డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో సుజుకి లెట్స్ విడుదల

Written By:

సుజుకి మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి లెట్స్ స్కూటర్‌ను సరికొత్త డ్యూయల్ టోన్ పెయింట్ స్కీములో విడుదల చేసింది. డ్యూయల్ టోన్ వేరియంట్ సుజుకి లెట్స్ ప్రారంభ ధర రూ. 48,193 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

సుజుకి లెట్స్ డ్యూయల్ టోన్ కలర్స్

నూతన లెట్స్ స్కూటర్ మూడు విభిన్నమైన డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అవి, రాయల్ బ్లూ/ మ్యాట్ బ్లాక్, ఆరేజ్/ మ్యాట్ బ్లాక్ మరియు గ్లాస్ స్పార్కిల్ బ్లాక్. న్యూ గ్రాఫిక్స్ మరియు బ్లాక్ ఫినిష్ వీల్స్ మినహాయిస్తే, డిజైన్ మరియు ఇంజన్ పరంగా లెట్స్ స్కూటర్‌లో ఎలా మార్పులు జరగలేదు.

సుజుకి లెట్స్ డ్యూయల్ టోన్ కలర్స్

సాంకేతికంగా సుజుకి లెట్స్ స్కూటర్‌లో 112.8సీసీ సామర్థ్యం ఉన్న బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8.2బిహెచ్‌పి పవర్ మరియు 8.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. సివిటి ట్రాన్స్‌మిషన్ గల ఇందులో ఉత్తమ మైలేజ్ కోసం SEP టెక్నాలజీని అందివ్వడం జరిగింది.

సుజుకి లెట్స్ డ్యూయల్ టోన్ కలర్స్

రెండు చక్రాలను ఆపడానికి 120ఎమ్ఎమ్ చుట్టుకొలత ఉన్న డ్రమ్ బ్రేకులు అందించారు. స్కూటర్‌కు ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ పోర్క్ మరియు వెనుక వైపున స్వింగ్ ఆర్మ్ తరహాలో ఉన్న కాయిల్ స్ప్రింగ్ కలదు. 5.2-లీటర్ల వరకు పెట్రోల్ నింపుకోవచ్చు.

సుజుకి లెట్స్ డ్యూయల్ టోన్ కలర్స్

సుజుకి మోటార్ సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సతోషి ఉచిద మాట్లాడుతూ, "నాణ్యత విషయంలో రాజీపడకుండా, కస్టమర్లకు అనుగుణంగా తమ విభిన్న ఉత్పత్తుల్లో ఉత్తమ ఫీచర్లను అందిస్తున్నామని తెలిపాడు. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లో లభించే లెట్స్ స్కూటర్ యువ కొనుగోలుదారులను ఖచ్చితంగా ఆకర్షిస్తుందని చెప్పుకొచ్చాడు."

సుజుకి లెట్స్ డ్యూయల్ టోన్ కలర్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జపాన్ టూ వీలర్ దిగ్గజం సుజుకి టూ వీలర్ సంస్థకు లెట్స్ స్కూటర్ ఆశించిన మేర విక్రయాలు తెచ్చిపెట్టలేదు. డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్లో విడుదలైన నేపథ్యంలో విక్రయాలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. లెట్స్ స్కూటర్‌కు, ఆక్టివా-ఐ మరియు టీవీఎస్ స్కూటీ జెస్ట్110 వంటివి పోటీగా ఉన్నాయి.

English summary
Read In Telugu: Suzuki Let’s With Dual Tone Colours Launched In India; Priced At Rs 48,193
Story first published: Thursday, July 6, 2017, 10:53 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark