జాగ్వార్ ఎక్స్ఇ 20డి రివ్యూ: అన్నింటా అద్భుతమే...!!

2016లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో జాగ్వార్ సరికొత్త ఎక్స్ఇ(XE) కారును తొలిసారిగా ఆవిష్కరించింది. తొలుత ఎక్స్ఇ కేవలం 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభించేది. ఇప్పుడు, జాగ్వార్ ఇదే ఎక్స్ఇ లగ్జరీ సెడాన్‌

By Anil Kumar

2016లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో జాగ్వార్ సరికొత్త ఎక్స్ఇ(XE) కారును తొలిసారిగా ఆవిష్కరించింది. తొలుత ఎక్స్ఇ కేవలం 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభించేది. ఇప్పుడు, జాగ్వార్ ఇదే ఎక్స్ఇ లగ్జరీ సెడాన్‌లో డీజల్ ఇంజన్ పరిచయం చేసి ఎక్స్ఇ 20డి వేరియంట్‌ను సరసమైన ధరలో లాంచ్ చేసింది.

Recommended Video

Cars Owned By Indian Celebrities - DriveSpark
జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సిటీ మరియు హైవే రోడ్ల మీద పరీక్షించి జాగ్వార్ ఎక్స్ఇ 20డి నిజంగానే పర్ఫామెన్స్ కోసం పుట్టిందో లేదో తెలుసుకోవడానికి జాగ్వార్ తమ ఎక్స్ఇ 20డి ప్రెస్టీజ్ మోడల్ కారును డ్రైవ్‌స్పార్క్ తెలుగు బృందానికి ప్రత్యేక అవకాశం కల్పించింది.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి కంప్లీట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ఇవాళ్టి కథనంలో...

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఎక్ట్సీరియర్

జాగ్వార్ తమ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్ కారును స్పోర్టివ్ మరియు పర్ఫామెన్స్ ప్రియులను ఆకుట్టుకునేలా సెగ్మెంట్ మొత్తం మీద బెస్ట్ డిజైన్ అంశాలతో జాగ్వార్ డిజైనింగ్ టీమ్ ఎంతో చక్కగా రూపొందించింది. ఎలిగెన్స్ మరియు స్పోర్టివ్ లక్షణాలతో ఎంతో చుక్కటి రూపాన్ని సొంతం చేసుకుంది.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

జాగ్వార్ ఎక్స్ఇ ఫ్రంట్ డిజైన్‌లోని బానెట్ మీద క్యారెక్టర్ లైన్స్ కండలు తిరిగిన రూపాన్ని ప్రతిబింబించాయి. ఫ్రంట్ గ్రిల్ క్రిందుగా పెద్ద పరిమాణంలో ఉన్న ధృడమైన బంపర్ సెటప్ ఉంది. ఆధునిక జాగ్వార్ కార్లలో తరచుగా వస్తున్న పెద్ద పరిమాణంలో విశాలమైన గ్రిల్ మరియు జాగ్వార్ లోగో ఎక్స్ఇ సెడాన్‌లో హైలెట్‌గా నిలిచాయి.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సరికొత్త జాగ్వార్ ఎక్స్ఇలో పగటి పూట వెలిగే నూతన ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. ఇతర జాగ్వార్ ఎస్‌యూవీ మరియు సెలూన్ కార్లలో ఉన్న కర్వీ మరియు ఎడ్జులు ఉన్న హెడ్‌ల్యాంప్స్ తరహా కాకుండా క్లీన్ డిజైన్‌ హెడ్‌లైట్లు న్యూ ఎక్స్ఇలో వచ్చాయి. అయితే, కార్నరింగ్ లైట్లు ఇందులో మిస్సయ్యాయి.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఎక్స్ఇ సైడ్ డిజైన్‌ గమనిస్తే, జాగ్వార్ ఎక్స్ఇ సెలూన్ యొక్క ఏరోడైనమిక్ డిజైన్ లక్షణాలను స్పష్టంగా గమనించవచ్చు. ఓవరాల్‌గా ఎక్స్ఇ ఫ్రంట్ డిజైన్‌ చాలా క్రిందకు ఉంటుంది. రియర్ డిజైన్ నుండి ముందు వైపుకు వచ్చే క్యారెక్టర్ మరియు షోల్డర్ లైన్లు ఎక్స్ఇ కారుకు మంచి సెలూన్ లుక్ తీసుకొచ్చాయి. ఎక్ట్సీరియర్ డిజైన్‌లో పలు క్రోమ్ సొబగులు ఉన్నాయి.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

జాగ్వార్ పేరు ప్రింట్ చేయబడిన ఇలాంటి స్పెషల్ ఎయిర్‌వెంట్ డిజైన్‌లు దాదాపు అన్ని జాగ్వార్ కార్లలో గుర్తించవచ్చు. చక్రాలు తిరిగే ప్రదేశంలోకి చేరే గాలిను సులభంగా బయటకు నెట్టేసేలా ఇవి డిజైన్ చేయబడ్డాయి.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రియర్ డిజైన్ చాలా ఎత్తుగా ఉంది. పెద్ద పరిమాణంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్‌కు మధ్యలో నెంబర్ ప్లేట్ బోర్డు, దానికి పైన జాగ్వార్ లోగోను ఇముడింపజేశారు. పెద్ద పరిమాణంలో ఉన్న రియర్ బంపర్‌ను చాలా ఆకర్షణీయంగా ఫైబర్ గార్నిష్ చేశారు. జాగ్వార్ ఎక్స్ఇలో కూడా డ్యూయల్ టిప్-ఎగ్జాస్ట్ సెటప్ కలదు.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

జాగ్వార్ ఎక్స్ఇ 20డి టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌లో జాగ్వార్ ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్స్ కారు ఎఫ్-టైప్ నుండి సేకరించిన టెయిల్ లైట్లను అందించారు.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంకా ఇందులో స్పోర్టివ్ తత్వం లేదనుకునే వారి కోసం డక్‌టెయిల్ రియర్ స్పాయిలర్ అందించారు. స్పోర్టివ్ మరియు ఏరోడైనమిక్ డిజైన్ అంశాల పర్ఫెక్ట్ మేళవింపు ఈ జాగ్వార్ ఎక్స్ఇ.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంటీరియర్

జాగ్వార్ ఎక్స్ఇ ఇంటీరియర్‌లోకి వెళ్లగానే ఎన్నో అత్యాధునిక ఫీచర్లు మీకు స్వాగతం పలుకుతాయి. సౌకర్యం మరియు లగ్జరీ ఫీల్‌కు ప్రతీకగా ఉంటుంది. సెంటర్ కన్సోల్ అచ్చం జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యూవీని పోలి ఉంటుంది. స్టార్ట్/స్టాప్ బటన్ మరియు క్లైమేట్ కంట్రోల్ ప్యానల్ వంటి ఎన్నో కంట్రోల్స్ కోసం పలు రకాల బటన్స్ వచ్చాయి.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంటీరియర్‌లో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే అంశం జాగ్వార్ డ్రైవ్ కంట్రోల్. ఫ్లోటింగ్ డ్యాష్ నుండి సెంటర్ కన్సోల్ వరకు చక్కటి రూపంలో ఫినిషింగ్ చేశారు. ఎన్నాళ్లయినా పాతబడని ఫీచర్లలో రోటరీ డయల్ డ్రైవ్ కంట్రోల్ ఒకటి.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డ్యాష్‌బోర్డ్ లోని డిస్ల్పే దగ్గరికి వస్తే, ఎక్స్ఇలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సంగీత ప్రియులను ఆకట్టుకునే మేరేడియన్ మ్యూజిక్ సిస్టమ్ మంచి అనుభూతినిస్తుంది. మధ్యలో ఉన్న గ్లూవ్ బాక్స్‌ను చాలా సులభంగా ఆపరే‌ట్ చేయవచ్చు, కానీ సరైన ప్రదేశంలో అందివ్వలేకపోయారు.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

జాగ్వార్ ఎక్స్ఇలోని ఫ్రంట్ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అత్యుత్తమ సపోర్ట్ మరియు విశాలమైన లెగ్ రూమ్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే, డ్రైవర్ సీటుకు మాత్రమే సీట్ అడ్జెస్ట్‌మెంట్ గుర్తుంచుకునే మెమొరీ ఫంక్షన్ ఉంది.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రియర్ సీట్ ప్యాసింజర్ల కోసం విశాలమైన లెగ్ రూమ్ ఉన్నప్పటికీ, పొడవుగా ఉన్న ప్యాసింజర్లకు కావాల్సినంత హెడ్ రూమ్ కల్పించడంలో జాగ్వార్ కొద్దిగా విఫలమైందని చెప్పాలి. జాగ్వార్ ఎక్స్ఇ 5-సీటర్ అయినప్పటీ రియర్ సీట్ ఇద్దరికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

జాగ్వార్ ఎక్స్ఇ 20డిలో 300-లీటర్ల కెపాసిటి గల డిక్కీ స్పేస్ ఉంది. బూట్ డోర్ ఓపెన్ చేస్తే డిక్కీలోని ఫ్లోర్ మీద స్పేస్-సేవర్ స్పేర్ వీల్ ఉంది.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

గాలి మరియు వెలుతురు కారులోకి వచ్చేలా పెద్ద పరిమాణంలో ఉన్న పానోరమిక్ సన్‌రూఫ్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్‌లో ఉంది. ఈ సన్‌రూఫ్ మందుకు మరియు వెనుకకు ఆటోమేటిక్‍‌గా అడ్జెస్ట్ అవుతుంది. ప్యానరోమిక్ రూఫ్ గురించి తెలియని వాళ్లను మాత్రం ఇది ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంజన్ మరియు పనితీరు

జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్‌లో 2.0-లీటర్ కెపాసిటి గల ఇంజీనియం డీజల్ ఇంజన్ కలదు. ఇదే ఇంజన్ జాగ్వార్ పెద్ద పెద్ద కార్లలో ఉన్నప్పటికీ, ఎక్స్ఇ చాలా తేలికగా ఉంటుంది. శక్తివంతమైన డీజల్ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 8-స్పీడ్ జడ్ఎఫ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ నుండి ఇంజన్ ప్రొడ్యూస్ చేసే 182బిహెచ్‌పి పవర్ మరియు 430ఎన్ఎమ్ టార్క్ అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

జాగ్వార్ ఎక్స్ఇ ఎంట్రీ లెవల్ సెలూన్ కారు కేవలం 9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 228కిమీలుగా ఉంది.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్‌లో నాలుగు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, ఇకో, నార్మల్/సిటీ, డైనమిక్ మరియు రెయిన్/స్నో. వీటిలో అధిక మైలేజ్ కోసం ఇకో మోడ్, క్రిస్పి అండ్ షార్ప్ థ్రోటిల్ రెస్పాన్స్ కోసం డైనమిక్ మోడ్, రెయిన్ లేదా స్నో మోడ్‌లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా వీలైనంత గ్రిప్ పొందవచ్చు.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సేఫ్టీ విషయానికి వస్తే, జాగ్వార్ ఎక్స్ఇలో డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఆల్ సర్ఫేస్ ప్రొగ్రెస్ కంట్రోల్ మరియు ఐదు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

జాగ్వార్ ఎక్స్ఇలో 17-అంగుళాల 7-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సస్పెన్షన్ కాస్త కఠినంగా అనిపించినప్పటికీ, కఠినమైన సవాళ్లను ఎంతో సులభంగా ఎదుర్కోగలిగింది.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

జాగ్వార్ ఎక్స్ఇ 20డి సిటీ డ్రైవింగ్‌లో 11.2కిమీల మైలేజ్ మరియు హైవే డ్రైవ్‌లో లీటర్‌కు 14.5కిమీల మైలేజ్‌నిస్తుంది. ఇదే సెగ్మెంట్లో ఉన్న లగ్జరీ సెలూన్ కార్లతో పోల్చుకుంటే మంచి మైలేజ్ ఇస్తుంది.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫన్ డ్రైవర్స్ కారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. కఠినమైన మలుపుల్లో కావాల్సినంత స్టీరింగ్ ఇచ్చి, యాక్సిలరేషన్ ప్రయోగిస్తే, కత్తితో వెన్ను కోసినంత సులభంగా మలుపుల్లో ఎదురయ్యే ప్రతి అవాంతరాన్ని అధిగమిస్తుంది.

జాగ్వార్ ఎక్స్ఇ 20డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మొదట్లో చెప్పినట్లుగానే, జాగ్వార్ ఎక్స్ఇ 20డి పర్ఫామెన్స్ ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ అని నిరూపించుకుంది. దీని ధర రూ. 43.21 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. కస్టమర్ దృష్టి కోణం నుంచి చూస్తే ధర కాస్త ఎక్కువే అనిపిస్తుంది. ఈ సెగ్మెంట్లో జాగ్వార్ ఎక్స్ఇ 20డి ధరకు తగ్గ విలువలతో ఉందనేది మా అభిప్రాయం!

Most Read Articles

English summary
Read In Telugu: Jaguar XE 20d: First Drive Review
Story first published: Tuesday, March 6, 2018, 19:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X