2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన స్కూటర్లు మరియు బైకులు

Written By:

2017 ఏడాదిలో ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని సంస్థలు నష్టాలతో కార్యకలాపాలను విరమించుకుంటే... మరికొన్ని సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త మోడళ్లను లాంచ్ చేశాయి.

అందులో బైకులు కూడా విపరీతంగా లాంచ్ అయ్యాయి. అత్యంత సరసమైన ఎంట్రీ లెవల్ టూ వీలర్ల నుండి అత్యంత ఖరీదైన హై కెపాసిటి ఇంజన్ గల సూపర్ బైకుల వరకు ఎన్నో టూ వీలర్ల విడుదలకు భారత్ నిలయమైంది. 2017లో విడుదలైన అతి ముఖ్యమైన టూ వీలర్ల గురించి ప్రత్యేక కలెక్షన్ మీ కోసం...

2017లో విడుదలైన బైకులు

టీవీఎస్ అపాచే ఆర్ఆర్310

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ మొట్టమొదటి ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్ సైకిల్‌ను 2017 డిసెంబరులో లాంచ్ చేసింది. టీవీఎస్ మోటార్స్ ఈ అపాచే ఆర్ఆర్ 310 బైకును బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ భాగస్వామ్యంతో రూపొందించింది. 35 ఏళ్ల రేసింగ్ హిస్టరీతో టీవీఎస్ తమ అత్యంత శక్తివంతమైన మోటార్ సైకిల్ అపాచే ఆర్ఆర్ 310ను ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో ప్రవేశపెట్టింది.

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310 లాంచ్ డిటైల్స్ కోసం...

2017లో విడుదలైన బైకులు

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 బైకును 300సీసీ సెగ్మెంట్లోకి స్పోర్టివ్ ఫుల్లీ ఫెయిరింగ్ డిజైన్‌లో అత్యంత సరసమైన ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టైకింగ్ లుక్స్, ప్రతి ఒక్కరూ కోరుకునే పర్ఫామెన్స్, రేస్ ట్రాక్ మరియు రెగ్యులర్ సిటీ రైడింగ్‌ అవసరాలకు ఎంతో అనువుగా ఉంటుంది. 2017లో అతి ముఖ్యమైన బైక్ లాంచెస్‌లో ఇదీ ఒకటి.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 బైకును డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ రైడ్ చేసింది. రివ్యూని చదవండి...

Recommended Video - Watch Now!
Top 5 Best Performance Bikes Under 1 Lakh - DriveSpark
2017లో విడుదలైన బైకులు

కెటిఎమ్ డ్యూక్ 390

ఇండియన్స్‌కు మోటార్ సైకిల్ రేసింగ్‌ను ఎక్కువగా చేరువ చేసిన వాటిలో కెటిఎమ్ కీలకంగా వ్యవహరించింది. దేశీయంగా కెటిఎమ్‌కు అతి ప్రధానమైన మోడల్ డ్యూక్ 390. సంవత్సరాలు గడిచేకొద్దీ డిజైన్ పాతదైపోవడంతో ఎన్నో అప్‌డేట్స్ చేసి సరికొత్త డ్యూక్ 390 బైకును లాంచ్ చేసింది. కెటిఎమ్ రీలాంచ్ చేసిన సరికొత్త డ్యూక్ 390 బైకు ప్రతిష్టాత్మక ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ దక్కించుకుంది.

2017లో విడుదలైన బైకులు

డిజైన్ మార్పులతో పాటు ఎన్నో కొత్త ఫీచర్లను కూడా తీసుకొచ్చింది. ఇందులో ఆల్ న్యూ ఎల్ఇడి హెడ్ ల్యాంప్, రైడ్ బై వైర్ థ్రోటిల్ మరియు స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ వంటివి ఫీచర్లను అత్యంత సరసమైన ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియాలో ఎంతో మంది యువ రైడర్ల ఫేవరెట్ రేసింగ్ మెషీన్‌గా కెటిఎమ్ 390 బైకు నిలిచింది.

2017లో విడుదలైన బైకులు

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 స్టెల్త్ బ్లాక్

మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయించే బైకులు ఎంతో ఇండియన్స్ యొక్క ఎవర్‌గ్రీన్ బైకులుగా నిలిచాయి. అందులో ఒకటి క్లాసిక్ 500. పాత కాలం నాటి రెట్రోల్ డిజైన్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్‌కు మాత్రమే సొంతమైన ఇంజన్ సౌండ్ వంటివి బైకును మరింత ప్రత్యేకం చేశాయి. కస్టమర్లకు నూతనత్వాన్ని పరిచయం చేసేందుకు స్టెల్త్ బ్లాక్ ఎడిషన్ బైకును స్టైలిష్ మ్యాట్ ఫినిషింగ్‌లో ప్రవేశపెట్టింది.

Trending On DriveSpark Telugu:

రాయల్ ఎన్ఫీల్డ్ మీద పోటీకి సిద్దమైన మహీంద్రా క్లాసిక్ బైకులు

అగ్రస్థానమే లక్ష్యంగా టాటా నుండి వస్తున్న 10 కొత్త కార్లు

మరో సంచలనాత్మక బైకును విడుదలకు సిద్దం చేసిన రాయల్ ఎన్ఫీల్డ్

2017లో విడుదలైన బైకులు

ఇంటర్‌సెప్టా 650 మరియు కాంటినెంటల్ జిటి 650

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ ఏడాది 650 ఇంజన్‌తో మరో రెండు బైకులను ఆవిష్కరించింది. 2017 ఐక్మా మోటార్ సైకిల్ షో వేదిక మీద ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకులను ప్రదర్శించింది. ఈ సరికొత్త 650 ఇంజన్‌తో ట్విన్ సిలిండర్ ఇంజన్ అభివృద్ది చేసిన ఏకైక భారతదేశపు టూ వీలర్ కంపెనీగా రాయల్ ఎన్ఫీల్డ్ నిలిచింది. వీటిని 2018 లో స్థాయిలో లాంచ్ చేయనుంది.

2017లో విడుదలైన బైకులు

హోండా గ్రాజియా

ఇండియన్ స్కూటర్ల విభాగంలో హోండా ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా స్కూటర్ల అమ్మకాల్లో హోండా టాప్‌లో నిలిచింది. ఇండియన్ స్కూటర్స్ సెగ్మెంట్లో తన స్థానాన్ని పధిలం చేసుకునేందుకు స్కూటర్ల లైనప్‌ను పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే గ్రాజియా అనే ప్రీమియమ్ స్కూటర్‌ను విడుదల చేసింది.

2017లో విడుదలైన బైకులు

పూర్తిగా ఫ్రెష్ డిజైన్‌లో, శక్తివంతమైన 125సీసీ కెపాసిటి గల ఇంజన్‌ను జోడించి యంగ్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఫస్ట్ ఇన్-క్లాస్ ఫీచర్లతో ప్రవేశపెట్టింది. పూర్తి స్థాయిలో న్యూ డిజైన్‌లో ఉన్న కస్టమర్ల దృష్టిని ఆకర్షించి, విడుదలైన అనతి కాలంలో మంచి ఫలితాలు సాధించింది.

2017లో విడుదలైన బైకులు

సుజుకి ఇంట్రూడర్ 150

2017లో జరిగిన అతి ముఖ్యమైన టూ వీలర్ విడుదలలో సుజుకి ఇంట్రూడర్ 150 క్రూయిజర్ మోటార్ సైకిల్ ఒకటి. సుజుకి ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన మోడళ్లలో ఇంట్రూడర్ 150 ఎంతో విభిన్నమైనది. సుజుకి ఇంట్రూడర్ 1800 ఐకానికి మోటార్ సైకిల్ ప్రేరణతో ఈ స్మాల్ ఇంట్రూడర్ 150 క్రూయిజర్ బైకును డెవలప్ చేసి లాంచ్ చేసింది.

2017లో విడుదలైన బైకులు

ఎంట్రీ లెవల్ 150సీసీ సెగ్మెంట్లో ఇంట్రూడర్ 150 విప్లవాత్మక డిజైన్‌ను కలిగి ఉంది. తక్కువ కెపాసిటి గల ఇంజన్‌ అనే విషయాన్ని పక్కపెడితే బైకు మొత్తం డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. న్యూ హెడ్ ల్యాంప్, ఇరువైపులా పెద్ద పరిమాణంలో ఉన్న సైడ్ డీకాల్స్ వంటివి ఇది పెద్ద బైక్ అనే ఫీల్ కలిగిస్తాయి. ఏదేమైనప్పటికీ ఈ ఏడాదిలో సుజుకి టూ వీలర్స్ ఇండియాకు ఇదొక ఇంపార్టెంట్ లాంచ్.

2017లో విడుదలైన బైకులు

కెటిఎమ్ డ్యూక్ 250

అప్‌డేటెడ్ డ్యూక్ 390తో పాటు ఇండియన్ కెటిఎమ్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తూ డ్యూక్ 250 మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. 250సీసీ కెపాసిటి గల బైకులో ఎంచుకోదగిన బెస్ట్ మోడల్ కెటిఎమ్ డ్యూక్ 250. చూడటానికి అచ్చం డ్యూక్ 390 ను పోలి ఉంటుంది. అయితే, తక్కువ ధరతో అందించే ఉద్దేశ్యంతో కొన్ని ఫీచర్లను మిస్ చేసింది.

2017లో విడుదలైన బైకులు

పర్ఫామెన్స్ విషయానికి వస్తే, ఈ శ్రేణిలో ఉన్న ఇతర మోడళ్లతో పోల్చుకుంటే కెటిఎమ్ డ్యూక్ 250 బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. క్వార్టర్ లీటర్ ఇంజన్ గల ఈ బైకుతో సక్సెస్ అందుకునేందుకు ధరను కూడా చాలా తెలివిగా పోటీని దృష్టిలో ఉంచుకుని నిర్ణయించింది.

2017లో విడుదలైన బైకులు

యమహా ఎఫ్‌జడ్ 25

అత్యుత్తమ పనితీరు, స్మూత్ ఇంజన్ మరియు నమ్మదగిన బైకులకు యమహా ఇండియా పేరుగాంచింది. వాటిలో ఈ 2017లో విడుదలైన ఎఫ్‌జడ్ 25 కూడా ఒకటి. 250సీసీ ఇంజన్ ఉన్నప్పటికీ, ఆశించిన మైలేజ్‌తో రోజు వారి అవసరాలకు వాడుకునే మోడల్‌గా ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. ఈ ఏడాదిలో యమహా ఇండియాకు అతి ముఖ్యమైన లాంచ్ ఎఫ్‌జడ్ 25.

2017లో విడుదలైన బైకులు

బెనెల్లీ 302ఆర్

ఇటాలియన్ టూ వీలర్ల అగ్రగామి దిగ్గజం బెనెల్లీ దేశీయ విపణిలోకి ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్ సైకిల్ 302ఆర్ ను లాంచ్ చేసింది. 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద తొలిసారి ప్రదర్శించబడిన ఇది ఇండియాలో విడుదలకు ఎంతగానో వేచి చూసిన మోడల్. అగ్రెసివ్ డిజైన్ మరియు పెద్ద బైకుల తరహా శబ్ధాన్నిచ్చే 302ఆర్ ఏ విధంగాను అసంతృప్తినివ్వదు.

2017లో విడుదలైన బైకులు

ఫ్రంట్ డిజైన్‌లో రెండుగా చీలిపోయిన హెడ్ ల్యాంప్ బైకు మొత్తానికి ఓ విభిన్న రూపాన్ని తీసుకొచ్చింది. అంతే కాకుండా తేలికపాటి ట్రెల్లిస్ ఫ్రేమ్, డ్యూయల్ డిస్క్ బ్రేకులు, ముందువైపున స్టాండర్డ్ ఏబిఎస్ వంటి ప్రీమియమ్ పార్ట్స్ ఉన్నాయి. 2017లో ఇండియన్ 300సీసీ సెగ్మెంట్లో లాంచ్ అయిన వాటిలో బెనెల్లీ 302ఆర్ అతి ప్రధానమైనది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Best Bikes Of 2017 In India: Our Top Rated Bike Launches Of The Year
Story first published: Tuesday, December 26, 2017, 17:46 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark