ఫోక్స్‌వ్యాగన్ టైగన్: ధరలు పెంచారు.. అందుకు తగిన ఫీచర్లు కూడా పెంచారు..

జర్మన్ కార్ల బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారత మార్కెట్లో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ టైగన్ (Taigun) ధరలను భారీగా పెంచింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఈ మోడల్ ధరలు రూ.60,000 వరకూ పెరిగాయి. ధరల పెంపు అనంతరం మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ధరలు రూ. 11.39 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. అయితే, పెరిగిన ధరలకు అనుగుణంగా కంపెనీ ఈ ఎస్‌యూవీలో కొన్ని ఫీచర్లను కూడా పెంచింది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్: ధరలు పెంచారు.. అందుకు తగిన ఫీచర్లు కూడా పెంచారు..

వేరియంట్ల వారీగా పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ధరలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బేస్ కంఫర్ట్‌లైన్ వేరియంట్ల ధరలు 3.64 శాతం వరకూ పెరిగాయి. ఈ శ్రేణిలో అత్యధిక ధరల పెంపును అందుకుంది ఇదే. ఈ వేరియంట్ పై గరిష్టంగా రూ. 40,000 వరకూ ధరలు పెరిగాయి. దీంతో ఇప్పుడు టైగన్ ప్రారంభ ధర రూ. 11.39 లక్షలకు చేరుకుంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ హైలైన్ యొక్క మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్లు ధరలు కూడా రూ. 40,000 మేర పెరిగాయి. ఈ పెంపు తర్వాత టైగన్ హైలైన్ మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ. 13.39 లక్షలు కాగా, టైగన్ హైలైన్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 14.79 లక్షలుగా ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్: ధరలు పెంచారు.. అందుకు తగిన ఫీచర్లు కూడా పెంచారు..

టైగన్ టాప్‌లైన్ మరియు టైగన్ జిటి యొక్క మాన్యువల్ వెర్షన్‌ల ధరలు కూడా రూ. 40,000 మేర పెరిగాయి. ఈ ధరల పెంపు తర్వాత టైగన్ టాప్‌లైన్ మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ. 14.99 లక్షలు కాగా, జిటి మాన్యువల్ వేరియంట్ ధర రూ. 15.39 లక్షలుగా ఉంది. టైగన్ టాప్‌లైన్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 50,000 మేర పెరిగి రూ. 16.89 లక్షలకు చేరుకుంది. అలాగే, టైగన్ జిటి ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 60,000 మేర పెరిగి రూ. 18.59 లక్షల నుండి ప్రారంభం అవుతుంది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

ఫోక్స్‌వ్యాగన్ టైగన్: ధరలు పెంచారు.. అందుకు తగిన ఫీచర్లు కూడా పెంచారు..

ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లో అప్‌డేట్ చేయబడిన ఫీచర్లు

సాధారణంగా, కార్ కంపెనీలు తమ వాహనాల ధరలు పెంచినప్పుడు అందులోని ఫీచర్లలో ఎలాంటి మార్పులు చేయరు. అయితే, ఫోక్స్‌వ్యాగన్ మాత్రం తమ టైగన్ ధరను పెంచడంతో పాటుగా అందులో ఫీచర్లను కూడా పెంచింది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క అన్ని వేరియంట్‌లు ఇప్పుడు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ను స్టాండర్డ్‌ ఫీచర్‌గా కలిగి ఉంటాయి. అలాగే, ఇందులో ఆటో ఇంజన్ స్టార్ట్-స్టాప్ సెటప్ కూడా ఇప్పుడు 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజన్‌తో అమర్చబడిన అన్ని వేరియంట్‌లకు స్టాండర్డ్ ఫీచర్ గా లభిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్: ధరలు పెంచారు.. అందుకు తగిన ఫీచర్లు కూడా పెంచారు..

ఈ 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజన్ వేరియంట్లలో కొత్తగా ఆటో ఇంజన్ స్టార్ట్-స్టాప్ ఫీచర్ ను జోడించిన కారణంగా, ఈ ఇంజన్ గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసినప్పుడు ఈ ఇంజన్ లీటరుకు 19.2 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అంటే, మునుపటితో పోలిస్తే, ఇది 1.1 కిమీ మెరుగ్గా ఉంటుంది. కాగా, ఆటోమేటిక్ వేరియంట్‌లు ఇప్పుడు 17.23 కిమీ మైలేజీని అందిస్తాయి. ఈ మోడళ్లలో ఆటో స్టార్ట్-స్టాప్ సిస్టమ్ జోడించిక ముందు ఇది లీటరుకు 16.44 కిమీ మైలేజీని అందిస్తుంది. అంటే, దీని మైలేజ్ లీటరుకు 0.79 కిమీ మెరుగు పడింది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్: ధరలు పెంచారు.. అందుకు తగిన ఫీచర్లు కూడా పెంచారు..

ఈ రెండు స్టాండర్డ్ ఫీచర్లు మినహా, యాంత్రికంగా కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లో ఎలాంటి మార్పులు లేదు. ఇది రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మొదటిది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పి శక్తిని మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ పరంగా, జిటి ట్రిమ్ వేరియంట్లలో మాత్రమే మార్పు ఉంటుంది. ఇందులో సింగిల్ టోనే వేరియంట్లపై చెర్రీ రెడ్ ఇన్సర్ట్‌లు ఉండగా, ఇతర కలర్ ఆఫ్షన్లు గ్లోసీ గ్రే ఇన్‌సర్ట్‌లను కలిగి ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్: ధరలు పెంచారు.. అందుకు తగిన ఫీచర్లు కూడా పెంచారు..

జూన్ 9న 'ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్' (Volkswagen Virtus) విడుదల

ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గంనిస్తే, ఈ బ్రాండ్ తాజాగా భారత మార్కెట్లో ఆవిష్కరించిన తమ సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ 'ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్' (Volkswagen Virtus) ను కంపెనీ జూన్ 9, 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా, ఈ మోడల్ కోసం ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటికే తమ అధీకృత డీలర్లు మరియు వెబ్‌సైట్ ద్వారా అధికారిక బుకింగ్ లను కూడా స్వీకరిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ నుండి తాజాగా మార్కెట్లోకి రాబోతున్న ఈ లేటెస్ట్ మిడ్-సైజ్ సెడాన్, ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న వెంటో సెడాన్ స్థానాన్ని రీప్లేస్ చేయనుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్: ధరలు పెంచారు.. అందుకు తగిన ఫీచర్లు కూడా పెంచారు..

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన స్లావియా (Skoda Slavia) సెడాన్ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగానే ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ కూడా తయారు కానుంది. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్ల (స్లావియా, వర్త్యుస్)లో ఒకే రకమైన ఫీచర్లు మరియు పరికరాలు ఉపయోగించబడనున్నాయి. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మాదిరిగానే వర్త్యుస్ సెడాన్ కూడా 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో విడుదల కానుంది.

Most Read Articles

English summary
Volkswagen india hikes taigun price also adds more standard features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X