడిన డిజైన్ లో కనిపించే హెడ్‌లైట్‌లు & టెయిల్ లైట్లు, రీప్రొఫైల్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లు పొందుతుంది. అంతే కాకుండా ముందు మరియు వెనుక వైపు వెడల్పు అంతటా విస్తరించి ఉండే LED లైట్ బార్ కూడా ఇందులో చూడవచ్చు.

కొత్త బెంజ్ ఈక్యూబి ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టచ్‌స్క్రీన్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ మరియు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది 7 సీటర్ కారు కాబట్టి ప్రాక్టికాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ చాలా వరకు GLB మాదిరిగానే ఉంటుంది.

బెంజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్ EQB లాంచ్

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మెర్సిడెస్ బెంజ్ EQB యొక్క పవర్ అవుట్‌పుట్‌ రెండు వేరియంట్‌లలో భిన్నంగా ఉంటుంది. కావున EQB 300 వేరియంట్ 228 hp పవర్ మరియు 390 Nm టార్క్ అందిస్తుంది. అదే సమయంలో EQB 350 వేరియంట్ 292 hp పవర్ మరియు 520 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ అనేది నాలుగు చక్రాలకు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా డెలివరీ చేయబడుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి కేవలం 8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 160 కిమీ. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యువిలో 66.5kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 423 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ 8-సంవత్సరాల వారంటీని అందిస్తుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే బెంజ్ ఈక్యూబి 100 కిలో వాట్ DC ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా కేవలం 32 నిముషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఇక 11 కిలోవాట్ AC ఛార్జర్ ఉపయోగించి 10 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 6 గంటల 25 నిముషాల సమయం పడుతుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో చాలా అద్భుతంగా ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి మొత్తం 5 ఆకర్షణీయమైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి కాస్మోస్ బ్లాక్, రోజ్ గోల్డ్, డిజిటల్ వైట్, మౌంటైన్ గ్రే మరియు ఇరిడియం సిల్వర్ కలర్స్. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకి ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలాంటి ప్రత్యర్థులు లేదు. అయితే మార్కెట్లో ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది, ఎలాంటి అమ్మకాలను చేపడుతుంది అనే మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Most Read Articles

English summary
Mercedes benz eqb launched in india at rs 74 50 lakh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X