పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల ఆఫ్ రోడింగ్ రివ్యూ

Written By:

15 ఏళ్ల క్రితం తమ మొదటి ఎస్‌యూవీ కయీన్ ను ఆవిష్కరించి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం కయీన్ ఎస్‌యూవీకి జతగా మకన్ అనే ఎస్‌యూవీని ఆవిష్కరించి మరో షాకిచ్చింది.

అయితే, ఇండియాలో మాత్రమే పోర్షే ఉత్పత్తులకు ప్రత్యేక గౌరవం ఉంది. ఇండియన్ రోడ్ల మీద వీటిని నడపడం గ్లాస్ స్లిప్పర్స్‌తో నడవడంతో సమానం. పోర్షే బ్యాడ్జ్ మరియు దీని ధరల పరంగానే కాదు ఆఫ్ రోడింగ్ శైలిలో కూడా పోర్షే ఎస్‌యూవీలు గొప్పవే.... నేటి కథనంలో కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలను తెలుసుకుందాం రండి...

పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల రివ్యూ

జర్మనీలో ఈ తరహా రోడ్లు ఉండవు. కాబట్టి హై వే జర్నీల కోసం వీటిని అభివృద్ది చేసుంటుందని మీరు భావించవచ్చు. కానీ ఇండియన్ రఫ్ రోడ్ల మీద వీటి అద్బుతమైన పనితీరును గమనిస్తే, కోట్లు వెచ్చించి మరీ వీటిని ఎందుకు ఎంచుకుంటున్నారో అవగతం అవుతుంది.

పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు బృందం టెస్ట్ డ్రైవ్ నిర్వహించిన కయీన్ ఎస్‌యూవీలో 242బిహెచ్‌పి పవర్ మరియు 550ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. మకన్ ఎస్‌యూవీలో 248.5బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల రివ్యూ

రెండు ఎస్‌యూవీలలో కూడా ఆక్టివ్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు ఆఫ్ రోడ్ డ్రైవింగ్ మోడ్ కలదు. మకన్ ఎస్‌యూవీలో బటన్ ప్రెస్ చేయడం ద్వారా మరియు కయీన్‌లో స్విచ్ ప్రెస్ చేయడం ద్వారా ఆఫ్ రోడ్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఆప్ రోడింగ్‌కు సిద్దమయ్యాక రెండు ఎస్‌యూవీల యొక్క సస్పెన్షన్ సిస్టమ్ 40ఎమ్ఎమ్ వరకు ఎత్తును పెంచుకుంటుంది.

పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల రివ్యూ

ఇంజన్ ఉత్పత్తి చేసే మొత్తం టార్క్ ముందు లేదా వెనుక ఏదైనా ఒక యాక్సిల్‌కు 100శాతం సరఫరా చేసే విధంగా ఈ ఎస్‌యూవీలలో పోర్షే ట్రాక్షన్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ కలదు. దీనికి అదనంగా పోర్షే టార్క్ వెక్టరింగ్ ప్లస్ మరియు పోర్షే స్టెబిలిటి మేనేజ్‌మెంట్ వంటి వ్యవస్థలను ఉత్తమ ఆఫ్ రోడ్ డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా అందివ్వడం జరిగింది.

పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల రివ్యూ

మకన్ మరియు కయీన్ ఎస్‌యూవీలకు ఆఫ్ రోడ్ పరీక్ష నిర్వహిస్తున్నపుడు మొదటి ఎదురైన ఛాలెంజ్, రాళ్లు రప్పలతో ఎగుడుదిగుడుగా, ఏట వాలుతో ఉన్న తలం మీద డ్రైవ్ చేయడం. జారుడు స్వభావం అధికంగా ఉన్న ఈ పల్లపు తలం మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సులభంగా అధిగమించడం జరిగింది.

పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల రివ్యూ

చాలా వరకు ప్రయాణాల్లో అరుదుగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. ఒకవేల ఎదురైతే మాత్రం చాలా ఇబ్బందిపడాల్సి ఉంటుంది. మరి పోర్షే మకన్ మరియు కయీన్ లను వీటిని ఎలా ఎదుర్కొన్నాయో చూద్దాం రండి. అత్యంత ఏట వాలు మిట్ట మీదకు ప్రయాణిస్తున్నపుడు మధ్యలో గట్టిగా బ్రేక్‌లు ప్రెస్ చేసి హిల్ హోల్డ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకున్నాము.

పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల రివ్యూ

నిటారుగా ఉన్న అదే తలం మీద బ్రేక్ వదిలేశాక వాహనం ఒక్క ఇంచు కూడా వెనక్కి కదలలేదు. అంటే ఎంతటి నిటారు రోడ్డు మీదనైనా అదుపు కోల్పోకుండా సురక్షితంగా డ్రైవ్ చేయడానికి హిల్ హోల్డ్ సిస్టమ్ అధ్బుతంగా పనిచేస్తుంది. మకన్ మరియు కయీన్ రెండు ఎస్‌యూవీలను కూడా ఇదే తలం మీద, ఇదే శైలిలో పరీక్షించడం జరిగింది.

పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల రివ్యూ

పల్లె ప్రాంతాల్లోని రోడ్ల మీద వర్షాకాలంలో ఏర్పడే చిన్న చిన్న గుంతలు గుర్తున్నాయా... అచ్చం అదే రోడ్డు మీద వీటిని మరో సవాలుగా పరీక్షించడం జరిగింది. ముందు వైపు ఒక చక్రం నేల మీద మరో చక్రం గాలిలో, అదే విధంగా వెనుక వైపున ఒక చక్రం నేల మీద మరొకటి గాలిలో ఉండే విధంగా ఏర్పాటు చేసిన ట్రాక్ మీద దీనిని పరీక్షించాము. అయితే చక్రాలు గ్రిప్‌ను కోల్పోకుండా, గాలిలో ఉన్న చక్రాలతో పనిలేకుండా కేవలం నేల మీద ఉన్న రెండు చక్రాలతోనే బయటకు రాగలిగాము.

పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల రివ్యూ

ఎదురుగా ఉన్న రోడ్డు ప్రక్కవైపులకు ఏటవాలుగా ఉన్న సవాలు: ఇక్కడ వెహికల్స్‌కు ఎడమవైపు నుండి కుడివైపుకు 30 శాతం ఏటవాలుగా ఉన్న రోడ్డు మీద పరీక్షించాము. ఇందులో గుర్తించిన విషయం, ఈ పొజిషన్‌లో ఉన్న వాహనం యొక్క చక్రాలలో తిరగడానికి సౌకర్యంగా ఉన్న చక్రానికి మొత్తం పవర్ మరియు టార్క్ సరఫరా చేయడం జరిగింది. లోపల కూర్చున్న వారికి చాలా అసౌకర్యంగానే ఉంది, కానీ ఈ ఎస్‌యూవీలకు అది ఏ మాత్రం ఇబ్బంది కాదు.

పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల రివ్యూ

మరొక చాలెంజ్, ఏట వాలు పల్లపు తలం మీద ప్రయాణించడం. సాధారణ రోడ్డు మీద కాకుండా లోయ తరహా పల్లపు తలం మీద పరీక్షించాము. ఇలాంటి చోటు ఏదైనా తేడా జరిగితే వాహనం బోల్తా పడే అవకాశం ఎక్కువ.

పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల రివ్యూ

పోర్షే అందించింన హిల్ కంట్రోల్ ఫీచర్ ద్వారా నాలుగు చక్రాలకు సమానమైన బ్రేకింగ్ పవర్ అందించి వేగాన్ని నియంత్రిచడం జరిగింది. ఇలాంటి సమయంలో యాంటిలాక్ బ్రేక్ సిస్టమ్ వీల్స్ లాక్ కాకుండా చేసింది. వాహనం సురక్షితంగా సమతలానికి చేరే వరకు ఇందులోని వ్యవస్థలన్నీ ఒకదానికొటి సమంగా పనిచేసుకుంటూ వచ్చాయి.

పోర్షే కయీన్ మరియు మకన్ ఎస్‌యూవీల రివ్యూ

ఆఫ్ రోడింగ్ అన్ని కఠినమైన భూభాగాల తరువాత నీటి కుంట మీదుగా డ్రైవ్‌చేయాల్సి వచ్చింది. నీటి మట్టం తక్కువగానే ఉన్నప్పటికీ, మట్టి మొత్తం నీటితో కలిసిపోయి అప్పటికే బురదగా మారిపోయింది. టైర్లు స్లిప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న ఛాలెంజ్ ఇది. అయితే బురద మరియు నీటిని వెదజల్లుకుంటూ సునాయాసంగా బయటకు చేరుకోవడం జరిగింది.

డైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్పోర్ట్స్ మరియు సూపర్ కార్ల తయారీ పరంగా ప్రసిద్దిగాంచిన పోర్షే ఎస్‌యూవీలను తయారు చేస్తే, చాలా మంది ఆటోనిపుణులు నవ్వుకున్నారు. కానీ ఇంటీరియర్ పరంగా రాజీ పడని లగ్జరీ సౌకర్యాలు మరియు అద్భుతమైన ఆఫ్ రోడింగ్ లక్షణాలతో మకన్ మరియు కయీన్ వెహికల్స్ స్పోర్ట్స్ ఎస్‌యూవీలుగా నిలిచాయి.

తీర్పు

తీర్పు

మకన్ ధర రూ. 78.97 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది మరియు కయీన్ డీజల్ ధర రూ. 1.1 కోట్లు ఎక్స్-షోరూమ్ బెంగళూరుగా ఉంది. 2.2-టన్నుల బరువున్న ఒక్కొక్క ఎస్‌యూవీ కేవలం 7.3 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. ధర పరంగా దిమ్మ తిరగడం గ్యారంటీ, కానీ డబ్బు సమస్యే కాదు అనుకునే వారికి ఇవి ఉత్తమ ఎంపికలే.

English summary
Read In Telugu Porsche Cayenne Macan Off Road Capabilities Explored
Story first published: Wednesday, June 14, 2017, 11:25 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark