ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి రోడ్డు మీదికి వస్తున్న వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ విధంగా వాహనాల సంఖ్య పెరగడం వల్ల ఇంధన వనరులు కూడా క్షీణిస్తున్నాయి. ఈ కారణంగానే వాహనాలకు డీజిల్ మరియు పెట్రోల్ కొరతలు ఏర్పడుతున్నాయి. కావున వీటి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీదారులు మరియు వాహన వినియోగదారులు దీనికి ప్రత్యామ్నాయాన్ని వెతుకుతూ ఎలక్ట్రిక్ వాహనాలపై ద్రుష్టి సారించారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సంఖ్యంలో విడుదలవుతున్నాయి.

భారత మార్కెట్లో ఇప్పటికే చాలా మంది వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశారు. ఇందులో భాగంగానే ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ ఆడి, ఇప్పుడు తన ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన ఈ-ట్రోన్‌ను భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఆడి ఈ-ట్రోన్ మొదటిసారి 2019 లో భారత మార్కెట్లో ప్రదర్శించబడింది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఈ ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గత ఏడాది భారత మార్కెట్లో అడుగుపెట్టాల్సి ఉంది, కానీ కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, విడుదల కాస్త వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ఎస్‌యూవీ విడుదలకు ముందే మేము ఆడి ఈ-ట్రోన్‌ ఎస్‌యూవీ డ్రైవ్ చేసాము. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూలో చూద్దాం.. రండి.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఎక్స్టీరియర్ మరియు డిజైన్:

మేము డ్రైవ్ చేసిన కొత్త ఆడి ఈ-ట్రోన్ ఎస్‌యూవీ టాంగో రెడ్ మెటాలిక్ షేడ్ లో ఉంటుంది. ఈ పెయింట్ స్కీమ్ కారును చాలా స్పోర్టీగా కనబడేలా చేస్తుంది. ఈ ఎస్‌యూవీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో ప్రత్యేకంగా ఉంచిన డీఆర్‌ఎల్‌లతో సొగసైన హెడ్‌లైట్ యూనిట్ ఇవ్వబడుతుంది. ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఆడి ఈ-ట్రోన్ ఎస్‌యూవీలోని క్లస్టర్‌లో ఆడి డిజిటల్ మ్యాట్రిక్స్ లైటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులోని హెడ్‌ల్యాంప్‌లు దాదాపు 500 మీటర్ల వరకు ప్రకాశిస్తాయి. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి ఇరువైపులా బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్‌తో స్పోర్టి బంపర్ లభిస్తుంది. ఇక్కడ ఎయిర్ ఫ్లో కోసం వెంట్స్ కలిగి ఉంది, ఇది వాహనానికి మంచి ఏరోడైనమిక్స్ ఇస్తుంది

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

కారు ముందు భాగంలో క్రోమ్ లేదు, ఫ్రంట్ గ్రిల్ చుట్టూ బ్రష్ చేసిన సిల్వర్ పెయింట్ స్కీమ్ ఉంది. ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఆడి లోగో క్రింద ఇవ్వబడింది. బంపర్ యొక్క దిగువ సగం బ్రష్ చేసిన సిల్వర్ ఫినిషింగ్ గమనించవచ్చు.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఈ-ట్రోన్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ మొదట మీరు గమనించే విషయం ఫెండర్ యొక్క ఇరువైపులా ఉన్న ఈ-ట్రోన్ బ్యాడ్జ్. ఈ బ్యాడ్జ్ పక్కన మీరు గమయించినట్లైతే అక్కడ ఒక బటన్ ఉంటుంది, ఈ బటన్‌ను రెండు సెకన్ల పాటు నొక్కి ఉంచితే, ఛార్జింగ్ సాకెట్‌ను చూపిస్తుంది. ఛార్జర్‌ను అన్‌ప్లగ్ చేసిన తర్వాత, దాన్ని మూసివేయడానికి మీరు మళ్ళీ రెండు సెకన్ల పాటు బటన్‌ను నొక్కి ఉంచాలి.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఈ ఎస్‌యూవీకి 20 ఇంచెస్ డ్యూయల్ టోన్ 5-స్పోక్ అల్లాయ్ వీల్ మరియు యెల్లో బ్రేక్ కాలిపర్స్ ఉన్నాయి. మొత్తంమీద, అల్లాయ్ వీల్స్ మరియు బ్రేక్ కాలిపర్స్ ఏ కోణం నుండి అయినా ఈ-ట్రోన్ ని చాలా అద్భుతంగా చూపిస్తుంది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఇక రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సొగసైన టెయిల్ లైట్ యూనిట్లను ఎల్‌ఈడీ బార్‌తో కలుపుతుంది. ఈ సెటప్ కారుకు ఫ్యూచరిస్టిక్ స్టైలింగ్ ఇస్తుంది. బూట్ లిడ్ కి ఇరువైపులా ఈ-ట్రోన్ మరియు 55 క్వాట్రో బ్యాడ్జింగ్‌ను కూడా పొందుతుంది. ఈ-ట్రోన్ రియర్ పార్కింగ్ కెమెరాను పొందుతుంది, ఇది గట్టి ప్రదేశాలలో పార్కింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీకి 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా ఫీచర్ కూడా ప్రామాణికంగా లభిస్తుంది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

కాక్‌పిట్ మరియు ఇంటీరియర్స్:

ఆడి ఈ-ట్రోన్ యొక్క క్యాబిన్ లోపలికి అడుగు పెట్టగానే, లోపలి భాగం చాలావరకు బ్లాక్‌ కలర్ లో పూర్తయి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి ఇన్‌సైడ్‌లకు స్పోర్టి అనుభూతిని ఇస్తుంది. అంతే కాకుండా కారు యొక్క క్యాబిన్ చుట్టూ బ్రష్ చేసిన అల్యూమినియం ఎలిమెంట్స్ ఉన్నాయి.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

డాష్‌బోర్డ్‌లోని మధ్యలో రెండు టచ్‌స్క్రీన్ డిస్ప్లేలు ఉన్నాయి. పైన ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పూర్తి చేసిన 10.1-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, క్రింద ఉన్న రెండవ స్క్రీన్ 8.8 ఇంచెస్ యూనిట్, ఇది వాహనానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రదర్శిస్తుంది, అంతే కాకుండా ఎయిర్ కండిషనింగ్ కోసం కంట్రోల్ ప్యానల్‌గా కూడా పనిచేస్తుంది. క్లైమేట్ కంట్రోల్ గా కూడా పనిచేస్తుంది. ఆడి ఈ-ట్రోన్ ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం ని కూడా కలిగి ఉంది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఇన్‌స్ట్రుమెంటేషన్ ను ఆడి వర్చువల్ కాక్‌పిట్ అనే ఎల్‌సిడి యూనిట్ నిర్వహిస్తుంది. ఆడి ఈ-ట్రోన్ ఎస్‌యూవీలో అందించే ఫ్యాన్సీ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ డ్రైవర్‌కు మరింత పట్టును ఇస్తుంది. కావున డ్రైవర్‌ను రహదారిపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ స్పోర్టి అనుభూతిని ఇస్తుంది. స్టీరింగ్ వీల్ ఎలక్ట్రానిక్ టిల్ట్ మరియు టెలిస్కోపిక్ అడ్జస్ట్ ఫీచర్ కూడా కలిగి ఉంది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఇప్పుడు సీట్ల విషయానికి వస్తే, ముందు సీట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో 12 విధాలుగా సర్దుబాటు చేయవచ్చు. డ్రైవర్ సీట్లో మెమరీ ఫంక్షన్ పొందుతుంది దీని కోసం కంట్రోల్స్ డోర్ ప్యానెల్స్ లో ఉంటాయి. సీటు అందించే కుషనింగ్ చాలా బాగుంది, సుదీర్ఘ ప్రయాణాలకు సౌకర్యంగా ఉంటుంది. రియర్ సీట్ మంచి థాయ్ సపోర్ట్ మరియు సాఫ్ట్ బ్యాక్ సపోర్ట్ అందించబడుతుంది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ముగ్గురు ప్రయాణీకులను వెనుక సీటులో సులభంగా కూర్చోవచ్చు, కానీ వెనుక భాగంలో ఇద్దరు ప్రయాణీకులు మాత్రమే ఉంటే, సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌ను ఉపయోగించుకోవచ్చు.రియర్ ఎసి జోన్ కోసం కంట్రోల్స్ మధ్యలో ఉన్నాయి. అంతే కాకుండా వెనుక ఉండే ప్రయాణికుల కోసం రెండు టైప్-సి ఛార్జింగ్ సాకెట్లు కూడా లభిస్తాయి.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఆడి ఈ-ట్రోన్ ఎస్‌యూవీ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,901 మిమీ, 1,935 మిమీ వెడల్పు, 1,629 మిమీ ఎత్తు, 2,928 మిమీ వీల్‌బేస్ మరియు 172 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ యొక్క బూట్ స్పేస్ 600 లీటర్స్ వరకు ఉంటుంది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ మరియు హ్యాండ్లింగ్:

50 క్వాట్రోతో ప్రారంభమయ్యే ఆడి ఈ-ట్రోన్ మూడు పవర్‌ట్రైన్ ఎంపికలతో అందించబడుతుంది. ఇది 71.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 312 బిహెచ్‌పి మరియు 540 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అయితే శక్తివంతమైన 55 క్వాట్రో మరియు ఎస్ వేరియంట్లు ఒకేలా 95 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో ఉంటాయి. కానీ, ఎస్ వేరియంట్ ఆకట్టుకునే 435 బిహెచ్‌పి మరియు 808 ఎన్ఎమ్ టార్క్ పంపుతుంది. ‘బూస్ట్' మోడ్‌లో ఇది 503 బిహెచ్‌పి మరియు 973 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

మేము 360 బిహెచ్‌పి మరియు 561 ఎన్ఎమ్ ను ఉత్పత్తి చేసే 55 క్వాట్రో వేరియంట్‌ను డ్రైవ్ చేసాము. ఇది బూస్ట్ మోడ్‌లో, 408 బిహెచ్‌పి పవర్ మరియు 664 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ-ట్రోన్‌కు శక్తినిచ్చే రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఇందులో ఉన్నాయి. ఒకటి ముందు వైపు ఉన్న 125 కిలోవాట్ల మోటారు మరియు వెనుక వైపు 140 కిలోవాట్ల మోటార్. ఆడి యొక్క 'క్వాట్రో' AWD వ్యవస్థ ద్వారా నాలుగు చక్రాలకు శక్తి పంపబడుతుంది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఆడి ఈ-ట్రోన్ ఒకే ఛార్జీతో 441 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. మేము ఈ పరిధిని పరీక్షించలేదు, కానీ డ్రైవింగ్ పరిస్థితులను బట్టి ఎస్‌యూవీ అంత దూరం ప్రయాణించగలదని మేము చెప్పగలము.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఆడి ఈ-ట్రోన్ 150 కిలోవాట్ల డిసి ఛార్జర్‌ను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది 11 కిలోవాట్ల ఏసీ ఛార్జర్‌ను ఉపయోగించి సుమారు 8.5 గంటల్లో 0 నుంచి 80% వరకు ఛార్జ్ చేయగలదు. ఆడి ఇ-ట్రోన్ ఎస్‌యూవీలో అందించే ఎసి ఛార్జర్‌ను హుడ్ కింద ఉంచారు.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఈ-ట్రోన్ ఎస్‌యూవీ స్పోర్ట్ మోడ్‌లో కేవలం 5.7 సెకన్లలో గంటకు 100 కిమీ వేగవంతం అవుతుంది మరియు గంటకు 200 కిమీకి చేరుకుంటుంది. డ్రైవింగ్ పరిధిని పెంచడానికి ఇది ఆరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఇది రీజనరేటీవ్ బ్రేకింగ్‌ను కలిగి ఉంది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఆడి ఈ-ట్రోన్ ఎస్‌యూవీలో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ ఎస్‌యూవీ ఎత్తును ఆన్-రోడ్, ఆఫ్-రోడ్, కంఫర్ట్ లేదా డైనమిక్ మోడ్‌లో ఆటోమాటిక్ గా అడ్జస్ట్ చేస్తుంది. ఇందులో కంఫర్ట్ మోడ్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మోడ్‌లో, త్రాటల్ రెస్పాన్స్, స్టీరింగ్ వీల్ మరియు సస్పెన్షన్ అన్నీ సమతుల్యతతో ఉంటాయి, కావున సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇస్తాయి.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇది ఎలాంటి రోడ్డులో అయినా సజావుగా డ్రైవ్ చేయడానికి అనుమతిస్తుంది. క్యాబిన్ లోపల ఇన్సులేషన్ లెవెల్ కూడా అద్భుతంగా ఉంటుంది. కావున బయటి నుండి ఒక్క శబ్దం కూడా క్యాబిన్లోకి ప్రవేశించదు.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఈ-ట్రోన్ ఆల్-ఎలక్ట్రిక్, ఇది ఐసి ఇంజిన్ కలిగి ఉండదు, కావున ఇంజిన్ బే నుండి వచ్చే కంపనం లేదా శబ్దం వంటివి ఉండదు. అయితే అధిక వేగంతో వెళ్ళేటప్పుడు, టైర్ల నుండి శబ్దం కొంతవరకు వినిపిస్తుంది, కానీ మ్యూజిక్ పెంచడం ద్వారా ఇవి కంట్రోల్ అవుతుంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ మోటార్లు అధిక వేగంతో కదులుతున్నప్పుడు కొంత శబ్దం వినవచ్చు. కానీ అది పెద్దగా ఇబ్బంది కలిగించదు.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఆడి ఈ-ట్రోన్ అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. స్టీరింగ్ వీల్ అద్భుతమైన స్పందనను కలిగి ఉంది. విభిన్న డ్రైవ్ మోడ్‌లను ఉపయోగించి దీన్ని కఠినతరం చేయవచ్చు లేదా మృదువుగా చేయవచ్చు. మీ అభిరుచికి అనుగుణంగా మోటార్, గేర్‌బాక్స్ మరియు స్టీరింగ్ రెస్పాన్స్ కాన్ఫిగర్ చేయడానికి ఇండ్యూజువల్ మోడ్ కూడా అందించబడుతుంది. పరిమాణం ఉన్నప్పటికీ, ఈ ఎస్‌యూవీ చాలా బాగుంది మరియు బాడీ రోల్ మరింత మెరుగ్గా ఉంటుంది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కొత్త ఆడి ఈ-ట్రోన్ 55 క్వాట్రో చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది. ఆడి కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేస్తున్న మొదట ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ 'ఈ-ట్రోన్'. ఈ-ట్రోన్ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ ఇక్యూసి 400, జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ఉంటుంది.

ఆడి బ్రాండ్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రోన్' 55 క్వాట్రో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఆడి ఈ-ట్రోన్ అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది. మీరు అధిక మొత్తంలో డబ్బును వెచ్చించి, ఒక ఫ్యాన్సీ కారు కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు ఆడి ఈ-ట్రోన్ ఎస్‌యూవీ మంచి ఎంపిక అవుతుంది. త్వరలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త ఆడి ఈ-ట్రోన్ ధర 1 కోటి రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Audi e-Tron 55 Quattro First Drive Review. Read in Telugu.
Story first published: Monday, July 5, 2021, 11:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X