Mercedes AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. ఓ లుక్కేసుకోండి

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ బ్రాండ్స్ లో ఒకటి మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz). జర్మనీకి చెందిన ఈ లగ్జరీ కార్ తయారీ సంస్థ భారత మార్కెట్లో కొత్త హ్యాచ్‌బ్యాక్ విడుదల చేయడానికి సాన్నాహాలు సిద్ధం చేస్తోంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త మెర్సిడెస్ మెర్సిడెస్ ఏఎమ్‌జి ఏ45 ఎస్ (Mercedes-AMG A45 S) చూడటానికి చాలా స్టైలిష్ డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది.

ఇటీవల మేము ఈ కొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి ఏ45 ఎస్ (Mercedes-AMG A45 S) డ్రైవ్ చేసాము. కావున ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు రైడింగ్ ఇంప్రెషన్ వంటి వాటిని గురించి మరింత సమచారం ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా.. మీ కోసం.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

Mercedes-AMG A45 S ఎక్స్టీరియర్ డిజైన్ మరియు స్టైల్:

Mercedes-AMG A45 S యొక్క డిజైన్ మొదటి చూపులోనే చాలా ఆకర్షించే విధంగా ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క ముందు నుండి, కొత్త A45 S స్టాండర్డ్ A-క్లాస్ కంటే చాలా వెడల్పుగా కనిపిస్తుంది. ఎదుకంటే ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క పునర్నిర్మించిన ఫ్రంట్ ఎండ్ దీనిని మరింత వెడల్పుగా చూపించడంలో సహాయ పడుతుంది.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

ఇందులోని క్రోమ్ హారిజాంటల్ బార్‌లతో కూడిన స్టాండర్డ్ మెర్సిడెస్ గ్రిల్ పొందుతుంది. కొత్త AMG A45 S హ్యాచ్‌బ్యాక్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే పనామెరికానా గ్రిల్‌ పొందుతుంది. ఈ గ్రిల్ లో వర్టికల్ స్లాట్ మరియు దాని మధ్యలో పెద్ద మెర్సిడెస్ బ్యాడ్జ్ ఉన్నాయి.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

Mercedes-AMG A45 S యొక్క గ్రిల్‌కు ఆనుకుని A-క్లాస్ యొక్క యాగ్యులర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ కారు యొక్క బోనెట్ కింద చల్లటి గాలిని అందించడానికి పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లతో పునర్నిర్మించిన ఫ్రంట్ ఆప్రాన్ ఉంటుంది. బోనెట్‌పై ఉన్న పవర్ డోమ్‌లు ఇతర A-క్లాస్‌తో పోల్చితే A45 S యొక్క విస్తృత ఫ్రంట్ ట్రాక్‌తో పెంపొందించబడిన ఫ్రంట్ ఎండ్ యొక్క కండరాల రూపాన్ని జోడిస్తుంది.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

AMG A45 S సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లను కలిగి ఉంటుంది. ఇవి బ్లాక్ కలర్ లో మరియు మిచెలిన్ రబ్బర్‌తో పూర్తి చేయబడి ఉంటుంది. ఇందులో బ్రేక్ కాలిపర్‌లు రెడ్ కలర్ లో ఉండటం మీరు ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ కొత్త మోడల్ స్టాండర్డ్ A-క్లాస్ కాదని తెలుపడానికి, టర్బో 4మ్యాటిక్ ప్లస్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

వెనుక భాగంలో A45 S బ్యాడ్జింగ్, స్లీకర్ రియర్ టెయిల్‌లైట్‌లు మరియు డిఫ్యూజర్ ఎలిమెంట్ వంటివి సాధారణమైనదిగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ కొత్త Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్ చూడటానికి అద్భుతంగా మరియు చాలా ఆకర్షనీయంగా ఉంది అని మాత్రమే ఖచ్చితంగా చెప్పవచ్చు.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

Mercedes AMG A45 S ఇంటీరియర్ మరియు ఫీచర్లు:

AMG A45 S లోపలి అడుగుపెట్టగానే మీకు అద్భుతమైన క్యాబిన్ స్వాగతం పలుకుతుంది. ఇందులోని ఇంటీరియర్ డిజైన్ దాదాపు దాని A-క్లాస్ ఇంటీరియర్ డిజైన్ మాదిరిగా ఉంటుంది. స్టాండర్డ్ A-క్లాస్ ఇంటీరియర్ కూడా చాలా అత్యుత్తమంగా ఉంటుంది. కావున AMG A45 S ఇదే క్వాలిటీ ఇంటీరియర్ పొందుతుంది.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

AMG A45 S యొక్క డ్యాష్‌బోర్డ్‌లో డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ మరియు MBUX పవర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ యొక్క ట్విన్ డిస్‌ప్లేలు ఉన్నాయి. ఇందులోని రెండు డిస్‌ప్లేను చాలా షార్ప్ రెస్పాన్స్ అందిస్తాయి. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 'హే మెర్సిడెస్' అనే పదాలను అనుసరించే వాయిస్ కమాండ్‌లకు కూడా రెస్పాండ్ అవుతుంది.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

లోపలి భాగంలో అద్భుతమైన స్టీరింగ్ వీల్ కనిపిస్తుంది. ఇది AMG యూనిట్ మరియు లెదర్ మరియు మైక్రోఫైబర్‌తో అలంకరించబడి 12 'o క్లాక్ స్ట్రిప్‌ను కలిగి ఉంటుంది. అలాగే బర్మీస్టర్ సౌండ్ సిస్టమ్ మరియు AMG పెర్ఫార్మెన్స్ సీట్లు ఇందులో ఉన్నాయి. ఇందులోని సీట్లు మీరు సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కూడా చాలా అనుకూలమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

Mercedes AMG A45 S ఇంజిన్, స్పెక్స్ మరియు పర్ఫామెన్స్:

మనం Mercedes AMG A45 S ఎలాంటి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది అని తెలుసుకోవడానికి ముందు, ఇంజిన్ గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం..

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

Mercedes-AMG A45 S కేనేడు ఉత్పత్తిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఫోర్-సిలిండర్ ఇంజన్‌తో ఆధారంగా ఉంటుంది. AMG ఈ ఇంజన్‌ని A35లో ఉన్న ఇంజిన్‌కి భిన్నంగా చేయడానికి చాలా కష్టపడింది అని తెలుస్తుంది. ఇందులో ఇప్పటికీ అడ్డంగా అమర్చబడిన ఇంజిన్ 180 డిగ్రీలు తిప్పబడింది. ఎగ్జాస్ట్ పోర్ట్‌లు మరియు టర్బోచార్జర్ ఫైర్‌వాల్‌ను ఎదుర్కొంటున్నప్పుడు ఇన్‌టేక్‌లు ఇప్పుడు ముందు వైపు ఉన్నాయి. ఇది ఇంజిన్ బే లోపల వాయుప్రసరణకు ప్రయోజనం చేకూరుస్తుంది, ఇది శీతలీకరణకు సహాయపడుతుంది.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

టర్బోచార్జర్ రోలర్ బేరింగ్‌లను కలిగి ఉంటుంది, ఇవి ఘర్షణను తగ్గించడంలో సహాయపడతాయి మరియు ఎగ్జాస్ట్ వాల్వ్‌లు పెద్దవిగా ఉంటాయి, కావున ఇవి ఎగ్జాస్ట్ వాయువుల ప్రవాహాన్ని పెంచుతాయి.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

ఇంజిన్ నిర్దిష్ట అవుట్‌పుట్‌ను పెంచడంలో సహాయపడే టూ టైప్స్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. అంటే దీని అర్థం A45 S యొక్క బానెట్ క్రింద ఉన్న 2.0-లీటర్ ఇంజన్ అమర్చబడి ఉంతుంది. Mercedes-AMG A45 S 1,991 సిసి ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ నుండి ట్విన్-స్క్రోల్ టర్బోచార్జర్‌తో శక్తిని పొందుతుంది, ఇది 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 421 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ - 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి, నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

Mercedes-AMG A45 S మొత్తం 6 డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి స్లిప్పరీ, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్, రేస్ మరియు ఇండ్యూజువల్ మోడ్స్. అంతే కాకుండా ఇందులో మెర్సిడెస్ డ్రిఫ్ట్ మోడ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది యాక్టివేట్ అయినప్పుడు A45 S మరింత అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. Mercedes AMG A45 S కేవలం 3.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం నుండి 278 కిమీ/గం వేగంతో దూసుకుపోతుంది.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

Mercedes AMG A45 S డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

Mercedes AMG A45 S ఎలాంటి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది అనే విషయానికి వస్తే, ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని మేము ఖచ్చితంగా చెప్పగలము. మీరు రేస్ మోడ్‌కి మారగానే, ఎగ్జాస్ట్ వాల్వ్‌లను తెరవడానికి స్టీరింగ్ వీల్‌పై బటన్‌ను క్లిక్ చేయండి. కారు వేగం నిజంగా చిరుతలా ఉంటుంది. మొత్తానికి పాప్స్ మరియు బ్యాంగ్స్ బిగ్గరగా ఉంటాయి మరియు అప్ అండ్ డౌన్‌షిఫ్ట్‌లలో ఎక్కువగా కనిపిస్తాయి.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

మేము కారును NATRAX వద్ద 230 కిమీ/గం కంటే ఎక్కువ వేగంతో డ్రైవ్ చేసాము. ఈ వేగంలో కూడా మీకు స్టీరింగ్ చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది మీరు మీకు నచ్చిన వేగంలో ప్రయాణించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అడాప్టివ్ డంపర్‌లు మేజిక్ లాగా పనిచేస్తాయి.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

మేము గరిష్టంగా ఎలక్ట్రానిక్ పరిమితమైన 278 కిమీ/గం గరిష్ట వేగంన్ని సాధించాము. ఓవర్ హై-స్పీడ్ టెస్ట్ ట్రాక్ 16 మీటర్ల వెడల్పుతో, నాలుగు భారీ లేన్‌లతో ఉన్నందున, మా స్పీడ్ వేగానికి ఎక్కడా ఎక్కువ బ్రేకింగ్ లేదు. కానీ పిట్ లేన్‌కి తిరిగి రావడానికి వేగాన్ని తగ్గించేటప్పుడు బ్రేక్‌లను వర్తింపజేయడం, ఎంత త్వరగా పని చేస్తాయో మీరు ఇక్కడ చూడవచ్చు.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

NATRAX హై-స్పీడ్ ట్రాక్ ద్వారా మా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ డ్రైవింగ్ ఇంప్రెషన్‌ చాలా అద్భుతంగా ఉంది. ఇది కేవలం మూడు నిమిషాలలోపు (1-ల్యాప్) పూర్తయింది. కావున మొత్తానికి ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలము.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

Mercedes AMG A45 S హ్యాచ్‌బ్యాక్ మంచి డిజైన్ కలిగి ఉండి, అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. NATRAX యొక్క హై-స్పీడ్ ట్రాక్ లో చాలా అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

Mercedes-AMG A45 S ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: వచ్చేసింది.. చూసారా..!!

కొత్త Mercedes AMG A45 S ధర గురించి కంపెనీ ఇంకా అధికారిక సమాచారం అందించలేదు. విడుదల సమయంలో ధర వివరాలు వెల్లడవుతాయి. AMG A45 S మూలల్లో డ్రైవ్ చేయడానికి కూడా వెనక్కి తగ్గేది లేదు. ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ మరియు గ్రిప్పీ మిచెలిన్ PS 4S టైర్లు రోడ్డుపైన మంచి పట్టును అందించడంలో సహాయపడతాయి. కావున కొత్త AMG A45 S మంచి పర్ఫామెన్స్ అందించి వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలము.

Most Read Articles

English summary
Mercedes amg a 45 s telugu review interiors features specs engine performance driving impressions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X