కొత్త 2022 సుజుకి విటారా ఎస్‌యూవీ వస్తోంది, అక్టోబర్‌లో ఆవిష్కరణ!

జపనీస్ కార్ బ్రాండ్ సుజుకి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న విటారా ఎస్‌యూవీలో ఓ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదే ఎస్‌యూవీని మన దేశంలో విటారా బ్రెజ్జా పేరుతో మారుతి సుజుకి విక్రయిస్తోంది.

కొత్త 2022 సుజుకి విటారా ఎస్‌యూవీ వస్తోంది, అక్టోబర్‌లో ఆవిష్కరణ!

ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని సమర్థంవంతంగా ఎదుర్కునేందుకు, ఈ కొత్త మోడల్ సమగ్ర డిజైన్ మార్పులు మరియు విస్తృత శ్రేణి అప్‌గ్రేడ్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. వచ్చే అక్టోబర్‌లో కొత్త విటారాను ఆవిష్కరిస్తామని, ఏడాది చివరినాటికి లేదా 2022 ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ మోడల్ అమ్మకాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

కొత్త 2022 సుజుకి విటారా ఎస్‌యూవీ వస్తోంది, అక్టోబర్‌లో ఆవిష్కరణ!

ప్రస్తుత మోడల్‌తో పోల్చుకుంటే, కొత్త 2022 సుజుకి విటారా చాలా అగ్రెసివ్ వైఖరితో ఉంటుంది. ఈ కొత్త విటారా అంతర్జాతీయ మార్కెట్లలో కియా సెల్టోస్, హ్యుందాయ్ కోనా, టొయోటా సి-హెచ్ఆర్ మొదలైన వాటికి పోటీగా ఉంటుంది. సుజుకి ఈ ఏడాది ఐరోపాలో ప్రవేశపెట్టబోయే మూడు కొత్త మోడళ్లలో కొత్త విటారా కూడా ఒకటి అవుతుంది.

కొత్త 2022 సుజుకి విటారా ఎస్‌యూవీ వస్తోంది, అక్టోబర్‌లో ఆవిష్కరణ!

మిగిలిన రెండు మోడళ్లలో కొత్త సుజుకి జిమ్మీ మరియు జిమ్మీ ఎస్‌యూవీ యొక్క ఎల్‌డబ్ల్యుబి (లాంగ్ వీల్ బేస్) వెర్షన్‌లు ఉన్నాయి. కొత్త 2022 సుజుకి విటారా పరిమాణం కూడా పెరుగుతుందని సమాచారం. పాత మోడల్‌తో పోలిస్తే, ఇది మరింత విశాలంగా, పెద్దదిగా కనిపిస్తుంది. అయితే, దాని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం అలానే ఉండే అవకాశం ఉంది.

కొత్త 2022 సుజుకి విటారా ఎస్‌యూవీ వస్తోంది, అక్టోబర్‌లో ఆవిష్కరణ!

కొత్త విటారాను ప్రస్తుతం ఉన్న మోనోకోక్ ప్లాట్‌ఫామ్ యొక్క సవరించిన సంస్కరణపై ఆధారపడి ఉంటుంది, ఇది సుజుకి ఇంజనీర్లకు ఎక్కువ క్యాబిన్ స్థలం మరియు లగేజ్ స్పేస్‌ను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. అయితే, ఇది ప్రస్తుతం ఉన్న 2,500 ఎంఎం వీల్‌బేస్‌ను ఎస్‌యూవీ నిలుపుకుంటుందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.

కొత్త 2022 సుజుకి విటారా ఎస్‌యూవీ వస్తోంది, అక్టోబర్‌లో ఆవిష్కరణ!

ఈ ప్లాట్‌ఫామ్ సుజుకి యొక్క కొత్త హార్టెక్ ప్లాట్‌ఫామ్ కావచ్చని సమాచారం. మారుతి సుజుకి ఇదే ప్లాట్‌ఫామ్‌పై భారతదేశంలో కొన్ని మోడళ్లను విక్రయిస్తోంది. ఈ కొత్త విటారా ఎస్‌యూవీలో ఇందులో సరికొత్త మల్టీమీడియా సిస్టమ్ కోసం పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను జోడించే అవకాశం ఉంది. ఇంకా ఇందులో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్ మరియు మెరుగైన మెటీరియల్ క్వాలిటీ లభిస్తుందని భావిస్తున్నారు.

కొత్త 2022 సుజుకి విటారా ఎస్‌యూవీ వస్తోంది, అక్టోబర్‌లో ఆవిష్కరణ!

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2022 సుజుకి విటారాలో 1.4-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ అలానే నిలుపుకుంటుందని సమాచారం. కాకపోతే, ఈ ఇంజన్ ఆప్షనల్ ఆల్‌గ్రిప్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ మరియు ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఆప్షన్లతో వస్తుందని తెలుస్తోంది.

కొత్త 2022 సుజుకి విటారా ఎస్‌యూవీ వస్తోంది, అక్టోబర్‌లో ఆవిష్కరణ!

అంతేకాకుండా, ఈ ఇంజిన్ తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుందని, ఇందులో 10 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారు, 48-వోల్ట్ బ్యాటరీలు మరియు మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు లభిస్తాయని సమాచారం.

కొత్త 2022 సుజుకి విటారా ఎస్‌యూవీ వస్తోంది, అక్టోబర్‌లో ఆవిష్కరణ!

ఎంట్రీ లెవల్ వేరియంట్లలో 1.0 ఎల్ 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఆఫర్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త విటారా కోసం టొయోటా యొక్క పూర్తి హైబ్రిడ్ వ్యవస్థను సుజుకి ఉపయోగించవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

కొత్త 2022 సుజుకి విటారా ఎస్‌యూవీ వస్తోంది, అక్టోబర్‌లో ఆవిష్కరణ!

ప్రస్తుతానికి ఈ నెక్స్ట్ జనరేషన్ సుజుకి విటారా మన దేశంలో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీని బదులుగా, ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మరియు ఎమ్‌జి ఆస్టర్ వంటి మోడళ్లతో పోటీ పడేందుకు మారుతి-టొయోటా సంస్థలు సంయుక్తంగా ఓ మిడ్-సైజ్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

Most Read Articles

English summary
Suzuki To Unveil New Gen Vitara SUV Soon Globally. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X