సిట్రోయెన్ eC3 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

భారతీయ మార్కెట్లో ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ అడుగుపెట్టినప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతోంది, ఇందులో భాగంగానే కంపెనీ మొదట "సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్‌"తో అరంగేట్రం చేసింది. ఆ తరువాత C3 క్రాస్‌ఓవర్ హ్యాచ్‌బ్యాక్‌తో మరింత ఆదరణ పొందగలిగింది. అయితే ఇప్పుడు సిట్రోయెన్ eC3 విడుదలకు సన్నద్ధమైంది.

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న సిట్రోయెన్ ఎలక్ట్రిక్ కారు eC3 కారుని డ్రైవ్ చేయడానికి ఇటీవల మాకు అవకాశం లభించింది. ఈ చిన్న కారు చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, అద్భుతమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంది. ఈ సరికొత్త సిట్రోయెన్ eC3 డిజైన్, ఫీచర్స్ మరియు రేంజ్ వంటి వివరాలతో పాటు పర్ఫామెన్స్ వంటి వివరాలు కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

సిట్రోయెన్ eC3 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సిట్రోయెన్ eC3 డిజైన్:

సిట్రోయెన్ eC3 దాదాపు చూడటానికి కొంత దాని మునుపటి మోడల్ 'సి3' ని పోలి ఉన్నప్పటికీ ఇది సి3 కాదు అని తెలియజేయడానికి ఇందులో కొన్ని ఫీచర్స్ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్ పరంగా చూడ ముచ్చటగా ఉంది. దీని ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ ఉంటుంది, దానికి కొంచెం పైన డే టైమ్ రన్నింగ్ లైట్స్ చూడవచ్చు. హెడ్‌ల్యాంప్ సెటప్‌ కింది భాగంలో బ్లాక్ ప్లాస్టిక్-క్లాడ్ సెక్షన్‌లో ఫ్రంట్ బంపర్‌పై ఫాగ్ ల్యాంప్‌ చూడవచ్చు.

సిట్రోయెన్ eC3 యొక్క ఫాగ్ ల్యాంప్‌ చుట్టూ పోలార్ వైట్ కలర్ గమనించవచ్చు. నిజానికి పోలార్ వైట్ అనేది ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క డ్యూయెల్ టోన్ థీమ్‌ కోసం ఎంపిక చేసిన కలర్. ఎందుకంటే ఈ eC3 యొక్క రూప్ కూడా పోలార్ వైట్ కలర్ లో ఉండటం గమనించవచ్చు. ఈ డ్యూయెల్ టోన్ కలర్ సిట్రోయెన్ eC3 కి మరింత అద్భుతంగా ఉంటుంది.

సిట్రోయెన్ eC3 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రూప్ పోలార్ వైట్ కలర్ లో ఉంటే మిగిలిన బాడీ కలర్ జెస్టీ ఆరెంజ్, ప్లాటినం గ్రే లేదా స్టీల్ గ్రేలో పూర్తి చేయబడి ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు వివిధ కలర్ ఆప్సన్స్ లో కూడా లభిస్తుంది. కావున సిట్రోయెన్ eC3 కొనాలనుకునే వినియోగదారుడు తమకు నచ్చిన కలర్ ఆప్సన్ ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క అన్ని కలర్ ఆప్సన్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి.

సిట్రోయెన్ eC3 లో కనిపించే పోలార్ వైట్ వైబ్ ప్యాక్ కారు యొక్క డోర్‌లలో కూడా కనిపిస్తుంది. రియర్ ప్రొఫైల్ లో కూడా ఈ కలర్ గమనించవచ్చు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం రియర్ ప్రొఫైల్ లో ఉన్న eC3 బ్యాడ్జ్. ఇది సిట్రోయెన్ యొక్క ఎలక్ట్రిక్ కారు అని స్పష్టంగా చెబుతుంది. అంతే కాకుండా ముందు వున్న రెండు డోర్ల మీద చిన్న 'e' బ్యాడ్జ్ కూడా ఉంటుంది.

సిట్రోయెన్ eC3 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ కొత్త సిట్రోయెన్ eC3 లో ఛార్జింగ్ పోర్ట్ ముందు భాగంలో ఉంటుంది. ఇది కుడి వైపున ఫ్రంట్ వీల్ ఆర్చ్ పైన అమర్చబడి ఉంటుంది. ఇది ఒక ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్‌ కలిగి ఉంటుంది, కానీ అది మూసివేయబడి ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ రీట్రోఫిట్ చేయకపోవడానికి ప్రధాన కారణం అదనపు వైరింగ్ అని ఇక్కడ గమనించవచ్చు. మొత్తం మీద సిట్రోయెన్ eC3 డిజైన్ ఆధునిక కాలంలో చాలా అనుకూలంగా ఉండేలా రూపొందించబడి ఉంది.

సిట్రోయెన్ eC3 ఫీచర్స్:

సిట్రోయెన్ eC3 యొక్క క్యాబిన్‌లోకి అడుగుపెట్టగానే మీరు ఒకటి గమనించవచ్చు. అదే 'గేర్ లివర్', గేర్ లివర్ అనేది ఇందులో కనిపించదు. అయితే కంపెనీ దానికి బదులుగా eC3 ని డ్రైవ్‌లోకి తీసుకురావడంలో మీకు సహాయపడటానికి టోగుల్ స్విచ్‌ అందించింది. అంతే కాకుండా ఈ లివర్ పక్కన eC3 ని ఎకో మోడ్‌లోకి మార్చడానికి ఒక బటన్ కూడా కనిపిస్తుంది. క్యాబిన్ విశాలంగా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

సిట్రోయెన్ eC3 డాష్ బోర్డు మధ్యలో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. ఇది వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఈ డిస్‌ప్లే 35 కి పైగా ఫీచర్స్ కనెక్ట్ చేయడానికి MyCitroen Connect యాప్‌ కూడా ఉంటుంది. దీని ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్, ఛార్జింగ్ స్టేషన్స్ వంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడంలో సహాయపడతాయి.

ఈ ఫీచర్స్ తో పాటు జియో ఫెన్సింగ్, మీ కారును కేవలం ఒక ట్యాప్‌లో గుర్తించే సామర్థ్యం మరియు మీ కారును ఎవరైనా చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినట్లయితే SOS వార్ణింగ్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇక సీటింగ్ విషయానికి వస్తే, eC3 లో ఉండే సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. ఇందులో బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉండటం వల్ల ఫ్లోర్ దాదాపు 70 మి.మీ ఎత్తులో ఉంటుంది.

ఈ కారణంగా వెనుక వైపు ఉన్నవారు తమను తాము కొంచెం ఎక్కువ థై అప్ పొజిషన్‌లో ఉన్నట్లు భావిస్తారు. అయినప్పటికీ ఇది చాలా సౌకర్యవంతంగానే ఉంటుంది. అంతే కాకుండా ఇందులో బూట్ స్పేస్ 315 లీటర్లు మాత్రమే ఉంటుంది. కావున ఎక్కువ లగేజ్ ఉంచడానికి అవకాశం ఉండదు. మొత్తమ్ మీద సిట్రోయెన్ eC3 డిజైన్ మాత్రమే కాకుండా ఫీచర్స్ కూడా చాలా అనుకూలంగా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్:

సిట్రోయెన్ eC3 అనేది ఎలక్ట్రిక్ కారు, కావున ఇందులోని అతిపెద్ద మార్పు బోనెట్ అనే చెప్పాలి. ఎందుకంటే దీని కింద ఎయిర్-కూల్డ్ 29.2kwh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ నిక్షిప్తం చేయబడి ఉంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 320 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఈ రేంజ్ వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

కొత్త eC3 ఎలక్ట్రిక్ CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది, కావున DC ఫాస్ట్ ఛార్జర్‌లో ప్లగ్ చేసినప్పుడు eC3 ఎలక్ట్రిక్ కేవలం 57 నిముషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. అయితే 15A సాకెట్‌లో ప్లగ్ హోమ్ ఛార్జర్ (3.3kW ఆన్-బోర్డ్ ఛార్జర్‌) ఉపయోగించి ఛార్జ్ చేసుకోవడానికి 10-గంటల సమయం పడుతుంది. ఛార్జింగ్ టైమ్ హోమ్ ఛార్జర్ ద్వారా కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా చాలా అనుకూలంగా ఉంటుంది.

బ్యాటరీ ప్యాక్ eC3 యొక్క ఫ్రంట్ యాక్సిల్‌పై అమర్చబడిన ఒకే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 56.2 బిహెచ్‌పి పవర్ మరియు 143 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు మీద 3-సంవత్సరాలు లేదా 1,25,000 కి.మీ వారంటీ, మోటారు మీద 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిమీ వారంటీ మరియు బ్యాటరీ ప్యాక్ మీద 7 సంవత్సరాలు లేదా 1,40,000 కిమీ వారంటీ అందిస్తుంది.

సిట్రోయెన్ eC3 డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

సిట్రోయెన్ eC3 డ్రైవింగ్ చేసేటప్పుడు గమనించదగ్గ విషయం ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్ అందించే నిశ్శబ్దం. ఇందులోని NVH లెవెల్స్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అద్భుతంగా ఉంటాయి. eC3 ఎలక్ట్రిక్ అనేది C3 లైనప్‌లో అతి తక్కువ శక్తివంతమైనది, అయినప్పటికీ ఇది 143 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది స్పీడ్ పరంగా చాలా ఉత్తమంగా ఉన్నట్లు అతి తక్కువ సమయంలోనే కనుగొనవచ్చు.

ఈ సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కారులో ఎకో మరియు స్టాండర్డ్ అనే రెండు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య పెద్దగా వ్యత్యాసం పెద్దగా ఉన్నట్లు అనిపించదు, కానీ మీరు హైపర్‌మైలింగ్‌లో లేకుండా ఉంటే ప్రతి సందర్భంలోనూ మీరు స్టాండర్డ్‌ మోడ్ లో ఉన్నట్లు భావిస్తారు. మేము ఈ ఎలక్ట్రిక్ కారుని చెన్నైలోని వాబ్‌కో టెస్ట్ ట్రాక్ మీద డ్రైవ్ చేసాము, మృదువైన రోడ్ల మీద ఖచ్చితమైన సస్పెన్షన్ సెటప్‌ గమనించలేకపోయాము.

అయినప్పటికీ, బ్యాటరీ ప్యాక్ యొక్క అదనపు బరువు మరియు eC3 యొక్క తక్కువ గ్రావిటీ వంటివి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించాయి. అయినప్పటికీ కొన్ని కఠినమైన రోడ్ల మీద జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఎంతనై ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ముందు భాగంలో డిస్క్‌ బ్రేకులు, వెనుక వైపు డ్రమ్‌ బ్రేకులు ఉంటాయి, కావున మంచి బ్రేకింగ్ సిస్టం పొందవచ్చు. మొత్తం మీద కొత్త సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ అద్భుతమైన పనితీరుని అందిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

సిట్రోయెన్ eC3 పై మా అభిప్రాయం:

సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. తక్కువ సమయం వల్ల ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ఖచ్చితమైన రేంజ్ మేము టెస్ట్ చేయలేకపోయాము. ఈ ఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్లో టాటా మోటార్స్ యొక్క 'టియాగో ఈవి' కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు ధరలను వెల్లడించలేదు, ఈ eC3 గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Citroen ec3 first drive review design features and driving impressions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X