2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన టాప్ 5 కాన్సెప్ట్ కార్లు - మారుతి eVX నుంచి టాటా అవిన్య కాన్సెప్ట్ EV వరకు

భారతదేశంలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో అనేక ఆధునిక కార్లు అడుగుపెట్టాయి. ఇందులో టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఎంజి మోటార్స్ మరియు హ్యుందాయ్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. 2022 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన 5టాప్ కాన్సెప్ట్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన టాప్ 5 కాన్సెప్ట్ కార్లు - మారుతి eVX నుంచి టాటా అవిన్య కాన్సెప్ట్ EV వరకు

మారుతి సుజుకి eVX కాన్సెప్ట్:

ఆటో ఎక్స్‌పో 2023 ప్రారంభమైన మొదటి రోజే మారుతి సుజుకి తన లేటెస్ట్ కాన్సెప్ట్ eVX ఆవిష్కరించింది. ఈ మారుతి సుజుకి eVX కాన్సెప్ట్ కారు మరో రెండు సంవత్సరాల్లో మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది ఒక ఆల్-ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUV కావున ఇది ఒక ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌ ఉంటుంది. అయితే గ్రిల్ భాగం మొత్తం క్లోజ్ చేయబడి దాని మధ్యలో బ్రాండ్ లోగో ఉంటుంది. కింది భాగంలో ఫాగ్ ల్యాంప్స్ మరియు పెద్ద సిల్వర్ బాష్ ప్లేట్‌ వంటివి ఉన్నాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన టాప్ 5 కాన్సెప్ట్ కార్లు - మారుతి eVX నుంచి టాటా అవిన్య కాన్సెప్ట్ EV వరకు

మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ SUV లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇందులోని 60 kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 550 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఇది మార్కెట్లో లాంచ్ అయినా తరువాత ఖచ్చితమైన పరిధి తెలుస్తుంది. అయితే తప్పకుండా ఈ ఎలక్ట్రిక్ SUV 500 కిమీ పరిధిని అందిస్తుందని ఆశిస్తున్నాము. కావున ఇది తప్పకుండా ఎక్కువ పరిధిని కోరుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన టాప్ 5 కాన్సెప్ట్ కార్లు - మారుతి eVX నుంచి టాటా అవిన్య కాన్సెప్ట్ EV వరకు

టాటా హారియార్ EV:

దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2023 వేదికగా దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన హారియర్ EV కాన్సెప్ట్‌ మోడల్ 2024 నాటికి విక్రయానికి రానున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కారు ఒమేగా ఆర్కిటెక్చర్‌ మీద ఆధారపడి ఉంటుంది. కావున ఇది అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన టాప్ 5 కాన్సెప్ట్ కార్లు - మారుతి eVX నుంచి టాటా అవిన్య కాన్సెప్ట్ EV వరకు

కొత్త టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారులో 60 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ బ్యాటరీ ఫ్యాక్స్ కంటే కొంత పెద్దదిగా ఉంటుంది, కావున రేంజ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 400 కిమీ నుంచి 500 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉంటుందని భావించవచ్చు. అయితే ఇంకా ఖచ్చితమైన గణాంకాలు వెల్లడి కాలేదు.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన టాప్ 5 కాన్సెప్ట్ కార్లు - మారుతి eVX నుంచి టాటా అవిన్య కాన్సెప్ట్ EV వరకు

టాటా అవిన్య కాన్సెప్ట్ EV:

టాటా మోటార్స్ 2023 ఆటో ఎక్స్‌పో వేదిక మీద ప్రదర్శించిన అత్యుత్తమ మోడల్ ఈ 'అవిన్య కాన్సెప్ట్ EV'. ఇది 2022 ఏప్రిల్ నెలలోనే భారతీయ మార్కెట్లో వెల్లడైంది. నిజానికి టాటా మోటార్స్ ప్రపంచ మార్కెట్లో పరిచయం చేసిన జనరేషన్ 3 ఎలక్ట్రిక్ వాహనాల్లో 'అవిన్య' మొదటిది చెప్పవచ్చు. 2022 లోనే వెల్లడైన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఆటో ఎక్స్‌పోలో కూడా అందరి దృష్టిని ఆకర్శించింది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన టాప్ 5 కాన్సెప్ట్ కార్లు - మారుతి eVX నుంచి టాటా అవిన్య కాన్సెప్ట్ EV వరకు

టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2023 లో ప్రదర్శించిన ఈ మోడల్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం కంపెనీ తయారు చేసిన సరికొత్త స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఉత్పత్తి 2025 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త జనరేషన్ 3 ఎలక్ట్రిక్ వెహికల్ 500 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ఇదివరకే తెలిపింది. కావున ఇది తప్పకుండా మార్కెట్లో విజయవంతమైన మోడల్ గా అవతరించనుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన టాప్ 5 కాన్సెప్ట్ కార్లు - మారుతి eVX నుంచి టాటా అవిన్య కాన్సెప్ట్ EV వరకు

టయోటా హైలక్స్ ఎక్స్‌ట్రీమ్:

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన చాలా వాహనాల్లో టయోటా హైలక్స్ ఎక్స్‌ట్రీమ్ చాలామంది దృష్టిని ఎంతగానో ఆకర్శించింది. ఈ ఆఫ్ రోడ్ కాన్సెప్ట్‌ ఆఫ్ రోడ్ ప్రియలందరిని ఒక్క చూపుతోనే కట్టి పడేసింది. ఈ కొత్త టయోటా హైలక్స్ ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్ పిక్ అప్ SUV అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ కూడా పొందుతుంది. కావున ఎలాంటి ఆఫ్ రోడింగ్ కైనా ఇది సిద్ధంగా ఉంటుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన టాప్ 5 కాన్సెప్ట్ కార్లు - మారుతి eVX నుంచి టాటా అవిన్య కాన్సెప్ట్ EV వరకు

కొత్త టయోటా Hilux ఎక్స్‌ట్రీమ్ బాహ్య మార్పులు మనకు స్ఫష్టంగా తెలుస్తున్నాయి. అయితే లోపల ఇంటీరియర్ లో ఏమైనా మార్పులు జరిగాయా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. దీని గురించి టయోటా కూడా ఎలాంటి సమాచారం అందివ్వలేదు. ఈ SUV టయోటా ఫార్చ్యూనర్ యొక్క అదే 2.8-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఈ ఇంజిన్ 201 bhp పవర్ మరియు 500 Nm గరిష్ట టార్క్‌ అందిస్తుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన టాప్ 5 కాన్సెప్ట్ కార్లు - మారుతి eVX నుంచి టాటా అవిన్య కాన్సెప్ట్ EV వరకు

టాటా కర్వ్ కాన్సెప్ట్:

టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2023లో కర్వ్ కాన్సెప్ట్ కూడా ప్రదర్శించింది. ఇది రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్లో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఇది ఇప్పటికే గత సంవత్సరం ప్రదర్శించబడిన ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఇది టర్బోచార్జ్డ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కంపెనీ త్వరలోనే వెల్లడిస్తుంది.

Most Read Articles

English summary
Top five concept cars at auto expo 2023 maruti evx tata avinya concept and more
Story first published: Saturday, January 14, 2023, 16:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X