ఆ దేశంలో కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన మెర్సిడెస్ బెంజ్.. ఎందుకంటే?

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) రష్యాలో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నిస్సాన్, రెనాల్ట్ మరియు టొయోట తర్వాత రష్యా వెడుతున్న నాలుగవ కంపెనీగా మెర్సిడెస్ బెంజ్ అవతరించింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఆ దేశంలో కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన మెర్సిడెస్ బెంజ్.. ఎందుకంటే?

మెర్సిడెస్ బెంజ్ రష్యాలోని తన ఆస్తులను స్థానిక పెట్టుబడిదారులకు విక్రయించబోతున్నట్లు సమాచారం, మాస్కో సమీపంలో ఉన్న కంపెనీ ఫ్యాక్టరీతో సహా తన విక్రయించనున్నట్లు తెలిసింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 2 బిలియన్ యూరోల నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది.

ఆ దేశంలో కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన మెర్సిడెస్ బెంజ్.. ఎందుకంటే?

మెర్సిడెస్-బెంజ్ కంపెనీ తన రష్యా ప్లాంట్‌లో బెంజ్ ఇ-క్లాస్ సెడాన్‌ను ఉత్పత్తి చేసేది. అయితే ఈ ఏడాది మార్చి నుండి అక్కడ ఉత్పత్తిని కూడా పూర్తిగా నిలిపివేసింది. కంపెనీ యొక్క ఈ ఫ్యాక్టరీలో దాదాపు 1,000 మందికి పైగా కార్మికులు పని చేసేవారు. అయితే కంపెనీ ఉత్పత్తిని నిలిపివేయడం వల్ల వీరు కూడా ఉపాధిని కోల్పోయే స్థితి ఏర్పడింది.

ఆ దేశంలో కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన మెర్సిడెస్ బెంజ్.. ఎందుకంటే?

రష్యాలో కంపెనీ యొక్క అమ్మకాలు గణనీయంగా పడిపోవడం వల్ల విక్రయాలు కూడా చాలా తగ్గిపోయాయి. 2022 జనవరి నుండి సెప్టెంబర్ వరకు రష్యాలో కంపెనీ 9,558 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ అమ్మకాలు గత సంవత్సరం కంటే ఏకంగా 70 శాతం తక్కువ అని కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరిన్ని తగ్గే అవకాశం కూడా ఏర్పడవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ రష్యాలో తన కార్యకలాపాలకు స్వస్తి చెప్పింది. కంపెనీ తమ స్థానిక అనుబంధ సంస్థ అయిన అవోడోమ్‌కు విక్రయించనున్నట్లు తెలిపింది.

ఆ దేశంలో కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన మెర్సిడెస్ బెంజ్.. ఎందుకంటే?

మెర్సిడెస్ బెంజ్ యొక్క కార్లు తమ దేశంలో ఉత్పత్తి చేయాలను రష్యన్ కస్టమర్లు కోరుకుంటున్నారు. అయితే కంపెనీ దీనికి ససేమిరా అంటోంది. మెర్సిడెస్-బెంజ్ ప్రస్తుతం కమాజ్ అనే రష్యన్ ట్రక్ కంపెనీలో 15% వాటాను కలిగి ఉంది, కాగా వచ్చే ఏడాది ఈ వాటాను డైమ్లర్ ట్రక్స్‌కు అప్పగించే అవకాశం ఉంది.

ఆ దేశంలో కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన మెర్సిడెస్ బెంజ్.. ఎందుకంటే?

మెర్సిడెస్ బెంజ్ అనగానే అందరికి లగ్జరీ కార్లు గుర్తుకు వస్తాయి. ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ లగ్జరీ కార్లు రష్యాలో మంచి అమ్మకాలను పొందాయి. అయితే రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం తరువాత కంపెనీ ఎక్కువ నష్టాలను పొందవలసి వచ్చింది.

ఆ దేశంలో కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన మెర్సిడెస్ బెంజ్.. ఎందుకంటే?

ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలో రెనాల్ట్ కంపెనీ కూడా తన వ్యాపారాన్ని రష్యాలో నిలిపివేసింది. ఇందులో భాగంగానే కంపెనీ తన రష్యాలోని మొత్తం వ్యాపారాన్ని NAMI అనే ప్రభుత్వ యాజమాన్య సంస్థకు విక్రయించింది.

ఆ దేశంలో కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన మెర్సిడెస్ బెంజ్.. ఎందుకంటే?

నిస్సాన్ కంపెనీ రష్యాలో తన వ్యాపారాన్ని నిలిపివేస్తున్న సందర్భంగా కంపెనీ యొక్క మొత్తం వ్యాపారాలను కేవలం 1 యూరో లేదా సుమారు $0.97 కి NAMI సంస్థకు విక్రయిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రక్రియలో కంపెనీ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.

ఆ దేశంలో కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన మెర్సిడెస్ బెంజ్.. ఎందుకంటే?

రష్యాలో తన వ్యాపారం నిలిపివేస్తే దాదాపు $687 మిలియన్ల నష్టాన్ని కంపెనీ చవి చూడాల్సి వస్తుంది. ఇది అక్కడి ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం తప్పకుండా కొంత మేర ఉంటుంది. అయితే కంపెనీ రష్యా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం ప్రకారం, కంపెనీ యొక్క తన 2,000 మంది ఉద్యోగులకు 12 నెలల ఉద్యోగ భద్రతను అందిస్తుంది.

ఆ దేశంలో కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన మెర్సిడెస్ బెంజ్.. ఎందుకంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన వెంటనే మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తన ఉత్పత్తిని నిలిపివేసింది. కాగా ఇప్పుడు తన వ్యాపారాన్ని పూర్తిగా నిలివేయడానికి సిద్దమైపోయింది. రష్యాలో వరుసగా కంపెనీలు తమ వ్యాపారాలను నిలిపివేయడం వల్ల కంపెనీలు మరియు కార్మికులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిస్థితి రానున్న రోజులలో చక్కబడుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.

Most Read Articles

English summary
Mercedes benz to quit russia factory will be sold
Story first published: Thursday, October 27, 2022, 16:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X