ఫోర్డ్ ఫ్రీస్టైల్: ఒక కొత్త మోడల్‌తో సంచలనానికి సిద్దమైన ఫోర్డ్

ఫోర్డ్ ఇండియా దేశీయ క్రాసోవర్ కార్ల పరిశ్రమలోకి ప్రవేశించింది. ఇటీవల ఆవిష్కరించిన ఫోర్డ్ ఫ్రీస్టైల్ అత్యంత ఆకర్షణీయమైన డిజైన్ శైలిలో భారీ అంచనాలతో విడుదలకు సిద్దమైంది. మరి, ఫోర్డ్ ఫ్రీస్టైల్ ధరకు

By Anil Kumar

అమెరికా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్, ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారుతో కాంపాక్ట్ యుటిలిటి వెహికల్ (CUV) అనే సెగ్మెంటుకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకించి దేశీయ మార్కెట్ కోసం అభివృద్ది చేసిన ఫ్రీస్టైల్ కారును భారత్ కేంద్రంగా అంతర్జాతీయ ఆవిష్కరణ చేసింది.

ఫోర్డ్ తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించిన ఫ్రీస్టైల్ కాంపాక్ట్ యుటిలిటి వెహికల్‌ను ఫిగో మరియు ఇకోస్పోర్ట్ మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది. ఫ్రీస్టైల్ క్రాసోవర్ నిజంగానే, పేరుకు తగ్గట్లుగా ఫ్రీ-స్టైల్డ్ (CUV).

ఫోర్డ్ కొత్తగా పరిచయం చేస్తున్న ఫ్రీస్టైల్ క్రాసోవర్ మొదటిసారి కారు కొనేవారికి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్ మరియు ఫ్యామిలీతో సౌకర్యంగా ప్రయాణించే క్యాబిన్, ధరకు తగ్గ విలువలు, ఫీచర్లు మరియు అత్యుత్తమ మైలేజ్ ప్రతి హ్యాచ్‌బ్యాక్ ప్రేమికుడిని కట్టి పడేస్తుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఇండియన్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ డిజైన్ శైలిలో ఉండే విభిన్న ఉత్పత్తులకు డిమాండ్ అధికమవుతోంది. ఇందుకు ఉదాహరణ ప్రతి ఏడాది కూడా ఎస్‌యూవీ లక్షణాలున్న హ్యాచ్‌బ్యాక్ తరహా క్రాసోవర్ కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో ప్రధానంగా టయోటా ఎటియోస్ క్రాస్, ఫియట్ అవెంచురా మరియు హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ వంటి కార్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

2018 ఏడాదికి వచ్చేసరికి ఫోర్డ్ ఇండియా కూడా దేశీయ క్రాసోవర్ కార్ల పరిశ్రమలోకి ప్రవేశించింది. ఇటీవల ఆవిష్కరించిన ఫోర్డ్ ఫ్రీస్టైల్ అత్యంత ఆకర్షణీయమైన డిజైన్ శైలిలో భారీ అంచనాలతో విడుదలకు సిద్దమైంది. మరి, ఫోర్డ్ ఫ్రీస్టైల్ ధరకు తగ్గ విలువలను కలిగి ఉందో... లేదో... చూద్దాం రండి....

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

డిజైన్ మరియు స్టైలింగ్

ఫోర్డ్ వారి కైనటిక్ డిజైన్ లాంగ్వేజ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారుకు ఒక కొత్త రూపాన్నిచ్చింది. ఏదేమైనప్పటికీ ఫ్రీస్టైల్ ఎక్ట్సీరియర్ ప్యానల్స్ ఫిగో లక్షణాలను కప్పి ఉంచుతున్నాయి. అయినప్పటికీ అసలైన CUV గా గుర్తింపు తెచ్చుకునేందుకు విభిన్నమైన స్టైలింగ్ అందివ్వడం జరిగింది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ఫ్రీస్టైల్ గ్రౌండ్ క్లియరెన్స్ 190ఎమ్ఎమ్‌గా ఉంది, ఫిగో కంటే 16ఎమ్ఎమ్ అధికంగా ఉండటం దీని ప్రత్యేకత. దేశీయ దిగ్గజ ఎస్‌యూవీ బ్రాండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 గ్రౌండ్ క్లియరెన్స్ 200ఎమ్ఎమ్‌గా ఉంది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ CUV లో అధునాతన 15-అంగుళాల 4-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సాధారణంగా 4-స్పోక్ అల్లాయ్ వీల్స్ కార్లలో చాలా అరుదుగా ఉంటాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఫ్రంట్ స్టైలింగ్ కోసం ఫోర్డ్ ఫ్రీస్టైల్ కారులో హనీకాంబ్ బ్లాక్ గ్రిల్ డిజైన్ కలదు, ఫిగో కారుతో పోల్చుకుంటే ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. ఫిగో నుండి సేకరించిన స్పెషలైజ్డ్ స్మోక్ ఎఫెక్ట్ గల హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఆఫ్ రోడింగ్ లక్షణాలను పెంచేందుకు సిల్వర్ స్కిడ్ ప్లేట్ మరియు కారు చుట్టూ బాడీ అంచుల వద్ద ఫాక్స్ క్లాడింగ్ కలదు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

సైడ్ ప్రొఫైల్ కారు యొక్క అసలైన ఎత్తుకు నిదర్శనం. చక్రాలకు మరియు బాడీకి మధ్య కొద్దిగా గ్యాప్ ఉంది. ఏమైనప్పటికీ, ఫోర్డ్ ఫ్రీస్టైల్ ప్రాథమిక కొలతలు ఫిగో కారును పోలి ఉంటాయి. వీల్ ఆర్చెస్‌కు సమాతరంగా ఫ్రంట్ డోర్ వద్ద మొదలయ్యి, రియర్ టెయిల్ ల్యాంప్ వద్ద అంతమయ్యే క్యారెక్టర్ లైన్స్ ఫ్రీస్టైల్ సైడ్ ప్రొఫైల్‌కు చక్కటి రూపాన్ని తీసుకొచ్చాయి.

అదనంగా ఫోర్డ్ ఫ్రీస్టైల్ రూఫ్ రెయిల్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి, ఇవి కేవలం అలంకార ప్రాయంగా కాకుండా వీటి మీద లగేజ్ తీసుకెళ్లడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఫ్రీస్టైల్ కారులో ఇరువైపులా బ్లాక్ గ్రాఫిక్స్, మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఫోర్డ్ ఫ్రీస్టైల్‌లో సరికొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఉంది. కానీ, దాని కాంతి ఎల్ఇడి లైట్లతో కాకుండా సాధారణ లైట్లతోనే వస్తుంది. స్కిడ్ ప్లేట్ మరియు ఫాక్స్ క్లాడింగ్‌తో సహా రియర్ బంపర్ డిజైన్ అచ్చం ఫ్రంట్ బంపర్‌నే పోలి ఉంటుంది. అన్ని అంశాల పరంగా చూసుకుంటే ఫోర్డ్ ఫ్రీస్టైల్ స్టైల్ మరియు కండలు తిరిగిన రూపం రెండింటిని కలిగి ఉంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఇంటీరియర్

ఫ్రీస్టైల్ ఎక్ట్సీరియర్ తరహాలోనే ఇంటీరియర్ కూడాఫిగో శైలిలో ఉంది. ప్రాథమిక ఫ్రీస్టైల్ ఇంటీరియర్ ఫిగోను పోలి ఉంటుంది. అయితే, విశాలమైన క్యాబిన్, ఫీచర్లు మరియు స్వల్ప మార్పు చేర్పులు దీని సొంతం.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఇంటీరియర్ డ్యాష్ బోర్డ్ బ్లాక్ కలర్ మీద చాకోలేట్ ఫినిషింగ్‌ థీమ్‌లో ఉంది, అయితే ఇది ఫ్రీస్టైల్ క్యారెక్టర్ లక్షణాలను కలిగి ఉంది. గొప్ప అనుభూతినిచ్చే ధృడమైన మెటీరియల్‌తో డ్యాష్ బోర్డును తయారు చేసారు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

స్టీరియో మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఇంటీరియర్‌లో 6.5-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ (ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మిడ్ వేరియంట్లో ఉన్నటువంటి) కలదు. సింక్3 ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ అనుసంధానం గల 6.5-ఇంచ్ టచ్‌‌స్క్రీన్ సిస్టమ్ ఉంది. డ్యాష్ మీద కంటికి సమాంతరంగా ఉంటుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఫోర్డ్ నుండి ఆశించినట్లుగానే, ఇంటర్‌ఫేస్ మరియు సిస్టమ్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పటి వరకు 10 లక్షల లోపు కార్లలో వచ్చినటువంటి బెస్ట్ మరియు మోస్ట్ రెస్పాన్సివ్ ఇన్ఫో‌టైన్‌మెంట్ సిస్టమ్ ఇదే.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సులభంగా మరియు వేగంగా బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌ను దీనితో కనెక్ట్ చేసుకోవచ్చు. అదనంగా ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లు స్డాండర్డ్‌గా వచ్చాయి. డ్రైవింగ్ చేసేటపుడు మన దిశను తెలుసుకోవడానికి ఇందులో కంపాస్ (దిక్సూచి) కూడా ఉంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

సౌకర్యం మరియు బూట్ స్పేస్

ఫ్రీస్టైల్ యొక్క ఎత్తు కారణంగా పలు ప్రదేశాల్లో స్పేస్ బాగా కలిసొచ్చింది. ఫ్రీస్టైల్ ఇంటీరియర్‌లో ఎన్నో రకాల స్టోరేజ్ స్పేస్‌లు ఉన్నాయి. గ్లూవ్ బాక్స్, డోర్ బిన్స్, కప్పులు మరియు మొబైల్ ఫోన్ల కోసం సీట్ల మధ్య స్టోరేజ్ స్పేస్‌లు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఫోర్డ్ ఫ్రీస్టైల్ అత్యంత ప్రయోనకరంగా ఉంటుంది, స్టాండర్డ్ క్లాత్ మ్యాట్లు కాకుండా రబ్బరు మ్యాట్లు మరియు మనసుకు ఆహ్లాదాన్ని పంచే సౌకర్యవంతమైన ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

క్యాబిన్‌లోని వెనుక వరుస సీటింగ్ వద్ద అత్యంత సౌకర్యవంతంగా విశాలంగా ఉంటుంది. అంతే కాకుండా సౌకర్యవంతమైన జర్నీ కోసం ఎత్తైన సీటింగ్ కలదు. అయితే, పొడుగు ప్రయాణికులకు ఫ్రీస్టైల్ కాస్త కష్టతరంగా ఉండవచ్చు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

లగేజ్ స్పేస్ విషయానికి వస్తే, 257-లీటర్ల లగేజ్ స్పేస్ కలదు, ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో కూడా ఇంతే స్పేస్ ఉంది. వెనుక సీటును మలిపివేయడంతో బూట్ స్పేస్ పెంచుకోవచ్చు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఇంజన్, పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ అనుభవం

ఫోర్డ్ ఫ్రీస్టైల్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఫోర్డ్ వారి నూతన డ్రాగన్-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 95-హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఫోర్డ్ ఫ్రీస్టైల్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఫోర్డ్ వారి నూతన డ్రాగన్-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 95-హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఫ్రీస్టైల్ పెట్రోల్ యూనిట్‌లో సరికొత్త గేట్రాగ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇందులో ఉంది. అయితే, ఈ పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించడం లేదు.

గేట్రాగ్: గేట్రాగ్ ప్రపంచపు అతి పెద్ద ప్యాసింజర్ కార్లు మరియు వాణిజ్య వాహనాలకు అవసరమయ్యే ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ సరఫరా చేసే సంస్థ. గేట్రాగ్ మూడు సంస్థలతో ఉమ్మడి భాగస్వామ్యం కలిగి ఉంది. అందులో ఒకటి ఫోర్డ్ మోటార్స్-గేట్రాగ్ భాగస్వామ్యం ఒకటి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

కొత్త ఇంజన్ ఫోర్డ్ ఫ్రీస్టైల్ కారును 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన మోడల్‌గా నిలిచింది. డీజల్ వెర్షన్‌లో 100హార్స్‌పవర్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ మరియు ఇకోస్పోర్ట్‌లో ఉంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో నిర్మించడంతో ఫ్రీస్టైల్ ఎత్తు ఎక్కువగానే ఉంటుంది, దీంతో ఎలాంటి ఎత్తున్నవారైనా సరే రోడ్డును చక్కగా పరిశీలించవచ్చు. డ్రైవింగ్ డైనమిక్స్ చక్కగా ఉండటంతో ప్రతి ఒక్కరూ ఫ్రీస్టైల్‌ను డ్రైవ్ చేయడానికి ఉసిగొల్పుతుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

స్మూత్‌గా రన్ అయ్యే ఇంజన్ గరిష్టంగా 6800ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగాన్ని అందుకోవడంలో ప్రోత్సహిస్తుంది. మేము డ్రైవ్ చేసిన మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వెర్షన్. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కావడంతో డ్రైవింగ్ చాలా ఫన్ క్రియేట్ చేస్తుంది. 3000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగంతోనే ఎలాంటి ఎత్తైన రోడ్లనైనా, కఠినమైన మలుపులనైనా సునాయసంగా అధిగమిస్తుంది. తేలికగా కదిలే క్లచ్ ఉండటంతో ఫ్రీస్టైల్‌ను సులభంగా డ్రైవ్ చేయవచ్చు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఫోర్డ్ విక్రయిస్తున్న ఇతర మోడళ్లతో పోల్చుకుంటే ఫ్రీస్టైల్ పదునైన హ్యాండ్లింగ్ మరియు హై లెవల్ భద్రతను అందించింది. ఎలక్ట్రిక్ పవర్ సాయంతో స్టీరింగ్ టిల్ట్ ఉండటంతో రోడ్డు అవసరాలకు అనుగుణంగా వెయిట్ బ్యాలెన్సింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు మరే ఇతర క్రాసోవర్ కార్లలో రానటువంటి పటిష్టమైన రోడ్ గ్రిప్ దీని సొంతం.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఎలాంటి వేగం వద్దనైనా మలుపులను సులభంగా అధిగమిస్తుంది మరియు మట్టి రోడ్లు, గుంతలు మరియు పదునైనా రహదారులను సునాయసంగా ఛేదిస్తుంది. అద్భుతమైన డ్రైవింగ్‌కు సహకరించే ఫోర్డ్ ఫ్రీస్టైల్‌లో ఉన్న అండర్‌బాడీ టెక్నాలజీ మరియు ఫీచర్లను చూద్దాం రండి....

  • చక్రాలు దొర్లడాన్ని నివారించడానికి యాంటీ రోల్ఓవర్ ప్రివెన్షన్ సిస్టమ్ ఉంది. ఇది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం సాయంతో బ్రేకింగ్ పవర్‌ను విభజించి కారులో వేరు వేరు చక్రాల మీద వ్యక్తి గతంగా ఉన్న డ్రైవ్ టార్క్ తగ్గించి చక్రాలు రోల్ అవ్వడాన్ని నియంత్రిస్తుంది.
  • 15-అంగుళాల వీల్స్‌కు అత్యుత్తమ పటిష్టమున్న 185/60 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి.
  • ఫిగోతో పోల్చుకుంటే పొడవాటి స్ప్రింగులు ఉన్న మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్ కలదు.
  • ధృడమైన యాంటీ-రోల్‌బార్
  • ఫిగోతో పోల్చుకుంటే 30ఎమ్ఎమ్ విశాలమైన ట్రాక్.
  • రైడ్ హైట్ 190ఎమ్ఎమ్ వరకు పెరిగింది.
  • బ్రేకింగ్ విధుల కోసం ఖచ్చితమైన పనితీరను కనబరిచే ఫ్రంట్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. బ్రేక్ పెడల్ విషయానికి వస్తే, అత్యుత్తమ స్టాపింగ్ పవర్ కలిగి ఉంది. ఓవరాల్‌గా ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఒక ధృడమైన కాంపాక్ట్ యుటిలిటి వెహికల్‌గా నిరూపించుకుంది.

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ స్పెసిఫికేషన్స్

    Model Petrol Diesel
    Engine 1.2-litre naturally-aspirated 3-cylinder 1.5-litre turbocharged 4-cylinder
    Displacement (cc) 1194 1498
    Power (bhp) 94.7 98.6
    Torque (Nm) 120 215
    Transmission 5-speed manual 5-speed manual
    Mileage (km/l) 19 24.4
    Tyre Size 185/60 R15 185/60 R15
    ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ వేరియంట్లు, మైలేజ్ మరియు రంగులు

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతుంది. అవి, ఆంబియంట్, ట్రెండ్, టైటానియం మరియు టైటానియం ప్లస్. ఫ్రీస్టైల్ ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది. అవి, కేన్‌యాన్ రిడ్జ్, మూన్‌డస్ట్ సిల్వర్, స్మోక్ గ్రే, వైట్ గోల్డ్(మేము నడిపి పరీక్షించిన కారు), ఆక్స్‌ఫర్డ్ వైట్ మరియు అబ్సల్యూట్ బ్లాక్.

    ఏఐర్ఏఐ కథనం మేరకు, ఫ్రీస్టైల్ పెట్రోల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 19కిలోమీటర్లు మరియు డీజల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 24.4కిలోమీటర్లుగా ఉంది. పెట్రోల్ వెర్షన్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 42-లీటర్లు మరియు డీజల్ వేరియంట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 40లీటర్లుగా ఉంది.

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

    సేఫ్టీ మరియు ప్రధాన ఫీచర్లు

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, కీలెస్ ఎంట్రీ, అప్రోచ్ సెన్సార్లు, దొంగలబారి నుండి కారును రక్షించే పెరీమీటర్ థెప్ట్ అలారమ్, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు గంటకు 15కిమీల వేగం ఉన్నపుడు ఆటోమేటిక్ రీలాక్ అయ్యే ఫీచర్ తప్పనిసరిగా ఉంది.

    అంబియంట్ మినహా, అన్ని వేరియంట్లలో రివర్స్ పార్కింగ్ కెమెరా, ఫోర్డ్ ఫ్రీస్టైల్ టాప్ ఎండ్ వేరియంట్లో యాక్టివ్ రోల్ఓవర్ ప్రొటెక్షన్(ARP), సైడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగులు మరియు ఎమర్జెన్సీ అసిస్టెన్స్ వంటి అదనపు భద్రత ఫీచర్లు ఉన్నాయి.

    ఫోర్డ్ ఫ్రీస్టైల్‌లో ఉన్న ఇతర ఫీచర్లలో పవర్ ఫోల్డ్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు, ఎలక్ట్రోక్రోమిక్ ఇన్‌సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్ మరియు ఫోర్డ్ మైకీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

    యాక్ససరీలు మరియు వారంటీ

    ఇప్పటి వరకే మరే ఇతర క్రాసోవర్ కార్లలో రానటువంటి ఎక్ట్సీరియర్ యాక్ససరీలు ఎన్నో ఉన్నాయి. అందులో, బాడీ స్ట్రిప్ కిట్, డిఫరెంట్ రూఫ్ కలర్, సీటు కవర్లు, సన్ బ్లైండ్స్, రియర్ స్పాయిలర్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు స్లిమ్‌లైన్ వెథర్ షీల్డ్ వంటివి ఉన్నాయి.

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

    ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఇంజన్ అండర్ షీల్డ్, యాంటీ థెఫ్ట్ నట్లు, నెక్ రెస్ట్ మరియు పిల్లో, రియర్ వ్యూవ్ కెమెరా, రూఫ్ రెయిల్స్, స్మార్ట్ ఆంబియంట్ లైటింగ్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటివి అదనపు యాక్ససరీలు ఉన్నాయి.

    వారంటీ విషయానికి వస్తే, రెండేళ్ల పాటు లేదా 100,000కిలోమీటర్ల వరకు ఏది ముందైతే దానికి వారంటీ లభిస్తుంది. వివిధ రకాల వారంటీ మరియు సర్వీస్ పొడగింపు ప్లాన్లు కూడా ఉన్నాయి.

    100,000 కిలోమీటర్లకు ముందుగా నిర్ణయించిన సర్వీస్ ధరలు

    పెట్రోల్

    మొత్తం ధర: రూ. 41,000

    కిలోమీటరుకు: 41 పైసలు

    డీజల్

    మొత్తం ధర: రూ. 51,000

    కిలోమీటరుకు: 51 పైసలు

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

    పోటీదారులు

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ విపణిలో ఉన్న టయోటా ఎటియోస్ క్రాస్ మరియు హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుతానికి, ఈ సెగ్మెంట్లో ఫ్రీస్టైల్ కారుదే పైచేయి అని చెప్పవచ్చు. పోటీదారులతో సహా ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఎంత వరకు మెరుగైనదో క్రింది పట్టిక ద్వారా చూద్దాం రండి....

    Model Displacement (cc) Power/Torque (bhp/Nm) Mileage (km/l)
    Ford Freestyle 1194 94.7/120 19

    Hyundai

    i20 Active
    1197 81.9/114.7 15

    ToyotaEtios Cross 1197 79/104 17.71

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

    తీర్పు

    ప్రతి దానిలో మంచి అంశాలు ఉన్నట్లే, చెడు అంశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ, డిజైన్, స్టైలింగ్, ఫీచర్లు మరియు భద్రత పరంగా అన్ని ప్రశ్నలకు టిక్ మార్క్ పడింది. మరియు ఫోర్డ్ ఫిగో శైలిలోనే ఫ్రీస్టైల్ కూడా ప్రతి డ్రైవర్‌ను తన అద్వితీయమైన పనితీరుతో బాగా ఆకట్టుకుంటుంది.

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    ఫోర్డ్ తొలిసారిగా ప్రయత్నించిన క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్ ఫ్రీస్టైల్ చాలా బాగా ఆకట్టుకుంది. మరియు ఈ సెగ్మెంట్లో ఒక కొత్త గాలిని ప్రవహింపజేసింది. అన్నింటికంటే పోటీదారులను ఎదుర్కోగల అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం. నగర మరియు గ్రామీణ ఎలాంటి రహదరాల్లోనైనా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా ప్రయాణిస్తుంది. ఎలాంటి చింత లేకుండా ధైర్యంగా ఫ్రీస్టైల్ కారును ఎంచుకోవచ్చు.

    ఫోర్డ్ ఫ్రీస్టైల్ గురించి ముఖ్యమైన అంశాలు

    • విడుదల అంచనా: ఏప్రిల్ మధ్య భాగానికి
    • ధర అంచనా: రూ. 6 నుండి 9 లక్షలు (ఆన్-రోడ్)
    • బుకింగ్ ధర: రూ. 21,000 లు
    • డెలివరీలు: జూన్ 2018 నుండి ప్రారంభమవుతాయి

Most Read Articles

English summary
Read In Telugu: Ford Freestyle Review — From The Land Of The Free, To The Hands Of The Brave!
Story first published: Wednesday, April 11, 2018, 16:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X