2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ: 42 ఏళ్లుగా కొనసాగుతున్న రాజసం

By Anil Kumar

1972లో తొలిసారిగా పరిచయమైన మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ప్రపంచపు బెస్ట్ కారుగా పిలవబడుతోంది. ప్రపంచ లగ్జరీ కార్ల పరిశ్రమలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఆధిపత్యం చెలాయిస్తోంది. జర్మన్ భాషలో సొండర్‌క్లాసే(స్పెషల్ క్లాస్)గా పిలువబడుతున్న ఎస్-క్లాస్ ప్రపంచపు అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటి.

మెర్సిడెస్ బెంజ్ ఇండియా విభాగం ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్‌లో పలు మార్పులు చేర్పులు చేసి 2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ను ప్రవేశపెట్టింది. ఇందులో, ప్రత్యేకించి అత్యాధునిక డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్ వచ్చింది. దీంతో, ఇండియాలో ADAS ఫీచర్‌తో వచ్చిన మొట్టమొదటి కారు 2018 మెర్సిడెస్ ఎస్-క్లాస్. ADAS వెహికల్ సిస్టమ్ సురక్షితమైన డ్రైవింగ్ చేయడానికి డ్రైవరుకు ఎంతగానో సహకరిస్తుంది.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

46 ఏళ్ల క్రితం పరిచయమైన ఎస్-క్లాస్ ఇప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్‌లో 2018 ఎస్-క్లాస్ గా మనముందుకు వచ్చింది. అత్యాధునిక ADAS ఫీచర్‌తో పాటు 2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌లో ఇంకా ఏయే మార్పులు జరిగాయి? ఎలాంటి ఫీచర్లు వచ్చాయి? మరియు మునుపటి ఎస్-క్లాస్‌తో పోల్చుకుంటే ఇది ఎంత వరకు బెస్ట్? వంటివి తెలుసుకోవాలని ఉందా....? ఇవాళ్టి 2018 మెర్సిడెస్ ఎస్-క్లాస్ రివ్యూ కథనంలో చూద్దాం రండి...

మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ కొత్త తరం ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్‌ను రివ్యూ చేయడానికి డ్రైవ్‌స్పార్క్ బృందాన్ని అతిథి మర్యాదలతో స్వాగతించి, రెండు రోజుల పాటు విలాసవంతమైన ఆతిథ్యమిచ్చి తమ ఎస్-క్లాస్‌ను టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని కల్పించింది.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

డిజైన్ మరియు స్టైలింగ్

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్‌ను ఫ్రంట్ నుండి చూసినపుడు మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే ఎంతో ప్రాక్టికల్‌గా ఉంటుంది. తీక్షణంగా గమనిస్తే, ఎస్-క్లాస్ హుందాతనాన్ని గుర్తించవచ్చు. మునుపటి ఎస్-క్లాస్ నుండి సేకరించిన డిజైన్ లక్షణాలను యథావిధిగా ఇందులో పొందుపరచడాన్ని కూడా గమనించగలం. ట్రెడిషన్ గార్డెన్ వ్యాగనర్ తరహా స్మూత్ మరియు కర్వీ క్యారెక్టర్ లైన్స్ హైలెట్‌గా నిలిచాయి.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

2018 ఎస్-క్లాస్ ఫ్రంట్ డిజైన్‌లో మెర్సిడెస్ సాంప్రదాయ 3-స్లాట్ గ్రిల్ యథావిధిగా వచ్చింది. అంతే కాకుండా, హైగ్లాస్ బ్లాక్ ఫినిషింగ్‌లో నిలువుటాకారంలో ఉన్న రేడియేటర్ గ్రిల్ కూడా ఉంది. రీడిజైన్ చేయబడిన మూడు కనురెప్పల ఆకృతిలో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ఎల్ఇడి హెడ్‍‌ల్యాంప్స్ ఉన్నాయి. మెర్సిడెస్ ఈ డిజైన్‌ను "ట్రిపుల్ టార్చ్" అని పిలుస్తోంది. ఎస్-క్లాస్‌లో మూడు, ఇ-క్లాస్‌లో రెండు మరియు సి-క్లాస్ ఒక్క పట్టీ మాత్రమే ఉండే ఎల్ఇడి ల్యాంప్ స్ట్రిప్ ఉంటుంది.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఎలిగెన్స్ మరియు స్పోర్టివ్‌నెస్ మధ్య సమం చేస్తూ అత్యంత ఆకర్షణీయమైన శైలిలో ఫినిష్ చేశారు. ఫ్రంట్ వీల్ ఆర్చ్ వద్ద ప్రారంభమయ్యే ధృడమైన షోల్డర్ లైన్ వెనుక వైపున్న వీల్ ఆర్చ్ వద్ద ముగుస్తుంది. కారుకు ఇరువైపులా క్రోమ్ సొబగులున్నాయి. 3035ఎమ్ఎమ్ వీల్ బేస్ గల ఎస్-క్లాస్ ఖచ్చితంగా పొట్టి కారు అయితే మాత్రం కాదు.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

2018 మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ రియర్ డిజైన్ చూడటానికి అచ్చం పాత వెర్షన్ ఎస్-క్లాస్ కారునే పోలి ఉంటుంది. అదే మునుపటి ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ యథావిధిగా వచ్చింది. క్రిందివైపునున్న బంపరులో ఇరువైపులా విశాలమైన టెయిల్ పైపులు ఉన్నాయి.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ సొగసైన సెలూన్ కారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో ఇలాంటి సెలూన్ కార్లను ఎన్నో చూసుంటాం. మెర్సిడెస్ బెంజ్ కూడా ఇదే డిజైన్ ఫిలాసఫీలో విభిన్న వెర్షన్‌లను రూపొందించింది. ఏఎమ్‌జి జిటి 4-డోర్ కూపే ఇందుకొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

ఇంటీరియర్

విలాసవంతమైన, అత్యాధునిక మరియు సువాసభరితమైన క్యాబిన్ ప్రతి కారు యజమాని కోరుకుంటాడు. ఎస్-క్లాస్ విషయానికి వస్తే, ఈ మూడు అంశాల పరంగా మిమ్మల్ని ఏ మాత్రం నిరుత్సాహపరచదు. క్లైమేట్ కంట్రోల్ నుండి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ పర్ఫ్యూమింగ్ సిస్టమ్, రియర్ ప్యాసింజర్ల కోసం మెస్సేజ్ ఫంక్షన్ ఇంకా ఎన్నో ఎస్-క్లాస్ ఇంటీరియర్‌ను అత్యంత విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన క్యాబిన్‌గా మార్చేశాయి.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

ఏదేమైనప్పటికీ, మునుపటి తరం ఎస్-క్లాస్ సెడాన్‌తో పోల్చుకుంటే 2018 ఎస్-క్లాస్ ఇంటీరియర్‌లో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. మరి ఇందులో ఉన్న కొత్తదనమేమిటి అంటే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మెనూ స్కోలింగ్ కోసం సరికొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్ మీద టచ్ సెన్సిటివ్ ప్యాడ్స్ మరియు మెటల్ కంట్రోల్ నాబ్స్ ఉన్నాయి. టచ్ సెన్సిటివ్ ప్యాడ్స్ మీద మీ వేళ్లను స్వైప్ చేయడంతో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపరేట్ చేయవచ్చు.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

అధునాతన స్టీరింగ్ వీల్ మినహాయిస్తే, 2018 మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఇంటీరియర్‌లో 12.3-అంగుళాల పరిమాణంలో ఉన్న డిజిటల్ డిస్ల్పేలు ఉన్నాయి. ఒకటి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం. టచ్ కంట్రోల్, టచ్ ప్యాడ్ కంట్రోలర్ లేదా వాయిస్ కమాండ్ ద్వారా దీనిని ఆపరేట్ చేయవచ్చు. రెండు డిస్ల్పేలను కూడా సింగిల్ గ్లాస్ ప్యానల్ ద్వారా అనుసంధానం చేశారు.

సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఎస్-క్లాస్ ఇంటీరియర్‌లో ఉన్న ఇతర ఫీచర్లు:

 • 64 రంగుల్లో మన మూడ్‌కు తగ్గట్లుగా మార్చుకునే అవకాశం ఉన్న ఆంబియంట్ క్యాబిన్ లైటింగ్ సిస్టమ్.
 • ఆరు రకాల హై-క్వాలిటీ ఇంటీరియర్ ఫ్రెగ్రెన్సెస్ గల ఇంటీరియర్ ఎయిర్ బ్యాలెన్స్ ప్యాకేజ్
 • ఎలక్ట్రికల్ పవర్ ద్వారా వెనుక సీట్లును 43.5 డీగ్రీల కోణం వరకు వంపుకునే ఫీచర్
 • ఛాఫర్ ప్యాకేజ్- ఇందులో ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లను ముందుకు జరుపుకోవచ్చు
 • పానరోమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్
 • వెనుక వైపున మొబైల్స్ కోసం వైర్‍‌లెస్ ఛార్జింగ్
 • మ్యూజిక్ ప్రియుల కోసం 13 హై-పర్ఫామెన్స్ బర్మెస్టర్ స్పీకర్లు ఉన్నాయి
2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

పర్ఫామెన్స్ మరియు ధరలు

కొత్త తరం ఎస్-క్లాస్ సెడాన్‌లో 282-హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 3.0-లీటర్ కెపాసిటి గల సరికొత్త ట్విన్-టుర్భోఛార్జ్‌‌డ్ ఇన్‌లైన్-ఆరు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. గత ఏడాది 3.0-లీటర్ వి6 ఇంజన్‌ స్థానాన్ని భర్తీ చేసిన ఇది గరిష్టంగా 600ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రెండు టన్నుల బరువున్న లగ్జరీ సెలూన్ కారు కేవలం ఆరు సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడాన్ని సుసాధ్యం చేయడంలో ఈ ఇంజన్ పనితీరు కనబడుతుంది. దీని గురించి మీతో పంచుకోవాల్సిన మరో నిజం... సరికొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్ 350డి బిఎస్-VI ఉద్గార ప్రమాణాలను పాటించే భారతదేశపు మొట్టమొదటి కారు. అదే విధంగా ఎస్ 450 మోడల్ 362 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 3.0-లీటర్ల ట్లిన్-టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌లో లభిస్తోంది.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ స్పెసిఫికేషన్స్

Model S 350d (Reviewed) S 450
Engine 3.0-litre twin-turbocharged inline-six diesel 3.0-litre twin-turbocharged inline-six petrol
Power (bhp) 282 362
Torque (Nm) 600 500
Transmission 9G-TRONIC 9G-TRONIC
Acceleration 0-100km/h (s) 6 5.1
Top Speed (km/h) 250 250
Price (ex-showroom, Delhi) Rs 1.33 crore Rs 1.37 crore

ఎస్-క్లాస్ డ్రైవింగ్ అనుభవం...

టెస్ట్ డ్రైవ్ చేసిన వేరియంట్ 2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ S-320dఆరు సిలిండర్ల ఇన్ లైన్ డీజల్ ఇంజన్ ఐడ్లింగ్‌లో ఉన్నంతసేపు మరియు ఒక క్రమానుగతంగా యాక్సిలరేషన్ పెంచినపుడు స్మూత్‌గా రన్ అవుతుంది. కానీ, ఇది డీజల్ వేరియంట్ అని మనం ఇచ్చే యాక్సిలరేషన్ ద్వారా సులభంగా గుర్తిస్తారు. ఆరు సిలిండర్ల ఇంజన్ డీజల్ ఇంజన్ అత్యంత శక్తివంతమైన మరియు వేగవంతమైనది. టుర్బోఛార్లకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.

ఎస్-క్లాస్ గరిష్ట వేగం గంటకు 220 కిలోమీటర్లుగా ఉంది. ఇంజన్‌కు అనుసంధానం చేసిన 9-ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా గేర్లు వేగానికి తగ్గట్లు చాలా సులభంగా మారిపోతాయి. ఓవరాల్ డ్రైలింగ్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ అంత పదునైనదైతే కాదు. అయితే, అత్యుత్తమ బాడీ కంట్రోల్ విషయంలో 7-సిరీస్ కంటే ఎస్-క్లాస్ ఎంతో మెరుగైనది. ప్రతి ఎగుడుదిగుడు రోడ్లను మరియు స్పీడ్ బంప్స్‌ను ఎదుర్కొని సుఖవంతమైన ప్రయాణించే కల్పించేందుకు నాలుగు చక్రాలకు ప్రత్యేకమైన అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ కలదు. మెరుగైన ఇంజన్ అందివ్వడంతో శబ్ధం, కుదుపులు మరియు కఠినత్వపు లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి.

అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)మరియు సేఫ్టీ ఫీచర్లు

ఎస్-క్లాస్ అచ్చం మనిషిలాగే కారును నడుపుతుంది. పొడవాటి రోడ్ల మీద మానవ ప్రమేయం లేకుండానే నడుస్తుంది. ఇందుకు దోహదపడిన లెవల్-2 అటానమస్ సిస్టమ్‌కు ప్రతి ఎస్-క్లాస్ కస్టమర్ ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. ఎస్-క్లాస్ సెడాన్‌ను లెవల్-2 అటానమస్ కారుగా వర్గీకరించారు. స్టీరింగ్, యాక్సిలరేషన్ మరియు బ్రేకింగ్ ఇలా అన్నింటిని రాడార్ ఆధారిత అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కెమెరా మరియు సెన్సార్ల ద్వారా లెవల్-2 అటానమస్ సిస్టమ్ చూసుకుంటుంది.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

ఎస్-క్లాస్ తనంతట తాను ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ డ్రైవర్ రోడ్డు మీద దృష్టిసారిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి డ్రైవర్ ప్రతి 15 సెకండ్లకు ఒకసారి చేతులతో స్టీరింగ్ టచ్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతం, ఆటోమొబైల్ పరిశ్రమలో ఐదు లెవల్స్ అటానమస్ సిస్టమ్స్ ఉన్నాయి.

లెవల్ 0: నో ఆటోమేషన్

 • సిస్టమ్ సామర్థ్యం: స్టీరింగ్, బ్రేకులు, యాక్సిలరేషన్ మరియు మార్గం అన్నింటినీ డ్రైవర్ చూసుకోవాలి
 • ఉదాహరణ: మారుతి ఆల్టో
లెవల్ 1: డ్రైవర్ అసిస్టెన్స్
 • సిస్టమ్ సామర్థ్యం: స్టీరింగ్ వీల్ లేదా వెహికల్ స్పీడ్ ఏదైనా ఒకదానిని నియంత్రిస్తుంది. రెండింటిని కంట్రోల్ చేయలేదు.
 • ఉదాహరణ: అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
లెవల్ 2: పార్శియల్ ఆటోమేషన్
 • సిస్టమ్ సామర్థ్యం: స్టీరింగ్, యాక్సిలరేషన్ మరియు బ్రేకులను సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. అయితే, ప్రతిసారీ డ్రైవర్ దృష్టి ఖచ్చితంగా అవసరం.
 • ఉదాహరణ: మెర్సిడెస్ బెంజ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ మరియు టెస్లా ఆటోపైలట్
లెవల్ 3: కండీషనల్ ఆటోమేషన్
 • సిస్టమ్ సామర్థ్యం: డ్రైవింగ్‌లో చాలా విభాగాలను మేనేజ్ చేస్తుంది. కారు తనంతట తాను మార్గాన్ని ఎంచుకోలేనపుడు మరియు సిస్టమ్ డీయాక్టివేట్ అయినపుడు డ్రైవర్ సహాయం ఖచ్చితంగా అవసరమవుతుంది
 • ఉదాహరణ: ఆడి ట్రాఫిక్ జామ్ పైలట్
లెవల్ 4: హై ఆటోమేషన్
 • సిస్టమ్ సామర్థ్యం: హ్యుమన్ ఇన్‌పుట్ లేకుండానే పనిచేస్తుంది, కానీ ముందుగా ఎంచుకున్న పరిస్థితులకు లోబడి మాత్రమే కారును డ్రైవ్ చేస్తుంది.
 • ఉదాహరణ: వినియోగంలో లేని గూగుల్ యొక్క ఫైర్‌ఫ్లై పోడ్-కార్ ప్రోటోటైప్(పెడల్స్ లేదా స్టీరింగ్ వీల్ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది)
లెవల్ 5: ఫుల్ ఆటోమేషన్
 • సిస్టమ్ సామర్థ్యం: ఎలాంటి రోడ్డు అయినా... ఎలాంటి పరిస్థితుల్లోనైనా కారును సిస్టమ్ మాత్రమే నడుపుతుంది. డ్రైవర్ కేవలం గమ్యస్థానం వివరాలు అందివ్వాల్సి ఉంటుంది.
 • ఉదాహరణ: ఇంకా ప్రొడక్షన్‌లోకి రాలేదు

ADAS ద్వారా రివర్సింగ్ కూడా చేయవచ్చు. మెర్సిడెస్‌లో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ డిస్ట్రోనిక్ సిస్టమ్. డిస్ట్రోనిక్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకుంటే వెహికల్ ప్రయాణిస్తున్న వేగం మరియు దూరాన్ని లెక్కిస్తుంది. మరియు దూరానికి తగిన వేగంలోనే కారును నడుపుతుంది. లేదంటే కారును అపేస్తుంది.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఉన్న సేఫ్టీ ఫీచర్లలో, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, ప్రమాదం జరిగేటపుడు డ్రైవర్ బ్రేక్ వేయనపుడు ఈ ఫీచర్ తనంతట తానే కారు వేగాన్ని తగ్గించి ఆపేస్తుంది. ప్రి-సేఫ్ ప్లస్, ప్రమాదం జరిగినపుడు వచ్చే విపరీతమైన శబ్దం నుండి చెవిలోని కర్ణబేరిని రక్షిస్తుంది. బ్లైండ్ స్పాట్ మరియు లేన్-కీప్ అసిస్ట్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

తీర్పు

అత్యద్భుతమైన మెర్సిడెస్ బెంజ్ టాప్ రేంజ్ మోడల్ ఇండియన్ లగ్జరీ సెగ్మెంట్‌కు పునఃనిర్వచినమిస్తుంది. ప్రత్యేకించి, సౌకర్యమైన రైడ్, అత్యుత్తమ హ్యాండ్లింగ్, గొప్ప ఇంటీరియర్ ఫీల్, టెక్నికల్‌గా అత్యాధునిక భద్రతా ఫీచర్లు పరంగా మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లగ్జరీ కార్ల విభాగంలో ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్ మళ్లీ 5-స్టార్ వెహికల్‌గా నిరూపించుకుంది. ఏ ఉద్దేశంతో అయితే, నిర్మించారో ఆ ఉద్దేశ్యానికి అనుగుణంగా దీని పనితీరు ఉంది. ఎస్-క్లాస్ పరిచయమై 42 ఏళ్లు అయినా... అప్పటికీ ఇప్పటికీ లగ్జరీ సెడాన్ సెలూన్ సెగ్మెంట్లో ఎస్-క్లాస్‌దే ఆధిపత్యం.

2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ

మీకు తెలుసా...?

బాష్ రూపొందించిన ఎలక్ట్రానిక్ ఫోర్-వీల్ మల్టీ-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో మొదటి ప్రొడక్షన్‌కు వచ్చిన ప్రపంచపు మొట్టమొదటి కారు మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ (11 సిరీస్).

English summary
Read In Telugu: 2018 Mercedes-Benz S-Class Review — The Standard, Then and Now
X

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more