ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలను పరీక్షించిన డ్రైవ్‌స్పార్క్

Written By:

ఫోర్డ్ ఇండియా గత ఏడాది శక్తివంతమైన, భారీ పరిమాణంలో ఉన్న ఎండీవర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. అప్పటి నుండి అతుకులు, గతుకుల ఇండియన్ రోడ్ల మీద మరియు అనేక స్మార్ట్ అండ్ మెట్రో సిటీల గుండా పరీక్షించబడిన ఫోర్డ్ ఎండీవర్ అచ్చమైన ఆఫ్ రోడింగ్ వెహికల్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

అయితే ఫోర్డ్ ఇండియా ఈ ఎండీవర్ యొక్క ఆఫ్ రోడింగ్ శక్తిసామర్థ్యాలను నిరూపించుకునేందుకు మీడియా డ్రైవ్ నిర్వహించింది. ఇందులో డ్రైవ్‌స్పార్క్ బృందం నుండి అనుభవజ్ఞులైన వెహికల్ పరీక్షకులు స్వయంగా నడిపి తమ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ అనుభవాలను వివరించారు. నేటి కథనం ద్వారా ఆ వివరాలు తెలుగు పాఠకుల కోసం తెలుగులో.....

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

"గ్రీన్ సిటీ ఆఫ్ ది ఇండియా" (బెంగళూరు) నగర వేదికగా ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడ్ ఎక్స్‌ప్లోరింగ్ డ్రైవ్ సాగింది. ఇందులో ఫోర్డ్ ఎండీవర్ లైనప్‌లోని 3.2-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌ గల వేరియంట్ పరీక్షించడం జరిగింది.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

ఫోర్డ్ ప్రకారం ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 197బిహెచ్‌పి పవర్ మరియు 470ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

ఫోర్డ్ ఈ ఎండీవర్‌లో ఇంటెలిజెంట్ ఫోర్ డ్రైవ్ సిస్టమ్ అందించింది. ఇది అవసరాన్ని బట్టి పవర్‌ను కేవలం మూడు లేదా రెండు లేదా ఒక్క చక్రానికి పవర్ సరఫరా చేస్తుంది. వాహనంలోని మూడు చక్రాలు తిరిగినా ముందుకు కదిలే అవకాశం లేనప్పుడు, నడిచే అవకాశం ఉన్న మిగిలిన ఒక్క చక్రానికి మొత్తం పవర్ సరఫరా చేస్తుంది ఈ సిస్టమ్.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

ఏ వాహనం యొక్క ఆఫ్ రోడింగ్ పనితీరును గమనించాలంటే, డ్రైవ్‌కు ముందుగా వాహనాన్ని ఆఫ్ రోడింగ్ కోసం సెట్టింగ్స్ చేయాలి, మేము డ్రైవ్ చేయడానికి ముందు, ఫోర్డ్ ప్రతినిధి వాహనాన్ని పూర్తిగా ఆఫ్ రోడింగ్ డ్రైవ్ కోసం సెట్ చేశాడు.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. కాబట్టి డయల్ రూపంలో ఉన్న మోడ్ సెట్టర్ ద్వారా ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ను ఆఫ్ రోడింగ్ లోకి మార్చడం జరిగింది. అలాగే నిర్ధేశకుడు వాహనాన్ని పూర్తిగా టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లోకి మార్చేసాడు. వివిధ బటన్ల ద్వారా ఫోర్ వీల్ డ్రైవ్ మరియు డిఫరెన్షియల్ లాక్ లను యాక్టివేట్ చేయడం జరిగింది.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

ఫోర్డ్ ఎండీవర్‌లో వివిధ రకాల డ్రైవింగ్‌ మోడ్‌లను ఎంచుకోవడానికి డయల్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. ఇందులో సాధారణ మోడ్ లో ఉన్నప్పుడు ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ 60 శాతం వెనుక చక్రాలకు మరియు 40 శాతం ముందు చక్రాలకు సరఫరా చేస్తుంది. ఇది నగర మరియు కొద్దిగా గరుకు రహదారుల మీద ఈ మోడ్‌లో డ్రైవ్ చేయవచ్చు.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

మా ఈ ఎండీవర్ ఆఫ్ రోడ్ డ్రైవ్‌లో మొదటి చాలెంజ్ నీరు, మట్టి కలయికలో బురదమయమైన రహదారి మీద వెళ్లడం. ఇందుకోసం ఎండీవర్ లోని మోడ్ సెట్టర్ ద్వారా మంచు/మట్టి/పచ్చిక మోడ్‌ను ఎంచుకోవడం జరిగింది. ఈ మోడ్‌లో యాక్సిలరేటర్ స్వల్పంగా అప్లై చేసినప్పటికీ గరిష్ట టార్క్ టైర్లకు చేరి వాహనాన్ని ముందుకు నెడుతుంది.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

ఆఫ్ రోడింగ్ లక్షణాలను పరిశీలించే పరీక్షలో భాగంగా నీరు మట్టి కలయికతో ఉన్న లోతైన గుంటను దాటి వెంటనే ఎడమ వైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ స్నో/మడ్/గ్రాస్ (మంచు/మట్టి/పచ్చిక) మోడ్ ద్వారా ఎలాంటి మొరాయింపు లేకుండా సులభంగా దాటడం జరిగింది.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

తరువాత ఛాలెంజ్ నిటారుగా ఉన్న తలం... మా ఈ ఎండీవర్‌లో మరో కఠినమైన సవాల్ ఈ అప్ ఎహెడ్ టెర్రైన్ ఛాలెంజ్. చూడాగానే కాస్త అపనమ్మకం కలిగింది. అయితే ఇందులోని రాక్ మోడ్ మరియు హిల్ స్టార్ట్, అసిస్ట్ మరియు హోల్డ్ వంటి ఫీచర్ల ద్వారా సునాయసంగా ఈ రోడ్డును అధిగమించడం జరిగింది.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

ఈ సవాలును ఎదుర్కోవడానికి ముందుగా, రాక్ డ్రైవింగ్ (ఎత్తు పల్లాల చేధన కోసం)మోడ్‌ను డయల్ మోడ్ సెలక్టర్ ద్వారా ఎంచుకోవడం జరిగింది. నిజానికి ఈ మోడ్ ఎంచుకోవాలంటే వెహికల్ యొక్క ట్రాన్స్‌మిషన్ న్యూట్రల్‌లో ఉండాలి. తక్కువగా యాక్సిలరేటర్ మీద బరువును పెంచుతూ సునాయసంగా ఈ ఎత్తు పల్లాన్ని అదిగమించడం జరిగింది, ఈ ఛాలెంజ్‌లో ఫోర్డ్ వారి హిల్ హోల్డ్ అసిస్ట్ సిస్టమ్ ద్వారా వాహనాన్ని ఈ వాలు తరం మీద కొన్ని సెకండ్ల పాటు నిలపగలిగాం.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

వాలు తలం మీద కాస్త భయంతో కూడుకున్న సవాలే అని చెప్పవచ్చు. అధిక వేగం వద్ద పల్లపు తలం మీద ప్రయాణిస్తున్నపుడు అదుపు ఖచ్చితంగా ఉండాలి, అందుకోసం ఇందులో స్టీరింగ్ వీల్ మీద హిల్ డిసెంట్ కంట్రోల్ సహాయంతో వేగాన్ని నియంత్రించేందుకు ఓ బటన్ అందివ్వడం జరిగింది.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

తరువాత మేము ఎదుర్కున్న సవాల్ ఇసుకతో కూడిన భూభాగం. సాధారణంగా ఇలాంటి భూబాగాల్లో టైర్లు గిర్రున తిరగుతుంటాయి. ఇందుకోసం ఓ నిర్దష్టమైన గేరు ఎంచుకుని ఇంజన్‌ను ఎక్కువ రైస్ చేస్తుంటాము. తద్వారా వెహికల్ అక్కడే ఉంటుంది తప్పితే ముందుకు కదలదు. అయితే ఇందులోని శాండ్ మోడ్ ఎంచుకోవడం ద్వారా సునాయసంగా ఇసుకతిన్నెలను దాటవేయడం జరిగింది.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

వాలు తలం మీద, వెనుక నుండి ముందు వైపుకు ఉన్న వాలు తలం కాదండోయ్, ఎడమ నుండి కుడివైపుకు ఉన్న వాలు తలం. ఇలాంటి మార్గాలు కూడా చాలానే ఎదురవుతుంటాయి. నిర్దేశకుడు తెలిపిన సూచన మేరకు, ఇంతుకు ముందు తెలిపిన వాలు తలం మీద వాహనాన్ని నిలపమన్నాడు. తరువాత ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ గమనించమన్నాడు. చూస్తే షాక్, వాహనం 23 డిగ్రీలలో వాలుగా ఉంది. తరువాతం తెలిసిన విషయం ఏమిటంటే గరిష్టంగా 35 డిగ్రీ వాలు తలం మీద కూడా ఈ వాహనాన్ని నిర్దిష్టంగా నడపచ్చని.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

తరువాత వచ్చిన సవాలు సుమారుగా 70 డిగ్రీల కోణీయంగా ఉన్న వాలుతలం మీద ప్రయాణం. ఇలాంటి భద్రతను పాటించకుండానే అత్యంత లోతుగా ఉండే తలం మీద డౌన్ హిల్ అసిస్ట్ ద్వారా సురక్షితంగా గ్రౌండ్‌ను చేరుకున్నాము.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

ఎత్తు, లోతు పల్లాలు, ఇసుక మరియు బురద మట్టి రహదారులు అదే విధంగా నీటితో నిండిని గుంటల మీదగా సాగిన మా ఆఫ్ రోడింగ్ ప్రయాణం తరువాత కాస్త విశ్రాంతి తీసుకుని వెంటవెంటనే చిన్న చిన్న గుంతలు వచ్చే తరహాలో రోడ్డుకు కుడి మరియు ఎడమ చక్రం వెళ్లే మార్గంలో గుంతలను తవ్వడం జరింది. ప్రతి ఆఫ్ రోడింగ్ వెహికల్ ఈ మార్గంలో సఫలం చెందాల్సి ఉంటుంది. సౌకర్యవంతంగా ఈ మార్గంలోని రైడ్ పూర్తయ్యింది.

ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

ఆఫ్ రోడింగ్‌లో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన ఎండీవర్ ఎస్‌యూవీ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ ఆన్ రోడ్ ధరలు

  • ఎండీవర్ హైదరాబాద్ ధర రూ. 37,51,658 లు
  • ఎండీవర్ విజయవాడ ధర రూ. 37,47,792 లు
  • ఎండీవర్ విశాఖపట్నం ధర రూ. 37,69,763 లు
  • ఎండీవర్ తిరుపతి ధర రూ. 37,69,763 లు
అన్ని ధరలు ఆన్ రోడ్‌గా ఇవ్వడం జరిగింది.
ఫోర్డ్ ఎండీవర్ ఆఫ్ రోడింగ్ రివ్యూ

నిజానికి మేము నిర్వహించిన ఆఫ్ రోడింగ్ పరీక్షల్లో అన్ని కోణాల్లో కూడా అద్బుతమైన తీరును ప్రదర్శించింది. కళ్లకు కట్టినట్లు చూపే మా ఈ రివ్యూ పట్ల మీ అభిప్రాయాన్ని క్రింద ఉన్న కామెంట్ బాక్స్‌లో వ్యాఖ్యానించగలరు....

మరిన్ని ఫోర్డ్ ఎండీవర్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయగలరు మరియు మీకు నచ్చిన ఎండీవర్ ఫోటోను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోగలరు....

 

English summary
Ford Endeavour Off-Road Prowess Tested — Endeavouring Into The Wild
Story first published: Monday, March 6, 2017, 16:26 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark