బిఎమ్‌డబ్ల్యూ హైబ్రిడ్ ఐ8 రివ్యూ మరియు టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

Written By:

జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ స్పోర్ట్స్ మరియు హైబ్రిడ్ లక్షణాలు గల ఐ8 కారును దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి టెస్ట్ డ్రైవ్ నిర్వహించి ఈ కారు యొక్క విశేషాలను తెలుగు పాఠకులకు అందించేందుకు డ్రైవ్‌స్పార్క్ తెలుగు బృందాన్ని ఆహ్వానించింది. మా బృందంలోని అనుభవజ్ఞులు దీని గురించి సవివరంగా వివరించడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకునేరు. సుమారుగా రెండున్నర కోట్లు విలువైన ఈ కారును టెస్ట్ చేయడానికి తెలుగు మీడియాలో డ్రైవ్‌స్పార్క్ తెలుగును మాత్రమే ఆహ్వానించింది. సాధారణంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు మాత్రమే లభించే అవకాశం డ్రైవ్‌స్పార్క్ తెలుగుకు మాత్రమే లభించింది. ఇవాళ్టి కథనంలో.... బిఎమ్‌డబ్ల్యూ ఐ8 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి...

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

హాలీవుడ్ యాక్షన్ చిత్రాలనగానే మనకు ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్ కార్లు గుర్తొస్తాయి. అందులో లాంబోర్గిని, పోర్సే, ఫెరారి వంటి స్పోర్ట్స్ కార్లు ప్రత్యేకంగా ఉంటాయి. వాటి సరసన ఇప్పుడు బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు కూడా చేరింది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మిషన్ ఇంపాసిబుల్ అనే హాలీవుడ్ చిత్రంలో బిఎమ్‌డబ్ల్యూ ఐ8 ఈ లగ్జరీ స్పోర్ట్ హైబ్రిడ్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముందు వైపు డిజైన్ అంశాలను భవిష్యత్తును సూచించే విధంగా అభివృద్ది చేయడం ద్వారా ఈ కారు కూడా యాక్షన్ సినిమాల్లో స్థానం దక్కించుకుంటోంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

బిఎమ్‌డబ్ల్యూ ఈ ఐ8 హైబ్రిడ్ కారును కాన్సెప్ట్ దశలో తొలిసారిగా 2009లో ఆవిష్కరించింది. 2011లో మరో డిజైన్ మరియు 2013లో జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ ఆటో షో వేదిక మీద ఆవిష్కరించింది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

అయితే పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ దశకు చేరుకున్న బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారును 2014 అధికారికంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. వివిధ అంతర్జాతీయ విపణిలో విక్రయాలకు అందుబాటులోకి తెచ్చింది. వాటిలో బిఎమ్‌డబ్ల్యూకు ఇండియా ఓ ప్రదానమైన మార్కెట్.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును ఏ యాంగిల్ నుండి గమనించినా అద్బుతమైన డిజైన్ లక్షణాలను కలిగి ఉంది. తక్కువ ఎత్తుతో, విశాలమైన శరీరంతో, లగ్జరీ ఇంటీరియర్, భివిష్యత్ డిజైన్ అంశాలను ప్రతిబింబించే డిజైన్ ఇలా ఏ కోణంలో నుండి పరిశీలించినా దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి. రెక్కల తరహాలో ఉన్న టెయిల్ లైట్లు వాటి చుట్టూ నీలిరంగులో ఉన్న సొబగులు రియర్ డిజైన్‌లో కీలకంగా ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును పార్క్ చేసినా లేదంటే డ్రైవ్ చేసినా... చుట్టు భారీ జనాలు గుమిగూడటం జరిగింది. సిజర్ డోర్లు లేదంటే బటర్ ఫ్లై డోర్లుగా పిలిచే వాటిని ఇందులో అందివ్వడం ద్వారా ఈ హైబ్రిడ్ కారు రూపాన్నే మార్చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

తక్కువ బరువును కలిగి ఉండేందుకు కార్బన్ ఫైబర్ మెటీరియల్ ఎక్కువగా వినియోగించడం జరిగింది. మరియు స్పోర్ట్స్ కార్లలో మొదటి సారిగా చెప్పుకునే లేజర్ హెడ్ లైట్లు ఇందులో ఉన్నాయి. పగటి పూట వెలిగే బ్యాకప్ లైట్లు, టర్న్ సిగ్నల్స్ కూడా ఇందులో అందివ్వడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 లో సాంకేతిక అంశాల పరంగా చూస్తే, 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో ఛార్జ్‌డ్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రిక్ అనుసంధానంతో కలదు. ఎలక్ట్రిక్ మోటార్ మరియు పెట్రోల్ ఇంజన్ రెండూ సంయుక్తంగా 362బిహెచ్‌పి పవర్ మరియు 570ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇందులో ఎవరూ ఊహించని మరో టెక్నాలజీ ఉంది. దీనిని కేవలం ఎలక్ట్రిక్ మోటార్ ద్వారానే 37కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మరియు పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండు కాంబినేషన్లలో దీనిని డ్రైవ్ చేయవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారులో మూడు రకాల డైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి,

 • కంఫర్ట్ (డీఫాల్ట్ సెట్టింగ్ - ఆటోమేటిక్‌గా ప్రారంభంలో ఇందే ఉంటుంది)
 • ఎకో డ్రైవింగ్ మోడ్ (మైలేజ్ దృష్టిలో ఉంచుకుని డ్రైవ్ చేసే వారి కోసం)
 • స్పోర్ట్స్ (రేసింగ్ ప్రియుల కోసం)
బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇందులో శక్తివంతమైన స్టాపింగ్ సిస్టమ్ కోసం అద్బుతమైన బ్రేకింగ్ వ్యవస్థ అందివ్వడం జరిగింది. బ్రేకులు ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తిని స్టోర్ చేసుకోవచ్చు. ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు పెడల్ షిఫ్టర్స్ ద్వారా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

కంఫర్ట్ మరియు ఎకో ప్రో మోడ్స్ లలో ఎలక్ట్రిక్ మోటార్ మరియు పెట్రోల్ ఇంజన్‌ల పనితరు అద్బుతం అని చెప్పాలి. గంటకు 60కిమీల వేగం లోపు ఉన్నపుడు ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా, తరువాత ఆ వేగాన్ని మించినపుడు పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ కలయికలో వేగం పెరిగితే స్పోర్ట్స్ డైవింగ్ మోడ్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. ఈ మోడ్ వద్ద స్పీడ్ మీటర్ మొత్తం ఎరుపు రంగు లైట్లలోకి మారుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 లో ఎలక్ట్రిక్ మోటార్ ఉత్పత్తి చేసే పవర్ ముందు చక్రాలకు మరియు పెట్రోల్ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ వెనుక చక్రాలకు అందుతుంది. తద్వారా ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో పవర్ సమతుల్యం చక్కగా జరుగుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ట్రాఫిక్ మరియు హై స్పీడ్ కండీషన్‌లలో స్టీరింగ్ చాలా పదునైన పనితీరును కనబరుస్తుంది. స్టీరింగ్ ఉపయోగం చాలా స్వల్పంగా ఉంటుంది. దీనిని నడిపేటప్పుడు డ్రైవర్ అత్యుత్తమ విశ్వాసాన్ని కలిగి ఉంటాడు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

డిజైన్ పరంగా కారుకు ఇరువైపులా క్యారెక్టర్ లైన్లు, స్టైలిష్ సిసర్ డోర్లు, శక్తివంతమైన స్పోర్టివ్ లక్షణాలు గల ఇంజన్‌ను ఇందులో ఉంది. కొలతల పరంగా 117ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 2800ఎమ్ఎమ్ వీల్ బేస్ ఇందులో కలదు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మా రివ్యూలో అతి ముఖ్యమైన ప్రశ్న - మీకు స్పోర్ట్స్ కారు కొనే ఆలోచన ఉందా...? ఉంటే వీటికి ఉన్న ఎంపికలు ఆడి ఆర్8, జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్, ఫెరారి మరియు లాంబోర్గిని. మరి స్పోర్ట్స్ తో పాటు హైబ్రిడ్ వెర్షన్ కారు కావాలంటే... దీనికి గల ఏకైక ఎంపిక బిఎమ్‌డబ్ల్యూ ఐ8.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

సాధారణ కారులో ఉండే అన్ని లక్షణాలతో పాటు స్పోర్టివ్ లక్షణాలు ఉన్న ఇందులో దాదాపు అన్ని ఫీచర్లు ఉన్నాయి. గరిష్ట సేఫ్టీ ఫీచర్లు మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏ మాత్రం డోకా లేదని చెప్పవచ్చు. లగేజ్ కోసం అత్యుత్తమ బూట్ స్పేస్ ఇందులో ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మరి ఈ కారు ధర ఎంత ? బిఎమ్‌డబ్ల్యూ ఐ8 గురించి చదివిన తరువాత, దీని ఫోటోలు చూసిన తరువాత అందరి మదిలో మెదిలే ప్రశ్న దీని ధర ఎంత - హైదరాబాదులో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.33 కోట్లు. దీని ఆన్ రోడ్ ధర రూ. 2.50 కోట్లుగా ఉంది.

సాంకేతిక సమాచారం

సాంకేతిక సమాచారం

 • ఇంజన్ - 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల
 • పవర్ - 288బిహెచ్‌పి
 • టార్క్ - 319ఎన్ఎమ్
 • ఎలక్ట్రిక్ మోటార్ పవర్ - 129బిహెచ్‌పి
 • ఎలక్ట్రిక్ మోటార్ టార్క్ - 250ఎన్ఎమ్
 • మొత్తం పవర్ (పెట్రోల్ ఇంజన్ + ఎలక్ట్రిక్ మోటార్) - 357బిహెచ్‌పి
 • మొత్తం టార్క్ (పెట్రోల్ ఇంజన్ + ఎలక్ట్రిక్ మోటార్) - 570ఎన్ఎమ్
 • 0 నుండి 100 కిమీల వేగం - 4.4 సెకండ్లలో
 • గరిష్ట వేగం - 250కిమీలు
బిఎమ్‌డబ్ల్యూ కొలతలు

బిఎమ్‌డబ్ల్యూ కొలతలు

 • పొడవు - 4689ఎమ్ఎమ్
 • వెడల్పు - 1942ఎమ్ఎమ్
 • ఎత్తు - 117ఎమ్ఎమ్
 • గ్రౌండ్ క్లియెరన్స్ - 117ఎమ్ఎమ్
 • ఇంధన ట్యాంక్ కెపాసిటీ - 42కిలోమీటర్లు
 • వీల్ బేస్ - 2800ఎమ్ఎమ్
 • వీల్ సైజ్ - 20-అంగుళాలు
English summary
Read In Telugu To know About The BMW i8 Road Test Review

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark