Just In
- 18 min ago
ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన మ్యూజికల్ స్కూటర్.. జీవితం ఇలా రంగులమయం కావాలంటూ ట్వీట్..
- 16 hrs ago
కార్తిక్ ఆర్యన్: ఖరీదైన గిఫ్ట్ పొందాడు.. భారదేశంలోనే ఫస్ట్ ఓనర్ అయిపోయాడు
- 17 hrs ago
'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే
- 20 hrs ago
ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!
Don't Miss
- News
సొంతపార్టీనేతలే బండి సంజయ్ కు షాక్ ఇస్తున్నారా? చేరికల అడ్డగింతపై అగ్రనేతలకు బండి కంప్లైంట్!!
- Finance
Fuel Prices Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు
- Sports
India Playing XI vs Ireland: ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం.. తొలి టీ20లో ఆడే భారత తుది జట్టు ఇదే!
- Movies
యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ 26 నుండి జులై 2వ తేదీ వరకు..
- Technology
ఆండ్రాయిడ్ & ఆపిల్ ఫోన్లను హ్యాక్ చేసే కొత్త Spyware ! జాగ్రత్త...హెచ్చరించిన గూగుల్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
భారత్‌లో లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకున్న స్కోడా ఆక్టావియా.. శక్తివంతమైన వేరియంట్ వస్తోంది..!
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం సెడాన్ స్కోడా ఆక్టావియా (Skoda Octavia) దేశీయ విపణిలో లక్ష మంది వినియోగదారులకు చేరువైంది. కంపెనీ ఈ కారు యొక్క విడిభాగాలను విదేశాల నుండి భారతదేశంలోకి దిగుమతి చేసుకొని ఇక్కడే స్థానికంగా అసెంబుల్ చేస్తుంది. స్కోడా ఆక్టేవియా భారత మార్కెట్లో 1 లక్ష యూనిట్ల విక్రయ మైలురాయిని అధిగమించడంతో, ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న CKD మోడల్‌గా నిలిచింది.

స్కోడా ఆక్టావియాకు భారతదేశంలో రెండు దశాబ్ధాలకు పైగా చరిత్ర ఉంది. ఇది 2001లో భారతదేశానికి మొదటిసారిగా పరిచయం చేయబడింది. ఆక్టేవియా అనే పేరు 8 సంఖ్య ఆధారంగా వచ్చింది. మొదటి-తరం ఆక్టేవియాను 2004లో భారతదేశానికి వచ్చిన vRS మోడల్ ఆధారంగా రూపొందించారు. ఒక సంవత్సరం తర్వాత, స్కోడా తమ రెండవ తరం ఆక్టావియాను లారాగా పరిచయం చేసింది. కంపెనీ ఈ కారును 2010 సంవత్సరం వరకు భారతదేశంలో విక్రయానికి అందుబాటులో ఉంచింది.

కాగా, మూడవ తరం ఆక్టావియా సెడాన్ మార్కెట్లోకి రావడానికి చాలానే సమయం పట్టింది. కంపెనీ ఈ కారును 2013లో భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఈసారి ఇది దాని అసలు పేరు (ఆక్టావియా) తోనే విడుదలైంది. మూడవ తరం ఆక్టావియా ఆధారంగా కంపెనీ 2017లో vRS 230 మరియు 2020లో vRS 245తో భారత మార్కెట్‌కు రెండు vRS మోడల్‌లను అందించింది. ఇప్పటి వరకు ఆక్టేవియా vRS 245 స్కోడా నిర్మించిన అత్యంత వేగవంతమైన ప్రొడక్షన్ కార్లలో ఒకటిగా మిగిలిపోయింది.

ప్రస్తుత తరం (నాల్గన తరం) ఆక్టావియా (అంతర్గతంగా ఆక్టేవియా ఏ8 అని పిలుస్తారు) సెడాన్ ను కంపెనీ గత సంవత్సరం (2021లో) భారత మార్కెట్లో విడుదల చేసింది. జూన్ 2020లో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త తరం ఆక్టావియా సెడాన్ రూ.25.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదలైంది. కొత్త 2021 స్కొడా ఆక్టేవియా సెడాన్‌ను స్టైల్ మరియు ఎల్ అండ్ కె (లౌరిన్ అండ్ క్లెమెంట్) అనే రెండు వేరియంట్లలో విడుదల చేశారు.

విడుదల సమయంలో (జూన్ 2021లో) స్కోడా ఆక్టావియా స్టైల్ వేరియంట్ ధర రూ.25.99 లక్షలు కాగా, టాప్-ఎండ్ ఎల్ అండ్ కె వేరియంట్ ధర రూ.28.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి. స్కోడా ఆక్టావియా 1996లో అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ స్కోడా ప్రపంచవ్యాప్తంగా 7.5 మిలియన్ యూనిట్ల ఆక్టేవియా కార్లను విక్రయించింది, ఇందులో వివిధ రకాల బాడీ స్టైల్స్ ఉన్నాయి.

ప్రస్తుత స్కోడా ఆక్టావియా భారతదేశంలో రెండు వేరియంట్‌లలో అందించబడుతోంది. అవి - స్టైల్ మరియు లారిన్ అండ్ క్లెమెంట్ (L&K). ఈ రెండు వెర్షన్లు కూడా 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తాయి. స్కొడా ఆక్టేవియా ఇప్పుడు బ్రాండ్ యొక్క 2.0-లీటర్ టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. కాగా, ఇందులో ఓ 1.5-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌ను కంపెనీ తరువాతి దశలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుత 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 4,180-6,000 ఆర్‌పిఎమ్ మధ్యలో గరిష్టంగా 188 బిహెచ్‌పి శక్తిని మరియు 1,500-3,990 ఆర్‌పిఎమ్ మధ్యలో 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్‌గా గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండదు. కొత్త తరం 2021 స్కొడా ఆక్టేవియా సెడాన్‌ను కంపెనీ యొక్క అప్‌గ్రేడ్ చేయబడిన ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి నిర్మించారు.

కొత్త తరం స్కోడా ఆక్టావియా సెడాన్‌లో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన క్రిస్టల్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద బటర్‌ఫ్లై-గ్రిల్, కొత్త 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన బూట్-లిడ్, కొత్త ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్, వాషర్‌తో కూడిన రియర్-వ్యూ కెమెరా మరియు బూట్-లిడ్ పొడవు అంతటా విస్తరించిన పెద్ద స్కొడా బ్యాడ్జ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

కొత్త తరం ఆక్టావియా ఇంటీరియర్స్‌లో రెండు పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలు ఉంటాయి. ఇందులో ఒకదానిని ఇన్ఫోటైన్‌మెంట్ స్కీన్ కోసం మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం ఉపయోగించనున్నారు. ఇంకా ఇందులో బేజ్ కలర్ లెథర్ అప్‌హోలెస్ట్రీ, పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ మరియు యాంబియంట్ లైటింగ్ ఉన్న డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, పాడిల్ షిఫ్టర్లు మరియు ఆడియో, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఇతర ఫంక్షన్ల కోసం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. - స్కోడా ఆక్టావియా పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

శక్తివంతమైన స్కోడా ఆక్టావియా vRS మోడల్ వస్తోంది..
ఇదిలా ఉంటే, స్కోడా ఆక్టేవియా సెడాన్‌లో కంపెనీ ఓ శక్తివంతమైన vRS వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొత్త స్కోడా ఆక్టావియా vRS మోడల్ భారతదేశంలోకి ప్రవేశించబోయే మొదటి హైబ్రిడ్ స్కోడా కారు అవుతుంది. ఈ నాల్గవ తరం ఆక్టావియా vRS మోడల్ 2020లో మొదటిసారిగా అంతర్జాతీయ మార్కెట్‌లలో ప్రవేశపెట్టబడింది మరియు ఇది 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు ఇందులోని ఓ ఎలక్ట్రిక్ మోటార్ తో లభిస్తుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 241bhp శక్తిని మరియు 370Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీగా ఉంటుంది.