స్కార్పియో మరియు సఫారీ మధ్య పోటీ ఈనాటిది కాదు.. మరి ఈ కొత్త మోడళ్లు ఎలా తలపడనున్నాయ్..!?

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా స్కార్పియో మరియు టాటా సఫారీ రెండూ కూడా ప్రత్యేకమైన యుటిలిటీ వాహనాలే. ఈ రెండు మోడళ్ల మధ్య పోటీ ఈనాటిది కాదు. మహీంద్రా స్కార్పియో విడుదలకు 4 సంవత్సరాల ముందే, అంటే 1998లో మొదటి తరం టాటా సఫారీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ మోడల్ ప్రారంభంతో భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ బ్రాండ్ మరింత బలాన్ని పుంజుకుంది. మహీంద్రా కూడా స్కార్పియోని మొదటిసారిగా మార్కెట్లో విడుదల చేయడానికి దాదాపు ముందు, దాని అభివృద్ధి కోసం దాదాపు 5 సంవత్సరాల సమయం తీసుకుంది.

స్కార్పియో మరియు సఫారీ మధ్య పోటీ ఈనాటిది కాదు.. మరి ఈ కొత్త మోడళ్లు ఎలా తలపడనున్నాయ్..!?

మహీంద్రా తన సుధీర్ఘమైన రీసెర్చ్ తర్వాత స్కార్పియోని విడుదల చేసింది. అయితే, 1998 సంవత్సరంలో టాటా సఫారీ తొలిసారిగా ప్రారంభించబడినప్పుడు, ఇదొక 7-సీటర్ మోడల్ మరియు రహదారిపై అత్యంత గంభీరమైన ఎస్‌యూవీ మాత్రమే కాదు. ఆ సమయంలోనే కంపెనీ ఈ కారులో సుదీర్ఘమైన ఫీచర్లను అందించింది. ఫలితంగా, టాటా సఫారీ అతి తక్కువ సమయంలోనే భారత ఆటోమొబైల్ మార్కెట్లో స్థిరపడగలిగింది. సఫారీ వేగానికి చెక్ పెట్టేందుకు మహీంద్రా 2002లో తమ స్కార్పియోని విడుదల చేసింది.

స్కార్పియో మరియు సఫారీ మధ్య పోటీ ఈనాటిది కాదు.. మరి ఈ కొత్త మోడళ్లు ఎలా తలపడనున్నాయ్..!?

ఈ మొదటి తరం మహీంద్రా స్కార్పియో, భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీదారు అయిన మహీంద్రాకు అనేక విధాలుగా గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. మహీంద్రా స్కార్పియో దాని పనితీరు మరియు మైలేజ్ కారణంగా త్వరలోనే విజయవంతమైన ఎస్‌యూవీగా నిలిచింది.

స్కార్పియో మరియు సఫారీ మధ్య పోటీ ఈనాటిది కాదు.. మరి ఈ కొత్త మోడళ్లు ఎలా తలపడనున్నాయ్..!?

అమ్మకాల పరిమాణంలో మహీంద్రా ఎల్లప్పుడూ పైచేయి సాధించినప్పటికీ, టాటా సఫారీకి బలమైన అభిమానుల సంఖ్య ఉంది (పాత కాలపు టాటా సఫారీని ఇప్పటికీ ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు). అయితే, మార్కెట్లో పెరిగిన పోటీ మారుతున్న పరిణామాల నేపథ్యంలో, టాటా మోటార్స్ తమ సఫారీ కారును 2019లో భారత మార్కెట్ నుండి ఉపసంహరించుకుంది. దీంతో టాటా మోటార్స్, మహీంద్రా స్కార్పియో తో దాదాపు 17 ఏళ్ల పాతకాలపు పోటీకి ముగింపు పలికింది.

స్కార్పియో మరియు సఫారీ మధ్య పోటీ ఈనాటిది కాదు.. మరి ఈ కొత్త మోడళ్లు ఎలా తలపడనున్నాయ్..!?

మహీంద్రా మాత్రం మార్కెట్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, స్థిరమైన అమ్మకాలను సాధిస్తూ, ఎప్పటికప్పుడు మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీని మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తూ, ఉత్పత్తిని కొనసాగించింది. అయితే, టాటా మోటార్స్ 2021లో తమ టాటా హారియర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారు చేసిన 7-సీటర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని 'టాటా సఫారీ' నేమ్‌ప్లేట్‌తో తిరిగి మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఎస్‌యూవీ టాటా హారియర్ యొక్క 7-సీటర్ వెర్షన్ కావడంతో ఇది మోనోకోక్ ఛాసిస్ మరియు ఫ్రంట్-వీల్-డ్రైవ్ లేఅవుట్ ను కలిగి ఉంటుంది.

స్కార్పియో మరియు సఫారీ మధ్య పోటీ ఈనాటిది కాదు.. మరి ఈ కొత్త మోడళ్లు ఎలా తలపడనున్నాయ్..!?

ఫలితంగా ఈ ఎస్‌యూవీ పురాతన సఫారీ మాదిరిగా ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ కాలేకపోయింది. ఈ ఎస్‌యూవీలో ఆఫ్-రోడ్ ఫీచర్లు లేనప్పటికీ, ఇప్పటికీ ఇది చాలా బోల్డ్‌గా కనిపిస్తూ, రహదారిపై మంచి రోడ్ ప్రజెన్స్ ను కలిగి ఉంటుంది. ఒక్క ఆఫ్-రోడ్ సామర్థ్యాలలో మినహా మిగిలిన అన్ని విషయాలలో కొత్త తరం టాటా సఫారీ ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన కొత్త తరం మహీంద్రా స్కార్పియోతో పోటీ పడుతుంది.

స్కార్పియో మరియు సఫారీ మధ్య పోటీ ఈనాటిది కాదు.. మరి ఈ కొత్త మోడళ్లు ఎలా తలపడనున్నాయ్..!?

మహీంద్రా తమ సరికొత్త 2022 స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని విడుదల చేయడంతో ఒకప్పుడు మరచిపోయిన పోటీ మళ్లీ మొదలైనట్లయింది. ముందుగా ఈ రెండు ఎస్‌యూవీల పరిమాణాలను గమనిస్తే, కొత్త టాటా సఫారీ 4,661 మిమీ పొడవు, 1,894 మిమీ వెడల్పు, 1,786 మిమీ ఎత్తు మరియు 2,741 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. అయితే, మహీంద్రా స్కార్పియో ఈ టాటా ఎస్‌యూవీ కన్నా ఎక్కువగా 1 మిమీ పొడవు, 23 మిమీ వెడల్పు, 71 మిమీ ఎత్తు మరియు 9 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉండి, సఫారీ కన్నా పెద్దగా కనిపిస్తుంది.

Mahindra Scorpio N Vs Tata Safari - Dimensions
Dimensions Mahindra Scorpio N Tata Safari
Length 4,662mm 4,661mm
Width 1,917mm 1,894mm
Height 1,857mm 1,786mm
Wheelbase 2,750mm 2,741mm
స్కార్పియో మరియు సఫారీ మధ్య పోటీ ఈనాటిది కాదు.. మరి ఈ కొత్త మోడళ్లు ఎలా తలపడనున్నాయ్..!?

మహీంద్రా స్కార్పియో-ఎన్ కొలతల విషయంలోనే కాదు ఇంజన్ విషయంలో కూడా టాటా సఫారీని ఓడిస్తుంది. పవర్‌ట్రెయిన్ పరంగా, టాటా సఫారీ కేవలం ఒకేఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. అయితే మహీంద్రా మాత్రం తమ కొత్త స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని ఒక పెట్రోల్ ఇంజన్ మరియు రెండు రకాల డీజిల్ ఇంజన్‌ ఆప్షన్లతో విక్రయిస్తోంది. ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 167.7bhp గరిష్ట శక్తిని మరియు 350Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్‌ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

Mahindra Scorpio N Vs Tata Safari - Engine Diesel
Specs Mahindra Scorpio N Tata Safari
Engine Size 2.2-litre 2.0-litre
Engine Type Turbocharged, inline-4, diesel Turbocharged, inline-4, diesel
Max. Power 132 PS (Z2 trim) / 175 PS (other trims) 170 PS
Max. Torque Not revealed yet 350 Nm
Transmission 6-speed MT (Z2 trim) / 6-speed MT, 6-speed AT (other trims) 6-speed MT, 6-speed AT
స్కార్పియో మరియు సఫారీ మధ్య పోటీ ఈనాటిది కాదు.. మరి ఈ కొత్త మోడళ్లు ఎలా తలపడనున్నాయ్..!?
Mahindra Scorpio N Vs Tata Safari - Engine Petrol
Specs Mahindra Scorpio N
Engine Size 2.2-litre
Engine Type Turbocharged, inline-4, petrol
Max. Power 202 PS
Max. Torque Not revealed yet
Transmission 6-speed MT / 6-speed AT

అలాగే, మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క 2.2-లీటర్ యూనిట్ నుండి 172bhp గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది. అయితే, కంపెనీ ఈ ఇంజన్ టార్క్ అవుట్‌పుట్‌ను వెల్లడించలేదు కానీ XUV700లోని ఇదే ఇంజన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌లో 400Nm టార్క్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్‌లో 370Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. చేస్తుంది. వీటికి అదనంగా మహీంద్రా స్కార్పియో-ఎన్ మెరుగైన ఆఫ్-రోడ్ సామర్థ్యం కోసం రియర్ డిఫరెన్షియల్-లాక్‌లతో కూడిన ఆప్షనల్ 4WD సెటప్‌తో కూడా వస్తుంది. కాబట్టి, ఏ విధంగా చూసిన ఈ రెండు ఎస్‌యూవీల పోటీలో మరోసారి మహీంద్రానే నెగ్గినట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Tata safari vs mahindra scorpio n the 20 years old competetion continues
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X