కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

భారతదేశంలో మారుతి సుజుకి (Maruti Suzuki) దేశపు అగ్రగామి కార్ కంపెనీగా కొనసాగడానికి ప్రధాన కారణం స్మాల్ కార్ విభాగంలో ఈ బ్రాండ్ బలమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని కలిగి ఉండటమే. మారుతి సుజుకి నుండి చాలా కాలంగా మార్కెట్లో ఉన్న మోడల్ మరియు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన మోడల్ ఆల్టో (Alto). ఈ చిన్న కారు గురించి భారతీయులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెట్రో నగరాల నుండి మారుమూల గ్రామాల వరకూ ఎక్కడ చూసిన ఆల్టో కార్లు దర్శనమిస్తూనే ఉంటాయి.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

మారుతి సుజుకి తమ ఆల్టో బ్రాండ్‌ను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ 43 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించిందంటే, ఈ మోడల్ ఎంత సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. మారుతి ఆల్టో విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని దాని సరసమైన ధర, తక్కువ మెయింటినెన్స్ మరియు తక్కువ రన్నింగ్ కాస్ట్, వీటన్నింటికీ మించి మారుతి సుజుకి బ్రాండ్ యొక్క విశ్వసనీయత. తరాలు మారుతున్న కొద్దీ మారుతి ఆల్టో కూడా మారుతూ వచ్చింది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

గతంలో మారుతి సుజుకి ఆల్టో కె10 పేరిట పెద్ద ఇంజన్‌తో కూడిన ఆల్టో కారును విక్రయించేది. అయితే, చిన్న కారు విభాగంలో పోటీలో ముందుండేందుకు మారుతి సుజుకి తమ 800సీసీ ఆల్టో కారును ప్రవేశపెట్టిన తర్వాత ఈ పెద్ద ఆల్టో కె10 గురించి మర్చిపోయింది. కాగా, ఇన్నాళ్లకు మారుతి సుజుకి తిరిగి తమ ఆల్టో కె10 కారును సరికొత్త రూపంలో విడుదల చేసింది. ఈ కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఆల్టో కె10 (2022 Maruti Suzuki Alto K10) ని మా డ్రైవ్‌స్పార్క్ బృందం కొచ్చిలో టెస్ట్ డ్రైవ్ చేసింది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవారు మరియు ముసలివారు అంటూ తేడా లేకుండా తమ రోజూవారీ ప్రయాణం కోసం ఉపయోగించే ఈ డైలీ కమ్యూటర్ ప్యాసింజర్ కారులో కొత్తగా ఏముంది? ఇది మునుపటి ఆల్టో కె10 కారును మరిపిస్తుందా? కొత్తగా చిన్న కారును కొనాలనుకునే వారిని మురిపిస్తుందా? మరిన్నో విషయాలను ఈ పూర్తి సమీక్షలో తెలుసుకుందాం రండి.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

2022 మారుతి సుజుకి ఆల్టో కె10 - డిజైన్ మరియు ఫీచర్లు

మనం చాలా రివ్యూలలో చెప్పుకున్నట్లు కారు డిజైన్ అనేది వ్యక్తిగత అభిప్రాయం. ఒకరికి నచ్చిన డిజైన్ మరొకరికి నచ్చకపోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మారుతి సుజుకి ఆల్టో కె10 ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంట్రీ లెవల్ కారు, కాబట్టి ఇందులో అత్యాధునికమైన మరియు ప్రీమియం డిజైన్ ఎలిమెంట్స్‌ను మనం ఆశించకూడదు. అలాగని, కంపెనీ ఎంట్రీ లెవల్ కారు కొనుగోలుదారులను నిరుత్సాహపరచదు. కొత్త 2022 ఆల్టో K10 చాలా సరళమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఇందులో కొన్ని ఆకర్షణీయమైన పాయింట్‌లు ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

మారుతి సుజుకి సెలెరియో లాంటి ఆకర్షణీయమైన డిజైన్‌తో కూడిన కారును తక్కువ ధరకే కొనాలనుకునే వారు మరియు మొదటిసారిగా కారును కొనుగోలు చేసే వారు షోరూమ్‌లలోకి ప్రవేశించిన వెంటనే కొత్త ఆల్టో కె10 ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. ఈ కారు ముందు భాగంలో పెద్ద గ్రిల్‌ మరియు దానిపై అమర్చిన సుజుకి బ్యాడ్జ్‌ ఉంటాయి. బానెట్ అంచులకు దిగువన ఉన్న కొత్త ర్యాప్అరౌండ్ హాలోజన్ హెడ్‌లైట్‌లు ప్రధానంగా కనిపిస్తాయి. కొత్త ఆల్టో కె10 చెక్కినట్లుగా ఉండే ఫ్రంట్ బంపర్, దాని దిగువ భాగంలో ఉండే సన్నటి సెంట్రల్ ఇన్‌టేక్‌ ఉంటాయి. బంపర్ దిగువ భాగంలో ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చి ఉంటే బాగుండనేది మా అభిప్రాయం.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

ఇక ఆల్టో కె10 సైడ్ ప్రొఫైల్ ను గమనిస్తే, ఇక్కడ చాలా ప్రముఖమైన షోల్డర్ లైన్‌తో పాటుగా మరికొన్ని క్యారెక్టర్ లైన్‌లు కూడా కనిపిస్తాయి. కొత్త 2022 ఆల్టో కె10 లో సైడ్ ఫెండర్‌లకు మౌంట్ చేయబడిన టర్న్ ఇండికేటర్లు ఉంటాయి, ఇవి ఇంకా ఓల్డ్ స్కూల్ డిజైన్‌నే తలపిస్తాయి. ఆల్టో కె10 కారులో 13 ఇంచ్ స్టీల్ వీల్స్ మరియు వాటిపై సన్నటి టైర్లు అమర్చబడి ఉంటాయి. ఇక్కడ కొనుగోలుదారులను నిరుత్సాహపరచే మరొక అంశం ఏంటంటే, ఇందులో ఆప్షనల్‌గా కూడా అల్లాయ్ వీల్స్ లేకపోవడమే. అవును, టాప్-ఎండ్ వేరియంట్లు కూడా స్టీల్ వీల్స్‌తోనే లభిస్తాయి. ఖర్చు తక్కువగా ఉంచేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

కొత్త ఆల్టో కె10 వెనుకవైపు డిజైన్‌ను గమనిస్తే, ఇక్కడ రూఫ్‌ని అంటిపెట్టుకుని ఉన్నట్లుగా ఉండే చిన్న ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, చతురస్రాకారంలో ఉండే స్క్వేర్డ్ ఆఫ్ టెయిల్‌లైట్‌లు మరియు హై మౌంటెడ్ థర్డ్ బ్రేక్ లైట్‌ మొదలైనవి ప్రధానంగా కనిపిస్తాయి. ముందు భాగంలో ఉన్న బంపర్ మాదిరిగానే వెనుక బంపర్ కూడా చాలా మజిక్యులర్ గా కనిపిస్తుంది. అయితే, ఈ బంపర్ చాలా సాదాగా ఉన్నట్లు అనిపిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

డోర్ హ్యాండిల్‌ను లాగి కారు లోపలికి ప్రవేశిస్తే, ఎక్కువగా నలుపు రంగులో ఉండే ఇంటీరియర్ థీమ్‌ మీకు స్వాగతం పలుకుతుంది. స్టీరింగ్ వీల్ మరియు కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ చుట్టూ ఉండే సిల్వర్ హైలైట్‌లు కారు లోపలి భాగంల కాస్తంత ప్రీమియం రూపాన్ని తెచ్చిపెడుతాయి. ఇంటీరియర్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇందులోని కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ గురించి. ఇది 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే రెండింటిని సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ 4-స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

మీ వద్ద కాస్తంత ఎక్కువ బడ్జెట్ ఉండి, టాప్ ఎండ్ వేరియంట్ 2022 ఆల్టో కె10 ను కొనుగోలు చేయగలిగినట్లయితే, ఈ వేరియంట్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా లభిస్తుంది. ఇంకా ఇందులో ఫోన్ మరియు వాల్యూమ్ కంట్రోల్స్ కోసం స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్ బటన్స్‌ని కూడా కలిగి ఉంటుంది. తక్కువ ధర కలిగిన ఇలాంటి బడ్జెట్ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లను పొందడం గొప్ప విషయం అని చెప్పొచ్చు.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

కారు లోపల సీట్లు, ఇంటీరియర్ థీమ్ యొక్క ముదురు నలుపు రంగు నుండి గ్రే సెంట్రల్ ఇన్‌సర్ట్‌లతో కొంత కొత్తదనాన్ని జోడిస్తాయి. డ్రైవింగ్ సీటు ఎత్తు సర్దుబాటు ఫీచర్‌ను కలిగి ఉండి, డ్రైవర్‌కు మంచి డ్రైవింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. ఇది కాంపాక్ట్ కారు, ఇందులో నలుగురు ప్రయాణీకులు (డ్రైవరుతో కలిపి) సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. వెనుక సీటులో మూడవ వ్యక్తి కూర్చోవడం వలన కాస్తంత అసౌకర్యంగా అనిపిస్తుంది, అయితే చిన్నపాటి దూర ప్రయాణాలలో మేనేజ్ చేయడం సాధ్యమే. కాకపోతే, సుధీర్ఘ ప్రయాణాలలో కారులో నలుగురికి మించి ప్రయాణించడం కాస్తంత అసౌకర్యంగా అనిపిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

ఇంటీరియర్ స్పేస్ విషయానికి వస్తే, కారు లోపలి భాగంలో తగినంత రూమ్ ఉంటుంది. వెనుక సీట్లు సాధారణ భారతీయ కొనుగోలుదారులకు తగిన మొత్తంలో క్నీ రూమ్ మరియు హెడ్‌రూమ్‌ను అందిస్తాయి. అయితే, ఈ కారులో వెనుక వైపున ఉన్నవారికి చికాకు కలిగించే అంశం ఏదైనా ఉందంటే, విండోస్‌ని మ్యాన్యువల్‌గా క్రిందకు దించడమే. తయారు ఖర్చును తగ్గించడం కోసం కంపెనీ ఇలా చేసింది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ చిన్న కారులో అడాస్ వంటి అధునాతన ఫీచర్లను ఆశించలేము కానీ, ఇది అవసరమైన అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో లభిస్తుంది. కొత్త 2022 ఆల్టో కె10 కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు మరియు EBDతో కూడిన ABS వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మారుతి సుజుకి తమ కొత్త 2022 ఆల్టో కె10 కారును బేసిక్ ఫీచర్లతో అందించినప్పటికీ, కస్టమర్లు ఈ కారుని తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునేందుకు రెండు కొత్త కస్టమైజేషన్ ప్యాకేజీలను కూడా అందిస్తుంది. ఇందులో గ్లింటో మరియు ఇంపాక్టో అనే కస్టమైజేషన్ ప్యాకేజీలు ఉన్నాయి. ఇకపోతే, మారుతి సుజుకి ఆల్టో కె10 మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో సాలిడ్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ మరియు ఎర్త్ గోల్డ్ అనే కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

2022 మారుతి సుజుకి ఆల్టో కె10 - ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లు

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఇప్పుడు మునుపటి కన్నా మరింత రీఫైన్డ్ బిఎస్6 పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో మారుతి సుజుకి యొక్క సరికొత్త K10C DualJet, Dual VVT 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. మారుతి సుజుకి యొక్క పాపులర్ టాల్‌బాయ్ కారు వ్యాగన్ఆర్ లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ 998సీసీ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 66 బిహెచ్‌పి శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, కొత్త ఆల్టో కె10 5-స్పీడ్ స్టాండర్డ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ లేదా 5-స్పీడ్ AMT (ఆటో గేర్ షిఫ్ట్ - ఏజిఎస్) ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ గేర్‌బాక్స్‌లు ఇంజన్ నుండి వచ్చే శక్తిని ముందు చక్రాలకు పంపిణీ చేస్తాయి. మైలేజ్ విషయానికి వస్తే, కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం, ఇందులోని మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.39 కిలోమీటర్ల మైలేజీని మరియు ఏజిఎస్ వేరియంట్ లీటరుకు 24.90 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫై చేసినదాని ప్రకారం).

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 3,530 మిమీ పొడవు, 1,490 మిమీ వెడల్పు మరియు 1,520 మిమీ ఎత్తును కలిగి ఉండి, 2,380 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం బరువు 1,150 కిలోగ్రాములుగా ఉంటుంది. మునుపటి తరం ఆల్టో కారుతో పోలిస్తే, ఈ కొత్త 2022 ఆల్టో కె10 దాని కన్నా 85 మిమీ ఎక్కువ పొడవు, 45 మిమీ ఎక్కువ ఎత్తు మరియు 20 మిమీ ఎక్కువ పొడవు గల వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. కొత్త ఆల్టో కారుని కంపెనీ యొక్క అధునాతన హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేయడం వలన ఈ పెద్ద కొలతలు సాధ్యమయ్యాయి. మారుతి సుజుకి ఆల్టో కె10 లో 13 ఇంచ్ స్టీల్ వీల్స్ మరియు అన్ని చక్రాలపై 145/80 R13 ప్రొఫైల్ టైర్‌లు అమర్చబడి ఉంటాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

2022 మారుతి సుజుకి ఆల్టో కె10 - డ్రైవింగ్ ఇంప్రెషన్స్

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 లోని త్రీ-సిలిండర్ ఇంజన్ అంత శక్తివంతమైనదేమీ కాదు, కానీ దాని పని అది చేసుకుంటూ పోతుంది. మీరు ఈ చిన్న కారులో స్పోర్టీ పనితీరును ఆశిస్తే, ఇది మిమ్మల్ని నిరాశపరిచే అవకాశం ఉంది. కంపెనీ ఈ కారును సిటీ కమ్యూటర్‌గా డిజైన్ చేసింది, కాబట్టి ఇది పవర్ మరియు మైలేజ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంది. నగర వీధుల్లో సులభంగా నావిగేట్ చేయడంలో సహాయపడటానికి ఈ ఇంజన్ తగినంత శక్తిని అందిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

అలాగని ఈ ఇంజన్ పనితీరును పూర్తిగా తీసిపారేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీ కుడి పాదాన్ని యాక్సిలరేటర్‌పై ఉంచినప్పుడు ఇంజన్ వేగంగా ప్రతిస్పందించడాన్ని మీరు గమనిస్తారు. అలాగే, కొత్త ఆల్టో కె10ని హైవేపై మేము మూడు అంకెల వేగంతో కూడా నడపగలిగాము. అయితే, పూర్తి లోడ్‌తో నడుపుతున్నడ్పుడు ఆల్టో కె10 వేగవంతం కావడానికి కొంత సమయం పడుతుంది మరియు ఇంజన్ అధిక rpms వద్ద కొంచెం ఎక్కువ శబ్దం చేస్తున్నట్లు అనిపిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

రెండు గేర్‌బాక్స్‌లలో మేము ఎక్కువగా మ్యాన్యువల్‌ని సిఫార్సు చేస్తాము, కొత్త ఆల్టో కె10 లైట్ క్లచ్‌ను కలిగి ఉండి, సున్నితమైన గేర్‌షిఫ్ట్ లను అందిస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారికి ఈ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుకూలంగా ఉంటుంది. అలాగే, రోజువారీ సిటీ ప్రయాణం చేసేవారికి, ఎక్కువ ఇబ్బంది లేకుండా గేర్లు మార్చాలనుకునే వారి ఏఎమ్‌టి గేర్‌బాక్స్ అనుకూలంగా ఉంటుంది. అయితే, AMT గేర్‌బాక్స్ వేరియంట్ ను తక్కువ వేగంతో నడుపుతూ గేర్‌లను మార్చినప్పుడు కొంచెం కుదుపుగా అనిపిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

కొత్త ఆల్టోలో బ్రేకులు ఈ లైట్ కారుకు సరిపోతాయి. బ్రేక్ పెడల్ ఎక్కువ ట్రావెల్‌ను కలిగి ఉండదు మరియు ఆపరేట్ చేయడానికి సులభంగా అనిపిస్తుంది. ఇకపోతే, స్టీరింగ్ వీల్ పై డ్రైవర్ శ్రద్ధ చాలా అవసరం. మొదటిసారి కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్న కారుకు ఈ స్టీరింగ్ అంత గొప్పగా అనిపించదు. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, కొత్త 2022 ఆల్టో కె10 లోని సస్పెన్షన్ సెటప్ మృదువైన రోడ్లపై మరియు కఠినమైన రోడ్లపై కూడా సున్నితంగా అనిపిస్తుంది. అర్బన్, రూరల్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఈ సస్పెన్షన్ ట్యూన్ చేయబడింది. ఈ లైట్ వెయిట్ కార్ కార్నర్స్ లో కూడా డ్రైవర్ కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

సాధారణంగా చిన్న కార్లలో నాయిస్, వైబ్రేషన్ మరియు హార్ష్‌నెస్ (NVH) స్థాయిలను అదుపులో ఉంచడం చాలా కష్టం. అయితే, మారుతి సుజుకి ఈ విషయంలో జాగ్రత్త వహించిందనే చెప్పాలి. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 మంచి NVH స్థాయిలను అందిస్తుంది మరియు ఇంజన్ శబ్దం రెవ్ కౌంటర్ యొక్క అధిక ముగింపులో మాత్రమే వినిపిస్తుంది. సేఫ్టీ పరంగా చూసుకుంటే, మొదటిసారిగా కారును కొనే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని, ఇరుకుగా ఉండే ప్రదేశాలలో పార్క్ చేయడానికి వీలుగా ఇందులో రియర్ కెమెరాను అందించి ఉంటే బాగుండనేది మా అభిప్రాయం.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

2022 మారుతి సుజుకి ఆల్టో కె10 - స్పెసిఫికేషన్లు

Specification Alto K10

Length (mm) 3530
Width (mm) 1490
Height (mm) 1520
Wheelbase (mm) 2380
Fuel Tank Capacity (L) 27
Engine
Configuration 3 Cylinder
Displacement (cc) 998
Power 66.62 PS 5500 rpm
Torque 89 Nm 3500 rpm
Transmission Type 5-speed MT / 5-speed AGS
Suspension
Front Mac Pherson Strut with Coil Spring
Rear Torsion Beam with Coil Spring
Brakes
Front Disc
Rear Drum
Tyre
Tyre 145/80 R13
కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

2022 మారుతి సుజుకి ఆల్టో కె10 - వేరింట్లు, ధరలు

Alto K10 Manual Auto Gear Shift
STD ₹3,99,000
LXi ₹4,82,000
VXi ₹4,99,500 ₹5,49,500
VXi+ ₹5,35,500 ₹5,83,500
కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ..! చోటా ప్యాక్.. బడా ధమాకా..!!

చివరిగా ఏం చెబుతారు..?

మారుతి ఆల్టో అప్పటికీ, ఇప్పటికీ మరియు ఎప్పటికీ బెస్ట్ ఎంట్రీ లెవల్ కారు అని చెప్పొచ్చు. ప్రస్తుతం అత్యంత ఖరీదైన కార్లను నడిపే వారు కూడా ఒకానొకప్పుడు ఆల్టో కారును నడిపే ఉంటారు. కొత్తగా మొదటిసారి కారు కొనేవారు, కాలేజ్ విద్యార్థులు, యువకులు, కొత్తగా ఐటి ఉద్యోగం పొందిన వారు, చిన్న కుటుంబాలు, మిడిల్-క్లాస్ ఫ్యామిలిలకు కొత్త 2022 ఆల్టో కె10 ఓ బెస్ట్ కారు అని చెప్పొచ్చు. నిజానికి ఇది బడ్జెట్ కారు కంటే ఎక్కువ అందిస్తుంది. కొత్త డిజైన్, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త ఇంజన్, మెరుగైన మైలేజ్, ఆకర్షణీయమైన ధర మరియు విశ్వసనీయమైన మారుతి సుజుకి బ్రాండ్ వంటి అంశాల కారణంగా కొత్త ఆల్టో కె10 కళ్లు మూసుకొని కొనుగోలు చేయవచ్చు. మీరేమంటారు..?

Most Read Articles

English summary
New maruti suzuki alto k10 test drive review design features specifications and first drive imp
Story first published: Wednesday, August 24, 2022, 13:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X