కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

భారతదేశంలో మారుతి సుజుకి (Maruti Suzuki) బ్రాండ్ కార్లకు ఎల్లప్పుడూ ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. దశాబ్దాల నుండి ఈ బ్రాండ్ భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ ఏదంటే టక్కున గుర్తుకు వచ్చేది మారుతి సుజుకినే. మొదటిసారి కారు కొనేవారి దగ్గరి నుండి పెద్ద కుటుంబాలు కోరుకునే ప్రీమియం కార్ల వరకూ ఈ బ్రాండ్ వివిధ విభాగాల్లో వాహనాలను అందిస్తోంది. మారుతి సుజుకి అందిస్తున్న ఎర్టిగా ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బెస్ట్ ఎమ్‌పివిగా ఉంది. ఏడు సీట్ల సామర్థ్యంతో పెద్ద కుటుంబాలకు ఇదొక చక్కటి ఆచరణీయమైన ఫ్యామిలీ కారుగా ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

సరసమైన ధరలు, మంచి ప్రాక్టికాలికీ, మెరుగైన మైలేజ్ మరియు మారుతి బ్రాండ్ యొక్క విశ్వసనీయత వంటి అనేక అంశాలతో ఇది సెగ్మెంట్లోని ఇతర మోడళ్ల కన్నా మెరుగ్గా ఉంటుంది. అయితే, మారుతి ఎర్టిగా కన్నా కాస్తంత ప్రీమియంగా కనిపించే మరియు అనిపించే కారును కోరుకునే వారి కోసం మారుతి సుజుకి తమ నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ఎర్టిగా ఎమ్‌పిని ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) అనే ప్రీమియం ఎమ్‌పివిని విక్రయిస్తోంది. గడచిన 2019లో ఇది తొలిసారిగా మార్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇటీవలే కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టింది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఎస్‌యూవీ లాంటి లుక్ ఎమ్‌పివి లాంటి ఫీల్‌తో మారుతి సుజుకి ఎక్స్ఎల్6, ఎర్టిగా కన్నా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఎక్స్ఎల్6 డిజైన్ అంశాలు చాలా స్పోర్టీగా మరియు ప్రీమియంగా ఉంటాయి. కొత్తగా వచ్చిన ఈ 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 మార్కెట్లో రూ. 11.29 లక్షల నుండి రూ. 14.55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో అందుబాటులో ఉంది. ఇదివరకటి మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త 2022 మోడల్ డిజైన్, ఫీచర్స్ మరియు మెకానికల్స్ పరంగా కొత్త మార్పులను కలిగి ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఈ కొత్త ఎమ్‌పివి ఏయే విషయాల్లో కొత్తగా ఉంది? ఇందులోని కొత్త ఇంజన్ మరియు గేర్‌బాక్స్‌ల పనితీరు ఎలా ఉంది? ఇది పాత మోడల్ కంటే మెరుగైనదా? ఇది మరింత సమర్థవంతంగా తయారైందా? మరియు ఇది మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి మేము ఈ కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివి మొదటిసారిగా నడిపి చూశాము. మరి ఇందులో మమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏంటో ఈ పూర్తి సమీక్ష (ఫుల్ డీటేల్డ్ రివ్యూ)లో తెలుసుకుందాం రండి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

2022 ఎక్స్ఎల్6 - డిజైన్ మరియు స్టైల్

మారుతి ఎర్టిగా మరియు మారుతి ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలను పక్కపక్కనే ఉంచి చూసినప్పుడు, ఎవరైనా ముందుగా ఎంచుకునే మోడల్ ఏదంటే, అది ఖచ్చితంగా ఎక్స్ఎల్6 అని చెప్పవచ్చు. ఎక్స్‌ఎల్6 ని మొదటిసారిగా చూసినప్పుడు వావ్.. సూపర్.. ఆసమ్.. అనే పదాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే, దీని డిజైన్ అంతలా ఆకట్టుకుంటుంది కాబట్టి. పాత మోడల్‌కి మరియు ఈ కొత్త మోడల్‌కి మధ్య డిజైన్‌లో వ్యత్యాసాలు చాలా స్వల్పమే అయినప్పటికీ, ఈ కొత్త మోడల్ మాత్రం చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇందులో హెడ్‌ల్యాంప్ యూనిట్ మినహా మిగిలిన డిజైన్ ఎలిమెంట్స్‌ను అన్నింటినీ రీడిజైన్ చేశారు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

పాత మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 మోడల్ ఎక్స్ఎల్6 లో హెడ్‌ల్యాంప్‌లు అలాగే ఉంచబడ్డాయి. కాకపోతే, అవి ఎల్ఈడి యూనిట్లతో భర్తీ చేయబడ్డాయి. ఇందులో టర్న్ ఇండికేటర్లు మాత్రమే హాలోజన్ లైట్లను కలిగి ఉంటాయి, మిగిలిన లైట్లన్నీ కూడా ఎల్ఈడి రూపంలో ఉంటాయి. ఈ కొత్త మోడల్ ఫ్రంట్ డిజైన్ బాగా పరిచయం ఉన్నట్లుగా అనిపించినప్పటికీ, ఇందులోహెడ్‌ల్యాంప్‌లు మినహా మిగిలిన అన్ని భాగాలు రీడిజైన్ చేయబడ్డాయి. ఇందులో ఫ్రంట్ గ్రిల్‌లో అతిపెద్ద మార్పు కనిపిస్తుంది. అయితే, ఈ గ్రిల్ డిజైన్ చాలా సింపుల్‌‌గా మరియు అంతే ప్రీమియంగా ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఫ్రంట్ గ్రిల్‌పై అమర్చిన క్రోమ్ ఎలిమెంట్స్ దీనికి మరింత ప్రీమియం అప్పీల్‌ను తెచ్చిపెడుతుంది. కాబట్టి, కారుపై క్రోమ్ గార్నిష్‌ను ఇష్టపడే వారు ఈ కొత్త XL6 ఫ్రంట్ ఎండ్‌ డిజైన్‌ను ఖచ్చితంగా ఇష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రిల్ పైభాగంలో క్రోమ్ స్ట్రిప్ మరియు దిగువన కూడా క్రోమ్ స్ట్రిప్ ఉంటుంది. గ్రిల్‌కి అడ్డంగా ఉండే పెద్ద మరియు మందపాటి క్రోమ్ స్ట్రిప్ కూడా ఇందులో కనిపిస్తుంది. గ్రిల్ మధ్యలో పెద్ద సుజుకి లోగో ఉంటుంది, అది కూడా క్రోమ్ లోనే ఫినిష్ చేయబడి ఉంటుంది. ఫ్రంట్ బంపర్ కూడా రీడిజైన్ చేయబడింది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఇప్పుడు ఆల్-రౌండ్ మ్యాట్ బ్లాక్ క్లాడింగ్‌ను కలిగి ఉంటుంది మరియు ఇది కారుకి చాలా ఆసక్తికరమైన స్టైలింగ్‌ను అందిస్తుంది. ఈ క్లాడింగ్ బంపర్‌పై కూడా కనిపిస్తుంది మరియు బంపర్ దిగువన మాట్ సిల్వర్ స్కఫ్ ప్లేట్ ఉంటుంది. ఇక సైడ్ ప్రొఫైల్‌ని గమనించినట్లయితే, ఇక్కడ ముందుగా మీ దృష్టిని ఆకర్షించే మొదటి అంశం దాని కొత్త అల్లాయ్ వీల్స్. ఇవి 16 ఇంచ్ మెషిన్డ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్. మా అభిప్రాయం ప్రకారం కొత్త ఎక్స్ఎల్6 లోని ఈ అల్లాయ్ వీల్స్ చాలా అత్యుత్తమమైన డిజైన్‌ని కలిగి ఉన్నాయి. వీటిపై అమర్చిన ఎమ్ఎర్ఎఫ్ వాండరర్ ఎకోత్రెడ్ టైర్‌లతో ఇవి రోడ్డుపై మరింత స్టాండవుట్‌గా నిలుస్తాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఇదివరకటి మోడల్‌తో పోల్చుకుంటే, వీల్ ఆర్చ్‌లపై ఉండే ప్లాస్టిక్ క్లాడింగ్ కొంచెం సన్నదిగా అనిపిస్తుంది. ఫ్రంట్ ఫెండర్‌లో క్రోమ్ ఇన్‌సర్ట్‌లతో కూడిన కొత్త మ్యాట్ బ్లాక్ డిజైన్ ఎలిమెంట్ ఉంటుంది. డోర్ హ్యాండిల్స్‌కి క్రోమ్ గార్నిష్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్‌లో కనిపించే ఏకైక క్రోమ్ బిట్ కూడా ఇదే. ఈ ఎమ్‌పివి సైడ్ నుండి బలమైన క్యారెక్టర్ లుక్ ని అందించేందుకు ఇందులో సాలిడ్ షోల్డర్ లైన్‌లు కనిపిస్తాయి. ఈ షోల్డర్ లైన్స్ ఎక్స్ఎల్6 ఎమ్‌పివికి మజిక్యులర్ లుక్‌ని తెచ్చిపెడుతాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

సైడ్స్‌ డిజైన్‌లో కనిపించే మరొక డిజైన్ ఎలిమెంట్, క్లాడింగ్‌లో ఉండే మ్యాట్ సిల్వర్ ఇన్సర్ట్. ఇది సైడ్‌బోర్డ్ అంతా కవర్ అయి ఉంటుది. కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6లో మరొక ముఖ్యమైన అప్‌డేట్, ఇందులోని కొత్త యూవీ కట్ విండోలు. ఇవి హానికరమైన యూవీ కిరణాలను ఫిల్టర్ చేస్తాయి. మేము ఈ ఫీచర్‌ని టెస్ట్ చేసినప్పుడు ఇది చాలా ప్రభావవంతంగా అనిపించింది. ఇక సైడ్స్‌లో చివరిగా చెప్పుకోవాల్సింది కారు పైన ఉండే రూఫ్ రెయిల్స్. ఇవి మ్యాట్ సిల్వర్ ఫినిష్‌లో డిజైన్ చేయబడి ఉంటాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఇక వెనుక వైపు డిజైన్‌ను గమనిస్తే, పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్‌లో పలు మార్పులు కనిపిస్తాయి. ఇందులో కొత్త ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లు ఉంటాయి. ఇవి ఇప్పుడు స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ మాదిరిగా ఉంటాయి. స్మోకీ ఫినిష్‌లో ఈ రివైజ్డ్ టెయిల్ ల్యాంప్స్ కారుకి వెనుక వైపు నుండి కూడా ఆధునిక రూపాన్ని అందిస్తాయి. ఇందులోని టెయిల్ గేట్‌పై క్రోమ్ స్ట్రిప్‌తో పాటుగా బ్లాక్డ్-అవుట్ స్ట్రిప్ కూడా ఉంటుంది. టెయిల్ గేట్‌పై కూడా XL6 మరియు SmartHybrid అనే రెండు బ్యాడ్జ్ లు కనిపిస్తాయి. వెనుక వైపు పైభాగంలో ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ మరియు విండ్‌స్క్రీన్ వాషర్‌తో కూడిన స్పాయిలర్ ఉంటాయి. దానికి దిగువన నిలువు రిఫ్లెక్టర్‌లతో రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్ ఉంటుంది. ఈ మార్పులన్నీ కూడా కొత్త 2022 మారుతి ఎక్స్‌ఎల్6 కి రిఫ్రెష్ డిజైన్ ఫీల్‌ను ఇస్తాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

2022 ఎక్స్ఎల్6 - కాక్‌పిట్ మరియు ఇంటీరియర్

మారుతి సుజుకి అందించే వాహనాలు ఎల్లప్పుడూ విశాలమైన మరియు ఆచరణాత్మకమైన ఇంటీరియర్‌కు ప్రసిద్ధి చెందినవని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకు కొత్త ఎక్స్ఎల్6 ఏమీ మినహాయింపు కాదు. కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివి కూడా అదే భావనను అనుసరిస్తుంది. మీరు ఈ కారుకి బయట ఉన్న క్రోమ్ డోర్ హ్యాండిల్స్‌ని ఓపెన్ చేసి, డోర్ తెరిచినప్పుడు కొత్త XL6 లోపలి భాగంలో ఉండే బ్లాక్ కలర్ థీమ్డ్ ఇంటీరియర్ మీకు స్వాగతం పలుకుతుంది.ఇందులో పూర్తి నలుపు రంగులో ఉండే ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డ్‌ ఉంటుంది. ఇందులో అక్కడక్కడా వుడ్ ఫినిష్ యాక్సెంట్స్ కూడా ఉంటాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

కారు లోపల ఏసి వెంట్స్ క్రింద గ్రైనీ వుడ్ ఫినిషింగ్ ట్రిమ్‌ ఉంటుంది. అలాగే, ఈ వుడ్ ట్రిమ్ కింద ఒక సిల్వర్ స్ట్రిప్ కూడా ఉంటుంది. ఈ కొత్త మోడల్ లోని ఏసి వెంట్‌లు చాలా స్టైలిష్‌గా ఉంటాయి మరియు డ్యాష్‌బోర్డ్‌లో మూడు క్షితిజ సమాంతర రేఖలు ఉంటాయి, ఇవి ఏసి వెంట్‌లను కనెక్ట్ చేస్తాయి. డ్యాష్‌బోర్డ్‌లో 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. విచారించాల్సిన విషయం ఏంటంటే, ఇవి రెండూ కూడా వైరు ద్వారా అందుబాటులో ఉంటాయి. అంటే, ఇందులో వైర్‌లెస్ Apple CarPlay మరియు Android Auto ఫీచర్ లేదన్నమాట.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

అయితే, ఈ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మారుతి సుజుకి యొక్క సరికొత్త స్మార్ట్‌ప్లే ప్రో యూనిట్, కాబట్టి ఇది అనేక కనెక్టెడ్ టెక్నాలజీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది మరియు దీని కంట్రోల్ ప్యానెల్ డ్యాష్‌బోర్డ్‌లో టచ్ స్క్రీన్‌కి దిగువన ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్ యొక్క సెట్టింగ్‌లను ప్రదర్శించడానికి ఇక్కడ ఓ చిన్నసైజు ఎల్‌సిడి స్క్రీన్‌ కూడా ఉంటుంది. ఈ డిస్‌ప్లే యూనిట్‌ పక్కన ఫ్యాన్ వేగం మరియు ఉష్ణోగ్రతను నియంత్రించే రెండు నాబ్‌లు కూడా ఉంటాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌కి దిగువ నుండి సెంటర్ కన్సోల్ ప్రారంభమవుతుంది. ఇందులో మీకు 12V సాకెట్‌తో పాటు USB చార్జింగ్ పోర్ట్‌ కూడా కనిపిస్తుంది. వీటి సాయంతో మీరు మీ ఫోన్‌ను చార్జ్ చేసుకోవడం లేదా దానిని ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌కి కనెక్ట్ చేసి ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లను యాక్సెస్ చేసుకోవడం చేయవచ్చు. కొత్త ఎక్స్ఎల్6 సెగ్మెంట్ ఫస్ట్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లను కలిగి ఉంటుంది, ఈ సీట్ వెంటిలేషన్ కోసం కంట్రోల్స్ కూడా సెంటర్ కన్సోల్‌లోనే అమర్చబడి ఉంటాయి. ఇందులో మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉంచడానికి కొంత స్థలం కూడా ఉంటుంది. కాకపోతే, నేటి ఆధునిక కార్లలో కనిపించే వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఫీచర్ కొత్త 2022 ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో లేదు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఈ సెంటర్ కన్సోల్‌లో ఉండే కప్‌హోల్డర్‌లు కూలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి మరియు ఈ కూలింగ్ ఫీచర్ కోసం డయల్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఇక దాని తర్వాత కనిపించేది గేర్ లివర్ మరియు డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం సర్దుబాటు చేయగల ఆర్మ్‌రెస్ట్. ఈ కారులోని సీట్లు అన్నీ కూడా పూర్తి నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటాయి మరియు వాటిపై రంధ్రాలు (వెంట్స్) ఉంటాయి. ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో ఈ వెంటిలేటెడ్ సీట్లు ఒక ప్రత్యేక వరంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇవి సీట్లను త్వరగా చల్లబరచడంలో సహకరిస్తాయి. ఇందులోని ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఆడియో, కాలింగ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వాయిస్ కమాండ్‌ల కోసం మౌంటెడ్ కంట్రోల్‌లను కలిగి ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్ సిల్వర్ ఇన్సర్ట్‌లతో చాలా స్పోర్టీగా అనిపిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఇక స్టీరింగ్ వెనుక భాగంలో ఉండే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను గమనిస్తే, కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని అనలాగ్ గేజ్‌లలో స్పీడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయెల్ ఇండికేటర్ మరియు ఉష్ణోగ్రత స్థాయి లను సూచించే మీటర్లు ఉంటాయి. అలాగే, వీటికి మధ్యలో ఉండే ఫుల్ కలర్ ఎమ్ఐడి యూనిట్‌లో ప్రస్తుత ఇంధన సామర్థ్యం, ​​సగటు ఇంధన సామర్థ్యం, ​​పరిధి (రేంజ్), ప్రస్తుత టార్క్ మరియు విద్యుత్ వినియోగం మొదలైన వాటితో పాటుగా అనేక రకాల ఇతర సమాచారం ప్రదర్శించబడుతుంది. ఈ కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా ఆధునికంగా మరియు రిఫ్రెష్డ్‌గా కనిపిస్తుంది. ఓవరాల్‌గా, ఈ కొత్త మోడల్‌లోని రిఫ్రెష్డ్ ఇంటీరియర్ మనకు కొత్త ఉల్లాసాన్నిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

2022 ఎక్స్ఎల్6 - ప్రాక్టికాలిటీ, కంఫర్ట్ మరియు బూట్ స్పేస్

మారుతి సుజుకి తమ కార్లను తయారుచేసేటప్పుడు ప్రాధాన్యతను ఇచ్చే అతి ముఖ్యమైన అంశాలలో ప్రాక్టికాలిటీ ఒకటి. ఈ బ్రాండ్ నుండి లభించే దాదాపు అన్ని కార్లు కూడా మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉంటాయి. కొత్తగా వచ్చిన 2022 మోడల్ మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కూడా ప్రాక్టికాలిటీలో బెస్ట్ అనిపించుకుంటుంది. లోపలి వైపు డోర్ పాకెట్స్ చాలా లోతుగా ఉండి, 1-లీటర్ బాటిల్‌ను హోల్డ్ చేయడంతో పాటుగా మరికొన్ని ఇతర చిన్న వస్తువులను ఉంచగల స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉంటాయి. డ్యాష్‌బోర్డ్‌లోని గ్లోవ్‌బాక్స్ కూడా చాలా లోతుగా ఉంటుంది మరియు ఇందులో చాలా వస్తువులను నిల్వ చేయవచ్చు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

అలాగే, సెంటర్ కన్సోల్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచడానికి సరిపడా స్థలం ఉంటుంది మరియు రెండు కప్‌హోల్డర్‌లు కూడా ఉన్నాయి. సర్దుబాటు చేయగల స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ క్రింది భాగంలో వాలెట్ పరిమాణంలో ఉండే వస్తువులను నిల్వ చేయడానికి చిన్న క్యూబీహోల్ కూడా ఉంటుంది. రెండవ వరుసలోని ప్రయాణీకుల కోసం12V పవర్ సాకెట్‌ కూడా ఉంటుంది మరియు మ్యాగజైన్ లేదా న్యూస్ పేపర్ వంటి వాటిని స్టోర్ చేయడానికి సీట్ బ్యాక్ పాకెట్‌లు కూడా ఉంటాయి. మూడవ వరుసలోని ప్రయాణీకుల కోసం కూడా 12V సాకెట్‌ ఉంటాయి మరియు సీట్లకు ఇరువైపులా కప్ హోల్డర్‌లు కూడా ఉంటాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో ఎక్కువ స్కోర్‌లను పొందే అంశం ఏదైనా ఉందంటే, అది దాని సౌకర్యం (కంఫర్ట్). ఎర్టిగా కన్నా ఎక్స్ఎల్6 చాలా చాలా సౌకర్యవంతమైన ఎమ్‌పివిగా ఉంటుంది. ఈ కొత్త 2022 మోడల్ ముఖ్యంగా డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం అనేక విషయాలను మెరుగుపరుస్తుంది. మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఇప్పుడు సెగ్మెంట్ ఫస్ట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను కలిగి ఉంటుంది మరియు ఇది ఈ మండు వేసవిలో ఓ చల్లటి వరంగా ఉంటుంది. ఈ వ్యవస్థ మూడు-దశల నియంత్రణను (3-స్టేజ్ కంట్రోల్) కలిగి ఉంటుంది. దీనిని ఆపరేట్ చేయడం కూడా చాలా సులభం. ఇందులోని సమర్థవంతమైన టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్, రెండవ వరుస మరియు మూడవ వరుస ప్రయాణీకుల కోసం ఏసి వెంట్స్ ప్రయాణీకులకు ఈ వేసవిలో చల్లటి ప్రయాణ అనుభూతిని అందిస్తాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

మేము ఈ కొత్త 2022 ఎక్స్ఎల్6 ఎమ్‌పివిని పరీక్షించే సమయంలో, వేసవి వేడి తీవ్రత దాదాపు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సమయంలో మా డ్రైవ్‌స్పార్క్ బృందాన్ని చల్లగా ఉంచడంలో ఈ కారులోని ఎయిర్ కండిషనింగ్ చాలా అద్భుతమైన పనితీరును కనబరిచిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ, మనలాంటి ఉష్ణమండల వాతావరణంలో ఉండే వారి కోసం ఈ ఫీచర్ ఎంత గొప్పదో దాని వెంటిలేటెడ్ సీట్లు వెల్లడిస్తాయి. ఈ కారులోని ముందు సీట్లు మంచి థై సపోర్ట్ మరియు బ్యాక్ సపోర్ట్‌ను అందిస్తాయి. డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు చేయగల ఆప్షన్‌ను కలిగి ఉంటుంది, కాబట్టి పొడవు తక్కువగా ఉండే వారికి కూడా ఇది అనుకూలమైన ఫీచర్‌గా ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఈ కారులో అత్యంత సౌకర్యవంతమైన సీట్లు రెండవ వరుసలో ఉండే కెప్టెన్ సీట్లు. ఇందులోని ప్రతి సీటు దాని స్వంత ఆర్మ్‌రెస్ట్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు డోర్ ప్యాడ్‌లు గట్టి ప్లాస్టిక్‌తో తయారు చేయబడినప్పటికీ, ప్రయాణీకుల మోచేతులు విశ్రాంతి తీసుకునే ప్రదేశంలో మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఫోమ్ ప్యాడింగ్ డిజైన్ చేయబడి ఉంటాయి. అయితే, దాదాపు అన్ని కాంపాక్ట్ ఎమ్‌పివిలలో ఉండే ఇరుకు వెనుక సీట్ల మాదిరిగానే ఈ కొత్త ఎక్స్ఎల్6 లోని మూడో వరుసలోని సీట్లు కూడా చిన్నివిగా ఉండి, అంత సౌకర్యవంతంగా అనిపించవు. ఇందులోని కెప్టెన్ సీట్ల కారణంగా, కారు లోపలికి ప్రవేశించడం మరియు నిష్క్రమించడం సులభంగా అనిపిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

రెండవ వరుసలోని కెప్టెన్ సీట్లను పూర్తిగా వెనక్కి రిక్లైన్ చేస్తే, మూడవ వరుసలోని ప్రయాణీకులకు లెగ్‌రూమ్ ఉండదు. అయితే, ఇందులోని రెండవ వరుసలో ఖాళీని ఇచ్చినట్లయితే, కెప్టెన్ సీట్లను పూర్తిగా వెనక్కి నెట్టాల్సిన అవసరం లేదు, కాబట్టి మూడవ వరుసలో లెగ్ రూమ్ (క్నీ రూమ్) బాగానే అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే, కొత్త XL6లోని మూడవ వరుసలో లభించే స్పేస్ ఈ సెగ్మెంట్లోని ఇతర ఎమ్‌పివిలలో లభించే మూడవ వరుస రూమ్ కంటే మెరుగ్గా ఉంటుంది. మూడవ వరుస సీట్లను వాలుగా ఉంచవచ్చు లేదా అవసరం లేదనుకున్నప్పుడు మడతపెట్టవచ్చు. ఇలా చేయడం వలన బూట్ స్పేస్‌ పెరుగుతుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

కొత్త 2022 మోడల్ ఎక్స్ఎల్6లో అన్ని సీట్లు ఓపెన్ చేసి ఉన్నప్పుడు, ఇందులో 209 లీటర్ల బూట్ స్పేస్‌ లభిస్తుంది. అయితే, ఇందులోని మూడవ వరుస సీట్లను క్రిందికి మడచడం ద్వారా ఈ స్టోరేజ్ స్పేస్‌ను 560 లీటర్లకు పెంచుకోవచ్చు. కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణిస్తూ, ఇంకా ఎక్కువ స్టోరేజ్ స్పేస్ కావాలనుకునే వారు రెండవ వరుసలోని కెప్టెన్ సీట్లను కూడా మడుచుకున్నట్లయితే, మొత్తం 692 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఈ కెప్టెన్ సీట్లు పెద్ద మరియు సౌకర్యవంతమైన హెడ్‌రెస్ట్‌లను కలిగి ఉన్న కారణంగా ఇవి పూర్తిగా మడుచుకోవు. బూట్ లోపల రెండు ప్లాస్టిక్ ట్రేలు ఉంటాయి, ఇవి కూడా లోతైన స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉంటాయి. మొత్తమ్మీద చూసుకుంటే, ఇది ప్రాక్టికాలిటీ, ఫంక్షనాలిటీ, ప్యాసింజర్ కంఫర్ట్ మరియు బూట్ స్పేస్ వంటి విషయాల్లో సెగ్మెంట్ బెస్ట్‌గా ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

2022 ఎక్స్ఎల్6 - ఇంజన్ పనితీరు మరియు డ్రైవింగ్ అనుభూతి

ఇంజన్ పనితీరు విషయంలో మాత్రం మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఒక అడుగు వెనుకే ఉంటుందని చెప్పాలి. అయితే, ఇందులోని రిఫ్రెష్డ్ 1.5 లీటర్ ఇంజన్ మాత్రం వినియోగదారులను ఏమాత్రం నిరుత్సాహపరచదని చెప్పొచ్చు. ఫుల్ పెర్ఫార్మెన్స్ మరియు క్విక్ యాక్సిలరేషన్ విషయంలో ఎక్స్ఎల్6 అద్భుతమైన ప్రదర్శనను అందించలేదు. అయితే, ఇలాంటి ఫ్యామిలీ కారును కోరుకునే కస్టమర్లు, ఎక్స్ఎల్6 విషయంలో ఈ అంశాలను చూడరనే చెప్పాలి. వీరి ప్రధాన ఉద్దేశ్యం తమ ఫ్యామిలీని సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా గమ్యాలకు చేర్చడమే. కాబట్టి, ఈ కారులోని ఇంజన్ అందించే పనితీరు వీరి అవసరానికి సరిపడా ఉంటుందని చెప్పవచ్చు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

కొత్త 2022 మోడల్ మారుతి ఎక్స్ఎల్6 ఇప్పుడు మరింత రిఫ్రెష్డ్ 1.5 లీటర్ పెట్రోల్ మరియు మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది మరియు ఇందులో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌ కూడా ఉంటుంది. ఇది ఇంజన్‌కు అవసరమైనప్పుడు కొంత అదనపు టర్నింగ్ ఫోర్స్‌తో సహాయపడుతుంది. ఈ కారులో 1462సిసి, ఫోర్-సిలిండర్ ఇంజన్‌ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 101.6 బిహెచ్‌పి శక్తిని మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 136.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఇప్పుడు కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇందులోని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ మునుపటి మోడల్ నుండి అలానే కొనసాగించడం జరిగింది. మేము టెస్ట్ డ్రైవ్ చేసింది, కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వేరియంట్.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఈ వేరియంట్‌లోని ఇంజన్ స్టార్ట్ బటన్‌ను నొక్కగానే, ఇందులోని పెట్రోల్ ఇంజన్ చాలా నిశ్శబ్దంగా ఆన్ అవుతుంది. కొన్నిసందర్భాల్లో అసలు ఇంజన్ ఆన్‌లో ఉందా లేక ఆఫ్‌లో ఉందా అని కన్ఫ్యూజ్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది. అయితే, యాక్సిలరేటర్ పెడల్‌ను నొక్కగానే ఇంజన్ రయ్‌రయ్ అంటూ శబ్ధం చేస్తుంది. ఈ ఇంజన్ సౌండ్ అధిక RPMల వద్ద వినగలిగేలా ఉంటుంది. ఇక ఈ వేరియంట్ లోని ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ‘D' మోడ్‌లోకి స్లాట్ చేయగానే, ఎమ్‌పివి ఎటువంటి సందేహం లేకుండా ముందుకు కదులుతుంది. ఇందులో మీరు ఎటువంటి కుదుపులను అనుభవించరు మరియు ఇది చాలా మృదువైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

కొత్త ఎక్స్ఎల్6 లో D మోడ్‌లో మంచి వేగంతో డ్రైవింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. గేర్లు మారే సమయంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ చాలా సైలెంట్‌గా అనిపిస్తుంది. అయితే, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, మాన్యువల్ మరియు బ్యాక్ స్టాండ్‌లో షిప్ట్ చేస్తున్నప్పుడు కలిగే స్వల్ప కుదుపులను కూడా మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. అయితే, కారు కదలికలో ఉన్నప్పుడు మాత్రం డ్రైవ్ మరియు మాన్యువల్ మోడ్‌ల మధ్య మారుతున్నప్పుడు ఈ కుదుపులు అంతగా అనిపించవు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఇక ఇందులో ఇప్పుడు పాడిల్ షిఫ్టర్‌లను ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. మారుతి సుజుకి తొలిసారిగా తమ కార్లలో ప్యాడిల్ షిఫ్టర్ ఫీచర్‌ను అందిస్తోంది. ఒకప్పుడు హై-ఎండ్ ప్రీమియం కార్లకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్ ఇప్పుడు సాంప్రదాయ కార్లలో కూడా అందుబాటులోకి తెచ్చింది మన మారుతి సుజుకి. ఈ వేరియంట్‌లోని ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను మాన్యువల్ ‘M' మోడ్‌లోకి స్లాట్ చేయడం ద్వారా ఈ ప్యాడిల్ షిఫ్టర్ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ‘M' మోడ్‌లో, డ్రైవర్ ప్యాడిల్‌ను పైకి మార్చడానికి ఉపయోగించకపోతే, గేర్‌బాక్స్ రెడ్‌లైన్ వరకు ప్రతి గేర్‌ను పట్టుకుంటుంది. గేర్‌బాక్స్ ప్రతి షిఫ్ట్ అభ్యర్థనకు అద్భుతంగా ప్రతిస్పందిస్తుంది మరియు ఇది టార్క్ కన్వర్టర్ అని గుర్తుంచుకోండి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఈ కారులోని K15C స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ISG (ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్)ని కలిగి ఉండి, చాలా ఉపయోగకరమైన లక్షణాలను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. వీటిలో మొదటిది ఐడిల్ స్టార్ట్/స్టాప్ (Idle Start/Stop) ఫీచర్. ఈ ఫీచర్ వలన ఇంజన్ ఎక్కువ సేపు ఖాలీగా (ఐడిల్‌గా) ఉన్నప్పుడు లేదా ఎక్కువ సమయం వేచి ఉండే రెడ్ లైట్ల వద్ద ఇంజన్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా చేస్తుంది. ఫలితంగా, ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది మరియు మైలేజ్‌ను పెంచుతుంది. తిరిగి క్లచ్ నొక్కగానే ఇంజన్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. ఈ ఫీచర్ ద్వారా ఎంత ఇంధనం ఆదా చేయబడిందనే విషయాన్ని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని MIDలో మిల్లీలీటర్‌లలో ప్రదర్శించబడుతుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ప్రస్తుతం, ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, కారులో ప్రతి ఇంధనపు చుక్క కూడా చాలా ముఖ్యమే అని గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఈ ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ ఫీచర్ ప్రస్తుతం పరిస్థితుల్లో ఓ అక్షయపాత్ర లాంటిది అనొచ్చు. అలాగే, ఇందులోని ISG సాయంతో కారును స్టార్ట్ చేసినప్పుడు, ఇది సాధారణం కన్నా తక్కువ ఇంధనాన్ని మండిచడం ద్వారా కారు ఇంజన్‌ను ఆన్ అయ్యేలా చేస్తుంది. తద్వారా కారును తరచూ స్టార్ట్ చేయడం వలన వృధా అయ్యే పెట్రోల్‌లో మరికొన్ని మిల్లీలీటర్లను ఆదా చేస్తుంది. తక్కువ RPMల వద్ద, ISG అవసరమైనప్పుడు అదనపు టార్క్‌ను అందించడం ద్వారా ఇంజన్‌కు సహాయం చేస్తుంది. ఈ ఎమ్‌పివి తక్కువ పీక్ పవర్ ఫిగర్ కలిగి ఉన్నప్పటికీ అవుట్‌గోయింగ్ మోడల్ కంటే మెరుగైన లో ఎండ్ కలిగి ఉండటానికి ఇదే కారణంగా చెప్పవచ్చు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఒక హై-పెర్ఫార్మెన్స్ కారులో ఆశించే పనితీరును ఈ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌తో ఆశించడం సరికాదు. అలాంటి వారికి, ఈ ఇంజన్ పనితీరు కొద్దిగా బలహీనంగానే అనిపిస్తుంది మరియు పూర్తి థ్రోటిల్ (యాక్సిలరేటర్ పెడల్‌ను పూర్తిగా నొక్కినప్పుడు) ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ, కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 హైవేపై పెర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా రాజీపడదు. ఇది ఇప్పటికీ హైవేపై మూడంకెల వేగాన్ని చేరుకోగలదు, కాకపోతే ఇది స్పీడ్ రన్నర్ కాదు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 చూడటానికి చిన్నగా అనిపించిప్పటికీ, ఇది పొడవైన వాహనం మరియు ఈ కారును కార్నర్స్‌లో డ్రైవ్ చేసేటప్పుడు దీనిని అనుభూతి చెందవచ్చు. కాబట్టి, కార్నరింగ్స్ (మలుపుల) వద్ద ఈ కారుతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి అధిక వేగంతో కార్నర్స్‌లో (మలుపుల్లో) డ్రైవ్ చేసేటప్పుడు దీని బాడీ రోల్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

ఈ కారులోని స్టీరింగ్ చాలా తేలికగా అనిపిస్తుంది, తక్కువ వేగంతో కారును నడుపుతున్నప్పుడు ఈ ఫీల్ స్పష్టంగా తెలుస్తుంది. అధిక వేగంతో నడుపుతున్నప్పుడూ ఈ స్టీరింగ్ తేలికగానే అనిపిస్తుంది, అయితే ఇది డ్రైవర్ కాన్ఫిడెన్స్‌ను స్వల్పంగా దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీద, కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 భారత రోడ్లపై డ్రైవ్ చేయడానికి ఓ చక్కని ఎమ్‌పివిగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని వెంటిలేటెడ్ సీట్ ఫీచర్‌ శరీరానికి మరియు మనసుకి ఎంతో హాయిని అందిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

2022 ఎక్స్ఎల్6 - సేఫ్టీ ఫీచర్లు

ఇటీవలి కాలంలో మారుతి సుజుకి ఇండియా తమ వాహనాలలో అందించే సేఫ్టీ ఫీచర్లను బాగా మెరుగుపరిచిందనే చెప్పాలి. కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో లభించే సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో సుజుకి-టెక్ట్ బాడీ, ఈబిడితో కూడిన ఏబిఎస్, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, పెడస్టేరియన్ ప్రొటెక్షన్ సిస్టమ్, కొల్లైజన్ అలెర్ట్, సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్లు మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు మొదలైనవి ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

2022 ఎక్స్ఎల్6 - ఇతర ముఖ్యమైన ఫీచర్లు

ఈ కారులో లభించే ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఫ్రంట్ వెంటిలేటెడ్ కప్ హోల్డర్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, 360-డిగ్రీ కెమెరా, ఆటో ORVM (సైడ్ మిర్రర్లు), రెండవ వరుసలో ఏసి వెంట్స్ మరియు కెప్టెన్ సీట్లు ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

2022 ఎక్స్ఎల్6 - వేరియంట్లు, ధరలు

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఆరు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్ల వారీ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Maruti XL6

Manual Automatic
Zeta ₹11,29,000 ₹12,79,000
Alpha ₹12,29,000 ₹13,79,000
Alpha+ ₹12,89,000 ₹14,39,000
Alpha+ Dual Tone ₹13,05,000 ₹14,55,000
కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

2022 ఎక్స్ఎల్6 - కలర్ ఆప్షన్లు

కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, కొత్త 2022 మారుతి ఎక్స్ఎల్6 నెక్సా బ్లూ, రెడ్, ఖాకీ, గ్రే, సిల్వర్ మరియు వైట్ అనే 6 సింగిల్ టోన్ మరియు రెడ్ విత్ బ్లాక్ రూఫ్‌, ఖాకీ విత్ బ్లాక్ రూఫ్ మరియు సిల్వర్ విత్ బ్లాక్ రూఫ్‌ అనే 3 డ్యూయెల్ టోన్ ఆప్షన్లలో లభిస్తుంది. మొత్తంగా ఇందులో 9 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో నెక్సా బ్లూ షేడ్ ఇంతకు ముందు విక్రయించబడిన ఎక్స్ఎల్6 లైనప్‌లో ఉన్నప్పటికీ, ఈ కొత్త 2022 మోడల్ కొత్త నెక్సా బ్లూ కలర్‌తో వస్తుంది. మా అభిప్రాయం ప్రకారం ఇది పాతదాని కంటే చాలా మెరుగ్గా కనిపిస్తోంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డీటేల్డ్ రివ్యూ: ఎర్టిగా కా బాప్.. ఎమ్‌పివిలలో నేనే తోప్..!

2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 - చివిరగా ఏం చెబుతామంటే..?

కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 పాత మోడల్ కంటే మెరుగైనదా? అని అడిగితే, దీనికి మేము ఖచ్చితంగా అవుననే సమాధానం చెబుతాం. అనేక విషయాల్లో ఇది పాత మోడల్ కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ 2022 మోడల్‌లో ఇప్పుడు అనేక కొత్త ఫీచర్లు లభిస్తాయి. అలాగే, ఇందులో కొత్త ఇంజన్ మరియు గేర్‌బాక్స్‌లను ఉపయోగించారు. ఒకవేళ మీరు ఈ ధర పరిధిలో ఓ మంచి ఎమ్‌పివిని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, రోజూవారీ ఉపయోగం కోసం కొత్త 2022 మారుతి ఎక్స్ఎల్6 మీకు ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తుంది. కొత్త అవతార్‌లో వచ్చిన ఈ కొత్త మోడల్ మీ కొత్త అవసరాలకు సరికొత్తగా ఉంటుంది.

Most Read Articles

English summary
Maruti suzuki xl6 facelift first drive review price features driving impressions and more
Story first published: Tuesday, April 26, 2022, 7:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X