సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ పొందిన BYD Atto 3 గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు - ఇక్కడ చూడండి

చైనా బ్రాండ్ కార్లంటే చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి, లేటెస్ట్ ఫీచర్స్ ఎక్కువగా అందుబాటులో ఉన్నప్పటికీ.. సేఫ్టీ విషయంలో అంత నమ్మశక్యంగా ఉండవేమో అనే సందేహాలు. అయితే ఇలాంటి సందేహాలకు సమాధారణంగా ఇటీవల BYD కంపెనీ భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన SUV విడుదల చేసింది.

BYD కంపెనీ విడుదల చేసిన Atto 3 ఎలక్ట్రిక్ SUV మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉంటుంది. కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు యొక్క ధరలను కూడా ఇటీవలే వెల్లడించింది. ఈ SUV కొనాలనుకునేవారు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది, ఆ విషయాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ పొందిన BYD Atto 3 గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు - ఇక్కడ చూడండి

ధర మరియు బుకింగ్స్:

BYD కంపెనీ విడుదల చేసిన Atto 3 ఎలక్ట్రిక్ SUV ధర రూ. 33.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ ధర దాని ప్రత్యర్థులకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఇందులో ధరకు తగిన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ కూడా స్వీకరిస్తోంది. ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభమవుతాయి.

సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ పొందిన BYD Atto 3 గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు - ఇక్కడ చూడండి

డిజైన్:

BYD ATTO 3 మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV ముందు భాగంలో BYD అక్షరాలతో కూడిన సిల్వర్ గ్రిల్‌ ఉంటుంది, దానికి కింది భాగంలో Atto 3 అనేది ఉంటుంది. అంతే కాకుండా ఇందులో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌తో కూడా సొగసైన హెడ్‌లైట్‌ ఉంటుంది.

సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచెస్ ఫైవ్ స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు సి-పిల్లర్‌పై ప్రత్యేకమైన సిల్వర్ ఫినిషింగ్ వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ మరియు పెద్ద అక్షరాలతో కూడిన 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' ఉన్నాయి.

సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ పొందిన BYD Atto 3 గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు - ఇక్కడ చూడండి

ఫీచర్స్:

ఫీచర్స్ విషయానికి వస్తే, BYD ATTO 3 ఎలక్ట్రిక్ SUV లో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఒక పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింథటిక్ లెదర్ అపోల్స్ట్రే, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు మరియు 5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.

సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ పొందిన BYD Atto 3 గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు - ఇక్కడ చూడండి

కలర్ ఆప్సన్స్ మరియు కొలతలు:

కొత్త ATTO 3 ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి బౌల్డర్ గ్రే, పార్కర్ రెడ్, స్కీ వైట్ మరియు సర్ఫ్ బ్లూ కలర్స్, ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇక కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,455 మిమీ, వెడల్పు 1,875 మిమీ మరియు ఎత్తు 1,615 మిమీ వరకు ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క వీల్‌బేస్‌ 2,720 మిమీ వరకు ఉంటుంది. కొలతల పరంగా ఇది దాని ప్రత్యర్థులకంటే కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది.

సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ పొందిన BYD Atto 3 గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు - ఇక్కడ చూడండి

బ్యాటరీ ప్యాక్ & ఛార్జింగ్:

కొత్త BYD అటో 3 ఎలక్ట్రిక్ SUV పెద్ద 60.48 kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది, కావున ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 521 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని కూడా పొందుతుంది. ఈ SUV కేవలం 7.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్లవరకు వేగవంతం అవుతుంది.

సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ పొందిన BYD Atto 3 గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు - ఇక్కడ చూడండి

ఛార్జింగ్ విషయానికి వస్తే, BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు 80 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 50 నిమిషాల్లో 0 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. అదే సమయంలో టైప్ 2 AC ఛార్జర్‌ని ఉపయోగించి, బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. కంపెనీ ఈ SUV కొనుగులుదారులకు 7kW AC హోమ్ ఛార్జర్‌తో పాటు 3kW AC పోర్టబుల్ ఛార్జింగ్ బాక్స్‌ వంటి వాటిని కూడా అందిస్తుంది.

సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ పొందిన BYD Atto 3 గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు - ఇక్కడ చూడండి

సేఫ్టీ ఫీచర్స్:

ఇక చివరగా ఇందులో తెలుసుకోవాల్సిన విషయం సేఫ్టీ ఫీచర్స్. ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, బెల్ట్ ప్రిటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, ఐసోఫిక్స్, సీట్‌బెల్ట్ రిమైండర్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్పీడ్ అసిస్టెన్స్ మరియు లేన్ అసిస్ట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. ఇటీవల నిర్వహించబడిన క్రాష్ టెస్ట్ లో Atto 3 ఎలక్ట్రిక్ SUV ఏకంగా 5 స్టార్ రేటింగ్ పొందింది. కావున ఇది భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది.

సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ పొందిన BYD Atto 3 గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు - ఇక్కడ చూడండి

రేంజ్ మరియు ప్రత్యర్థులు:

BYD Atto 3 ఎలక్ట్రిక్ SUV ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 521 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ధృవీకరించబడింది. అదే సమయంలో ఇది దాని ఎలక్ట్రిక్ వాహన విభాగంలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన MG ZS EV ఎలక్ట్రిక్ కారుకి ఇది ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #బివైడి #byd
English summary
Top things about new byd atto 3 electric suv
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X