భారత్‌లో లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా (Lamborghini Huracan Tecnica) విడుదల; ధర రూ. 4.04 కోట్లు

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని (Lamborghini) భారతదేశంలో మరో సరికొత్త సూపర్ కారును విడుదల చేసింది. లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా (Lamborghini Huracan Tecnica) పేరుతో కంపెనీ ప్రవేశపెట్టిన ఈ లేటెస్ట్ సూపర్ కారు ధర ఏకంగా రూ. 4.04 కోట్లు (ఎక్స్-షోరూమ్).

Recommended Video

లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్

లంబోర్ఘిని నుండి అత్యంత ప్రజాదరణ పొందిన ఈ లేటెస్ట్ రియర్-వీల్ డ్రైవ్ సూపర్ కారు ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన నాలుగు నెలల తర్వాత ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది.

భారత్‌లో లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా (Lamborghini Huracan Tecnica) విడుదల; ధర రూ. 4.04 కోట్లు

లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా డిజైన్

లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా సూపర్ కారును కంపెనీ యొక్క ఇతర మోడళ్లయిన బాంకర్స్ టెర్జో మిల్లెనియో కాన్సెప్ట్ మరియు మ్యాడ్ ఎసెన్జా ఎస్‌సివి12 మోడళ్ల నుండి ప్రేరణ పొంది డిజైన్ చేశారు. ఇందులోని ఫ్రంట్ బంపర్ యొక్క నలుపు రంగు Ypsilon డిజైన్ టెర్జో మిల్లెనియో నుండి తీసుకోబడింది. అలాగే, కొత్త హురాకాన్ టెక్నికా యొక్క డిజైన్ సిల్హౌట్ ఎసెన్జా ఎస్‌సివి12 ట్రాక్ మోడల్ నుండి ప్రేరణ పొందింది. వెనుక భాగంలో, టెక్నికా ఫిక్స్‌డ్ రియర్ వింగ్‌ను కలిగి ఉంటుంది, ఇది స్టాండర్డ్ హురాకాన్ ఇవో రియర్ వీల్ డ్రైవ్ మోడల్ తో పోలిస్తే 35 శాతం ఎక్కువ డౌన్‌ఫోర్స్‌ను జోడిస్తుంది.

భారత్‌లో లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా (Lamborghini Huracan Tecnica) విడుదల; ధర రూ. 4.04 కోట్లు

లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా స్పెసిఫికేషన్స్

లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా బాంకర్స్ ఎక్స్‌టిఓ మోడల్‌లో ఉన్న అదే పెద్ద 5.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ 90-డిగ్రీ వి10 గ్యాసోలీన్ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 631 బిహెచ్‌పి శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 565 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు పంపణీ చేయబడుతుంది.

భారత్‌లో లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా (Lamborghini Huracan Tecnica) విడుదల; ధర రూ. 4.04 కోట్లు

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా లోని శక్తివంతమైన వి10 ఇంజన్ ఈ కారుని కేవలం 3.2 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునేలా చేస్తుంది. అలాగే, ఇది కేవలం 9.1 సెకన్లలోనే గంటకు 0 నుండి 200 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే, ఈ సరికొత్త లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా గంటకు గరిష్టంగా 325 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

భారత్‌లో లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా (Lamborghini Huracan Tecnica) విడుదల; ధర రూ. 4.04 కోట్లు

కొత్త లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా కంపెనీ హురాకన్ ఇవో మరియు హురాకన్ ఎస్‌టిఓ మోడళ్ల మధ్య కూర్చొని, ఈ రెండు ప్రపంచాలలో అత్యుత్తమమైన వాటిని అందజేస్తుందని లంబోర్ఘిని పేర్కొంది. లంబోర్ఘిని హురాకాన్ యొక్క STO మరియు EVO S మోడల్ మాదిరిగానే, Tecnica కూడా మూడు రకాల డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. వీటిలో స్ట్రాడా, స్పోర్ట్ మరియు కోర్సా అనే డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఇవి ఈ సూపర్‌కార్ యొక్క ఏరో మరియు ఛాసిస్ సెటప్ కు అనుగుణంగా సర్దుబాటు చేయబడ్డాయి.

భారత్‌లో లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా (Lamborghini Huracan Tecnica) విడుదల; ధర రూ. 4.04 కోట్లు

హురాకాన్ టెక్నికా అత్యధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ, అతి తక్కువ సమయంలో ఆగిపోయేలా చేయడానికి ఇందులో వెంటిలేటెడ్ మరియు క్రాస్-డ్రిల్డ్ కార్బన్ సిరామిక్ డిస్క్‌లను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో ముందు బ్రేక్‌లు 380 మిమీ వ్యాసంతో 6 పిస్టన్ కాలిపర్‌లను కలిగి ఉంటాయి, వెనుక బ్రేక్‌లు 325 మిమీ వ్యాసంతో 4 పిస్టన్ కాలిపర్‌లను కలిగి ఉంటాయి. ఇందులోని అధునాతన ఏబిఎస్ ఫీచర్ సాయంతో హురాకన్ టెక్నికా కారును కేవలం 31.5 మీటర్లలో గంటకు 100 వేగం నుండి ఆపివేయడం సాధ్యమవుతుందని కంపెనీ వివరిచింది.

భారత్‌లో లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా (Lamborghini Huracan Tecnica) విడుదల; ధర రూ. 4.04 కోట్లు

ఈ కారులోని ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా యొక్క ముందు చక్రాలపై బ్రిడ్జ్‌స్టోన్ పోటెన్జా స్పోర్ట్ 245/30 R20 టైర్లు మరియు వెనుక చక్రాలపై 305/30 R20 టైర్‌లు అమర్చబడి ఉంటాయి. ఇందులోని కొత్త 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వెనుక కార్బన్ బ్రేక్‌లు ప్రత్యేకంగా ఉంటాయి.

భారత్‌లో లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా (Lamborghini Huracan Tecnica) విడుదల; ధర రూ. 4.04 కోట్లు

భారతదేశంలో కొత్త హురాకాన్ టెక్నికాను విడుదల చేసిన సందర్భంగా లంబోర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ, భారతదేశంలో తమ స్థిరమైన వృద్ధి కోసం కొత్త మోడళ్లను వేగంగా తీసుకురావడం చాలా కీలకమని, ఈ నేపథ్యంలో మార్కెట్లో నేడు తమ సరికొత్త హురాకాన్ టెక్నికాను ఆవిష్కరించడానికి తాము ఎంతో సంతోషిస్తున్నామని చెప్పారు. తేలికైన టెక్నికా యొక్క రీకాలిబ్రేటెడ్ LDVI సిస్టమ్ మరియు నిర్దిష్ట సస్పెన్షన్ సెటప్, రియర్-వీల్ డైరెక్ట్ స్టీరింగ్ మరియు వినూత్నమైన బ్రేక్ కూలింగ్ మెరుగుదలలతో ప్రత్యేకంగా ట్యూన్ చేయబడిన డ్రైవింగ్ మోడ్‌లు, డ్రైవర్ యొక్క ప్రతి సందర్భంలోనూ ఖచ్చితమైన హురాకాన్‌ను అనుభవించేలా చేస్తాయని ఆయన అన్నారు.

Most Read Articles

English summary
Lamborghini launches huracan tecnica in india price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X