బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్‌డ్రైవ్ 30డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

Written By:

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీని తొలిసారిగా, 1999లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. ఆ తరువాత కాలంలో ఫస్ట్ మరియు సెకండ్ జనరేషన్ ఎక్స్5 ఎస్‌యూవీలను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా మూడవ తరానికి చెందిన ఎక్స్5 ఎస్‌యూవీని అందుబాటులోకి తెచ్చింది.

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విభాగం, తమ థర్డ్ జనరేషన్ ఎక్స్5 ఎస్‌యూవీకి టెస్ట్ డ్రైవ్ నిర్వహించి, దీని ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ సామర్థ్యాలను పరీక్షించే అవకాశాన్ని డ్రైవ్‌స్పార్క్ తెలుగు బృందానికి ఇచ్చింది. నేటి కథనంలో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ....

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

పదహారేళ్ల క్రితం విడుదలైన తొలి ఎక్స్5 ఎస్‌యూవీతో పోల్చుకుంటే బిఎమ్‌డబ్ల్యూ విడుదల చేసిన థర్డ్ జనరేషన్ ఎక్స్5 లో చాలా మార్పులే సంభవించాయి. డిజైన్, ఇంటీరియర్, ఎంటర్‌టైన్‌మెంట్, సేఫ్టీ, వంటి ఎన్నో ఫీచర్లతో ఎక్స్5 ఎస్‌‌యూవీ అప్‌డేట్ అయ్యింది.

ఎక్ట్సీరియర్ డిజైన్

ఎక్ట్సీరియర్ డిజైన్

ఫ్రంట్ డిజైన్‌లో బిఎమ్‌డబ్ల్యూ కి చెందిన ప్రసిద్ద కిడ్నీ ఫ్రంట్ గ్రిల్ యధావిథంగా అందివ్వడం జరిగింది. అయితే మునుపటి ఎక్స్5 వెర్షన్‌లతో పోల్చితే పెద్ద మార్పులేవీ చోటు చేసుకోలేదు. రెండు భాగాలుగా ఉన్న ఫ్రంట్ గ్రిల్‍‌కు ఇరువైపులా పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న హెడ్ ల్యాంప్స్ అందివ్వడం జరిగింది. వీటికి క్రిందుగా గుండ్రటి ఆకారంలో ఫాగ్ ల్యాంప్స్ గుర్తించవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

కారు వేగాన్ని తీవ్రంగా వ్యతిరేకించేది గాలితో కలిగే ఘర్షణ. దీనిని నివారించడానికి, గాలిని చీల్చుకుంటూ, ముందుకు చొచ్చుకుపోయే విధంగా ఫ్రంట్ డిజైన్ మరియు బానెట్ మీద ప్రత్యేక క్యారెక్టర్ లైన్స్ అందివ్వడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

చివరి జనరేషన్ ఎక్స్5 తో పోల్చుకుంటే ఈ థర్డ్ జనరేషన్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 100 కిలోల వరకు తక్కవ బరువుతో ఉంది. తేలకగా ఉండటమే కాకుండా, మంచి ధృడమైన బాడీని కలిగి ఉంది. ఇందు కోసం ఈ మోనోకోక్యూ బాడీ నిర్మాణంలో అల్ట్రా హై టెన్సైల్ స్టీల్ వినియోగించారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఖరీదైన మరియు లగ్జరీ ఎస్‌యూవీలలో రియర్ డిజైన్‌కు కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. అప్‌జడేటెడ్ ఎల్ఇడి టెయిల్ లైట్లు, సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, క్రోమ్ ఎక్స్5 బ్యాడ్జింగ్ గుర్తించవచ్చు. ఈ రియర్ డిజైన్ దాదాపు ప్రీవియస్ జనరేషన్‌నే పోలి ఉంది. ఎక్స్5 ఎస్‌యూవీని ఎనిమిది విభిన్న ఎక్ట్సీరియర్ కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

ఇంటీరియర్

ఇంటీరియర్

ఎక్స్5 ఇంటీరియర్‌లోకి ప్రవేశించగానే లగ్జరీ ఫీల్ కలుగుతుంది. ప్రత్యేకించి లగ్జరీ సీట్లు, ఇవోరి వైట్ మరియు నాపా లెథర్ అప్‌హోల్‌స్ట్రే మీకు స్వాగతం పలుకుతాయి. లాంగ్ డ్రైవ్‌లకు అనువుగా సీట్లను ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే అవకాశం కలదు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

లగేజ్ స్పేస్ మరియు థర్డ్ రో సీటింగ్ రెండింటిని స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది. మూడవ వరుస సీటును మలిపివేయడం ద్వారా 650-లీటర్ల లగేజ్ స్పేస్ పొందవచ్చు. మరింత స్పేస్ కావాలనుకుంటే రెండవ వరుస సీటును మలిపేయడంతో 1,870-లీటర్లకు పెంచుకోవచ్చు(క్యాబిన్ స్పేస్ లీటర్లలో కొలవడం జరిగింది).

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

బిఎమ్‌డబ్ల్యూ తమ థర్డ్ జనరేషన్ ఎక్స్5లోని ప్రధానమైన ప్రదేశాల్లో కలపతో చేసిన సొబగులు అందించింది. డ్యాష్ బోర్డ్, సెంటర్ కన్సోల్, డోర్ ప్యానెల్స్ మరియు స్టోరేజ్ ప్యానెల్స్ మీద ఆకర్షణీయంగా చెక్కతో చేసిన ఎలిమెంట్లను అందించింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంటీరియర్‌లో ప్రధానమైన ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్ కోసం ఐడ్రైవ్ సిస్టమ్ అందించింది. 10.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఐడ్రైవ్ వ్యవస్థ కలదు. దీని ఆధారంగా క్యాబిన్ ఆంబియంట్ లైటింగ్ సెట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ సమాచారం, న్యావిగేషన్, ఇంజన్ యొక్క రియల్ టైమ్ పవర్ మరియు టార్క్ వంటి ఎన్నో వివరాలు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో గమనించవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

తప్పనిసరి ఫీచర్లుగా, 16-స్పీకర్ల హార్మన్/కార్డన్ ఆడియో సిస్టమ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటి, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, సెంటర్ ఆర్మ్ రెస్ట్ మరియు చిల్ స్టోరేజ్ బాక్స్ ఉన్నాయి. మరియు పెద్ద పరిమాణంలో ఉన్న ప్యానరోమిక్ సన్ రూఫ్ కలదు.

ఇంజన్ మరియు పనితీరు

ఇంజన్ మరియు పనితీరు

మేము పరీక్షించిన ఎక్స్5 ఎస్‌యూవీలో 3-లీటర్, ఇన్ లైన్-6 టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 255బిహెచ్‌పి పవర్ మరియు 560ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 లో అందించిన వివేకవంతమైన ఎక్స్‌డ్రైవ్ సిస్టమ్ ఇంజన్ పవర్‌ను అన్ని చక్రాలకు సమానంగా సరఫరా చేస్తుంది. ప్రతికూల రహదారి పరిస్థితులు ఎదురైనపుడు మొత్తం ఇంజన్ పవర్‌లో 60 శాతం వెనుక చక్రాలకు, 40 శాతం ముందు చక్రాలకు సరఫరా చేస్తుంది. ఇది కేవలం 6.5-సెకండ్ల వేగంలోనే 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 230కిలోమీటర్లుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఎక్స్5 లోని ఇంజన్‌కు వేగంగా గేర్లను మార్చే సామర్థ్యం ఉన్న 8-స్పీడ్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడ్‌లో డ్రైవింగ్ చేస్తున్నపుడు గేర్లను సులభంగా మార్చేందుకు స్టీరింగ్ వీల్ మీద పెడల్ షిఫ్టర్ కంట్రోల్ ఉన్నాయి. ఇందులో "లాంచ్ కంట్రోల్" అనే ఫీచర్‌తో పాటు బ్రేకులు వేసినపుడు చక్రాలు స్కిడ్ అవ్వడాన్ని నివారించడానికి యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీలో నాలుగు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, ఎకో ప్రో- ఈ మోడ్‌లో మంచి మైలేజ్ వస్తుంది, కానీ ఆశించిన ఇంజన్ పవర్ రాదు. కంఫర్ట్- సిటిలో డ్రైవింగ్ చేయడానికి కంఫర్ట్ మోడ్ చాలా బెటర్. స్పోర్ట్ మరియు స్పోర్ట్ ప్లస్- యాక్సిలరేషన్ స్పందన చాలా బాగా ఉంటుంది. స్పోర్టివ్ రైడింగ్ కోసం వీలైనంత ఎక్కువ పవర్ ఈ రెండు డ్రైవింగ్ మోడ్‌లలో పొందవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇండియాలో విడుదలయ్యే ప్రతి ఎస్‌యూవీకి గ్రౌండ్ క్లియరెన్స్ మరియు అత్యుత్తమ చక్రాలు, టైర్లు ఎంతో ముఖ్యం. కాబట్టి ఎక్స్5 లో 206ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కలదు. ఆఫ్ రోడ్ డ్రైవింగ్‌లో మంచి పటిష్టత్వం కోసం 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు వాటికి 255/55 కొలతల్లో ఉన్న టైర్లు అందివ్వడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రెండు టన్నుల బరువున్న ఫీలింగ్ మనకు ఏ మాత్రం కలదు. అయితే సీట్ హైట్ చాలా ఎక్కువగా ఉందన్న భావన కలగుతుంది. ప్రమాదకర మలుపుల్లో కూడా సునాయసంగా స్టీరింగ్ తిప్పడానికి అనువుగా వివేకవంతమైన మరియు వేగంగా స్పందించే ఎలక్ట్రిక్ స్టీరింగ్ ఇందులో ఉంది. ఓవరాల్‌గా ఎస్‌యూవీని చూడటానికి భారీ పరిమాణంలో ఉన్నప్పటికీ మంచి హ్యాండ్లింగ్ కలదు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీ సిటిలో 8.2కిమీ/లీ మరియు హై వే మీద 12.8కిమీ/లీ మైలేజ్ ఇచ్చింది. 80 లీటర్ల స్టోరేజ్ కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ ఇందులో ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

1999 లో విడుదలైన ఎక్స్5 తో పోల్చుకుంటే డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ పనితీరు పరంగా అనేక మార్పులు సంభవించాయి. కానీ బిఎమ్‌డబ్ల్యూ వారి స్పోర్టివ్ డిఎన్‌ఎ పరంగా ఎక్స్5 లో ఎలాంటి మార్పులు జరగలేదు.

తీర్పు

తీర్పు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ధర రూ. 74.3 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. ధర ఏ మాత్రం సమస్యకాదనుకునే వారికి ఇదొక బెస్ట్ లగ్జరీ ఎస్‌యూవీ. ఈ ధరల శ్రేణిలో దీనికి సాటి మరొక ఎస్‌యూవీ లేదనే చెప్పాలి.

English summary
Read In Telugu: BMW X5 xDrive30d First Drive Review
Story first published: Friday, June 30, 2017, 13:28 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark