మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ

భారతదేశంలో 'మహీంద్రా' (Mahindra) కంపెనీ యొక్క 'స్కార్పియో' (Scorpio) గురించి దాదాపు తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇది 2002 లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మంచి ప్రజాదరణ పొందుతూ తిరుగులేని SUV గా ప్రసిద్ధి పొందింది. ఇప్పటికి కూడా ఈ SUV కి ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

2006, 2009 మరియు 2014 సంవత్సరాల్లో మహీంద్రా స్కార్పియో యొక్క ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లు పుట్టుకొచ్చాయి. కాగా మహీంద్రా స్కార్పియో మార్కెట్లో విడుదలైన దాదాపు రెండు దశాబ్దాల తరువాత 2022 లేటెస్ట్ స్కార్పియో దేశీయ విఫణిలో కొత్త అవతార్ లో దూసుకొచ్చింది. దీని పేరు 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' (Mahindra Scorpio Classic).

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

మహీంద్రా కంపెనీ దేశీయ మార్కెట్లో తన కొత్త స్కార్పియో క్లాసిక్ SUV ని 2022 సంవత్సరం ప్రారంభంలో విడుదల చేసింది. అయితే కంపెనీ ఈ కొత్త SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 30 నిముషాల్లో ఒక లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ స్వీకరించగలిగింది. దీన్ని బట్టి చూస్తే మహీంద్రా కంపెనీ యొక్క ఈ కొత్త SUV కి ఎంత ప్రజాదరణ ఉందొ స్పష్టంగా అర్థమవుతుంది.

అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాధరన పొందిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ని మేము ఇటీవల డ్రైవ్ చేసాము. ఈ కొత్త స్కార్పియో క్లాసిక్ డిజైన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏమిటి, డ్రైవ్ చేయడానికి ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం.. రండి.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ డిజైన్ మరియు స్టైల్:

మహీంద్రా కంపెనీ విడుదల చేసిన కొత్త స్కార్పియో క్లాసిక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త SUV ని చూడగానే దాని మునుపటి మోడల్ గుర్తుకు వస్తుంది. అయితే ఇందులో కొన్ని అప్డేట్స్ తప్పకుండా గమనించవచ్చు. ఈ SUV యొక్క ముందు భాగంలో అదే ఫ్రంట్ ఫాసియాను చూడవచ్చు, అయితే ఇది క్లియర్ లెన్స్ ర్యాప్‌రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, మస్కులర్ లైన్‌లతో కూడిన బానెట్ మరియు ఐకానిక్ హుడ్ స్కూప్‌ వంటివి ఇందులో ఉన్నాయి.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

ముందు వైపున ఉండే ఫ్రంట్ అప్ గ్రిల్ కొత్తదిగా ఉండటమే కాకుండా ఇందులో 6 వర్టికల్ క్రోమ్ స్లాట్స్ పొందుతుంది. అదే సమయంలో వీటికి మధ్యలో బ్రాండ్ యొక్క కొత్త లోగో కూడా చూడవచ్చు, చాలా వరకు దాని ముందు భాగంలో పెద్దగా అప్డేటెడ్ డిజైన్ లేదని తెలుస్తుంది. కాగా ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ఉంటుంది. దిగువన ఉన్న స్కిడ్ ప్లేట్ మాట్ సిల్వర్‌లో పూర్తి చేయబడింది. వీల్ ఆర్చ్‌లు మరియు క్వార్టర్ ప్యానెల్‌లు మరింత ఆకర్షణను తీసుకురావడంలో సహాయపడతాయి.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ కొత్త అల్లాయ్ వీల్స్ అందరి దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి. ఇవి డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అల్లాయ్స్ అల్లాయ్ వీల్స్. ఇందులో బ్లాక్ ఫినిషింగ్ కొంత తక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఇందులో కొత్త స్కార్పియో బ్యాడ్జింగ్ మరియు mHawk బ్యాడ్జ్‌ వంటివి ఇది అప్డేటెడ్ స్కార్పియో అని స్పష్టంగా చెబుతాయి.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ స్కార్పియో క్లాసిక్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. అదే సమయంలో నిలువుగా ఉండే టెయిల్ ల్యాంప్ ఉంటుంది. ఈ పొడవైన టెయిల్ ల్యాంప్ అనేది మొదటి 2006 ఫేస్‌లిఫ్ట్‌లో మొదటిసారిగా కనిపించింది, ఆ తరువాత 2014 ఫేస్‌లిఫ్ట్‌లో తొలగించబడి 2022 కొత్త మోడల్ లో మళ్ళీ తీసుకురావడం జరిగింది. మొత్తం మీద మహీంద్రా యొక్క కొత్త స్కార్పియో క్లాసిక్ మంచి డిజైన్ పొందుతుంది.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఇంటీరియర్ ఫీచర్స్:

కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ లో ఎక్కువ మంది కస్టమర్లు తెలుసుకోవాలనుకునే విషయం ఇంటీరియర్ ఫీచర్స్. ఇందులో చాలా వరకు కస్టమర్లకు అనుకూలంగా ఉండే ఫీచర్స్ ఉంటాయని చెప్పవచ్చు. చంకీ డోర్ హ్యాండిల్‌ ఉపయోగించి డోర్ ఓపెన్ చేయగానే మీకు అద్భుతమైన క్యాబిన్ స్వాగతం పలుకుతుంది. ఇంటీరియర్ చాలా వరకు కొత్త బేజ్ కలర్ అపోల్స్ట్రే పొందుతుంది. సీట్లు ఎప్పటిలాగానే ఫ్లాట్‌గా ఉంటాయి.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

ఇందులోని స్టీరింగ్ వీల్ XUV500 నుండి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, మ్యూజిక్ మొదలైనవాటిని కంట్రోల్ చేయడానికి మౌంట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఈ స్ట్రీరింగ్ వీల్ వెనుక అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా మీకు మునుపటి మోడల్ ని గుర్తుకు తెస్తుంది.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

ఇందులోని MID చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ చాలా సమాచారాన్ని ప్యాక్ చేస్తుంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, ఓడోమీటర్, రెండు ట్రిప్‌మీటర్‌లు, టెంపరేచర్ గేజ్ మరియు ఫ్యూయల్ గేజ్‌ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. ఈ MID కి కుడివైపున పెద్ద అనలాగ్ స్పీడోమీటర్ మరియు ఎడమవైపు టాకోమీటర్ వంటివి ఉన్నాయి.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ యొక్క డ్యాష్‌బోర్డ్ లో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సఫోర్ట్ చేస్తుంది. మేము డ్రైవ్ చేసిన వేరియంట్ 'S11'. కావున ఇందులో ఆరు స్పీకర్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది మంచి ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్:

మహీంద్రా స్కార్పియో ఒకప్పటినుంచి కూడా ఒక ఆచరణాత్మక SUV గా పేరుతెచ్చుకుంది. కావున మంచి ఫీచర్స్ మరియు పరికరాలతో పాటు మంచి కంఫర్ట్ కూడా అందిస్తుంది. ఇందులోని సీట్లు వెడల్పుగా ఉండటం వల్ల చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సీట్లపై కాంటౌరింగ్ లేదు, కాబట్టి ఇది ఒక ఫ్లాట్ బెంచ్ మాదిరిగా కనిపిస్తుంది. మధ్య వరుసలో కూడా మంచి కంఫర్ట్ లభిస్తుంది. సీట్లు మంచి లెగ్ రూమ్, క్నీ రూమ్ మరియు హెడ్ రూమ్ మాత్రమే కాకుండా మంచి అండర్‌థై సపోర్ట్‌ కూడా అందిస్తాయి.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

నిజానికి మహీంద్రా స్కార్పియో క్లాసిక్ మల్టిపుల్ సీటింగ్ కాన్ఫిగరేషన్ తో అందుబాటులో ఉంటుంది. ఇది 7 సీటర్ మరియు 9 సీటర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. 7 సీటర్ వేరియంట్ లో రెండవ వరుసలో రెండు కెప్టెన్ సీట్లు మరియు మూడవ వరుసలో ఒక బెంచ్‌ ఉంటుంది. 9 సీటర్ విషయానికి వస్తే, ఇందులో రెండవ వరుసలో ఒక బెంచ్ మరియు వెనుకవైపు నలుగురికి జంప్ సీట్లు లభిస్తాయి.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

మేము డ్రైవ్ చేసిన కారు 7 సీటర్ వేరియంట్, కావున ఇందులో ముందు రెండు, మధ్యలో ముగ్గురికి బెంచ్ సీటు మరియు వెనుక వైపు రెండు వైపులా ఉండే జంప్ సీట్లు ఉన్నాయి. 7 సీటింగ్ ఆప్సన్ పొందే మరో వేరియంట్ మధ్యలో ఉన్న బెంచ్ సీటు స్థానంలో కెప్టెన్ సీట్లు, వెనుక జంప్ సీటు స్థానంలో బెంచ్ సీటు ఉంటాయి.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే, ఇందులోని వెనుకవైపు ఉన్న జంప్ సీట్లు మడతపెట్టటానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మధ్యలో ఉన్న బెంచ్‌ సీటుని కూడా ఫోల్డ్ చేయవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది. అయితే కంపెనీ 460 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుందని తెలిపింది. కానీ అంతకంటే ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

మహీంద్రా యొక్క మొదటి తరం స్కార్పియో 2.6 లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌ ద్వారా శక్తిని పొందింది. ఆ తరువాత 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజన్ పొందింది. ఇది 140 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

కొత్త 2022 స్కార్పియో క్లాసిక్ 2.2-లీటర్ mHawk ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఇంజిన్ యొక్క పవర్ గణాంకాలు తగ్గుతాయి. కావున ఇంజిన్ 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 130 బిహెచ్‌పి పవర్ మరియు 1,600 - 2,800 ఆర్‌పిఎమ్ మధ్య 300 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది దాని పాత mHawk ఇంజన్‌ కంటే 10 బిహెచ్‌పి పవర్ మరియు 20 ఎన్ఎమ్ టార్క్ తక్కువగా డెలివరీ చేస్తుంది.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

పాత ఇంజిన్ కంటే కూడా కొత్త ఇంజిన్ బరువు ఇప్పుడు 55 కేజీల వరకు తగ్గుతుంది. అయినప్పటికి మంచి పనితీరుని అందిస్తుంది. ఇది కేవలం 13 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. పనితీరులో కూడా పాత స్కార్పియో కంటే కొంత తక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జాతఃచేయబడి ఉంటుంది. హైవేపైన ట్రిపుల్ డిజిట్ వేగాన్ని కూడా త్వరగానే చేరుకుంటుంది.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

రైడ్ నాణ్యతను మెరుగుపరచడంలో అడాప్టివ్ డంపర్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది ఎదురు దిగుడు ప్రాంతాల్లో మరియు గుంతల వంటి ప్రాంతాల్లో కూడా సజావుగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇది కొంత పొడవైన SUV కాబట్టి పనితీరు పరంగా ఉత్తమైనదనే చెప్పాలి.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

స్కార్పియో క్లాసిక్ 4WD ఆప్సన్ తో అందుబాటులో లేదు. అయినప్పటికీ ఇది ఆఫ్ రొడింగ్ కి కూడా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి సామర్థ్యం కలిగిన SUV, కావున డ్రైవింగ్ చేయడానికి అనుకూలంగా ఉండటమే కాకూండా.. మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ సేఫ్టీ ఫీచర్స్:

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ మంచి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ కింద చూడవచ్చు.

  • డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు
  • ప్యానిక్ బ్రేక్ ఇండికేటర్
  • ఇంజిన్ ఇమ్మొబిలైజర్
  • యాంటీ తెఫ్ట్ వార్ణింగ్
  • సీట్ బెల్ట్ రిమైండర్
  • స్పీడ్ అలర్ట్
  • ఆటో డోర్ లాక్
  • ఏబీఎన్ విత్ ఈబిడి
  • మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

    మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కీ ఫీచర్లు:

    మహీంద్రా స్కార్పియో క్లాసిక్ మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా అద్భుతమైన ఇంటీరియర్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఉన్న ఫీచర్స్ కింద గమనించవచ్చు.

    • 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
    • ఆరు స్పీకర్లు
    • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
    • సెకండ్ రో ఏసీ వెంట్స్
    • హైడ్రాలిక్ బోనెట్ స్ట్రట్స్
    • స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్
    • మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

      మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్ మరియు ఎస్11 అనే రెండు వేరియంట్స్ లో విడుదలైంది. వీటి ధరలు వరుసగా రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మొత్తమ్ 5 కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవిపెర్ల్ వైట్, నాపోలి బ్లాక్, రెడ్ రేజ్, డి'సాట్ సిల్వర్ మరియు గెలాక్సీ గ్రే కలర్స్.

      మాస్ పర్ఫామెన్స్ అందించే క్లాస్ ఎస్‌యువి.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రివ్యూ: ఎక్కడా తగ్గేదే లే

      డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

      దేశీయ మార్కెట్లో ఒకప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతున్న స్కార్పియో, ఇప్పుడు కొత్త స్కార్పియో క్లాసిక్ రూపంలో మార్కెట్లో విడుదలైంది. ఈ కొత్త SUV మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ తో అద్భుతమైన పనితీరుని అందించేలా రూపొందించబడింది. ఇది డ్రైవ్ చేయడానికి కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. మొత్తం మీద ఇది మన కొత్త స్కార్పియో క్లాసిక్ పూర్తి వివరాలు. ఇలాంటి మరిన్ని కొత్త బైకులు మరియు కార్లను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra scorpio classic review design features performance other details
Story first published: Tuesday, November 15, 2022, 11:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X