కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..

మహీంద్రా కంపెనీ తన XUV700 SUV ని ప్రారంభించినప్పటి నుంచి మంచి బుకింగ్స్ పొందుతూ అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందగలిగింది. ఇప్పటికి కూడా ఈ SUV కోసం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగానే ఉంది. అయితే ఈ 2023 లో కంపెనీ XUV700 యొక్క ధరలను పెంచింది.

2023 వ సంవత్సరం ప్రారంభమైన ఇంకా ఒక నెల రోజులు కూడా పూర్తి కాలేదు, అప్పుడే కంపెనీ తన పాపులర్ SUV XUV700 ధరలను కనిష్టంగా రూ. 32,000 మరియు గరిష్టంగా రూ. 64,000 వరకు పెంచింది. ధరల పెరుగుదల కాకుండా ఈ ఆధునిక SUV డిజైన్ లో గానీ ఫీచర్స్ లో గానీ మరియు పర్ఫామెన్స్ లో గానీ ఎటువంటి అప్డేట్స్ లేదు.

మహీంద్రా XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..

XUV700 యొక్క పెట్రోల్ వేరియంట్ బేస్ మోడల్ MXMT5s ధరలు పెరగలేదు, కావున ఇది రూ. 13.45 లక్షల వద్ద అందుబాటులో ఉంది. అయితే ఇందులో టాప్ వేరియంట్ AX7 AT 7s L ధర రూ. 50,000 పెరిగి రూ. 23.60 లక్షలకు చేరింది. గతంలో ఈ వేరియంట్ ధర రూ. 23.10 లక్షలు. ఇక AX7 AT 7s ధర కూడా రూ. 47,000 పెరిగి రూ. 21.66 లక్షలకు చేరింది.

XUV700 యొక్క డీజిల్ వేరియంట్స్ విషయానికి వస్తే, బేస్ వేరియంట్ MXMT5s ధరలు నిశ్చలంగా ఉన్నాయి. అంటే ఈ SUV ధరలు పెరగలేదు మరియు తగ్గలేదు. కావున దీని ధర రూ. 13.96 లక్షలు. ఇందులో టాప్ వేరియంట్ అయిన AX7 AT 7s L AWD ధరలు రూ. 53,000 పెరిగి రూ. 25.48 లక్షలకు చేరింది. ఇందులో AX7 AT 7s ధరలు గరిష్టంగా రూ. 64,000 పెరిగాయి. కావున ఈ వేరియంట్ ధరలు ఇప్పుడు రూ. 22.48 లక్షలు.

మహీంద్రా XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. కటి 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

సేఫ్టీ పరంగా మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కైవసం చేసుకుంది. మొత్తం మీద దేశీయ మార్కెట్లో లభించే సురక్షితమైన కార్ల జాబితాలో XUV700 కూడా చేరింది.

మహీంద్రా XUV700 ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX3, AX3, AX5 మరియు AX7 వేరియంట్స్. ఇవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ ల ఎంపికలో అందుబాటులో ఉంటుంది. కానీ, MX5 ట్రిమ్ కేవలం 3 వేరియంట్‌లకు పరిమితం చేయబడింది. ఇందులో పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ ఆటోమేటిక్ మరియు డీజిల్ మాన్యువల్ వేరియంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 సీటర్ ఆప్షన్‌తో లభిస్తాయి.

మహీంద్రా XUV700 SUV డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Most Read Articles

English summary
Mahindra xuv700 price hiked new price details in telugu
Story first published: Saturday, January 28, 2023, 11:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X