గత వారం టాప్ కార్ న్యూస్: బిఎండబ్ల్యు నుంచి ఫెరారీ వరకు..

భారతీయ మార్కెట్లో గత వారం చాలా వరకు లగ్జరీ కార్లు విడుదలయ్యాయి. ఇందులో మెర్సిడెస్ బెంజ్ యొక్క ఏఎమ్‌జి ఈక్యూఎస్ 53 4మాటిక్+, లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ మరియు ఫెరారీ 296 జిటిబి వంటివి ఉన్నాయి. అంతే కాకూండా హ్యుందాయ్ కంపెనీ తన ఎన్-లైన్ యొక్క బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారభించింది.

దేశీయ మార్కెట్లో గతవారం విడుదలైన కార్లను గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.. రండి.

గత వారం టాప్ కార్ న్యూస్: బిఎండబ్ల్యు నుంచి ఫెరారీ వరకు..

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఈక్యూఎస్ 53 4మాటిక్+:

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ మార్కెట్లో తన కొత్త 'ఏఎమ్‌జి ఈక్యూఎస్ 53 4మాటిక్+' (AMG EQC 53 4matic+) సెడాన్ లాంచ్ చేసింది. ఈ కొత్త లగ్జరీ సెడాన్ ప్రారంభ ధర రూ. 2.45 కోట్లు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు బ్రాండ్ యొక్క రెండవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది.

గత వారం టాప్ కార్ న్యూస్: బిఎండబ్ల్యు నుంచి ఫెరారీ వరకు..

బెంజ్ యొక్క ఈ లగ్జరీ సెడాన్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 107.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 658 బిహెచ్‌పి పవర్ మరియు 950 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది. ఈ సెడాన్ యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిమీ ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్: బిఎండబ్ల్యు నుంచి ఫెరారీ వరకు..

లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా:

లంబోర్ఘిని కంపెనీ కూడా గతవారంలో తన 'హురాకాన్ టెక్నికా' ను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త సూపర్ కారు ధర రూ. 4.04 కోట్లు (ఎక్స్-షోరూమ్). లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా అనేది కంపెనీ యొక్క బాంకర్స్ టెర్జో మిల్లెనియో కాన్సెప్ట్ మరియు మ్యాడ్ ఎసెన్జా ఎస్‌సివి12 మోడళ్ల ప్రేరణతో రూపొందించబడింది.

గత వారం టాప్ కార్ న్యూస్: బిఎండబ్ల్యు నుంచి ఫెరారీ వరకు..

లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా 5.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 631 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 565 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవతం అవుతుంది. మొత్తం మీద ఇది గరిష్టంగా గంటకు 325 కిలోమీటర్ల వరకు వేగవతం అవుతుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడాయికి ఇక్కడ క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్: బిఎండబ్ల్యు నుంచి ఫెరారీ వరకు..

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 50వ జహ్రే ఎమ్ ఎడిషన్:

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ కూడా దేశీయ మార్కెట్లో 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ అనే కొత్త ఎడిషన్ విడుదల చేసింది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ధర రూ. 1.2 కోట్లు (ఎక్స్-షోరూమ్). అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కేవలం 10 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. కావున కొనుగోలుదారులు త్వరపడాల్సి ఉంటుంది.

గత వారం టాప్ కార్ న్యూస్: బిఎండబ్ల్యు నుంచి ఫెరారీ వరకు..

ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ 3.0 లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, 6 సిలిండర్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 340 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.1 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. డీఐ గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడాయికి ఇక్కడ క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్: బిఎండబ్ల్యు నుంచి ఫెరారీ వరకు..

ఫెరారీ 296 జిటిబి:

ఇటాలియన్ సూపర్ కార్ తయారీ సంస్థ 'ఫెరారీ' (Ferrari) తన మొట్ట మొదటి 6 సిలిండర్ స్పోర్ట్స్‌కార్ అయిన 'ఫెరారీ 296 జిటిబి' (Ferrari 296 GTB) విడుదల చేసింది. ఈ కొత్త హైబ్రిడ్ సూపర్ కార్ ధర అక్షరాలా రూ. 5.40 కోట్లు (ఎక్స్-షోరూమ్).

గత వారం టాప్ కార్ న్యూస్: బిఎండబ్ల్యు నుంచి ఫెరారీ వరకు..

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త ఫెరారీ 296 జిటిబి లో ట్విన్-టర్బో 3.0 లీటర్ V6 హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో కలిపి ఇంజిన్ 819 బిహెచ్‌పి పవర్ మరియు 740 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 165 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఎఫ్1 డిసిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడాయికి ఇక్కడ క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్: బిఎండబ్ల్యు నుంచి ఫెరారీ వరకు..

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ ఆవిష్కరణ:

హ్యుందాయ్ కంపెనీ 'వెన్యూ ఎన్-లైన్' (Venue N-Line) ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. దీనిని కంపెనీ వచ్చే నెల 6వ తేదీన అధికారికంగా మార్కెట్లో విడుదల చేయనుంది. అయితే కంపెనీ దీని కోసం 2022 ఆగస్ట్ 25 న అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లో లేదా అధీకృత డీలర్‌షిప్‌లో రూ. 21,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడాయికి ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Sunday, August 28, 2022, 13:00 [IST]
English summary
Top car news of the week telugu details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+