ఆటో ఎక్స్‌పో 2023: ఫుల్ ట్యాంక్‌తో 640 కిమీ అందించే 'మిరాయ్' ఆవిష్కరించిన టయోటా

ఆటో ఎక్స్‌పో 2023 లో అడుగుపెట్టిన చాలా వాహనాలలో ఒకటి టయోటా కంపెనీ యొక్క 'మిరాయ్' హైడ్రోజన్ ఫ్యూయల్-సెల్ వెహికల్. కంపెనీ ఈ 'మిరాయ్' హైడ్రోజన్ ఫ్యూయల్-సెల్ వెహికల్ ని ఆటో ఎక్స్‌పో వేదికగా ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆటో ఎక్స్‌పో 2023 లో టయోటా కంపెనీ ప్రదర్శించిన మిరాయ్ మోడల్ రెండవ జనరేషన్ కి చెందినది. ఇది నిజానికి 2020 లో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. కావున ఈ మోడల్ భారతీయ మార్కెట్లోకి తీసుకురావడం ఇదే మొదటి సారి కాదు. అప్పట్లోనే ఈ మోడల్ 2022 నాటికి భారతీయ మార్కెట్లో విడుదకవుతుందని భావించారు. అయితే అనుకోని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే ఈ 2023 ఆటో ఎక్స్‌పోలో మళ్ళీ కనిపించింది.

ఫుల్ ట్యాంక్‌తో 640 కిమీ అందించే మిరాయ్ ఆవిష్కరించిన టయోటా

భారతీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన ఈ రెండవా జనరేషన్ మిరాయ్ మోడల్ GA-L రియర్-వీల్-డ్రైవ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. కావున టయోటా ఫ్యూయెల్ సెల్ స్టాక్ మరియు డ్రైవ్‌ట్రెయిన్ భాగాలను పొందుతుంది. అంతే కాకుండా ఇది మూడు హైడ్రోజన్ ట్యాంకులను కలిగి ఉంటుంది. ఈ మూడు ట్యాంకులు కలిగి ఉండటం వల్ల ఇది ఎక్కువ పరిధిని అందించడానికి అనుకూలంగా ఉంటుంది.

దేశీయ విఫణిలో ఆవిష్కరించబడిన మిరాయ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ 174 hp పవర్ డెలివరీ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ట్యాంక్ తో గరిష్టంగా 640 కిమీ పరిధి అందిస్తుంది. నిజంగానే ఇది ఎక్కువ పరిధి కావాలనుకునే వారికి మంచి వాహనం అవుతుంది. ఇది మంచి డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు గాలిని శుభ్రపరచడానికి ఫిల్టర్స్ వంటివి ఉంటాయి.

ఫుల్ ట్యాంక్‌తో 640 కిమీ అందించే మిరాయ్ ఆవిష్కరించిన టయోటా

కొత్త మిరాయ్ స్లిక్ స్టైలింగ్, తక్కువ స్లంగ్ స్టాన్స్ కలిగి వెనుక భాగం కూపే మాదిరిగా ఉంటుంది. అయితే వెనుక ఉన్న డిజైన్ కి ముందు భాగంలో ఉన్న డిజైన్ కొంత భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. ముందు భాగంలో విశాలంగా ఉండే బోనెట్, దానికింద విశాలంగా బ్లాక్ కలర్ లో ఉన్న గ్రిల్, దాని పైన బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి. హెడ్ లాంప్, ఓఆర్విఎమ్ మరియు వెనుక వెడల్పు అంతటా విస్తరించి ఉండే టెయిల్ లైట్ వంటివి ఉంటాయి. మొత్తం డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్దగా మరియు సమాంతరంగా ఉన్న 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డ్యాష్ బోర్డు మధ్యలో ఉంటుంది. మిరాయ్ యొక్క హై స్పెక్ వేరియంట్ లో త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ స్టీరింగ్ వీల్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ సీట్లు, హెడ్ అప్ డిస్‌ప్లే మరియు ADAS టెక్నాలజీ ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఫుల్ ట్యాంక్‌తో 640 కిమీ అందించే మిరాయ్ ఆవిష్కరించిన టయోటా

టయోటా కంపెనీ భారతీయ మార్కెట్లో హైడ్రోజన్ ఫ్యూయల్-సెల్ వెహికల్స్ విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (iCAT)తో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం కూడా చేసింది. ఇందులో భాగంగానే తన రెండవ జనరేషన్ మిరాయ్ ని తీసుకువచ్చింది. అయితే ఈ కారుని టయోటా భారతీయ మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తుంది అనే విషయాన్ని గురించి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడ్డాయి మరియు విడుదలయ్యాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన/విడుదలైన వాహనాలను గురించి తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

Most Read Articles

English summary
Auto expo 2023 toyota mirai fuel cell vehicle showcased design and features
Story first published: Friday, January 13, 2023, 18:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X