టీవీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు తయారు చేసే Sony ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తే..?

టెలివిజన్లు, మ్యూజిక్ సిస్టమ్ ల తయారీలో పేరుగాంచిన టెక్ దిగ్గజం సోనీ (Sony) ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ విభాగంలోకి ప్రవేశించాలని చూస్తోంది. యావత్ ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఆసక్తి చూపుతున్న తరుణంలో, సోనీ కూడా ఈ విభాగంలో తన సత్తా ఏంటో చూపాలనుకుంటోంది. ఇందులో భాగంగానే, అమెరికాలోని లాస్ వేగాస్ నగరంలో జరుగుతున్న సిఈఎస్ 2022 (CES 2022) తమ అధునాతన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ను ఆవిష్కరించింది.

టీవీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు తయారు చేసే Sony ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తే..?

ప్రస్తుతం ప్రపంచం ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారుతోంది మరియు సాంప్రదాయ ఆటోమోటివ్ బ్రాండ్‌లు కూడా ఇప్పుడు అదే దిశగా పనిచేస్తున్నాయి. ఈ రేస్ లో సోనీ వంటి పలు టెక్ కంపెనీలు వెనుకబడి ఉండకూడదనుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, స్పీకర్లు, టీవీలు మరియు ఇతర వినియోగదారు ఎలక్ట్రానిక్‌లను తయారు చేయడంలో తమ ఖ్యాతిని సంపాదించుకున్న కొన్ని బ్రాండ్‌లు ఇప్పుడు ఈవీ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి మరియు వాటిలో సోనీ కూడా ఒకటి.

టీవీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు తయారు చేసే Sony ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తే..?

వాస్తవానికి సోనీకి ఆటోమొబైల్ రంగం కొత్తేమీ కాదు, ఈ బ్రాండ్ గత కొన్నేళ్లుగా ఆటోమొబైల్ పరిశ్రమకు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు మరియు ఇతర విడిభాగాలను సరఫరా చేస్తూ వస్తోంది. అయితే, ఇప్పుడు వాటన్నింటికీ మించి ఓ పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారును అందించేందుకు సిద్ధమైంది. సోనీ ఆవిష్కరించిన ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ త్వరలోనే ఉత్పత్తి దశకు చేరుకోవచ్చని భావిస్తున్నారు.

టీవీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు తయారు చేసే Sony ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తే..?

సోనీ తొలిసారిగా తమ విజన్ ఎస్ కాన్సెప్ట్ కారును 2020 లో ప్రదర్శించింది. ఇది భవిష్యత్ కోసం తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనం, చూడటానికి చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. అయితే, అప్పటికి, జపనీస్ బ్రాండ్ ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ఎటువంటి స్పష్టమైన ఉద్దేశాలను ప్రదర్శించనందున, ఈ ఈవీ కేవలం సోనీ చేయగల సామర్థ్యం యొక్క ప్రదర్శనగా మాత్రమే చూడబడింది. అయితే, ఇటీవలి కాలంలో Sony తమ ఎలక్ట్రిక్ వాహనాన్ని పబ్లిక్ రోడ్‌లపై పరీక్షిస్తున్నట్లు గుర్తించబడింది.

టీవీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు తయారు చేసే Sony ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తే..?

సోనీ ఈ కారును నిరంతరాయంగా పరీక్షించడాన్ని చూస్తుంటే, ఇది త్వరలోనే మార్కెట్లో విడుదల చేయబడుతుందని తెలుస్తోంది. సోనీ విజన్ ఎస్ ను మొదటిసారిగా ప్రదర్శించబడిన దాదాపు రెండేళ్ల తర్వాత కంపెనీ ఇప్పుడు ఉత్పత్తికి దగ్గరగా ఉన్న మోడల్ ను ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. ఈసారి ఇది ఎస్‌యూవీ రూపంలో పరిచయం చేయబడింది. లాస్ వేగాస్ లో జరుగుతున్నకన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో (CES) ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ప్రదర్శన.

టీవీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు తయారు చేసే Sony ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తే..?

గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా జరుగుతున్న ప్రదర్శనలో అనేక టెక్ దిగ్గజాలు తమ అధునాతన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ షోలో ప్రదర్శించబడే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యలో స్థిరమైన పెరుగుదల కనిపించింది. ఇప్పుడు ఈ జాబితాలో కొత్త సోనీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా చేర్చబడింది. ప్రస్తుతానికి సోనీ తమ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన సాంకేతిక వివరాలను గోప్యంగా ఉంచింది. అయితే, ఈ కంపెనీ రెండేళ్ల క్రితం ప్రదర్శించిన విజన్ ఎస్ మాదిరిగానే ఒకేరకమైన పవర్‌ట్రైన్ ను పంచుకోవచ్చని తెలుస్తోంది.

టీవీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు తయారు చేసే Sony ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తే..?

ఇదివరకటి విజన్ ఎస్ ఎలక్ట్రిక్ కారులో 536 బిహెచ్‌పి పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించినట్లు సోనీ పేర్కొంది. ఇందులో ముందువైపు ఒక మోటారు మరియు వెనుకవైపు మరొక మోటార్ ఉంటాయి. అంటే, ఇది ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ మాదిరిగా పనిచేస్తుందన్నమాట. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇది చాలా వేగవంతమైనది. కేవలం 5 సెకండ్లలోనే ఈ కారు గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. గరిష్ట వేగం విషయానకి వస్తే, ఇది గంటకు 240 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

టీవీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు తయారు చేసే Sony ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తే..?

టెక్ దిగ్గజమైన సోనీ నుండి వస్తున్న ఈ టెక్ లోడెడ్ కారులో ఆధునిక టెక్నాలజీ ఫీచర్లకు కొరతేమీ ఉండదు. ఇందులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 5G కనెక్టివిటీ, OTA అప్‌డేట్‌లు మరియు వినియోగదారులకు ఇబ్బంది లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి అన్ని సమయాల్లో వివిధ పారామితులను కొలిచే దాదాపు 40 సెన్సార్లు, అటానమస్ డ్రైవింగ్ వంటి మరెన్నో ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు.

టీవీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు తయారు చేసే Sony ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తే..?

సోనీ నుండి రాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా ఇలాంటి అధునాతన సాంకేతికతలను మరియు మరెన్నో ఫూచరిస్టిక్ ఫీచర్లను కలిగి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్‌ట్రెయిన్, టెక్నాలజీ మరియు లాంచ్ టైమ్‌లైన్‌పై మరిన్ని వివరాలను సోనీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

టీవీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు తయారు చేసే Sony ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తే..?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

సోనీ అనేది కొన్ని అద్భుతమైన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్‌లను ఉత్పత్తి చేసిన సుపరిచితమైన బ్రాండ్. ఇప్పుడు బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలోకి ప్రవేశించడం నిజంగా స్వాగతించదగిన విషయం. మరి మనం కూడా భారతదేశంలో ఎప్పటికైనా సోనీ ఎలక్ట్రిక్ వాహనాలను చూసే అవకాశం ఉంటుందా? ప్రస్తుతానికైతే త్వరలో చూస్తామని అనిపించడం లేదు, దీనికి కాలమే సమాధానం చెబుతుంది.

Most Read Articles

English summary
Sony electric suv unveiled at ces 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X