'ఇన్నోవా హైక్రాస్' ఆవిష్కరణ తేదీ వెల్లడించిన TOYOTA: వివరాలు

టొయోటా కంపెనీ భారతీయ మార్కెట్లో ఒక కొత్త ఎమ్‌పివిని విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఇప్పటికే రానున్న ఈ ఎమ్‌పివి యొక్క టీజర్ కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు టొయోటా కంపెనీ ఈ కొత్త ఎమ్‌పివిని దేశీయ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరించనుంది అనే విషయాన్ని వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

'ఇన్నోవా హైక్రాస్' ఆవిష్కరణ తేదీ వెల్లడించిన TOYOTA: వివరాలు

టయోటా కంపెనీ విడుదల చేయనున్న కొత్త ఎమ్‌పివి 'ఇన్నోవా హైక్రాస్'. ఇది భారతీయ మార్కెట్లో వచ్చే నెల 25 న (2022 నవంబర్ 25) ఆవిష్కరించబడుతుంది. కాగా ఈ ఇన్నోవా హైక్రాస్ 2023 లో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఎమ్‌పివి భారతీయ మార్కెట్లో ఆవిస్కరించడానికి ముందే ఇండోనేషియాలో నవంబర్ 21 న ఆవిష్కరించబడుతుంది.

'ఇన్నోవా హైక్రాస్' ఆవిష్కరణ తేదీ వెల్లడించిన TOYOTA: వివరాలు

టయోటా కంపెనీ కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. ప్రపంచ మార్కెట్లో (ఇతర దేశాల్లో) కూడా విక్రయించే అవకాశం ఉంది. టొయోట హైక్రాస్ అనేది కంపెనీ కొత్త అప్డేటెడ్ మోడల్, కావున ఇది తప్పకుండా మార్కెట్లో మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

'ఇన్నోవా హైక్రాస్' ఆవిష్కరణ తేదీ వెల్లడించిన TOYOTA: వివరాలు

ఇప్పటికే విడుదలైన టీజర్ల ప్రకారం, ఈ MPV అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుందని తెలుస్తుంది. ఈ కొత్త MPV ఫీచర్స్ పరంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇన్నోవా క్రిస్టా కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ MPV లో ఉండే ఇంజిన్ వివరాలు కూడా వెల్లడయ్యాయి.

'ఇన్నోవా హైక్రాస్' ఆవిష్కరణ తేదీ వెల్లడించిన TOYOTA: వివరాలు

కొత్త టొయోటా ఇన్నోవా హైక్రాస్ MPV ఇప్పుడు హెక్సాగోనల్ గ్రిల్‌ను పొందుతుంది. అయితే ఇది ఎల్ షేప్ ఇన్సర్ట్‌తో విస్తృతంగా విస్తరించబడిన హెడ్‌లైట్ ఉంటుంది. అదే సమయంలో దీని బానెట్‌పై క్రీజ్, బంపర్‌పై ఫాగ్ లైట్స్ వంటి వాటిని పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ లో 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. కాగా రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ బ్రేక్ లైట్‌తో సమాంతరంగా ఉండే టెయిల్ లైట్‌ కూడా లభిస్తాయి.

'ఇన్నోవా హైక్రాస్' ఆవిష్కరణ తేదీ వెల్లడించిన TOYOTA: వివరాలు

టొయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క ఇంటీరియర్స్ ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుందని తెలుస్తోంది. అదే సమయంలో ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్సన్ వంటి వాటితో పాటు రెండవ వరుస కెప్టెన్ సీట్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఇంటీరియర్ ఫీచర్స్ గురించి మరింత సమాచారం వచ్చే నెలలో తెలిసే అవకాశం ఉంటుంది.

'ఇన్నోవా హైక్రాస్' ఆవిష్కరణ తేదీ వెల్లడించిన TOYOTA: వివరాలు

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పుడు సేఫ్టీ పరంగా కూడా చాలా అప్డేట్ అయి ఉంటుంది. కాబట్టి ఇందులో ADAS వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కావున ఇది రోడ్ సైన్ అసిస్ట్, ఆటోమేటిక్ హై బీమ్, లేన్ డిపార్చర్ అలర్ట్ మరియు ప్రోయాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్ వంటి వాటిని కూడా పొందుతుంది.

'ఇన్నోవా హైక్రాస్' ఆవిష్కరణ తేదీ వెల్లడించిన TOYOTA: వివరాలు

త్వరలో ఆవిష్కరించబడనున్న కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో 2.0 లీటర్ లేదా 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇందులోని హైబ్రిడ్ ఇంజన్ కారణంగా ఇది ఖచ్చితంగా మంచి మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న దీని ఇంజిన్ 166 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

'ఇన్నోవా హైక్రాస్' ఆవిష్కరణ తేదీ వెల్లడించిన TOYOTA: వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

టయోటా ఇన్నోవా హైక్రాస్ తప్పకుండా దేశీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నాము. కాగా ఈ కొత్త MPV గురించి మరిన్ని వివరాలు మరియు ధరలు కూడా తెలియాల్సి ఉంది. ఈ MPV గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New toyota innova hycross unveil date revealed details
Story first published: Tuesday, November 1, 2022, 13:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X