2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టనున్న కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ - వివరాలు

జపనీస్ వాహన తయారీ సంస్థ టయోటా భారతదేశంలో జరగనున్న 2023 ఆటో ఎక్స్‌పోలో తన కొత్త తరం ఫ్లాగ్‌షిప్ ల్యాండ్ క్రూయిజర్‌ 300 ను ప్రదర్శించనుంది. ఇది కొత్త ప్లాట్‌ఫారమ్, లేటెస్ట్ డిజైన్, ఇంటీరియర్ మరియు కొత్త ఫీచర్లను పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టనున్న కొత్త ల్యాండ్ క్రూయిజర్ 300 అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇందులో సమాంతరంగా కనిపించే స్లాట్‌లతో కూడిన పెద్ద గ్రిల్, దానికి ఇరువైపులా సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫాగ్ ల్యాంప్‌ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ భారీగా కనిపించడమే కాకుండా ఫ్లెర్డ్ వీల్ ఆర్చ్‌లతో ఉంటుంది. వెనుక వైపున LED టెయిల్‌లైట్‌లతో నిటారుగా ఉండే టెయిల్‌గేట్‌ చూడవచ్చు.

 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టనున్న కొత్త ల్యాండ్ క్రూయిజర్

ఇంకా ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో సెంట్రల్ కన్సోల్, డోర్ ప్యాడ్‌లు మరియు స్టీరింగ్ వీల్‌పై వుడ్ మరియు సిల్వర్ ఫినిషింగ్ తో బ్లాక్ మరియు బేజ్ కలర్ థీమ్ పొందుతుంది. క్యాబిన్ మొత్తం చాలా వరకు బ్లాక్ కారల్ థీమ్ పొందుతుంది, కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. క్యాబిన్ చాలా విశాలంగా ఉండటం వల్ల మంచి డ్రైవింగ్ అనుభూతిని వాహన వినియోగదారులు తప్పకుండా పొందవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, 14-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు మరియు సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కావున ఈ ల్యాండ్ క్రూయిజర్‌ 300 తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తుంది.

కొత్త ల్యాండ్ క్రూయిజర్ 300 సిరీస్‌లో 3.5-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V6 పెట్రోల్ ఇంజన్ మరియు 3.3-లీటర్ బై-టర్బో V6 డీజిల్ యూనిట్ పొందుతుంది ఇందులోని 3.5-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V6 పెట్రోల్ ఇంజన్ 415 పిఎస్ పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇందులో ఉన్న 3.3-లీటర్ బై-టర్బో V6 డీజిల్ ఇంజిన్ 309 పిఎస్ పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ల్యాండ్ క్రూయిజర్ 300 అదే 10 స్పీడ్ AT తో కూడా వస్తుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి6 పెట్రోల్ ఇంజన్ కూడా కొన్ని ప్రాంతాలలో ఆఫర్‌లో ఉంది. దేశీయ మార్కెట్లో విడుదలయ్యే ఈ కొత్త మోడల్ ఏ ఇంజిన్ ఆప్సన్ లేదా ఏ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందుతుంది అనేది ఖచ్చితంగా తెలియదు. దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే తెలుస్తుంది.

ఈ కొత్త లేటెస్ట్ SUV యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ADAS టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది, కావున అడాప్టివ్ వేరియబుల్ సస్పెన్షన్, ఫోర్-జోన్ టెంపరేచర్ కంట్రోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, లెదర్ అపోల్స్ట్రే వంటి వాటితో పాటు రెండవ వరుసలో 11 ఇంచెస్ స్క్రీన్‌లు, మల్టీ-టెర్రైన్ మోడ్ సెలెక్టర్, 3D మల్టీ-టెర్రైన్ మానిటర్ మరియు 10 ఎయిర్‌బ్యాగ్‌లు వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టనున్న ల్యాండ్ క్రూయిజర్ 300 SUV భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది. దీని ధర ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ దేని ధర రూ.1.5 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఇది దేశీయ మార్కెట్లో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ మరియు లెక్సస్ LX వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ SUV గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New toyota land cruiser 300 to be showcased at auto expo 2023
Story first published: Friday, January 6, 2023, 11:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X