కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్‌ (Hyundai) ఇప్పుడిప్పుడే భారత ఎస్‌యూవీ మార్కెట్లో ఓ తిరుగులేని బ్రాండ్‌గా అవతరిస్తోంది. హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అందిస్తున్న వెన్యూ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విక్రయిస్తున్న క్రెటా మోడళ్లకు భారతీయ వినియోగదారుల నుండి లభిస్తున్న విశేష ఆదరణతో, ప్రస్తుతం ఈ కొరియన్ కార్ బ్రాండ్ దేశంలో అత్యధికంగా ఎస్‌యూవీలను విక్రయించే కంపెనీగా అవతరించింది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

కాగా, ఇప్పుడు ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ తన స్థానాన్ని మరింత పదిలంగా కాపాడుకునేందుకు క్రెటాకి ఎగువన టూసాన్ (Tucson) అనే ఓ ప్రీమియం ఎస్‌యూవీని ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసింది. భారతదేశంలో హ్యుందాయ్ టూసాన్ 2017 లో తొలిసారిగా విడుదల చేయబడింది మరియు ఇది భారత మార్కెట్లో హ్యుందాయ్ కు ఓ ఫ్లాగ్‌షిప్ మోడల్ గా ఉంది. హ్యుందాయ్ టూసాన్ లో ఇప్పటి వరకూ మూడు తరాల మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

ఇప్పటి వరకూ విక్రయించిబడిన మూడవ తరం మోడల్ గ్లోబల్ క్రాష్ టెస్టులో జీరో స్టార్ రేటింగ్ ను దక్కించుకుంది, కాగా, ఇప్పుడు కొత్తగా వచ్చిన నాల్గవ తరం 2022 హ్యుందాయ్ టూసాన్ అదే క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుని, జీరో నుండి హీరోగా మారి అందరి నోర్లకు తాళం వేయించేలా చేసింది. కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ సరికొత్త ఎక్స్టీరియర్ డిజైన్‌ మరియు మినిమలిస్ట్ ఇంటీరియర్ తో అందుబాటులోకి వచ్చింది. ఈసారి కంపెనీ మునుపెన్నడూ లేని విధంగా టూసాన్ టెక్నాలజీ అప్‌గ్రేడ్స్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

'లుక్ ఎట్ మి' డిజైన్ మరియు అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ మరియు ఆల్-వీల్ డ్రైవ్‌ ఆప్షన్ జోడింపులతో వచ్చిన నాల్గవ తరం హ్యుందాయ్ టూసాన్‌, దాని విభాగంలో ఓ గొప్ప ఎస్‌యూవీగా నిలుస్తుందా? పాత తరం మోడళ్లతో పోలిస్తే ఇది నిజంగానే జీరో నుండి హీరోగా మారిందా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను వెతికేందుకు మేము ఈ కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీని బెంగుళూరు రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేశాము. మరి ఇది మమ్మల్ని ఎందులో మెప్పించింది, ఎందులో నొప్పించదనే విషయాన్ని ఈ డీటేల్డ్ రివ్యూలో తెలుసుకుందాం రండి.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

హ్యుందాయ్ టూసాన్ - ఎక్స్‌టీరియర్ డిజైన్

మునుపటి తరం టూసాన్ తో పోలిస్తే ఈ కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీ పూర్తిగా రీడిజైన్ చేయబడింది మరియు ఇది ఈ కొరియన్ ఆటోమోటివ్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ డిజైన్ ఫిలాసఫీ - సెన్సుయస్ స్పోర్టినెస్‌ ఆధారంగా రూపొందించబడింది. టూసాన్ విషయంలో హ్యుందాయ్ యొక్క సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్‌ని కంపెనీ గరిష్ట స్థాయికి తీసుకువెళ్లినట్లుగా అనిపిస్తుంది. మీరు కూడా ఈ ఎస్‌యూవీని ముందు వైపు నుండి ఇలానే ఫీల్ అయ్యే అవకాశం ఉంది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

హ్యుందాయ్ టూసాన్ ముందు భాగంలో కొత్త 3డి క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్‌ ప్రధానంగా కనిపిస్తుంది. దానికి ఇరువైపులా ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్ సెటప్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌‌తో కూడిన ఫ్రంట్ బంపర్ మరియు ముందు వైపు నుండి మజిక్యులర్ లుక్‌ని ఇచ్చేలా బానెట్ పై డిజైన్ చేసిన క్రీజ్ లైన్స్ హైలైట్ గా నిలుస్తాయి. ప్రస్తుతం దేశంలో విక్రయించబడుతున్న చిన్న హ్యుందాయ్ ఎస్‌యూవీల మాదిరిగానే టూసాన్ లో కూడా హెడ్‌లైట్లు ముందు బంపర్‌లోని దిగువ విభాగాలకు తగ్గించబడుతాయి. ఫ్రంట్ బంపర్‌లోని ప్లాస్టిక్ క్లాడింగ్‌ కూడా ఉంది, ఇది టూసాన్ సైడ్స్ మరియు వెనుక వైపుకు కూడా విస్తరించి ఉంటుంది. ముందు వైపు ఇంజన్‌కి గాలి వచ్చేలా ఎయిర్ వెంట్‌లు కూడా కనిపిస్తాయి.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

ఇక సైడ్ డిజైన్ ను గమనిస్తే, షార్ప్ బాడీ లైన్స్ మరియు రాక్డ్ విండో లైన్ తో ఇది మంచి స్పోర్టీ లుక్ ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీ దృష్టిని ఆకర్షించే పెద్ద 18 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి. ఎప్పటిలాగే విండో చుట్టూ క్రోమ్ గార్నిష్ ఉంది, అయితే ఇది వెనుక విండ్‌స్క్రీన్ వైపుకు విస్తరించినట్లు ఉంటుంది. ఈ ఎస్‌యూవీ చెక్కిన రూపాన్ని అందించడానికి టూసాన్ సైడ్స్ లో పెద్ద వీల్ ఆర్చెస్ మరియు బలమైన క్రీజ్ లైన్స్ కనిపిస్తాయి.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

హ్యుందాయ్ టూసాన్ వెనుక డిజైన్ ను ఎక్కువగా టెయిల్‌లైట్‌లు ఆక్రమించినట్లుగా కనిపిస్తుంది. ఇవి ఎస్‌యూవీ వెడల్పుతో నడిచే లైట్‌బార్ విభాగం నుండి క్రిందికి వచ్చే పదునైన ప్రోట్రూషన్‌లను కలిగి ఉంటాయి. హ్యుందాయ్ బ్యాడ్జ్ వెనుక విండ్‌స్క్రీన్‌పై ఉంచబడింది మరియు టూసాన్ లో రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ ఎలిమెంట్‌ కూడా హైలైట్ గా నిలుస్తుంది. ఫ్రంట్ ఎండ్ మాదిరిగానే రియర్ ఎండ్ కూడా ఫాక్స్ సిల్వర్ బాష్ ప్లేట్ ను కలిగి ఉంటుంది. ఓవరాల్ గా ఇది అన్ని వైపుల నుండి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

హ్యుందాయ్ టూసాన్ - ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్లు

టూసాన్ బయట వైపు ఉన్న బాడీ-కలర్ డోర్ హ్యాండిల్ ని లాగి కారులోకి ప్రవేశించగానే, విశాలమైన మరియు అధునాతనమైన క్యాబిన్ మీకు స్వాగతం పలుకుతుంది. టూసాన్ లోని ఇంటీరియర్ చాలా మినిమలిస్టిగా ఉండి, డ్యాష్‌బోర్డ్ చాలా క్లీన్ గా కనిపిస్తుంది. ఫ్రంట్-కోప్యాసింజర్ వైపు డ్యాష్‌బోర్డ్ లో గ్లవ్ బాక్స్ తప్ప వేరే ఎలాంటి హడావిడి లేకుండా, చాలా నీట్ గా ఉంటుంది. డ్రైవర్ సైడ్ లో అతి తక్కువ భౌతిక బటన్లతో, డిజిటల్ మరియు ఫెథర్ టచ్ బటన్లతో కాక్‌పిట్ లాంటి అనుభూతిని అందిస్తుంది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

హ్యుందాయ్ టూసాన్ క్యాబిన్ అంతటా సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ కనిపిస్తాయి, ఇవి ఇంటీరియర్ కు మరింత ప్రీమియం అనుభూతిని జోడిస్తాయి. ఇందులోని లెథెరెట్ సీట్లు పెద్దవి మరియు ప్రయాణించడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. ముందు భాగంలో కూర్చునే వారికి వెంటిలేషన్ మరియు హీటింగ్ ఆప్షన్ తో కూడిన సీట్లు ఉంటాయి. డ్రైవర్ సీట్ పొజిషన్ ను తనకు నచ్చినట్లుగా సర్దుబాటు చేసుకోవడానికి ఇందులో 10-వే అడ్జస్టబుల్ పవర్ సీట్ మరియు ఆ సెట్టింగ్ ను స్టోర్ చేసుకోవడానికి మెమరీ ఫంక్షన్ కూడా ఉంది. మరొక గొప్ప విషయం ఏంటంటే, ఈ డ్రైవర్ సీటుకు నడుము (లంబార్) సపోర్ట్ కూడా ఉంది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

అలాగే, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణీకులు కూడా కంఫర్ట్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వెనుక సీట్లకు రిక్లైనింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. కొత్త టూసాన్ ఎస్‌యూవీలో పొడిగించిన వీల్‌బేస్‌ కారణంగా, ఇది వెనుకవైపు ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది. ఫలితంగా, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణీకులకు విశాలమైన లెగ్‌రూమ్ లభిస్తుంది. మీ వీకెండ్ ట్రిప్స్ కోసం ఇందులో 539 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంటుంది. బూట్ డోరును సులువుగా ఓపెన్ / క్లోజ్ చేయడానికి ఇందులో పవర్డ్ టెయిల్‌గేట్ ఫీచర్ కూడా ఉంటుంది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

ఇక డ్రైవర్ సీటులోకి వస్తే, ఈ ఫోర్త్ జనరేషన్ హ్యుందాయ్ టూసాన్ టూసాన్ డ్రైవర్ సమాచారం మరియు ప్రయాణీకుల వినోదం కోసం డ్యాష్‌బోర్డులో డ్యూయల్ డిస్‌ప్లే సెటప్ ఉంటుంది. ఇందులో ఒక స్క్రీన్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే కోసం మరియు మరొక స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఉపయోగించబడుతాయి. ఇవి రెండూ కూడా 10.25 ఇంచ్ సైజులో ఉంటాయి. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

డ్యాష్‌బోర్డు మధ్యలో ప్రధానంగా కనిపించే ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింది భాగాన్ని గమనిస్తే, కారులోని వాతావరణాన్ని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేసేందుకు ఇందులో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించిన కంట్రోల్స్ కోసం ఓ టచ్-ఆధారిత ప్యానెల్ కూడా ఉంటుంది. ఈ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కోసం ఎయిర్ వెంట్‌లు HVAC సెటప్ ఆన్ చేసినప్పుడు మాత్రమే తెరవబడతాయి. కొత్తవారిని అలరించడానికి దీనిని ఒక పార్టీ ట్రిక్ లాగా ఉపయోగించవచ్చు.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ యొక్క గ్రాఫిక్స్ డ్రైవర్ ఎంచుకున్న డ్రైవింగ్ మోడ్‌ ను బట్టి మారుతూ ఉంటుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే పెద్ద సైజులో ఉండి, ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇది హ్యుందాయ్ యొక్క బ్లూలింక్ కనెక్టింగ్ టెక్నాలజీతో పాటుగా ఆండ్రాయిడ్ మరియు యాపిల్ కార్‌ప్లే రెండింటిని సపోర్ట్ చేస్తుంది. ఈ కారులోని ప్రీమియం 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ మీ చెవులకు ఇంపైన సంగీతాన్ని చేరవేయడంలో కీలకంగా పనిచేస్తుంది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

ఈ కారులోని ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీలో వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 64-కలర్ యాంబియెంట్ లైటింగ్, పానోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, OTA (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్‌లు, వాయిస్ కమాండ్‌లు, అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కోసం హ్యుందాయ్ బ్లూలింక్ సిస్టమ్ వంటి అధునాతన టెక్ లోడెడ్ ఫీచర్లు చాలానే ఉన్నాయి.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

హ్యుందాయ్ టూసాన్ - సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ విషయంలో కొత్త తరం హ్యుందాయ్ టూసాన్ మునుపటి తరం మోడళ్ల కన్నా అనేక రెట్లు అడ్వాన్స్డ్ గా ఉంటుంది. కంపెనీ ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, పార్కింగ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ వంటి అనేక భద్రతా ఫీచర్లు (హ్యుందాయ్ ప్రకారం ఇందులో 60కి పైగా సేఫ్టీ ఫీచర్లు) ఉన్నాయి.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

హ్యుందాయ్ టూసాన్ లో స్మార్ట్‌సెన్స్ లెవల్ 2 ADAS (SmartSense Level 2 ADAS) ఫీచర్లు కూడా ఉన్నాయి. నిజానికి, కొత్త తరం టూసాన్ భారత మార్కెట్లో హ్యుందాయ్ నుండి వచ్చిన మొట్టమొదటి ADAS రెడీ వాహనం. ఇందులో బ్లైండ్-స్పాట్ అసిస్టెన్స్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిసన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ మరియు సరౌండ్ వ్యూ మానిటర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

మరొక గొప్ప విషయం ఏంటంటే, ఈ నాల్గవ తరం 2022 హ్యుందాయ్ టూసాన్, క్రాష్ టెస్టులో కూడా అద్భుతమైన పనితీరును చూపించి, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఈ కారు కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ మరియు యూరో ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులలో ఇది ఏకంగా ఐదుకి ఐదు స్టార్లు పొందింది. అడల్ట్ (పెద్దల) సేఫ్టీ విషయంలో ఈ ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ 16 పాయింట్లకు గానూ గరిష్టంగా 12.4 పాయింట్లను స్కోర్ చేసింది. పాదచారుల భద్రత (పెడస్టేరియన్ సేఫ్టీ) విషయానికొస్తే, కొత్త హ్యుందాయ్ టూసాన్ యూరో-ఎన్‌సిఎపిలో పాదచారుల రక్షణ భద్రతా పరీక్షలో 54 పాయింట్లకు గానూ 36.1 పాయింట్లను స్కోర్ చేసింది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

హ్యుందాయ్ టూసాన్ - ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్

భారత మార్కెట్లో హ్యుందాయ్ టూసాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలతో అందుబాటులోకి వచ్చింది మరియు ఇవి రెండూ కూడా 2.0 లీటర్ యూనిట్లే. ఇందులో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6200 ఆర్‌పిఎమ్ వద్ద154 బిహెచ్‌పి పవర్ ను మరియు 4500 ఆర్‌పిఎమ్ వద్ద 192 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది మరియు ఈ పెట్రోల్ వెర్షన్ టూసాన్ కేవలం ఫ్రంట్-వీల్ డ్రైవ్ రూపంలో మాత్రమే అందించబడుతుంది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

ఇక డీజిల్ ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే, 2.0 లీటర్ యూనిట్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 184 బిహెచ్‌పి పవర్ ను మరియు 2000-2700 ఆర్‌పిఎమ్ మధ్యలో 416 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ టూసాన్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందించబడుతుంది. మేము టెస్ట్ డ్రైవ్ చేసింది కూడా ఈ డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీనే.

Specification Nu 2.0 Petrol R 2.0 Diesel
Length (mm) 4630
Width (mm) 1865
Height (mm) 1665
Wheelbase (mm) 2755
Fuel Tank Capacity (L) 54
Engine
Configuration 4 Cylinder 4 Cylinder
Displacement (cm3) 1999 1997
Power 156 PS 6200 rpm 186 PS 4000 rpm
Torque 192 Nm 4500 rpm 416 Nm 2000-2750 rpm
Transmission Type 6-speed AT 8-speed AT
Suspension
Front McPherson strut
Rear Multi-link with coil spring
Brakes
Front Disc
Rear Disc
Tyre
Tyre spec (main) 235/60 R18 (D=462 mm) Diamond cut alloy
Tyre spec (spare) 235/60 R18 Diamond cut alloy T135/90 D17 Steel whee
కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

హ్యుందాయ్ టూసాన్ - డ్రైవింగ్ ఇంప్రెషన్స్

మేము టెస్ట్ డ్రైవ్ చేసిన హ్యుందాయ్ టూసాన్ 2.0-లీటర్ టర్బో డీజిల్ మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ యొక్క ఇంజన్ పనితీరు చాలా పంచీగా అనిపించింది. దాని టార్క్ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది మరియు ఇందులోని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ త్వరత్వరగా గేర్‌లను మార్చడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అధిక వేగం వద్ద క్యాబిన్ యొక్క అద్భుతమైన NVH (నాయిస్, వైబ్రేషన్ మరియు హార్ష్‌నెస్) స్థాయిలు ఉన్నప్పటికీ, ఇది డీజిల్ ఇంజన్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

ఇందులోని 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో దాని పనిని అది నిశ్శబ్దంగా నిర్వహిస్తుంది మరియు సాధారణంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అది గేర్‌ల ద్వారా మారడాన్ని మీరు గమనించలేరు. అయితే, యాక్సిలటేరన్ పూర్తిగా ఫ్లోర్ స్థాయికి నొక్కినప్పుడు, ఇంజన్ దాని టార్క్ స్వభావాన్ని పూర్తిగా యాక్సెస్ చేయడానికి అనుమతించడానికి వీలుగా ఇది చాలా సులభంగా ఒకటి లేదా రెండు గేర్‌లను క్రిందికి మారుస్తుంది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

టూసాన్ యొక్క అన్ని వెర్షన్లలో నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఆఫర్‌లో ఉన్నాయి - వీటిలో ఎకో, నార్మల్, స్పోర్ట్ మరియు స్మార్ట్ డ్రైవింగ్స్ మోడ్స్ ఉన్నాయి. ఎకో మోడ్‌లో, థ్రోటల్ రెస్పాన్స్ చాలా నీరసంగా అనిపిస్తుంది. బహుశా మైలేజ్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని ఈ మోడ్ ని పరిచయం చేసి ఉండొచ్చు. ఈ ఎకో మోడ్ లో మీరు స్టీరింగ్ వెయిట్‌ని అనుభవించలేరు. అయితే, స్పోర్ట్ మోడ్‌లో ఇది ఎకో మోడ్‌కు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఈ స్పోర్ట్ మోడ్‌లో స్టీరింగ్ వెయిట్ కూడా పెరుగుతుంది మరియు కార్నర్స్ లో డ్రైవర్ కాన్ఫిడెన్స్ ను కూడా పెంచుతుంది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

హ్యుందాయ్ టూసాన్ సస్పెన్షన్ సెటప్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని పెద్ద టైర్ల కారణంగా ఇది కార్నర్స్ లో తక్కువ బాడీ రోల్ ను కలిగి ఉంటుంది. ఇందులోని సస్పెన్షన్ సెటప్ చాలా మృదువైనదిగా ఉంటుంది. కాబట్టి, ఇది చదునైన రోడ్లు మరియు సాధారణ వేగం వద్ద అద్భుతంగా అనిపించినప్పటికీ, గుంతలతో కూడిన రోడ్లపై అంత గట్టిగా అనిపించదు. అధిక వేగంతో బంప్ లేదా పగుళ్లు ఉన్న ఉపరితలంపైకి వెళ్లినప్పుడు క్యాబిన్ లోపల దాని ప్రభావాలను అనుభవించవచ్చు.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

బ్రేకింగ్ విషయానికి వస్తే, కొత్త తరం హ్యుందాయ్ టూసాన్ లోని నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి. ఈ బ్రేక్‌ల పనితీరు గొప్పగా అనిపిస్తుంది. అయితే, డ్రైవర్లు ఈ బ్రేక్ పెడల్ యొక్క ట్రావెల్‌ను అలవాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. టూసాన్ యొక్క టాప్-స్పెక్ డీజిల్ వేరియంట్‌లో కంపెనీ ఆల్-వీల్ డ్రైవ్‌ ఆప్షన్ కూడా అందిస్తోంది. దేశంలో ఇప్పుడిప్పుడే ఆల్-వీల్ డ్రైవ్ వాహనాలకు ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో, టూసాన్ ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ కొత్త ఆఫ్-రోడింగ్ ఔత్సాహికులను ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

చివరిగా ఏం చెబుతారు..?

పిండి కొద్దీ రొట్టె అన్న సామెత మనందరికీ గుర్తుండే ఉంటుంది. హ్యుందాయ్ టూసాన్ విషయంలో ఈ సామెత చక్కగా సూట్ అవుతుంది. ఈ కారులో అన్ని అంశాలు ఆకట్టుకున్నప్పటికీ, దాని ధర మాత్రం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఇది ధరకు తగిన విలువను నూటికి నూరు శాతం అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత మార్కెట్లో కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 27.69 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 34.39 లక్షలుగా ఉంది. కొత్త టూసాన్ ప్లాటినం మరియు సిగ్నేచర్ అనే రెండు ట్రిమ్స్ లో మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్ల వారీగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Hyundai Tucson Price
Nu 2.0 Petrol 6-Speed Automatic Platinum AT ₹ 27,69,700
Nu 2.0 Petrol 6-Speed Automatic Signature AT ₹ 30,17,000
Nu 2.0 Petrol 6-Speed Automatic Signature AT DT ₹ 30,32,000
R 2.0 Diesel 8-Speed Automatic DSL Platinum AT ₹ 30,19,700
R 2.0 Diesel 8-Speed Automatic DSL Signature AT ₹ 32,87,000
R 2.0 Diesel 8-Speed Automatic DSL Signature AT DT ₹ 33,02,000
R 2.0 Diesel 8-Speed Automatic Signature 4WD AT ₹ 34,39,000
R 2.0 Diesel 8-Speed Automatic Signature 4WD AT DT ₹ 34,54,000
కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్‌యూవీ..

హ్యుందాయ్ ఎస్‌యూవీలలో టాప్-నాచ్ టెక్ లోడెడ్ ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్స్ మరియు పవర్‌ఫుల్ ఇంజన్స్‌తో పాటుగా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) మరియు ఆల్-వీల్-డ్రైవ్ (AWD) ఆప్షన్స్ కోరుకునే వారిని కొత్త తరం టూసాన్ ఎస్‌యూవీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపరచదు. ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి మరొక బలమైన కారణం ఏంటంటే, దాని 5-స్టార్ సేఫ్టీ రేటింగ్. ఇది టూసాన్ లోపల ప్రయాణీకుల భద్రతకు గట్టి భరోసానిస్తుంది.

Most Read Articles

English summary
2022 hyundai tucson test drive review design specs features engine and drving impressions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X