ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్: అరుదైన అవకాశం కల్పించిన జాగ్వార్

Written By:

ఆర్ట్ ఆఫ్ ఫర్పామెన్స్ టూర్ పేరుతో కార్లను టెస్ట్ డ్రైవ్ చేసి, ప్రత్యక్ష అనుభవంతో వాటి పనితీరును పరిశీలించే అవకాశాన్ని జాగ్వార్ కల్పించింది. దేశీయంగా బెంగళూరులో రెండవ సారి జాగ్వార్ ఈ ఆర్ట్ ఆఫ్ ఫర్పామెన్స్ టూర్ నిర్వహించింది. దీనికి డ్రైవ్‌స్పార్క్ బృందాన్ని కూడా జాగ్వార్ ఆహ్వానించింది.

జాగ్వార్ లగ్జరీ కార్ల డ్రైవింగ్, స్పీడింగ్ మరియు బ్రేకింగ్ వంటి అంశాల స్వీయ అనుభవం ఇవాళ్టి టెస్ట్ డ్రైవ్ కథనంలో మీ కోసం....

జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు టీం ఇప్పటికే అనేక జాగ్వార్ లగ్జరీ కార్లను పరీక్షించింది. ఇప్పుడు జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్ ఈవెంట్‌లో ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ సెడాన్ కార్లతో పాటు జాగ్వార్ తొలి ఎస్‌యూవీ ఎఫ్-పేస్ ను కూడా టెస్ట్ డ్రైవ్ చేసి పరీక్షించడం జరిగింది.

Recommended Video - Watch Now!
2018 Bentley Continental GT Revealed | In Telugu - DriveSpark తెలుగు
జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్

జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ రెండు లగ్జరీ సెడాన్ కార్లలో 2.0-లీటర్ సామర్థ్యం గల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 237బిహెచ్‌పి పవర్ మరియు 340ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ లలో పవర్ మొత్తం వెనుక చక్రాలకు అందుతుంది.

జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్

జాగ్వార్ విడుదల చేసిన తొలి ఎస్‌యూవీ ఎఫ్-పేస్ లో 3.0-లీటర్ సామర్థ్యం గల టుర్భో చార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యూవీ గరిష్టంగా 296బిహెచ్‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగలిగింది. ఇది గరిష్టంగా 1.9 టన్నుల బరువు ఉన్నప్పటికీ, గరిష్టంగా వేగం వద్ద ఒక కార్నర్ నుండి మరో కార్నర్‌కు ఎంతో సునాయసంగా చేరుకుంది.

జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్

ఎక్స్‌పీరియన్ డ్రైవింగ్ సెక్షన్‌లో, కారు అధిక వేగంలో ఉన్నపుడు రోడ్డు మీద ఒక లైన్ నుండి మరో లైన్‌కు సురక్షితంగా మారడం గురించి జాగ్వార్ ప్రతినిధి వివరించారు. ఈ అనుభవం రోజు వారి సిటీ రైడింగ్‌ను గుర్తు చేసింది. ఈ కార్లు సిటి డ్రైవ్‌కు కూడా చక్కగా సెట్ అవుతాయని నిరూపించకున్నాయి.

జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్

బయటి నుండి చూడటానికి జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ సెడాన్ కార్లు చాలా పొడవుగా ఉంటాయి. డ్రైవింగ్‌లో అధిక వేగం మీద ఉన్నపుడు వెనుక సీటులో ప్రయాణిస్తున్నపుడు కారు పొడవు ఖచ్చితంగా ఎందుకు అవసరమనే విషయం తెలుస్తుంది. సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు ఫన్ డ్రైవ్ కావాలంటే కారు పొడవు ఎంతో కీలకం...

జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్

జాగ్వార్ ఎఫ్-పేస్ 3-లీటర్ల డీజల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే కాదు, తమ మునుపటి వెర్షన్ ఎక్స్‌జెఎల్ లగ్జరీ సెడాన్‌లో ఉపయోగించిన 2.0-లీటర్ సామర్థ్యం గల టుర్భో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభిస్తోంది.

జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్

డీజల్ ఎఫ్-పేస్‌తో పోల్చుకుంటే పెట్రోల్ వేరియంట్ ఎఫ్-పేస్ చాలా చురకైనదని నిరూపించబడింది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రతి చిన్న అవరోధాన్ని అలవోకగా అధిగమించింది.

జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్

ఇక ఎక్స్ఇ సెడాన్ విషయానికి వస్తే, ఈ కార్యక్రమంలో ఊహించని పనితీరును కనబరించి అన్నింటికన్నా నాలుగు ఎక్కువ మార్కులే పొందింది. స్టీరింగ్ వీల్ చిన్నగా ఆపరేట్ చేస్తూనే లైన్ చేంజ్ అవ్వడం మరియు బ్రేక్ టచ్ చేయకుండానే స్పీడ్ మొత్తం తగ్గిపోయి కారు ఆగిపోవడం వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్

బెంగళూరులో జాగ్వార్ నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్ డ్రైవ్‌తో ముగిసింది.

జాగ్వార్ ఎఫ్-టైప్ కన్వర్టిబుల్ లగ్జరీ స్పోర్ట్స్ వి8 ఎస్ ట్రిమ్ కారులో 5.0-లీటర్ సామర్థ్యం ఉన్న సూపర్‌ఛార్జ్‌డ్ వి8 ఇంజన్ కలదు. దీనికి అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గుండా ఇంజన్ ఉత్పత్తి చేసే 488బిహెచ్‌పి పవర్ మరియు 625ఎన్ఎమ్ టార్క్ వెనుక చక్రాలకు చేరుతుంది.

జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్

రన్ వే మీద డ్రైవ్ చేస్తున్నపుడు ఇంజన్ వేగం(RPM) పెరిగే కొద్దీ సైలన్సర్ నుండి పెద్ద శబ్దాన్ని చేసుకుంటూ, నిజంగా ఒక జెట్ విమానంలా దూసుకెళ్లింది. ఇలాంటి శబ్దం రావడానికి ప్రధాన కారణం సూపర్ కార్లలో ఉన్న సూపర్‌ఛార్జ్‌డ్ ఇంజన్.

జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్

జాగ్వార్ ఎఫ్-టైప్ కేవలం 4 సెకండ్ల వ్యవధిలోపే గంటకు 100కిలోమీట్ల వేగాన్ని అందుకుని, గరిష్టంగా 240 నుండి 250 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. వేగం పుంజుకునే సమయంలో వచ్చే శబ్దం, ఓ నిర్ధిష్ట వేగాన్ని చేరుకున్న తరువాత తగ్గిందని చెప్పాలి. బ్రేకులు వేయాల్సిన అవసరం వచ్చినపుడు కొద్దిగా అప్లే చేయడం ద్వారా కారు వేగం కంట్రోల్‌లోకి వచ్చింది. అయితే, సూపర్ కార్ లక్షణాలను మరవకుండా ఇంజన్ అలాగే గర్జిస్తూ ఉంది.

జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జాగ్వార్ ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్ పేరుతో తమ లైనప్‌లోని దాదాపు అన్ని కార్ల డ్రైవింగ్ అనుభవాన్నికస్టమర్లకు అందించింది. లగ్జరీ(ఎక్స్ఇ, ఎక్స్ఎఫ్ మరియు ఎక్స్‌జెఎల్ ), లైఫ్ స్టైల్ వేరియంట్(ఎఫ్-పేస్) మరియు స్పోర్ట్స్(ఎఫ్-టైప్) వంటి మోడళ్ల పనితీరు మరియు సామర్థ్యాలను రన్ వే మీద పరీక్షించే అవకాశాన్ని కల్పించింది. భారత్‌లో జాగ్వార్ నిర్వహించిన రెండవ పర్ఫామెన్స్ టూర్ ఇది.

English summary
Read In Telugu: Jaguars On The Prowl In The Garden City — Exploring The Art Of Performance
Story first published: Tuesday, September 19, 2017, 18:03 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark