కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) గురించి దేశీయ వినియోగదారులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ అనేక ఆణిముత్యాల్లాంటి కార్లను మార్కెట్లో విడుదల చేసింది. ఆటోమోటివ్ ప్రపంచంలో అత్యధిక విజయగాథలను రచించిన కార్లలో మెర్సిడెస్-బెంజ్ బ్రాండ్ కూడా ఒకటి. దాదాపు Mercedes-Benz అందించిన అన్ని కార్లు కూడా దానికవే ప్రత్యేకతను కలిగి ఉండి, ఒక విజయగాథను కలిగి ఉన్నాయి. ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ దీనికి ఓ సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, ఈ బ్రాండ్ యొక్క 190 సిరీస్‌కి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయబడింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ఈ మెర్సిడెస్ బెంజ్ 190 మోడల్‌కి ఎంతో గౌరవం ఉంది. మెర్సిడెస్ బెంజ్ తాలిసారిగా 1990 కాలంలో భారీ అంచనాలతో తమ సి-క్లాస్ సెడాన్‌ను ప్రారంభించింది. ఒక్కమాటలో చెప్పాలంటే, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ గడచిన కొన్ని సంవత్సరాలుగా మరియు దాదాపు ఐదు తరాలుగా ఈ జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ కోసం చాలా అద్భుతంగా పనిచేస్తున్న ఓ సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచింది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

మెర్సిడెస్ బెంజ్ 2021లో తమ ఆరవ తరం సి-క్లాస్‌ కారును అనేక అంతర్జాతీయ మార్కెట్‌లలో విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఈ ఫ్లాగ్‌షిప్‌ను సూచిస్తూ దీనికి 'ది బేబీ ఎస్-క్లాస్' అని పేరును పెట్టింది. ఈ మోడల్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలైన దాదాపు ఏడాది తర్వాత, కొత్త సి-క్లాస్ ఇప్పుడు భారత మార్కెట్‌లోకి కూడా ప్రవేశించింది. ఈ లగ్జరీ సెడాన్‌ను మేము 'క్వీన్ ఆఫ్ ది హిల్స్' అని పిలువబడే ముస్సోరీలోని అందమైన ప్రదేశాల చుట్టూ టెస్ట్ డ్రైవ్ చేశాము మరియు ఇది కొత్త సి-క్లాస్ యొక్క మంచి చెడులను తెలుసుకోవడంలో మాకు ఎంతగానో ఉపయోగపడింది.

మరి ఈ కొత్త తరం మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ నిజంగా ఓ బేబీ ఎస్-క్లాస్‌గా ఉంటుందా? 2022లో మెర్సిడెస్-బెంజ్ ఇండియా రాయబోయే కొత్త విజయగాథ ఇదేనా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ - డిజైన్ మరియు స్టైల్

మెర్సిడెస్ బెంజ్ గడచిన ఐదు తరాలుగా మార్కెట్లో విడుదల చేసిన సి-క్లాస్ డిజైన్ విషయంలో చేసిన మార్పులు ఒక ఎత్తయితే, ఈ కొత్త ఆరవ తరం సి-క్లాస్ సెడాన్‌లో చేసిన మార్పులు మరొక ఎత్తు. అలాగని, మునుపటి మోడళ్లు బాగోలేవని కాదు, వేటికవే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. మారుతున్న కాలంతో పాటే, మెర్సిడెస్ బెంజ్ కూడా తమ సి-క్లాస్ సెడాన్ డిజైన్‌లో చేసిన మార్పులు చాలా స్ఫూర్తిదాయకం. కొత్త తరం మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ దాని మునుపటి తరం మోడళ్లతో సంబంధం తెంచుకోకుండా, దాని ప్రస్తుత డిజైన్ లాంగ్వేజ్‌లో కూడా దాని మునుపటి తరాలతో కొన్ని కనెక్షన్‌లను కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

అయితే, ఈ కొత్త ఆరవ తరం మోడల్‌తో చేసిన కొన్ని ముఖ్యమైన మార్పులను పాత అవుట్‌గోయింగ్ సి-క్లాస్ నుండి తీసుకోలేదు, కానీ సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ఎస్-క్లాస్ నుండి తీసుకోబడ్డాయి. ఇదే సి-క్లాస్‌కి అత్యధికంగా అమ్ముడైన పాయింట్‌లలో ఒకటిగా మారేలా చేసింది. సాధారణంగా ఎస్-క్లాస్ కార్లు ఈ జర్మన్ కార్ బ్రాండ్ నుండి లభిస్తున్న అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన మోడళ్లు. అలాంటిది, దాని కన్నా దాదాపు సగం ధరకే, చిన్న S-Class లాగా కనిపించే C-Class ని ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి?

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

ఈ కొత్త తరం సి-క్లాస్ సెడాన్ ఇప్పుడు మెర్సిడెస్-బెంజ్ పోర్ట్‌ఫోలియోలోని ఇతర సెడాన్‌లకు అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ప్రతి యాంగిల్ నుండి కూడా చక్కదనంతో నిండిన డిజైన్‌తో, చాలా అధునాతనంగా కనిపిస్తుంది. ఈ కారు వెనుక భాగపు డిజైన్ చాలా ఆకట్టుకుంటుంది. వెనుక వైపున టెయిల్ ల్యాంప్‌లు ఇప్పుడు మరింత కోణీయంగా కనిపిస్తాయి మరియు దాని లోపల ఒక విధమైన క్యాస్కేడింగ్ స్టైల్‌లో ఉంచబడిన ఎల్ఈడిలు ఈ డిజైన్ ఫ్యాక్టర్‌ను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బూట్ లిడ్ మరింత వంపుగా ఉంటుంది మరియు ఈ బ్రాండ్ యొక్క ఐకానిక్ త్రీ-పాయింటెడ్ స్టార్ హైలైట్‌గా నిలుస్తుంది. బూట్ లిడ్ యొక్క ఎడమ వైపున వేరియంట్ బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

వెనుక బంపర్ చాలా బలంగా కనిపిస్తుంది మరియు ఇది సెడాన్ బాడీతో సజావుగా మిళితం అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ బంపర్ దిగువన క్రోమ్ సరౌండ్‌లతో కూడిన రెండు ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు ఉంటాయి, ఇవి క్రోమ్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. వెనుక వైపు వాలుగా ఉన్న రూఫ్‌లైన్‌తో కొత్త తరం సి-క్లాస్ చాలా మోడ్రన్‌గా కనిపిస్తుంది. ఇక సైడ్ డిజైన్‌ను గమనిస్తే, ఇక్కడ ముందుగా మీ దృష్టిని ఆకర్షించేది ఇందులోని స్టైలిష్ 17 ఇంచ్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్. ఇందులోని టాప్-స్పెక్ C300d వేరియంట్ మరింత స్పోర్టీగా కనిపించే AMG-లైన్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

సైడ్స్‌లో మెర్సిడెస్-బెంజ్ చాలా మినిమలిస్టిక్ డిజైన్ లాంగ్వేజ్‌ని ఉపయోగించింది. ఇక్కడ షోల్డర్ లైన్ మాత్రమే చాలా ప్రముఖమైన క్యారెక్టర్ లైన్‌ను కలిగి ఉంటుంది. డోర్ హ్యాండిల్స్ చక్కగా మరియు మందంగా డిజైన్ చేయబడ్డాయి మరియు వాటి మధ్యలో క్రోమ్ స్ట్రిప్‌ను కలిగి ఉంటాయి. కొత్త సి-క్లాస్ అవుట్‌గోయింగ్ మోడల్ కంటే 65 మిమీ పొడవుగా ఉంటుంది, ఇది సైడ్ నుండి చూసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

ఇక ఫ్రంట్ డిజైన్ విషయానికి వస్తే, ముందు భాగంలో Mercedes-Benz యొక్క సిగ్నేచర్ ఫ్యామిలీ లాంగ్వేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో వ్రాప్‌అరౌండ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు ఒకే ఒక ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను కలిగి ఉంటాయి, ఇది చిన్న సి-క్లాస్ అని సూచిస్తుంది. ఈ బ్రాండ్ నుండి లభించే ఇ-క్లాస్ లో రెండు ఫీచర్లు మరియు ఎస్-క్లాస్ లో మూడు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. మెర్సిడెస్ సిగ్నేచర్ స్టార్-స్టడెడ్ గ్రిల్ ముందు భాగంలో ప్రధానంగా ఉంటుంది మరియు దానిపై పెద్ద త్రీ-పాయింటెడ్ స్టార్ (కంపెనీ లోగో) కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

కొత్త తరం సి-క్లాస్ ఫ్రంట్ ఎండ్‌కు మంచి క్యారెక్టరిస్టిక్స్‌ను అందించే ప్రధాన డిజైన్ అంశాలు దాని బానెట్‌పై కనిపిస్తాయి. బానెట్‌పై ఉన్న పవర్ బాడీ లైన్స్ ఈ డిజైన్‌కు మంచి మజిక్యులర్ లుక్‌ని జోడిస్తాయి, ఫలితంగా ముందు వైపు నుండి ఈ కారు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ కారుకి ఫ్రంట్ బంపర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది, ఇందులో ఫాగ్ ల్యాంప్‌లు మరియు దిగువ భాగంలో సిల్వర్‌తో ఫినిష్ చేయబడిన స్కఫ్ ప్లేట్ ఉంటుంది. మొత్తం మీద, కొత్త 2022 మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ చాలా సింపుల్ అండ్ మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, కంపెనీ డిజైనర్లు మాత్రం ఇందులో చిన్న చిన్న ట్వీక్స్ చేయడం ద్వారా ఓ మ్యాజిక్‌ను సృష్టించగలిగారని చెప్పవచ్చు.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ - కాక్‌పిట్ మరియు ఇంటీరియర్

బెంజ్ కార్లంటేనే విలాసానికి పెట్టింది పేరు, కాబట్టి కొత్త తరం సి-క్లాస్ ఈ విషయంలో మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపరచదు. ఇంటీరియర్‌లో కనిపించే అల్యూమినియం బటన్‌లు, హాప్టిక్ టచ్ ప్యానెల్‌లు, పెద్ద స్క్రీన్‌లు మరియు యాంబియెంట్ లైట్లతో ఇది ఖచ్చితంగా మీ మూడ్‌ని సెట్ చేస్తుంది. కొత్త Mercedes-Benz C-Class డోర్ హ్యాండిల్స్‌ని లాగి, కారులోకి ప్రవేశించగానే, హలో వరల్డ్ అంటూ మీకు ఓ కొత్త లోకం స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

ఈ కారులోని స్టీరింగ్ వీల్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది, మునుపటి కన్నా మరింత మెరుగ్గా అనిపిస్తుంది. ఇది ప్రీమియం లెథర్‌తో చుట్టబడి ఉంటుంది, అయితే సైజ పరంగా మాత్రం కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది. కారులోని వివిధ పరికరాలును మరియు ఫీచర్లను కంట్రోల్ చేయడానికి ఈ స్టీరింగ్ వీల్‌పై పలు కంట్రోల్ బటన్స్ కనిపిస్తాయి. స్టీరింగ్ వీల్‌లోని టచ్ ప్యాడ్‌ల సాయంతో డ్రైవర్‌లు ఇప్పుడు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ లోని వివిధ ఫీచర్లను మార్చడానికి మరియు స్క్రోల్ చేయడానికి మరియు అలాగే తమకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకోవాడనికి కూడా సహాయపడతాయి. అంటే, డ్రైవర్ తన స్టీరింగ్ వీల్‌పై నుండి చేయి తీయాల్సిన అవసరం లేకుండానే ఈ ఫీచర్లన్నింటినీ కంట్రోల్ చేయవచ్చన్నమాట.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో డ్రైవర్‌కు సమాచారం అందించేందుకు గానూ ఇక్కడ ఓ పెద్ద 12.3 ఇంచ్ ఫ్లోటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కనిపిస్తుంది. ఈ కారులోని దీనిని అమర్చిన మరియు డిజైన్ చేసిన విధానాన్ని చూస్తుంటే, ఇది ఖచ్చితంగా ఎస్-క్లాస్ నుండి ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తుంది. ఈ స్క్రీన్‌పై కారు ప్రయాణించే వేగం, ఇంజన్ వేగం, డ్రైవ్ మోడ్‌లు, గేర్ పొజిషన్, సగటు మైలేజ్, ​​ట్రిప్ మీటర్లు వంటివి మాత్రమే కాకుండా, కారు యొక్క వివిధ అంశాల గురించి చాలా సమాచారం ప్రదర్శించబడుతుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

ఈ డిస్‌ప్లే యూనిట్‌లో అత్యంత ఆధునిక టెక్నాలజీ ప్యాక్ చేయబడింది, ఇందులోని ఫీచర్ గురించి వివరించాలంటే, కొన్ని గంటల సమయం పడుతుంది. ఇందులో ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే, ఈ డ్రైవర్ డిస్‌ప్లే యొక్క లేఅవుట్‌ను కూడా మనకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవ్చచు. ఈ డిస్‌ప్లే యూనిట్‌కి ఎడమ వైపుగా మరియు కారు మధ్యలో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను ఎవ్వరైనా సరే దృష్టిని మరల్చుకోవడం కష్టం. ఇది కూడా ఫ్లోటింగ్ డిజైన్‌తో ఎస్-క్లాస్ మోడల్‌లో కనిపించే యూనిట్ మాదిరిగా ఉంటుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

కారులోని ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 11.9 ఇంచ్‌ల సైజులో ఉండి, నిలువుగా టాబ్లెట్ స్క్రీన్ మాదిరిగా అమర్చబడి ఉంటుంది. కాబట్టి, ఇది ఖచ్చితంగా పెద్దదిగా కనిపిస్తుంది. అయినప్పటికీ, ఇది డ్యాష్‌బోర్డులో అడ్డుగా అనిపించదు మరియు వాడుకలో సౌలభ్యం కోసం ఇది డ్రైవర్ వైపు కొద్దిగా వంగి ఉన్నట్లు ఉంటుంది. డ్రైవర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మాదిరిగానే ఈ డిస్‌ప్లే యూనిట్ కూడా ఫుల్లీ లోడెడ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది రెండవ తరం MBUX ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది మరియు ఇందులో అనేక లేటెస్ట్ కార్ కనెక్టింగ్ ఫీచర్లు మరియు వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యొక్క కస్టమైజేషన్ సెట్టింగ్‌లు మరియు డేటాను యాక్సెస్ చేయడం కోసం వేలిముద్ర (బయోమెట్రిక్) లేదా వాయిస్ రికగ్నిజషన్ లాక్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

కొత్త తరం మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ లోని ఏసి వెంట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి బ్రష్డ్ అల్యూమినియం ఫినిషింగ్‌లో ఉండి, జెట్-ప్రేరేపిత వెంట్‌ల మాదిరిగా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఇక సెంటర్ కన్సోల్‌ విషయానికి వస్తే, ఇది చాలా మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో నాబ్‌లు, బటన్‌లు, గేర్ లివర్‌తో పాటుగా డ్యూయల్-జోబ్ క్లైమేట్ కంట్రోల్‌ ఫీచర్లు ఉంటాయి. ఇందులోని డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ క్యాబిన్‌ను చాలా వేగంగా చల్లబరుస్తుంది, ప్రస్తుత వేసవిలో ఈ ఫీచర్ చాలా అవసరమైనది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

సెంటర్ కన్సోల్‌లో కొంత స్టోరేజ్ స్పేస్‌ కోసం ఆర్మ్‌రెస్ట్ క్రింది భాగంలో ఓ క్యూబీ హోల్ ఉంటుంది. ఈ ఆర్మ్‌రెస్ట్ కూడా ప్రీమియం లెథర్‌తో చుట్టబడి ఉండి, చాలా సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుంది. కస్టమర్లు ఇంటీరియర్స్‌లో ఇప్పుడు మకియాటో బేజ్, సియెన్నా బ్రౌన్ మరియు బ్లాక్ అనే మూడు రకాల కలర్ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు. వీటిలో ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మరియు కొత్త మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ లోపలి భాగాన్ని మరింత అందగా మారుస్తుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

ఈ కారులో యాంబియంట్ లైటింగ్ ఫీచర్ ఉంటుంది, దీనిని మీ మూడ్‌కి తగినట్లుగా మార్చుకునే వెసలుబాటు ఉంటుంది. ఈ ఫీచర్ కారు లోపల మీ మనస్సుకి హాయిని మరియు ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ ఫీచర్‌లో భాగంగా అందించిన కలర్ ఆప్షన్లు కూడా కళ్లకు చాలా ఇంపుగా అనిపిస్తాయి. ఇందులో మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే, ఒకవేళ మీరు మీ మనస్సుకి నచ్చిన యాంబియెంట్ కలర్‌ను కనుగొనలేకపోతే, మీరు ఎంచుకున్న డ్రైవింగ్ మోడ్‌కు అనుగుణంగా సి-క్లాస్ దానంతట అదే సరైన కలర్‌ను గుర్తించి, మూడ్ లైట్‌ను సెట్ చేస్తుంది. ఓవరాల్‌గా చూస్తే, ఈ కొత్త తరం సి-క్లాస్ మీ లగ్జరీ అనుభవాన్ని మరింత లగ్జరీగా మారుస్తుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ - కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్

కంఫర్ట్ అంటే మెర్సిడెస్-బెంజ్, మెర్సిడెస్-బెంజ్ అంటేనే కంఫర్ట్, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కాబట్టి, కంఫర్ట్ విషయంలో కొత్త తరం సి-క్లాస్‌ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపరచదు. ఇందులోని లెథర్ సీట్లు ప్రయాణీకులకు పూర్తి సౌకర్యాన్ని అందించేలా డిజైన్ చేయబడ్డాయి. ఇవి అందించే థై (తొడల) సపోర్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

వెనుక భాగంలో లభించే క్యాబిన్ స్థలం విశాలమైనది కాదు అలాగని ఇరుకైనది కాదు. ఇద్దరు ప్రయాణీకులు సౌకర్యంగా ప్రయాణించడానికి వెనుక క్యాబిన్ చక్కగా ఉంటుంది. వెనుక సీట్లలోని ప్రయాణీకుల సౌకర్యం కోసం సెంటర్ కన్సోల్ వెనుక భాగంలో ప్రత్యేకమైన AC వెంట్లు ఉంటాయి. ఈ ఏసి వెంట్లను కంట్రోల్ చేయడానికి కంట్రోల్ ప్యానెల్స్ కూడా ఉంటాయి.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

ఈ కారులోని డ్యూయల్-పేన్ పానోరమిక్ సన్‌రూఫ్ కొత్త సి-క్లాస్‌కి ఓ కన్వర్టిబల్ కారు లాంటి అనుభూతిని తెచ్చిపెడుతుంది. స్టోరేజ్ స్పేస్ విషయానికి వస్తే, మీరు కారులో ఎక్కడైతే క్యూబీ హోల్స్ ఉండాలనుకుంటారో, అలాంటి ప్రదేశాలలో కంపెనీ వీటిని డిజైన్ చేసింది. ఇందులో గ్లోవ్‌బాక్స్, సెంటర్ కన్సోల్, డోర్ ప్యానెల్‌లు మొదలైనవి ఉంటాయి. అవి చాలా పెద్దవి కాకపోయినప్పటికీ, తమ పనిని చక్కగా నిర్వహిస్తాయి. ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే, కొత్త Mercedes-Benz C-Class 455 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ - ఇంజన్ పనితీరు మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్‌లు

ఈ విషయం గురించి, ఇదివరకెప్పుడైనా మెర్సిడెస్ బెంజ్ కార్లను ఉపయోగించిన వారికైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, కొత్త వారి కోసం మాత్రం స్పెషల్‌గా చెప్పుకోవాలి. మెర్సిడెస్-బెంజ్ కార్లు తమ ఆకర్షణీయమైన డ్రైవింగ్ అనుభవానికి ప్రసిద్ధి చెందినవి. ముందు భాగంలో ఉండే శక్తివంతమైన ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ కారు యొక్క వెనుక చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. ఈ కొత్త తరం 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్‌లో గుర్తించదగిన విషయం ఏంటంటే, ఇది అప్‌డేట్ చేయబడిన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వస్తుంది. మేము ఇందులో లేటెస్ట్ పెట్రోల్ వెర్షన్‌ని టెస్ట్ డ్రైవ్ చేశాము.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

కొత్త సి-క్లాస్ కోసం కంపెనీ రెండు డీజిల్ ఇంజన్లు మరియు ఒక పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తోంది. ఇందులో బేస్ మోడల్ C200 కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. గతంలో ఇదే స్థానంలో పాత 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అందించేవారు. అయితే, ఈ కొత్త 1.5 లీటర్ ఇంజన్, డిస్‌ప్లేస్‌మెంట్ (సిసి) విషయంలో దాని పాత ఇంజన్ కన్నా చిన్నదే అయినప్పటికీ, ఇది దాని కన్నా 3 bhp ఎక్కువ శక్తిని మరియు 20 Nm ఎక్కువ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ ఇప్పుడు 204 bhp పవర్‌ను మరియు 300 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంటే, అంటే దీనర్థం ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుందని.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

డీజిల్ ఇంజన్ ప్రియుల కోసం కంపెనీ ఇందులో పెద్ద ఇంజన్లను కూడా అందిస్తోంది. ఇందులోని C220d వేరియంట్ 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది గరిష్చంగా 200 bhp శక్తిని మరియు 440 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. టాప్-స్పెక్ మోడల్‌లో (C300dలో) ఇదే ఇంజన్ ఉంటుంది, కాకపోతే, ఇది మరింత ఎక్కువ శక్తిని అందించేలా ట్యూన్ చేయబడింది. ఈ ఇంజన్ C300d వేరియంట్‌లో గరిష్టంగా 265 bhp శక్తిని మరియు 550 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్ AMG-లైన్ బాడీవర్క్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

గేర్‌బాక్స్ విషయానికి వస్తే, ఈ మూడు ఇంజన్ ఆప్షన్లు కూడా 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటాయి. ఇవి ISG (ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్)తో కూడిన తేలికపాటి-హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటాయి. ఈ సిస్టమ్ అవసరమైనప్పుడు అదనంగా 20 bhp లేదా 200 Nm వరకు జోడించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

ఈ మూడు ఇంజన్లను నిశితంగా పరిశీలిస్తే, మెర్సిడెస్-బెంజ్ ఇండియా C300d వేరియంట్‌ని కంపెనీ గో-టు పెర్ఫార్మెన్స్ వేరియంట్‌గా పుష్ చేస్తోందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అలాగని, ఇతర రెండు వేరియంట్‌లలోని ఇంజన్లు తక్కువేమీ కాదనుకోండి. అవి కూడా గరిష్టంగా 200 bhp ల కంటే ఎక్కువ శక్తినే ఉత్పత్తి చేస్తున్నాయి. మేము డ్రైవర్ చేసిన C200 టర్బో-పెట్రోల్ ఇంజన్ వేరియంట్ కూడా పెర్ఫార్మెన్స్ పరంగా మమ్మల్ని ఎంతగానో ఆక్టటుకుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

ఇంజన్ ఐడిల్‌గా ఉన్నప్పుడు ఇంజన్ శబ్ధం అస్సలు వినిపించదు. కానీ, ఎప్పుడైతే గ్యాస్ పెడల్ (యాక్సిలరేటర్)పై కాలుతో నొక్కగానే ఇంజన్ శబ్ధం మరియు అనుభూతి చాలా నాటకీయంగా మారుతుంది. గేర్‌బాక్స్‌ని డ్రైవ్‌ మోడ్‌లోకి స్లాట్ చేయగానే, కారు కొంచెం కూడా సంకోచించకుండా ముందుకు పరుగులు తీస్తుంది. మొదట్లో యాక్సిలేషన్ చాలా సరళంగా అనిపిస్తుంది. అయితే, ఇంజన్ మిడ్-రేంజ్ కి చేరుకోగానే దాని వేగం తెలుస్తుంది. ఈ ఇంజన్ యొక్క మిడ్-రేంజ్ మరియు టాప్-ఎండ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

కొత్త Mercedes-Benz C200 మరియు C220d వేరియంట్లు కేవలం 7.3 సెకన్లలోనే గంటకు గరిష్టంగా 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటాయి. ఈ ఫిగర్‌ను సాధించడానికి ఇందులోని 9G TRONIC ట్రాన్స్‌మిషన్ ఈ ఇంజన్‌లకి సరిగ్గా సరిపోతుంది. ఈ గేర్‌బాక్స్ పనితీరు చాలా వేగంగా మరియు అంతే సున్నితంగా అనిపిస్తుంది. ఇక స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ అనేది అవుట్‌గోయింగ్ మోడల్‌కు చెందిన కొంతమంది యజమానులు ఫిర్యాదు చేసిన అంశాలలో ఒకటి. కాబట్టి, కంపెనీ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కొత్త తరం సి-క్లాస్ స్టీరింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

కొత్త C-క్లాస్‌లో కంపెనీ స్టీరింగ్ పనితీరును మెరుగుపరిచింది. కొత్త మోడల్‌లో ఇది కొంచెం బరువుగా అనిపించినప్పటికీ, డ్రైవర్‌కు అద్భుతమైన కాన్ఫిడెన్స్‌ను అందిస్తుంది మరియు ఏ సమయంలోనైనా స్టీరింగ్‌తో డ్రైవర్ డిస్‌కనెక్ట్ అయిన అనుభూతిని అందించదు. కొత్త సి-క్లాస్‌లో సస్పెన్షన్ సెటప్ కూడా భారీగా మెరుగుపడింది. ఇది ఇప్పుడు కొంచెం మృదువైనదిగా ఉండి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది. అయితే, కార్నర్స్‌లో ఇది మృదువుగా ఉన్నట్లు అనిపించదు. ఎందుకంటే బాడీ రోల్ ని కనిష్టంగా ఉంచడం కోసం కంపెనీ ఈ సస్పెన్షన్ సెటప్‌ను అలా ట్యూన్ చేసింది.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

ముఖ్యమైన ఘట్టం మైలేజ్ విషయానికి వస్తే, సాధారణంగా ఖరీదైన కార్లు ఎక్కువ మైలేజీని అందించవనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. తడిసి మోపెడవుతున్న ఇంధన భారం నేపథ్యంలో, మెర్సిడెస్ బెంజ్ ఈ ఇంజన్లను అటు పెర్ఫార్మెన్స్ ఇటు మైలేజ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా రీఫైన్ చేసింది. కొత్త పెట్రోల్ వెర్షన్ సి-క్లాస్ సి200 లీటరుకు 16.9 కిమీ మైలేజీని ఇస్తుందని సర్టిఫై చేయబడింది. బెంజ్ వంటి కార్లకు ఈ మైలేజ్ ఫిగర్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ, తెలివిగా నడిపినప్పుడే మాత్రమే ఈ సంఖ్యను సాధించగలమని మేము చెప్పగలం.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

ఒకవేళ, మీరు ఈ కారు ఇంజన్ అందించే పూర్తి పెర్ఫార్మెన్స్‌ను చూడాలని ప్రయత్నిస్తే, మాత్రం ఎక్కువ పెట్రోల్ ఖర్చవుతుందని గుర్తించాలి. ఈ అంశాలన్నింటినీ కలిపి చూస్తే, కొత్త 2022 Mercedes-Benz C-Class ఓ సంపూర్ణ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులోని సీట్లు ఎక్కువ దూరం ప్రయాణించేవారిని సౌకర్యవంతంగా ఉంచుతాయి, సస్పెన్షన్ సెటప్ కూడా సౌకర్య స్థాయిలను పెంచుతుంది, అదే సమయంలో దాని ఇంజన్ మరియు పవర్‌ట్రెయిన్ కూడా అద్భుతమైన పనితీరును అందిస్తాయి.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ - సేఫ్టీ మరియు ముఖ్యమైన ఫీచర్లు

మెర్సిడెస్-బెంజ్ కార్లంటేనే సేఫ్టీకి పెట్టింది పేరు. కంపెనీ తమ కార్లలో ఎల్లప్పుడూ సేఫ్టీకి పెద్దపీఠ వేస్తుంది. ఈ బ్రాండ్ ఇప్పుడు అనేక సేఫ్టీ ఫీచర్లకు మార్గదర్శకంగా ఉంది, ఇలాంటి ఫీచర్లు ఇప్పుడు దాదాపు అన్ని ఇతర కార్లలో కూడా కనిపిస్తున్నాయి. వాస్తవానికి, 1981లో మెర్సిడెస్ బెంజ్ తొలిసారిగా ఎస్-క్లాస్‌లో ఎయిర్‌బ్యాగ్‌లను ప్రవేశపెట్టింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కొత్త సి-క్లాస్ భద్రత పరంగా చాలా ఉత్తమమైన ఫీచర్లను కలిగి ఉందని సురక్షితంగా చెప్పవచ్చు.

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

2022 Mercedes-Benz C-Classసేఫ్టీ ఫీచర్లు:

- యాక్టివ్ బ్రేక్ అసిస్ట్‌తో కూడిన అటెన్షన్ అసిస్ట్

- యాక్టివ్ బ్లైండ్ స్పాట్ అసిస్ట్

- యాక్టివ్ స్టీరింగ్ అసిస్ట్

- యాక్టివ్ లేన్-కీపింగ్ అసిస్ట్

- అడాప్టివ్ హైబీమ్ అసిస్ట్

- EBD తో కూడిన ABS

- ట్రాక్షన్ కంట్రోల్

- 8 ఎయిర్‌బ్యాగ్‌లు

- యాంటీ విప్లాష్

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

2022 Mercedes-Benz C-Class లో కీలకమైన ఫీచర్లు:

- 11.9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్

- రెండవ తరం MBUX కనెక్టివిటీ సూట్

- 12.3 ఇంచ్ LCD ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే

- యాంబియెంట్ లైటింగ్

- లెదర్ సీట్లు

- ఇంటీరియర్ కోసం మల్టిపుల్ కలర్ ఆప్షన్లు

- డ్యూయల్-పేన్ సన్‌రూఫ్

- డ్యూయెల్-జోన్ ఆటోమేటిక్ కంట్రోల్

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

2022 Mercedes-Benz C-Class వేరియంట్లు మరియు కలర్ ఆప్షన్లు

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మూడు వేరియంట్‌లు మరియు ఆరు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

2022 Mercedes-Benz C-Class వేరియంట్‌లు:

- C200

- C220d

- C300d

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

2022 Mercedes-Benz C-Class కలర్ ఆప్షన్లు:

- మోజావే సిల్వర్

- సలాటిన్ గ్రే

- హైటెక్ సిల్వర్

- మ్యానుఫాక్చరర్ ఒపలైట్ వైట్

- కావన్‌సైట్ బ్లూ

- అబ్సిడియన్ బ్లాక్

కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం..

చివరిగా ఏం చెబుతారు..?

కొత్త 2022 మోడల్ సి-క్లాస్‌తో, మెర్సిడెస్-బెంజ్ బ్రాండ్ తదుపరి స్థాయి (నెక్స్ట్ లెవల్‌)కి చేరుకుందని చెప్పవచ్చు. ఇది సాంకేతికతలో అత్యుత్తమమైనది మరియు దాని మినిమలిస్టిక్ స్టైలింగ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అప్‌డేటెడ్ ఇంజన్ మరియు పవర్‌ట్రైన్స్ కారణంగా కొత్త సి-క్లాస్ ఇప్పుడు మరింత మెరుగైన డ్రైవింగ్‌ అనుభూతిని అందిస్తుంది. క్యాబిన్ లోపల లభించే సౌకర్యం చాలా విలావసంతంగా ఉంటుంది. మొత్తమ్మీద ఈ కొత్త మోడల్‌లో ప్రయాణం మీరు మర్చిపోలేని ఓ సరికొత్త అనుభవాన్ని ప్రతిరోజూ అందిస్తూనే ఉంటుంది.

Most Read Articles

English summary
New 2022 mercedes benz c class test drive review features and driving impressions
Story first published: Monday, May 9, 2022, 10:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X