మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లకు అత్యధిక డిమాండ్ ఉండటం వల్ల, ప్రీమియం కార్లను కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీలు సరసమైన ధలకే తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. ఈ తరుణంలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ఏ-క్లాస్ లిమోసిన్ ను ప్రవేశపెట్టింది. ఇది క్వాలిటీ ఇంటీరియర్స్, లగ్జరీ ఫీచర్స్ తో పాటు మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

ఇటీవల మేము మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్‌ను సుందరమైన గోవా వీధుల్లో డ్రైవ్ చేసాము. కంపెనీ నిర్దేశించిన ఫీచర్స్ మరియు దీని పనితీరు వంటి ఇతర అంశాలను గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూలో తెలుసుకుందాం.. రండి.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

డిజైన్ మరియు స్టైల్:

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్‌ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది బ్రాండ్ యొక్క కొన్ని సిగ్నేచర్ ఎలిమెంట్స్ కలిగి ఉంది. ఏదేమైనా ఏ-క్లాస్ యొక్క డిజైన్ లోని హైలైట్ దాని బాడీ షేప్. ఎ-క్లాస్ యొక్క బోనెట్‌పై క్లీన్ లైన్స్ ఉండటమే కాకుండా, ఈ సెడాన్ యొక్క సైడ్ ప్రొఫైల్‌ మంచి డిజైన్‌ను కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

ఈ లగ్జరీ సెడాన్ యొక్క ముందుభాగం నుంచి ప్రారంభమయినట్లైతే, ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన సొగసైన ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. హెడ్‌ల్యాంప్‌ల మధ్య, క్రోమ్ తో నిండిన ఫ్రంట్ గ్రిల్ మధ్య లార్జ్ త్రీ-పాయింటెడ్ స్టార్స్ బ్రాండ్ సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్‌లో క్రోమ్ స్ట్రిప్ కూడా ఉంది. అది చివర వరకు విస్తరించి ఉండటం వల్ల మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

ఫ్రంట్ బంపర్ యొక్క దిగువ భాగంలో మెరుగైన ఎయిర్ ప్లో మరియు కూలింగ్ కోసం మధ్యలో ఎయిర్ డ్యామ్ మరియు రెండు ఎయిర్ పాకెట్స్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ అంతటా ఫ్రంట్ సెన్సార్లు ఉన్నాయి. అంతే కాకుండా కంపెనీ మరొక మెర్సిడెస్ బెంజ్ లోగోను ఫ్రంట్ గ్రిల్ పైన కూడా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

ఏ-క్లాస్ లిమోసిన్ యొక్క సైడ్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే, ఇది డ్యూయల్ టోన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. అల్లాయ్ వీల్స్ స్పోక్స్ మధ్య బ్లాక్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఇది సెడాన్ యొక్క ఏరోడైనమిక్ రూపకల్పనకు చాలా సహాయపడుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

సెడాన్ యొక్క సైడ్ ప్రొఫైల్ క్రోమ్ ఫినిషెడ్ విండో లైన్ మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ తో డ్యూయల్ టోన్ ORVM ద్వారా మెరుగుపరచబడుతుంది. ఎ-క్లాస్ సెడాన్ యొక్క సైడ్ ప్రొఫైల్ హెడ్‌ల్యాంప్‌లు మరియు టైల్ లాంప్స్ మధ్య స్ట్రాంగ్ షోల్డర్ లైన్ కలిగి ఉండటం వల్ల, కారుకు మంచి దూకుడు డిజైన్‌ను అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

కారు యొక్క వెనుక ప్రొఫైల్‌లో, బూట్ లిప్ స్పాయిలర్, స్ప్లిట్-ఎల్‌ఇడి టైల్ లాంప్స్ మరియు డ్యూయల్ క్రోమ్-ఫినిషెడ్ ఎగ్జాస్ట్ టిప్స్ ఉన్నాయి. ఎ-క్లాస్ లిమోసిన్ యొక్క టైల్ లాంప్స్ ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. అంతే కాకుండా రియర్ బంపర్ రెండు చివరలు క్రోమ్ స్ట్రిప్‌ను కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

వెనుక డిజైన్ వేరియంట్ బ్యాడ్జింగ్ మరియు బూట్-లిడ్ పై ఉంచిన మెర్సిడెస్ బెంజ్ లోగోతో పూర్తవుతుంది. రియర్ వ్యూ కెమెరా బూట్-లిడ్ పక్కన ఉంటుంది. కారును రివర్స్ లో ఉంచినప్పుడు మాత్రమే ఇది హౌసింగ్ నుండి బయటకు వస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ యొక్క ఎక్స్టీరియర్ డిజైన్ చాలా సింపుల్ గా ఉంది. ఇది స్మూత్ కర్వ్స్ మరియు ఫ్లోయింగ్ డిజైన్ తో విలాసవంతమైన రూపాన్ని ఇస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

కాక్‌పిట్ మరియు ఇంటీరియర్స్:

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లోపలికి వెళ్ళగానే, సెడాన్ ప్యాక్ లోని ఫీచర్స్ మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. డాష్‌బోర్డ్, డోర్స్, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ ఉపయోగించడంతో ఇంటీరియర్‌ చాలా చక్కగా ఉంటుంది. డాష్‌బోర్డ్ మరియు డోర్స్ పై వుడ్ ఉపయోగించడం ద్వారా ఇంటీరియర్స్ యొక్క అనుభూతి మరింత మెరుగుపడుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

ఇందులో టర్బైన్ స్టైల్ క్రోమ్ ఫినిష్డ్ ఎయిర్-వెంట్స్, క్రోమ్ ఫినిష్డ్ ఎయిర్ కాన్ స్విచ్‌లు, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు పెద్ద-డిస్ప్లే యూనిట్, ఇందులో రెండు 10.25 ఇంచెస్ స్క్రీన్‌లు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చాలా స్మూత్ గా ఉండి, టచ్ చేయగానే రెస్పాండ్ అయ్యే విధంగా ఉంటాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అనేక విధాలుగా ఆపరేట్ చేయవచ్చు. ఇందులో స్టీరింగ్‌లోని టచ్‌ప్యాడ్ బటన్లు, సెంటర్ కన్సోల్‌లోని టచ్‌ప్యాడ్ యూనిట్, MBUX వాయిస్ అసిస్టెంట్ మరియు స్క్రీన్‌పైన ఓల్డ్ స్టైల్ టచ్ ఇన్‌పుట్‌లు ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

MBUX వాయిస్ అసిస్టెంట్ విషయానికి వస్తే, ఇది వాయిస్ కమాండ్స్ ఇవ్వడం ద్వారా కారు యొక్క వివిధ ఫీచర్స్ కంట్రోల్ చేయడానికి వాహనదారులకు సహాయపడుతుంది. ఈ సిస్టమ్ కారు యొక్క రిమోట్ ఆపరేషన్‌ను ప్రారంభించే ‘మెర్సిడెస్ మి' మొబైల్ యాప్ కి కూడా అనుసంధానించబడి ఉంటుంది. రిమోట్ లాక్-అన్‌లాక్, వెహికల్ స్టేటస్ చెక్, జియో-ఫెన్సింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. MBUX లో అలెక్సా మరియు గూగుల్ హోమ్ ఇంటిగ్రేషన్ కూడా ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

MBUX అసిస్టెంట్ కాకుండా, సెడాన్‌లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. ఎ-క్లాస్ ప్రీమియం 12 స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో వస్తుంది.

కారు యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కస్టమైజేషన్ ఆప్సన్ హోస్ట్‌ను కలిగి ఉంది. దీనిని వాహనదారుడు డయల్స్ మరియు లేఅవుట్ల హోస్ట్ నుండి ఎంచుకోవచ్చు. ఇది వాహనదారునికి కావాల్సిన మొత్తం సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. క్యాబిన్ లోపల లైటింగ్ కండిషన్ తో సంబంధం లేకుండా డయల్స్ సులభంగా చదవవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క కస్టమైజేషన్ కోసం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ యొక్క రైట్ సెక్షన్ ఉపయోగించబడుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

డ్రైవర్ ప్రిఫరెన్స్ మరియు లైటింగ్ స్టేటస్ విషయానికి వస్తే, క్యాబిన్ యాంబిఎంట్ లైటింగ్‌ను కలిగి ఉంటుంది. వీటిని 64 డిఫరెంట్ కలర్స్ అప్సన్స్ ద్వారా కస్టమైజ్ చేయవచ్చు. అడ్జస్టబుల్ అండర్ థాయ్ సపోర్ట్ మరియు మెమరీ ఫంక్షన్స్ తో డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ సీట్లు చాలా సౌకర్యంగా ఉంటాయి. ఎ-క్లాస్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌ను కలిగి ఉంది. ఇది సెడాన్ యొక్క లగ్జరీ అనుభవాన్ని మరింత పెంచుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

డాష్‌బోర్డ్‌లోని మూడు ఎయిర్ కాన్ వెంట్ల క్రింద వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ మరియు యుఎస్‌బి టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ మరియు 12-వోల్ట్ సాకెట్ ఉన్నాయి. సెడాన్ క్యాబిన్ అంతటా మొత్తం ఐదు యుఎస్బి టైప్-సి పోర్టులు ఉన్నాయి.

కారు యొక్క వెనుక భాగంలో, ప్రయాణీకుడికి రెండు రియర్ ఎయిర్-కాన్ వెంట్స్ లభిస్తాయి. రియర్ ఎసి వెంట్స్ క్రింద స్మార్ట్‌ఫోన్‌ల కోసం యుఎస్‌బి ఛార్జింగ్ స్లాట్లు మరియు ముందు సీట్ల వెనుక భాగంలో స్టోరేజ్ కోసం పాకెట్స్ ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

ఎ-క్లాస్ లిమోసిన్ యొక్క ఇంటీరియర్స్ రెండు కలర్ స్కీమ్ లతో అందించబడతాయి. అవి ఆర్టికో బ్లాక్ మరియు ఆర్టికో మాకియాటో బీజ్ కలర్స్.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

మెర్సిడెస్ బెంజ్ కార్లు లేఅవుట్, డిజైన్, ఫీచర్స్, ఫీల్, ఫిట్ మరియు ఫినిషింగ్ పరంగా ఉత్తమమైన ఇంటీరియర్‌లను కలిగి ఉన్నాయి. క్యాబిన్ విలాసవంతమైన, సౌకర్యవంతమైన మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉన్నందున A క్లాస్ లిమోసిన్ భిన్నంగా లేదు. పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను ఇందులో చేర్చడం ద్వారా మొత్తం క్యాబిన్ అనుభవం మరింత మెరుగుపడుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ అండ్ బూట్ స్పేస్ :

ఎ-క్లాస్ లిమోసిన్ లోని సీట్లు అద్భుతమైన సౌకర్యాన్ని అందిస్తాయి. ముందు ఉండే ప్రయాణీకులను చాలా తక్కువ కదలికతో ఉంచడానికి ముందు సీట్లు బలంగా ఉన్నాయి. ముందు సీట్లలో లంబర్ సపోర్ట్ వినియోగదారులకు అనుకూలంగా అడ్జస్ట్ చేయవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

వెనుక సీట్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే కుడివైపు పొడవైన ప్రయాణికుడు కూర్చున్నప్పుడు హెడ్ రూమ్ కొంత ఇబ్బందిగా ఉంటుంది. వెనుక భాగంలో లెగ్ రూమ్ చాలా బాగుంటుంది, కావున పొడవైన ప్రయాణీకులు కూడా ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ చేర్చడం ద్వారా వెనుక సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, అంతే కాకుండా ఇంటిగ్రేటెడ్ కప్-హోల్డర్లు కూడా లభిస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

ఎ-క్లాస్ యొక్క ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే, క్యాబిన్ అంతటా మంచి స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. ఫ్రంట్ గ్లోవ్-బాక్స్‌ కొంత పెద్దదిగా ఉండటం వల్ల వాటర్ బాటిల్స్ కూడా ఉంచేందుకు వీలుగా ఉంటుంది.

సెంటర్ కన్సోల్‌లో రెండు కప్ హోల్డర్‌లు వేర్వేరు కప్ పరిమాణాలకు సరిపోయేలా అడ్జస్టబుల్ ఫ్లాప్‌లతో ఉంటాయి. ఫ్రంట్ డోర్ పాకెట్స్ రెండు 1 లీటర్ బాటిల్స్ మరియు 1 హాఫ్ లీటర్ బాటిల్ ఉంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వెనుక డోర్ పాకెట్స్ కూడా ఒక్కొక్కటి 1 లీటర్ మరియు హాఫ్ లీటర్ బాటిళ్లకు అనుకూలంగా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ సెడాన్ 405-లీటర్ల (A200) మరియు 395-లీటర్ల (A200d) బూట్ స్థలాన్ని కలిగి ఉంది. ఇది దాని విభాగంలో అతిపెద్దదనే చెప్పాలి. ఇది ఎక్కువ లగేజ్ ని కూడా సులభంగా లోడ్ చేయడంలో సహాయపడుతుంది.

Dimensions Mercedes-Benz A-Class Limousine
Length 4549mm
Width 1796mm
Height 1446mm
Wheelbase 2729mm
Boot Space 405-Litres
Ground Clearance 127mm
మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్ :

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో స్టాండర్డ్ గా అందించబడుతుంది. మేము ఎ-క్లాస్ సెడాన్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లను రెండింటినీ నడిపాము.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

ఇప్పుడు పెట్రోల్ వేరియంట్‌తో ప్రారంభించినట్లైతే, ఇది 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 1620 ఆర్‌పిఎమ్ వద్ద 161 బిహెచ్‌పి మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ (డిసిటి) డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్ కి స్టాండర్డ్ గా జతచేయబడి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1.3-లీటర్ యూనిట్ నిస్సాన్ కిక్స్ మరియు రెనాల్ట్ డస్టర్ టర్బో వేరియంట్‌లకు కూడా శక్తినిస్తుంది. ఏదేమైనా, ఏ- క్లాస్ యూనిట్ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే, ఈ సెడాన్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్‌తో పనిచేస్తుంది. ఇది బ్రాండ్ నుండి సరికొత్తది. ఇది గరిష్టంగా 1400 ఆర్‌పిఎమ్ వద్ద 148 బిహెచ్‌పి మరియు 3200 ఆర్‌పిఎమ్ వద్ద 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ డిసిటికి జతచేయబడుతుంది.

కొత్త 2.0-లీటర్ ఇంజన్ దాని పెట్రోల్-వేరియంట్ కంటే మంచి పనితీరుని అందిస్తుందని భావించవచ్చు. టర్బో-పెట్రోల్ యూనిట్ కంటే తక్కువ టార్క్ గణాంకాలు పెరగడంమే దీనికి కారణం.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

ఈ కారు యొక్క మైలేజ్ విషయానికి వస్తే A200 పెట్రోల్ వేరియంట్‌కు ARAI రేట్ చేసిన మైలేజ్ ఒక లీటరుకు 17.50 కిమీ, మరియు A200d లో ఒక లీటరుకు 21.35 కిమీ. మాకున్న అతి తక్కువ సమయం వల్ల ఖచ్చితమైన మైలేజ్ పొందలేకపోయాము. అయితే, క్లెయిమ్ చేసిన గణాంకాల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

రెండు ఇంజిన్ ఆప్సన్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్, గేర్‌ల పైకి వెళ్లడం సున్నితంగా అనిపిస్తుంది. ఏదేమైనా, 7-స్పీడ్ యూనిట్ సున్నితమైన డౌన్‌షిఫ్ట్‌లతో చేయగలిగింది, ఎందుకంటే రెవ్-మ్యాచింగ్ గేర్‌బాక్స్ కొన్ని సమయాల్లో గజిబిజిగా అనిపిస్తుంది. మరోవైపు, డీజిల్ వేరియంట్‌లోని 8 స్పీడ్ యూనిట్ డౌన్‌షిఫ్ట్‌లలో కూడా సున్నితంగా ఉంటుంది. మీరు ప్యాడీల్ షిఫ్టర్ల ద్వారా మాన్యువల్లీ కంట్రోల్ తీసుకున్నప్పుడు రెండు గేర్‌బాక్స్‌లు చాలా ప్రతిస్పందిస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

స్టీరింగ్ చాలా అనుకూలంగా ఉంటుంది. అనుభూతి పరంగా, స్టీరింగ్ అందించే ఫీడ్‌బ్యాక్ చాలా తక్కువ, కానీ ఇరవైలలో ప్రయాణించేటప్పుడు ఈ స్టీరింగ్ బరువును పెంచుకునే విధానం సహజమైన అనుభూతి.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

చివరగా చాసిస్ మరియు సస్పెన్షన్ విషయానికి వస్తే, మేము ఏ-క్లాస్ లిమోసిన్ ను గోవాలో డ్రైవ్ చేసాము. ఇక్కడ రోడ్లు చాలా ఇరుకైనవి మరియు కొంత వక్రీకృతంగా ఉన్నాయి. ఏదేమైనా ఎలాంటి రహదారులలో ప్రయాణించడానికి కూడా దీని బాడీ చాలా సహకరిస్తుంది. అంతే కాదు దిశను త్వరగా మార్చే సమయంలో కూడా ఇది ఎటువంటి ఇబ్బందిని ఎదొర్కొలేదు.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

మెర్సిడెస్ బెంజ్ యొక్క ఎ-క్లాస్ ‘డైనమిక్ సెలెక్ట్' సిస్టం కలిగి ఉంది. ఇందులో ఎకో, కంఫర్ట్, స్పోర్ట్ మరియు ఇండివిజువల్ అనే నాలుగు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ప్రతి మోడల్ మధ్య త్రాటల్ రెస్పాన్స్, స్టీరింగ్ ఫీచర్స్ మరియు గేర్‌బాక్స్ బిహేవియర్ గమనించవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

ఎకో మోడ్‌లో, లైట్ స్టీరింగ్ సెటప్‌తో గరిష్ట ఇంధన-సామర్థ్యాన్ని అందించడానికి సెడాన్ ఏర్పాటు చేయబడింది. గేర్‌బాక్స్ త్వరగా గేర్లను మార్చడానికి ప్రాముఖ్యత ఇస్తుంది. స్పోర్ట్ మోడ్‌లో స్టీరింగ్‌ కొంత కఠినంగా ఉంటుంది. త్రాటల్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుంది. స్పోర్ట్ మోడ్‌లోని అధిక RPM ల వద్ద గేర్‌లు, తక్షణ శక్తి కోసం భారీ ఇన్‌పుట్‌లతో క్రిందికి మారుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

ఎ-క్లాస్ లిమోసిన్ లో బ్రేకింగ్ సిస్టం అద్భుతంగా ఉంది. అత్యవసర సమయంలో కూడా బ్రేకింగ్ సిస్టం అద్భుతంగా పనిచేస్తుంది.బ్రేకింగ్ అద్భుతంగా ఉండటం వల్ల వాహనదారుడు ఇబ్బందిపడవలసిన అవసరం ఉండదు.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

కీ ఫీచర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్ :

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో

 • రౌండ్ ఎల్ఇడి లైటింగ్ (హెడ్‌ల్యాంప్‌లు, డిఆర్ఎల్ లు, టైల్ లైట్స్ మరియు టర్న్ సిగ్నల్స్)
 • 17-ఇంచ్ టూ-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్
 • లెదర్ అపోల్స్ట్రే
 • 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
 • 10.25 ఇంచెస్ కస్టమైజేషన్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
 • 64 కలర్ యాంబియంట్ లైటింగ్
 • ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ & కో ప్యాసింజెర్ సీట్లు
 • డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్
 • పనోరమిక్ సన్‌రూఫ్
 • MBUX వాయిస్ అసిస్ట్
 • అలెక్సా & గూగుల్ హోమ్ ఇంటిగ్రేషన్
 • మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

  ఎ-క్లాస్ సెడాన్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో

  • 7 ఎయిర్‌బ్యాగులు
  • బ్లైండ్‌స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టం
  • హిల్-హోల్డ్ కంట్రోల్
  • ట్రాక్షన్ కంట్రోల్,
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
  • ఇబిడి విత్ ఏబీఎస్
  • ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్
  • ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్
  • ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు
  • రివర్స్ పార్కింగ్ కెమెరా
  • పెరీమీటర్ / వాల్యూమెట్రిక్ అలారం
  • మెర్సిడెస్ మి బ్రేక్ డౌన్ & క్రాష్ అసిస్ట్
  • ప్రీ-సేఫ్ హెడ్ రెస్ట్రైన్స్,వంటివి ఉన్నాయి
  • మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

   వేరియంట్స్, కలర్స్ మరియు ప్రైస్:

   మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ సింగిల్ టాప్ స్పెక్ ట్రిమ్‌లో ఎ 200 పెట్రోల్ మరియు ఎ 200 డి డీజిల్ వేరియంట్లలో అందించబడుతుంది. మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో మోర్ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ ఎ 35 AMG వెర్షన్‌ను అందించనుంది. ఎ 35 సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యే రెండవ AMG మోడల్ అవుతుంది.

   మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

   ఎ-క్లాస్ సెడాన్‌లో కలర్ ఆప్షన్స్‌లో పోలార్ వైట్, మోజావే సిల్వర్, మౌంటెన్ గ్రే, కాస్మోస్ బ్లాక్, డెనిమ్ బ్లూ, మరియు ఇరిడియం సిల్వర్ ఉన్నాయి. ఇరిడియం సిల్వర్ పెయింట్ స్కీమ్ ఎంపికలో మాత్రమే బ్లాక్ ఇంటీరియర్ స్కీమ్ ఉంటుంది. మిగిలిన కలర్స్ బీజ్ కలర్ ఇంటీరియర్‌లతో అందించబడతాయి.

   మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

   భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ధర ఇంకా వెల్లడించలేదు. బెంజ్ కంపెనీ లగ్జరీ-సెడాన్‌ను 2021 మార్చి 25 న విడుదల చేయనుంది. అయితే, ఇది బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ సమర్పణగా పరిగణించబడుతున్నందున, దీని ప్రారంభ ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని మేము భావిస్తున్నాము.

   మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

   వారంటీ ఆఫర్ :

   మెర్సిడెస్ బెంజ్, ఎ-క్లాస్ లిమోసిన్‌ను త్రీ ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీతో అందిస్తోంది. అదేవిధంగా సెగ్మెంట్-మొదటి ఎనిమిదేళ్లు అన్ లిమిటెడ్ కిలోమీటర్స్ ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ అదనపు ఖర్చు లేకుండా కంపెనీ అందిస్తోంది. ఎనిమిదేళ్ల వారంటీ తదుపరి యజమానికి కూడా పూర్తిగా బదిలీ చేయబడుతుంది. యాజమాన్యం యొక్క వ్యయాన్ని భారీ తేడాతో తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.

   మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

   స్టాండర్డ్ వారంటీ ప్యాకేజీతో పాటు, కస్టమర్లు అదనపు ఖర్చుతో కొనుగోలు చేయడానికి మెయింటెనెన్స్ ప్యాకేజీలను కూడా కంపెనీ అందిస్తోంది. కంపెనీ 24x7 (RSA) రోడ్-సైడ్ అసిస్టెన్స్‌ను కూడా అందిస్తోంది.

   మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

   కాంపిటీషన్స్ మరియు ఫ్యాక్ట్ చెక్ :

   మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ భారత మార్కెట్లో, ఒకసారి ప్రారంభించిన తర్వాత బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపేకు ప్రత్యర్థిగా ఉంటుంది.

   Specifications Mercedes-Benz A-Class Limousine BMW 2-Series Gran Coupe
   Engine 1.3-litre Turbo-Petrol / 2.0-litre Diesel 2.0-litre Turbo-Petrol / 2.0-litre Diesel
   Power 161bhp/ 148bhp 189bhp/ 188bhp
   Torque 250Nm/ 320Nm 400Nm/ 280Nm
   Transmission 7-Speed DCT/ 8-Speed DCT 7-Speed DCT/ 8-Speed DCT
   Starting Price* TBA** 40.40 Lakh
   మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

   డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

   మెర్సిడెస్ బెంజ్ యొక్క ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ ఏ-క్లాస్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఏ-క్లాస్ మంచి ఇంటీరియర్, ఫిట్ అండ్ ఫినిష్ మరియు లేటెస్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి కలిగి ఉంటుంది. మీరు ఇటీవల కాలంలో ఒక మంచి లగ్జరీ సెడాన్ కోసం వేచి చూస్తున్నట్లైతే బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ మీకు తప్పకుండా మంచి ఎంపిక అవుతుంది.

Most Read Articles

English summary
Mercedes-Benz A-Class Sedan First Drive Review. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X