2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: బెస్ట్ ఏంటి... బ్యాడ్ ఏంటి...?

By Anil

2012 ఏడాదిలో జరిగిన ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన ఎన్నో కొత్త మోడళ్ల ఆవిష్కరణకు వేదికయ్యింది. ఇందులో ఫోర్డ్ కోసం కేటాయించిన బూత్ వద్ద సందర్శకుల తాకిడి విపరీతంగా ఉంది. ఎన్నెన్నో వాహనాలు కొలువుదీరాయి అయినప్పటికీ ఫోర్డ్ ముంగిటి మూగిన జనసందోహం అసంఖ్యాకం. ఇంతకీ అది ఏ కారో తెలుసా....? ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ.

2013లో తొలి పరిచయానంతరం, ఫోర్డ్ ఇండియా విభాగం ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. నాలుగేళ్ల క్రితం ఈ సెగ్మెంట్లో పోటీ లేకపోవడం భారీ విక్రయాల బాటపట్టి ఫోర్డ్‌కు సరికొత్త రికార్డులు తెచ్చిపెట్టింది. అయితే కాలం కదిలేకొద్దీ ఈ శ్రేణిలో ఎన్నో కొత్త మోడళ్లు వచ్చాయి. దీంతో ఎకోస్పోర్ట్ సేల్స్ తగ్గుముఖం పట్టాయి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

కొత్తదనం కోరుకునే కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని ఫోర్డ్ మోటార్స్ తమ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీలో భారీ మార్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేసింది. కొత్త ఇంజన్ వేరియంట్లో అప్‌డేట్ చేసిన ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను టెస్ట్ డ్రైవ్ చేసి, ఇందులోని ప్లస్సులు... మైనస్సులను పాఠకులతో పంచుకునే అవకాశాన్ని ఫోర్డ్ డ్రైవ్‌స్పార్క్ బృందానికి కల్పించింది.

2017 పోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ

నేటి 2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ కథనంలో... మునుపటి ఎకోస్పోర్ట్ మరియు కొత్త ఎకోస్పోర్ట్ మధ్య తేడా... సరికొత్త ఫోర్డ్‌ను కొనవచ్చా... కొనకూడదా... వంటి విషయాలు తెలుసుకుందాం రండి...

2017 పోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ

ఎక్ట్సీరియర్

ఫోర్డ్ తమ సరికొత్త ఎకోస్పోర్ట్ ఎస్‍‌యూవీని మునుపటి వెర్షన్‍‌తో పోల్చుకుంటే రీఫ్రెష్డ్ డిజైన్ అందించింది. మరింత ఎస్‌యూవీ అనుభూతిని కలిగించే లుక్ సొంతం చేసుకుంది. ఫ్రంట్ డిజైన్‌ మొత్తం ఎస్‌యూవీకి ఓ కొత్త రూపాన్ని తీసుకొచ్చింది.

2017 పోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ

మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే రెండుగా విభజించబడిన ఫ్రంట్ గ్రిల్, గ్రిల్‌కు ఇరువైపులా పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ట్విన్ బ్యారెల్ హెడ్ ల్యాంప్స్, సరికొత్త టర్న్ ఇండికేటర్స్ మరియు హెడ్ ల్యాంప్స్‌కు క్రిందుగా ఫాగ్ ల్యాంప్స్, బంపర్‌కు క్రిందుగా నూతన గ్రే స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి.

2017 పోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ

సైడ్ ప్రొఫైల్

ఫ్రంట్ డిజైన్‌తో పాటు సైడ్ ప్రొఫైల్‌లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. విభిన్న డిజైన్‌లో అల్లాయ్ వీల్స్ మీదకు చూపు వెళ్లడం ఖాయం. ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ టైటానియం ప్లస్ లో 17-అంగుళాల పరిమాణం గల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వీటికి 205/50 ఆర్17 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి.

2017 పోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ

రియర్ డిజైన్

రెగ్యులర్ వెర్షన్ ఎకోస్పోర్ట్‌ రియర్ డిజైన్‌తో పోల్చుకుంటే రీడిజైన్ చేయబడిన బంపర్ మరియు స్పేర్ వీల్ గమనించవచ్చు. అయితే రియర్ డోర్ తెరవడానికి ఇది వరకు ఉన్న బటన్ ఇప్పుడు కనిపించకుండా చేశారు.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

బూట్ స్పేస్(డిక్కీ)

రియర్ డోర్ తెరిస్తే, 352-లీటర్ల బూట్ స్పేస్ పొందవచ్చు. మరింత లగేజ్ స్పేస్ కోరుకునే వారు చివరి వరుస సీట్లను మడిపేయడంతో 1,178-లీటర్లకు పెంచుకోవచ్చు. డిక్కీ అడుగు భాగంలో ఉన్న డోర్ ఓపెన్ చేయడం ద్వారా మరో స్పోరేజ్ స్పేస్ పొందవచ్చు. విలువైన సామాగ్రిని భద్రత పరుచుకోవడానికి ఈ దాచి ఉంచిన ట్రే ఉపయోగపడుతుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఎక్ట్సీరియర్ తరహాలో ఇంటీరియర్‌ డిజైన్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా గుర్తించదగిన మార్పుల్లో ఆల్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్ మరియు డ్యాష్ బోర్డ్ మధ్యలో ఉన్న ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పేలు కీలకం.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

తెల్లని దారంతో కుట్టబడిన బ్లాక్ లెథర్ సీట్లున్నాయి. ఫ్రంట్ సీట్లు చాలా విశాలంగా ఉండటంతో కాళ్లు మరియు బాడీ మొత్తానికి అత్యంత సౌకర్యవంతంగా ఉంది. డ్రైవర్ అనుకూలతను బట్టి సీటు ఎత్తును మార్చుకుని నచ్చిన డ్రైవింగ్ పొజిషన్ సెట్ చేసుకోవచ్చు.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

వెనుక వరుస సీటింగ్ ప్రయాణికులు అంత సౌకర్యాన్ని ఇవ్వలేకపోయాయి. సీటును 60:40 నిష్పత్తిలో క్రిందకు మడపవచ్చ. బాడీ మొత్తానికి మంచి సపోర్ట్, బ్యాక్ రెస్ట్ ఇస్తాయి. అయితే, లెగ్ రూమ్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పొడవెక్కువ ఉండే ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

డ్యాష్ బోర్డులో అధునాతన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు. మునుపటి మోడల్‌లో ఉండే రెండు గొట్టాల్లాంటి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ స్థానంలో ఇప్పుడు ప్లేన్ డిజైన్‌లో వచ్చింది. ఫ్లాట్ బాటమ్ బ్యాగ్రౌండ్ గల మల్టీ ఫంక్షన్ డిస్ల్పే ఉంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త 2017ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లోని 8-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. థర్డ్ జనరేషన్ ఫోర్డ్ సింక్ సెటప్ ఎంతో వివేకవంతమైన సాంకేతక పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. 8-అంగుళాల డిస్ల్పే రియర్ వ్యూవ్ కెమెరా డిస్ల్పేలా కూడా పనిచేస్తుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఇందులోని వివేకవంతమైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. అయితే, ఇందులో న్యావిగేషన్ సిస్టమ్ మిస్సయ్యింది. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా 7-స్పీకర్ ఆడియో సిస్టమ్అనుసంధానం కలదు.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో అధునాతన క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కలదు. టాప్ ఎండ్ వేరియంట్లో రివర్సింగ్ కెమెరా మరియు ప్రారంభ వేరియంట్లో సెన్సార్లు ఉన్నాయి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఇతర ఫీచర్లు అయిన కూల్డ్ గ్లూవ్ బాక్స్, కీ లెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్ మరియు స్టాప్ బటన్, ఆంబియంట్ లైటింగ్, పలు రకాల స్టోరేజ్ ఆప్షన్స్, ఆర్మ్ రెస్ట్ మరియు డోర్ పాకెట్స్ వంటివి నూతన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇంటీరియర్‌లో ప్రత్యేకం అని చెప్పుకోవాలి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

సేఫ్టీ ఫీచర్లు

భద్రత పరంగా సరికొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు(టాప్ ఎండ్ వేరియంట్లో), యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐఎస్ఐఫిక్స్ చైల్డ్ మౌంట్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు స్పీడ్ లిమిటర్ వంటి భద్రత ఫీచర్లు ఉన్నాయి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో వచ్చిన అతి ప్రధానమైన మార్పు, బ్రాండ్ న్యూ మూడు సిలిండర్ల 1.5-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఫోర్డ్ డ్రాగన్ ఫ్యామిలీ ఇంజన్ సిరీస్ నుండి సేకరించిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 121బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త డ్రాగన్ సిరీస్ ఇంజన్‌ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సరికొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. నూతన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ టార్క్ కన్వర్టర్‌లా పనిచేస్తుంది. మరియు మునుపటి డ్యూయల్ క్లచ్ యూనిట్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. నూతన పెట్రోల్ వేరియంట్ ఎకోస్పోర్ట్ లీటర్‌కు 14.8కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఇక డీజల్ వెర్షన్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 97బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఇంజన్ పనితీరు

నూతన 1.5-లీటర్ డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ చెప్పుకోవడానికి మూడు సిలిండర్ల ఇంజన్ అయినప్పటికీ, ఒక్కసారి స్టార్ట్ అయ్యి, జర్నీ ప్రారంభిస్తే దీని నాయిస్, వైబ్రేషన్స్ మరియు హార్ష్‌నెస్(కఠినత్వము) లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. యాక్సిలరేషన్ పెంచేకొద్దీ ఇంజన్ స్మూత్‌గా రెస్పాండ్ అవుతుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఫ్యాక్ట్ షీట్

పరీక్షించిన వేరియంట్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియమ్ ప్లస్ ఆటోమేటిక్
ఇంజన్ 1.5-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్
గేర్‌బాక్స్ 6-స్పీడ్ ఆటోమేటిక్
పవర్ 121బిహెచ్@6,500ఆర్‌పిఎమ్
టార్క్ 150ఎన్ఎమ్@4,500ఆర్‌పిఎమ్
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 52-లీటర్లు
మైలేజ్ 14.8కిమీ/లీ
గ్రౌండ్ క్లియరెన్స్ 200ఎమ్ఎమ్
2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

తీర్పు

సరికొత్త 2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎన్నో అధునాతన ఫీచర్లు వచ్చాయి. అత్యంత శక్తివంతమైన ఇంజన్, అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్ ప్రత్యేకించి ఇండియన్స్‌ను ఆకట్టుకునే రూపాన్ని సొంతం చేసుకుంది. పాత తరం ఎకోస్పోర్ట్‌తో పోల్చుకుంటే సరికొత్త ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ధరకు తగ్గ విలువలను కలిగి ఉంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారీ మార్పులతో వచ్చిన ఎకోస్పోర్ట్ ధర రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే రూ. 30,000 లు అదనంగా ఉంది. ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా ఉంది. ఒకప్పుడు ఫోర్డ్‌కు సంచలనాత్మక విజయాన్ని తెచ్చిపెట్టిన ఎకోస్పోర్ట్ ఇప్పుడు ఇండియన్స్‌కు ఎలా రీచ్ అవుతుందో చూడాలి మరి.

English summary
Read In Telugu: 2017 Ford EcoSport First Drive Review — The Dragon’s Here For Its Throne
X

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more