ఈ రాష్ట్రంలో ఒక్క టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు కూడా అమ్ముడుపోలేదు.. కారణం ఏంటంటే..?

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా గడచిన మార్చ్ 2022 నెలలో తమ లైఫ్ స్టైల్ వాహనం టొయోటా హైలక్స్ పికప్ (Toyota Hilux Pickup) ట్రక్కు భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఈ పికప్ ట్రక్కు మార్కెట్లోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినప్పటికీ, కేరళ రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకూ ఒక్క హైలక్స్ పికప్ ట్రక్కు కూడా అమ్ముడు కాలేదు. మరి దానికి కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఈ రాష్ట్రంలో ఒక్క టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు కూడా అమ్ముడుపోలేదు.. కారణం ఏంటంటే..?

అమెరికా వంటి దేశాల్లో పికప్ ట్రక్కులకు భారీ డిమాండ్ ఉంటుంది. అక్కడ చాలా మంది వీటిని తమ రోజూవారీ ప్రయాణాల కోసం ఉపయోగిస్తుంటారు. అయితే, మనదేశంలో మాత్రం పికప్ ట్రక్కు అంటే కేవలం వాణిజ్య ప్రయోజనం కోసం మాత్రమే అనే భావన చాలా మందిలో ఉంది. అందుకే, ఇలాంటి పికప్ ట్రక్కులను ప్రైవేట్ వాహనాలనుగా వినియోగించడాన్ని మనం చాలా అరుదుగా చూస్తుంటాం.

ఈ రాష్ట్రంలో ఒక్క టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు కూడా అమ్ముడుపోలేదు.. కారణం ఏంటంటే..?

పర్యాటక రాష్ట్రమైన కేరళలో సవరించబడిన వాహనాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే, ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ నియమాలు చాలా ఖచ్చితంగా పాటిస్తారు, ముఖ్యంగా కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అయితే, కొన్నిసార్లు ఇలాంటి నియమాలు మరియు పరిమితులు కొంచెం అవసరమైన దానికంటే ఎక్కువగానే పాటిస్తున్నారని అనిపిస్తుంటుంది.

ఈ రాష్ట్రంలో ఒక్క టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు కూడా అమ్ముడుపోలేదు.. కారణం ఏంటంటే..?

భారతదేశం పికప్ ట్రక్కులను ప్రైవేట్ వాహనాలుగా నమోదు చేయడాన్ని అంతగా ప్రోత్సహించదు, ప్రత్యేకించి పేలోడ్ సామర్థ్యం 1 టన్ను కంటే ఎక్కువగా ఉంటే వాటిని తప్పనిసరిగా వాణిజ్య వాహనాలుగా మాత్రమే రిజిస్టర్ చేయాలి. ఈ కారణం వల్లనే మనం భారతీయ రోడ్లపై అనేక ప్రైవేట్ రిజిస్టర్డ్ మహీంద్రా బొలెరో క్యాంపర్ పికప్ ఎస్‌యూవీలను చూడలేకపోతున్నాం. అయితే, లైఫ్ స్టైల్ పికప్ విభాగంలో ఇసుజు మాత్రం చక్కగా ప్లాన్ చేసి, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ రాష్ట్రంలో ఒక్క టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు కూడా అమ్ముడుపోలేదు.. కారణం ఏంటంటే..?

ఇసుజు వి-క్రాస్ పికప్ ఎస్‌యూవీని కేరళలో ప్రైవేట్ వాహనంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగని, కేరళ MVD ఇసుజుకు "అనుకూలంగా" ఉన్నట్లు కాదు. ఇసుజు పికప్ ట్రక్కులో పేలోడ్ సామర్థ్యాన్ని 215 కిలోలుగా పేర్కొనడం ద్వారా కంపెనీ ఈ నిబంధనలతో చాలా తెలివిగా ప్లాన్ చేసింది. అందుకే, ఇసుజు వి-క్రాస్ పికప్ ట్రక్కును ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రైవేట్ వాహనంగా నమోదు చేసుకోవచ్చు.

ఈ రాష్ట్రంలో ఒక్క టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు కూడా అమ్ముడుపోలేదు.. కారణం ఏంటంటే..?

అయితే, టొయోటా హిలక్స్ పికప్ ఎస్‌యూవీలో పేలోడ్ సమస్య కారణంగా చాలా మంది ఈ పికప్ ట్రక్కును కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్నప్పటికీ, కేరళ MVD రూల్స్‌కి భయపడి కస్టమర్లు దీనిని కొనడం మానేస్తున్నారని టాకింగ్ కార్స్ పేరుతో ఉన్న ఓ యూట్యూబ్ చానెల్ లో హైలైట్ చేశారు. బహుశా, ఆ రాష్ట్రంలో టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కును తప్పనిసరిగా కమర్షియల్ వెహికల్ మాదిరిగానే రిజిస్టర్ చేయాలేమో అనే అనుమానం మరియు దాని ఖరీదైన ధర వంటి అంశాల కారణంగా కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒక్క హైలక్స్ పికప్ ట్రక్కు కూడా అమ్ముడుకాలేదు.

ఈ రాష్ట్రంలో ఒక్క టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు కూడా అమ్ముడుపోలేదు.. కారణం ఏంటంటే..?

ఓ నివేదిక ప్రకారం, టొయోటా హైలక్స్ ఎస్‌యూవీ కోసం వస్తున్న అధిక డిమాండ్ కారణంగా, ఇందులో అధిక పేలోడ్ మోడల్ కోసం బుకింగ్‌లు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ప్రస్తుతం, మార్కెట్లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ 'STD' వేరియంట్ టొయోటా హైలక్స్ పికప్ ధరలు రూ. 33.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన టాప్-స్పెక్ 'హై' వేరియంట్ ధర రూ. 36.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

ఈ రాష్ట్రంలో ఒక్క టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు కూడా అమ్ముడుపోలేదు.. కారణం ఏంటంటే..?

టొయటా హైలక్స్ పికప్ అద్భుతమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇది ఇటు సిటీ ప్రయాణాలకు మరియు అటు ఆఫ్-రోడ్ ఉపయోగానికి రెండింటికీ అనువుగా ఉంటుంది. అయితే, ఇది కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పికప్ ముందు భాగంలో పెద్ద హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్ మరియు ఇరు వైపులా ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లను కలిగి ఉంటుంది. మజిక్యులర్ బాడీ లైన్స్‌తో ముందు వైపు నుండి ఇది గంభీరంగా ఉండి, మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది.

ఈ రాష్ట్రంలో ఒక్క టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు కూడా అమ్ముడుపోలేదు.. కారణం ఏంటంటే..?

ఈ పికప్ ట్రక్కులోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో సాఫ్ట్ టచ్ మెటీరియల్స్‌తో కూడిన ఇంటీరియర్స్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, జెబిఎల్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ, ప్రంట్ పార్కింగ్ సెన్సార్లు, క్రూయిజ్ కంట్రోల్, అదనపు ఎయిర్‌బ్యాగ్‌లు, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు A-TRAC అనే యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ రాష్ట్రంలో ఒక్క టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు కూడా అమ్ముడుపోలేదు.. కారణం ఏంటంటే..?

టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు శక్తివంతమైన 2.8 లీటర్ డీజిల్ ఇంజన్‌ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 201బిహెచ్‌పి పవర్ మరియు 500ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. హైలక్స్ మాన్యువల్ వేరియంట్‌లో గరిష్ట టార్క్ కేవలం 420 ఎన్ఎమ్‌కి మాత్రమే పరిమితం చేయబడి ఉంటుంది. ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ (4x4) సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Why toyota dealers unable to sell hilux pickup truck in kerala
Story first published: Saturday, October 8, 2022, 6:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X