మారుతి జిమ్నీ vs మహీంద్రా థార్: ఇందులో బెస్ట్ ఏదంటే?

మారుతి సుజుకి కంపెనీ మొదటి సారిగా తన 5-సీటర్ 'మారుతి జిమ్నీ' SUV ని 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఈ SUV చూడటానికి మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ SUV మహీంద్రా కంపెనీ యొక్క 'థార్' SUV కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు పాపులర్ SUV ల మధ్య తేడాలను ఈ కథనంలో చూద్దాం రండి.

మారుతి జిమ్నీ vs మహీంద్రా థార్: ఇందులో బెస్ట్ ఏదంటే?

మారుతీ సుజుకి జిమ్నీ vs మహీంద్రా థార్: డిజైన్

మారుతి సుజుకి జిమ్నీ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో LED హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ కలర్ బంపర్‌లు, ఫ్లాప్ టైప్ డోర్ హ్యాండిల్స్ మరియు స్లైడింగ్ రియర్ విండో వంటివి ఉన్నాయి. ఈ SUV లో 2 కెప్టెన్ సీట్లు మరియు వెనుకవైపు 3 మంది ప్రయాణీకులకు ఒక బెంచ్ ఉంటాయి. సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రూప్ మాత్రం బ్లాక్ కలర్ ఉండటం చూడవచ్చు.

మారుతి జిమ్నీ vs మహీంద్రా థార్: ఇందులో బెస్ట్ ఏదంటే?

మహీంద్రా థార్ విషయానికీ వస్తే, ఈ SUV చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, ఇందులో నాలుగు సీట్లు వంటివి పొందుతాయి. మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

మారుతి జిమ్నీ vs మహీంద్రా థార్: ఇందులో బెస్ట్ ఏదంటే?

మారుతీ సుజుకి జిమ్నీ vs మహీంద్రా థార్: కొలతలు

మారుతి సుజుకి జిమ్నీ మరియు మహీంద్రా థార్ మధ్య పరిమాణంలో వ్యత్యాసం చాలా సులభంగా గుర్తించదగినది. మారుతి సుజుకి జిమ్నీ పొడవు 3985 మిమీ పొడవు, 1645 మిమీ వెడల్పు, 1720 మిమీ పొడవు మరియు 2590 మిమీ వీల్‌బేస్‌ కలిగి ఉంటుంది.

మారుతి జిమ్నీ vs మహీంద్రా థార్: ఇందులో బెస్ట్ ఏదంటే?

మారుతి సుజుకి జిమ్నీ vs మహీంద్రా థార్: ఫీచర్లు

మారుతి సుజుకి జిమ్నీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. డాష్‌బోర్డ్ రెండు చివరలో రౌండ్ ఎయిర్ వెంట్స్ ఉంటాయి. ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే కింద మ్యాన్యువల్ బటన్లు ఉండటం కూడా గమనించవచ్చు. రెండవ వరుస ప్రయాణికుల కోసం బాటిల్ హోల్డర్స్ మరియు ఛార్జింగ్ సాకేట్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

మారుతి జిమ్నీ vs మహీంద్రా థార్: ఇందులో బెస్ట్ ఏదంటే?

మహీంద్రా థార్ ఇంటీరియర్ విషయానికీ వస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ వంటి వాటికి సపోర్ట్ చేసే 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ ఉంటుంది. అంతే కాకుండా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్స్, క్రూయిజ్ కంట్రోల్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో పాటు కొత్త మహీంద్రా థార్ ఆటో స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌ పొందుతుంది. దీనిని స్టీరింగ్ వీల్ మరియు డ్రైవర్ డోర్ మధ్య కంట్రోల్ ప్యానెల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మారుతి జిమ్నీ vs మహీంద్రా థార్: ఇందులో బెస్ట్ ఏదంటే?

మారుతి సుజుకి జిమ్నీ vs మహీంద్రా థార్: ఇంజిన్ ఆప్సన్స్

కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. సుజుకి యొక్క లెజెండరీ ఆల్ గ్రిప్ ప్రో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా జిమ్నీ యొక్క నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ పంపుతుంది.

మారుతి జిమ్నీ vs మహీంద్రా థార్: ఇందులో బెస్ట్ ఏదంటే?

సరికొత్త మహీంద్రా థార్ RWD లో ఉన్న 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ దాని 4WD వేరియంట్ మాదిరిగా అదే పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 6 సీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, థార్ RWD మోడల్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 117 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. అయితే ఈ డీజిల్ ఇంజిన్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది. ఇందులో డీజిల్ ఆటోమేటిక్‌ వేరియంట్ అందుబాటులో లేదు.

మారుతి జిమ్నీ vs మహీంద్రా థార్: ఇందులో బెస్ట్ ఏదంటే?

మారుతి సుజుకి జిమ్నీ vs మహీంద్రా థార్: కలర్ ఆప్సన్స్ & ధరలు

మారుతి 5 డోర్స్ జిమ్నీ కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెరల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. కంపెనీ ఈ SUV ధరలను ఇంకా ప్రకటించలేదు, అయితే ధరలు తప్పకుండా త్వరలోనే వెల్లడవుతాయి.

మారుతి జిమ్నీ vs మహీంద్రా థార్: ఇందులో బెస్ట్ ఏదంటే?

మహీంద్రా థార్ RWD రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి బ్లేజింగ్ బ్రాంజ్ మరియు ఎవరెస్ట్ వైట్ కలర్స్. మహీంద్రా థార్ ఆర్‌డబ్ల్యుడి ఎఎక్స్ (ఓ) వేరియంట్ లేదా బేస్ వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు కాగా, కాగా థార్ ఆర్‌డబ్ల్యుడి ఎల్‌ఎక్స్ వేరియంట్ ధర రూ. 10.99 లక్షల వరకు ఉంటుంది. అదే సమయంలో థార్ ఆర్‌డబ్ల్యుడి ఎల్‌ఎక్స్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 13.49 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

Most Read Articles

English summary
Maruti suzuki jimny vs mahindra thar comparison design features and more
Story first published: Monday, January 16, 2023, 11:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X