టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

Written By:

టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి అందించిన మొదటి హ్యాచ్‌బ్యాక్ లివా. జపాన్‌కు చెందిన టయోటా తమ ఎటియోస్ సెడాన్ ఆధారిత హ్యాచ్‌‌బ్యాక్‌ను 2011 లో లివా రూపంలో విడుదల చేసింది. అయితే టయోటా మోటార్స్ తాజాగా ఎటియోస్ సెడాన్ మరియు ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌లను అప్‌డేటెడ్ మోడళ్లలో విడుదల చేసింది.

దేశీయంగా చాలా మంది దీనిని వ్యక్తిగత కారుగా ఎంచుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ట్యాక్సీల ప్రపంచంలో లివా హ్యాచ్‌బ్యాక్‌లదే పై చేయిగా ఉంది. వినియోగదారుల్లో ఈ భావనను పోగొట్టడానికి కొత్త శైలిలో సరికొత్త ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది ఫ్యామిలీ హ్యాచ్‌బాక్‌గా ఉందే లేదంటే ట్యాక్సీ రూపంలోనే ఉందా అనే విషయాన్ని నేటి మన రివ్యూ సెక్షన్ ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ ద్వారా తెలుసుకుందాం.

పరీక్షించిన మోడల్: టయోటా ఎటియోస్ లివా విఎక్స్(Toyota Etios Liva VX)

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టయోటా ఈ లివా డిజైన్ పరంగా పూర్తి మార్పులు చేసింది. మునుపటి లివాతో పోల్చుకుంటే ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. వెనుక వైపున కాస్త పొడగించబడిన లివా చూడటానికి స్పోర్టివ్ రూపంలో ఉంది. మరియు ముందు వైపున క్రోమ్ సొబగులతో ఫ్రంట్ గ్రిల్ డిజైన్ చేసారు.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టయోటా మోటార్స్ దీనిని చూడటానికి కాస్త విభిన్నంగా రూపొందించినప్పటికీ కొలతల పరంగా ఇది పాత లివానే తలపిస్తుంది. అయితే శబ్దం, కుదుపులు మరియు డ్రైవింగ్‌లో కఠనత్వాన్ని నిర్మూలిస్తూ బాడీని రూపొందించారు.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఏ కారునయినా స్పోర్టివ్ రూపంలోకి మార్చే అంశం చక్రాలు, అందుకోసం టయోటా ఇందులో అద్భుతంగా డిజైన్ చేయబడిన అల్లాయ్ చక్రాలను అందించింది. డిజైన్ శైలి మరియు కారు చేసే శబ్దం వంటి వాటి పరంగా మునుపటి లివాతో పోల్చుకుంటే ఇది ఎంతో ఉత్తమంగా ఉంది.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సాంకేతికంగా చూస్తే ఈ ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌లో మునుపటి లివాలో ఉన్న అవే శక్తివంతమైన పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందుబాటులోకి తెచ్చింది.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఎటియోస్ లివాలోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ సుమారుగా 79బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌లోని 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ సుమారుగా 67బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సరికొత్త ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌లోని రెండు ఇంజన్ ఆప్షన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మైలేజ్ పరంగా పెట్రోల్ వేరియంట్ ఎటియోస్ లివా లీటర్‌కు 18.16 కిలోమీటర్ల మైలేజ్ మరియు డీజల్ వేరియంట్ ఎటియోస్ లివా లీటర్‌కు 23.59 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

దీని డ్రైవింగ్ సౌలభ్యం గురించి చాలా మంది జీర్ణించుకోలేని అంశం ఏమిటంటే, దీని టెస్ట్ డ్రైవ్ చేసిన వివరాల ప్రకారం ఉత్తమ హ్యాండ్లింగ్ కారు అని గుర్తించడం జరిగింది. ఇది నిర్ధిష్టమైన శక్తిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అయితే మొత్తం శక్తిని ఉపయోగించుకుంటుంది.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మమ్మల్ని ఆశ్చర్యపరిచన మరొక అంశం ఏమిటంటే మునుపటి లివాతో మరియు ప్రస్తుతం ఉన్న హ్యాచ్‌బ్యాక్‌లతో పోల్చితే ఇందులోని సస్పెన్షన్ వ్యవస్థ ఎంతో అద్భుతం అని చెప్పాలి. మంచి హ్యాండ్లింగ్‌కు ఎంతో ముఖ్యమైన సస్పెన్షన్‌ను ఇందులో పరిచయం చేసారు.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ప్రారంభంలో దీనిని నడిపేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించినా చివరికి ఎంతో సౌకర్యవంతమైన రైడింగ్‌ను మిగిల్చి మంచి డ్రైవింగ్ అనుభూతిని మిగిల్చింది. తక్కువ కాలపరిమితిలో దీనికి టెస్ట్ డ్రైవ్ నిర్వహించడం వలన మైలేజ్ టెస్ట్ చేయలేకపోయాము.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంటీరియర్ పరంగా కొత్త రంగులను ఎటియోస్ లివాలో పరిచయం చేశారు. డ్యాష్ బోర్డ్ మరియు డోర్లకు లోపలి వైపున బ్లాక్ మరియు ఇవోరి రంగుల్లో ఫినిషింగ్ చేశారు. లగ్జరీ అనుభూతి పొందడానికి ఇందులో ప్రీమియ్ ఫ్యాబ్రిక్ సీట్లను అందించారు.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంటీరియర్ పరంగా కొత్త రంగులను ఎటియోస్ లివాలో పరిచయం చేశారు. డ్యాష్ బోర్డ్ మరియు డోర్లకు లోపలి వైపున బ్లాక్ మరియు ఇవోరి రంగుల్లో ఫినిషింగ్ చేశారు. లగ్జరీ అనుభూతి పొందడానికి ఇందులో ప్రీమియ్ ఫ్యాబ్రిక్ సీట్లను అందించారు.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సరికొత్త ఎటియోస్ లివాలో వినోదభరితమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో 2-డిఐఎన్ మ్యూజిక్ ప్లేయర్ కలదు, నాలుగు అద్దాలను కూడా ఎలక్ట్రిక్ ద్వారా నియంత్రించవచ్చు, రియర్ వ్యూవ్ కోసం బాహ్య వైపున అందించిన అద్దాలను కూడా ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకోవచ్చు, రీ డిజైన్ చేయబడిన మీటర్ కన్సోల్, వెనుక సీటు కోసం ఆర్మ్ రెస్ట్ మరియు డ్రైవర్ సీట్ ఎత్తును కూడా అడ్జెస్ట్ చేసుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

 భద్రత ఫీచర్లు

భద్రత ఫీచర్లు

టయోటా మోటార్స్ తమ అన్ని ఉత్పత్తుల్లో కూడా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌లో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా డ్యూయ్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులను అందించారు.

టయోటా ఎటియోస్ లివా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

వెనుక వైపున కూర్చునే ముగ్గురు వ్యక్తుల కోసం మూడు పాయింట్లు గల సీట్ బెల్ట్ కలదు, మరియు టయోటా ఇందులో ISOFIX యాంకర్స్ ను అందించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ మార్కెట్లో ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌లో అందించిన భద్రత పీచర్లు మరే ఇతర ఉత్పత్తుల్లో గుర్తించలేము.

పెట్రోల్ ఎటియోస్ లివా వేరియంట్ల ధర వివరాలు

పెట్రోల్ ఎటియోస్ లివా వేరియంట్ల ధర వివరాలు

  • సరికొత్త ఎటియోస్ లివా జిఎక్స్ ధర రూ. 5,64,127 లు
  • సరికొత్త ఎటియోస్ లివా వి ధర రూ. 5,88,188 లు
  • సరికొత్త ఎటియోస్ లివా విఎక్స్ ధర రూ. 6,39,231 లు
డీజల్ ఎటియోస్ లివా వేరియంట్ల ధర వివరాలు

డీజల్ ఎటియోస్ లివా వేరియంట్ల ధర వివరాలు

  • సరికొత్త ఎటియోస్ లివా జిఎక్స్‌డి ధర రూ. 6,94,053 లు
  • సరికొత్త ఎటియోస్ లివా విడి ధర రూ. 7,11,641 లు
  • సరికొత్త ఎటియోస్ లివా విఎక్స్‌డి ధర రూ. 7,53,657 లు

గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

సరికొత్త టయోటా ఎటియోస్ లివా డబ్బుకు తగ్గ హ్యాచ్‌బ్యాకేనా .. కాదా..

సరికొత్త టయోటా ఎటియోస్ లివా డబ్బుకు తగ్గ హ్యాచ్‌బ్యాకేనా .. కాదా..

నిరభ్యంతరంగా ఇది డబ్బుకు తగ్గ సరైన ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ అని చెప్పవచ్చు. చూడటానికి ఆకర్షణీయంగా, నడపడానికి సులభంగా, ఉత్తమంగా హ్యాండిల్ చేయగల మరియు మంచి భద్రత, వినోదాత్మకమైన ఫీచర్లతో డబ్బకు తగ్గ విలువను జోడిస్తుంది ఈ లివా హ్యాచ్‌బ్యాక్.

.
English summary
Read In Telugu: The New Toyota Etios Liva Review — We Get Behind The Wheel Of Toyota’s Updated Hatchback
Please Wait while comments are loading...

Latest Photos