2017 స్కోడా ఆక్టావియా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ....

2017 ఆక్టావియా ప్రీమియమ్ సెడాన్‌ను విపణిలోకి విడుదల చేసింది. నాలుగవ జనరేషన్ 2017 ఆక్టావియా ప్రీమియమ్ సెడాన్‌ను టెస్ట్ డ్రైవ్ రివ్యూ...

By Anil

ఇండియన్ ప్రీమియమ్ సెడాన్ సెగ్మెంట్లో స్కోడా ఆక్టావియా మంచి ఫలితాలనిస్తోంది. అయితే కాలం మారుతుండటంతో, అందుకు తగ్గ కస్టమర్లను చేరుకోవడం కోసం 2017 ఆక్టావియా ప్రీమియమ్ సెడాన్‌ను విపణిలోకి విడుదల చేసింది.

సిజెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియాలో అతి కొద్ది మోడళ్లనే విడుదల చేసినప్పటికీ, ప్రతి మోడల్‌కు మంచి పాపులారీ కలదు. వాటిలో ఆక్టావియా ప్రీమియమ్ సెడాన్ అతి ముఖ్యమైన మోడల్. అందుకే కాబోలు ఇప్పుడు నాలుగవ జనరేషన్ ఆక్టావియా కారును విపణిలోకి విడుదల చేసింది.

Recommended Video

Volkswagen Tiguan Review In Telugu - DriveSpark తెలుగు
2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

ముందు మాట

స్కొడా తొలుత 2001లో లారా సెడాన్‌తో ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించింది. సుమారుగా తొమ్మిదేళ్ల పాటు విపణిలో ఉన్న లారా స్థానాన్నిభర్తీ చేస్తూ, రెండవ తరానికి చెందిన ఆక్టావియా 2010లో మార్కెట్లోకి విడుదలయ్యింది. ప్రస్తుతం ఉన్న అందుబాటులో ఉన్న ఆక్టావియా మూడవ తరానికి చెందిన మోడల్‌గా 2013లో విపణిలోకి విడుదలైంది. స్కోడా తాజాగా నాలుగవ తరానికి చెందిన 2017 స్కోడా ఆక్టావియా కారును విడుదల చేసింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, 2017 మోడల్‌గా వచ్చిన ఆక్టావియా లేటెస్ట్ వెర్షన్ కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా ఉందో... లేదో... నేటి టెస్ట్ డ్రైవ్ కథనంలో చూద్దాం రండి....

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

ఎక్ట్సీరియర్

మునుపటి తరం ఆక్టావియాతో పోల్చితే 2017 ఆక్టావియా ఫ్రంట్ డిజైన్‌లో వచ్చిన స్పోర్టివ్ లుక్‌ను పెద్ద మార్పుగా గుర్తించివచ్చు. ఆకర్షణీయమైన క్వాడ్ అడాప్టివ్ ఎల్ఇడి లైట్లు పగటి పూట వెలిగే లైట్లతో జోడింపుతో వచ్చింది(ఇందులో బ్లేడ్ ఆకారంలో ఉన్న డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి). గ్లాస్ బ్లాక్ బటర్ ప్లై గ్రిల్, క్యారెక్టర్ లైన్స్ గల బానెట్, రెండుగా విడిపోయిన ఉన్న హెడ్ ల్యాంప్స్ డిజైన్ ఆక్టావియా ఔత్సాహికులను తీవ్రంగా ఆకర్షిస్తుంది.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

ఒక్కో వైపు రెండు చొప్పున ఇరువైపులా మొత్తం నాలుగు హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. వీటిలో ఫ్రంట్ గ్రిల్‌కు దగ్గరలో ఉన్నవి హై బీమ్ లైట్లుగా మరియు వాటి ప్రక్కన ఉన్న లైట్లు లో బీమ్ ల్యాంప్స్‌గా పనిచేస్తాయి.

రీడిజైన్ చేసి అందించిన ఫ్రంట్ బంపర్‌లో ఎయిర్ ఇంటేకర్ గుండా, రెండు ఫాగ్ ల్యాంప్స్‌ను కలుపుతూ క్రోమ్ పట్టీ అందివ్వడం జరిగింది. ఇందులో ఉన్న ఎల్ఇడి ఫ్యాగ్ ల్యాంప్స్ కార్నరింగ్ ల్యాంప్స్‌గా కూడా పనిచేస్తాయి.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

సైడ్ ప్రొఫైల్‌లో ఎలాంటి అనవసరపు డిజైన్ సొబగులకు చోటివ్వకుండా, ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ నుండి రియర్ టెయిల్ ల్యాంప్స్ వరకు ఒక క్యారక్టర్ లైన్ కలిగి ఉండటాన్ని గుర్తించగలం. 16-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ వీల్స్ 205/55 ఆర్16 కొలతల్లో ఉన్న గుడ్ఇయర్ టైర్లు ఉన్నాయి.

వెనుక డిజైన్‌లో విశాలమైన బాడీ కలదు, ప్రధానంగా జరిగిన మార్పులు గురించి చూస్తే, C-ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

బూట్ స్పేస్ (ఢిక్కీ స్పేస్)

సెడాన్‌లో ఆశించిన మేర లగేజ్ స్పేస్ రావడం దాదాపు అసాధ్యమే, అయితే స్కోడా 2017 ఆక్టావియాలో 590-లీటర్ల బూట్ స్పేస్ కలదు. అదనంగా మరింత స్పేస్ కోరుకునే వారు, వెనుక వరుస సీటింగ్‌ను 60:40 నిష్పత్తిలో మడిపివేయడం ద్వారా 1580 లీటర్ల వరకు బూట్ స్పేస్ పెంచుకోవచ్చు.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

ఇంటీరియర్

మునుపటి ఆక్టావియా ఇంటీరియర్‌ తరహాలోనే సరికొత్త స్కోడా ఆక్టాయాలో డ్యూయల్ టోన్ బీజి మరియు బ్లాక్ కలర్ ఇంటీరియర్ కలదు. అయితే అధునాతన ఫీచర్లను ఇందులో జోడించడం జరిగింది. విశాలమైన మరియు సౌకర్యవంతమైన సీట్లు, లెథర్ అప్‌హోల్‌స్ట్రే, మరియు 12 రకాలుగా అడ్జెస్టుకునే వీలున్న డ్రైవర్ సీటు, సీటు కదలికలను గుర్తుపెట్టుకునే మెమొరీ వంటివి ఆక్టావియాలో ఉన్నాయి.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

స్కోడా ఆక్టావియా క్యాబిన్ విశాలంగా ఉంది. మోకాలు మరియు కాళ్ల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సౌకర్యవంతంగా ఉంటుంది. రియర్ సీటులో ప్రయాణించే వారి కోసం ఏ/సి వెంట్స్ మరియు యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

డోర్లకు లోపలి వైపున ప్రీమియమ్ ఫీల్ కల్పిస్తూ, ప్లాస్టిక్ ఇన్‌సర్ట్స్ మరియు అల్యూమినియం సొబగులను అందివ్వడం జరిగింది. పది రకాల విభిన్న ఆంబియంట్ లైటింగ్ వ్యవస్థ కలదు.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

ఇంటీరియర్ ఫీచర్లు

ఇంటీరియర్‌లో అందరినీ ఆకట్టుకునే ప్రధాన అంశం, సరికొత్త 8-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌సిస్టమ్ కలదు. స్మూత్ ఆపరేటింగ్ వ్యవస్థ ఉన్న ఇది శాటిలైట్ న్యావిగేషన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా బాస్ కనెక్ట్ ద్వారా కారులో ప్రయాణించే అందరూ, ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్‌ను తమ స్మార్ట్ ఫోన్‌లతో అనుసంధానం చేసుకుని కంట్రోల్ చేయవచ్చు.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

స్కోడా ఆక్టావియాలో వర్షాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా క్లోజ్ అయ్యే సన్ రూఫ్ కలదు, డ్యూయల్ జోన్ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, కూల్ గ్లూవ్ బాక్స్, కీలెస్ ఎంట్రీ, స్లీకర్ స్టీరింగ్ వీల్ మరియు ఫ్రంట్ డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ లెగ్ రూమ్‌లో పడల్ లైట్లు ఉన్నాయి.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

ప్రతి ఇండియన్ కస్టమర్ మెచ్చుకునే, కోరుకునే ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్ స్కోడా 2017 ఆక్టావియా ప్రీమియమ్ సెడాన్ కారులో ఉంది. కారులో గేర్ సెలక్టర్‌కు ముందువైపు ఉన్న చిన్న బటన్ ప్రెస్ చేయడం ద్వారా డ్రైవర్ ఎలాంటి సూచనల్ చేయకుండానే కారు ఆటోమేటిక్‌గా పార్క్ అయిపోతుంది.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

2017 స్కోడా ఆక్టావియా లోని భద్రత ఫీచర్లు

స్కోడా ఆక్టావియాలో అత్యుత్తమ భద్రత ఫీచర్లను అందించింది. ఎనిమిది ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హిల్ హోల్డ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు డ్రైవర్ అలసటను గుర్తించి అలర్ట్ చేసే సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఒక వేళ ప్రమాదం జరిగే సందర్బం ఎదురైతే, ఆక్టావియాలోని మల్టీ-కొల్లిషన్ బ్రేకింగ్ సిస్టమ్ అలర్ట్ అయిపోయి బ్రేకులను వేసేస్తుంది. దీంతో ప్రమాద తీవ్రత దాదాపు తగ్గిపోతుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఇంజన్‌కు ఇంధన సరఫరాను నిలిపివేస్తుంది.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

ఇంజన్ వివరాలు

2017 స్కోడా ఆక్టావియా కారులో ఇంజన్ పరంగా కొన్ని మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయి. ప్రి-ఫేస్ లిఫ్ట్ కారులో వచ్చినటువంటి అవే డ్రైవ్ ట్రైన్స్ కొనసాగింపుగ వచ్చాయి. ఇందులో సింగల్ డీజల్ ఇంజన్ మరియు రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

ఆక్టావియాను సింగల్ 2.0-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ డైరక్ట్ షిప్ట్ గేర్‌బాక్స్(ఆటోమేటిక్) ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు. ఇది గరిష్టంగా 141బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ 21కిమీ/లీ మరియు ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 19.5కిలోమీటర్లగా ఉంది.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

ఆక్టావియాలోని 1.4-లీటర్ టుర్భో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 148బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభించే దీని మైలేజ్ లీటర్‌కు 16.7కిలోమీటర్లుగా ఉంది.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

స్కోడా ఆక్టావియాలో శక్తివంతమైన అధిక కెపాసిటి గల 1.8-లీటర్ టుర్భో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తోంది. 178బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల ఇది లీటర్‌కు 15.1కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

మేము టెస్ట్ డ్రైవ్ చేసిన వేరియంట్ ఆక్టావియా 1.8 టిఎస్‌ఐ ఆటోమేటిక్. ఇది కేవలం 1,250ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద గరిష్ట పవర్ ఉత్పత్తి చేయగలిగింది. ఇందులోని టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ మిడ్ రేంజ్ ఆర్‌పిఎమ్ వద్ద మ్యాగ్జిమమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మునుపటితో పోల్చుకుంటే మెకానికల్‌గా కూడా గుర్తించలేని మార్పులు జరిగాయి.

ఇక ఇందులోని 7-డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేగాన్ని బట్టి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, తనంటతానుగా గేర్లను మార్చుతూ డ్రైవర్‌కు అత్యుత్తమ డ్రైవింగ్ డ్రైవింగ్ అనుభవాన్ని కలిగించాయి.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

2017 స్కోడా ఆక్టావియా ధర వివరాలు...

ఆక్టావియాలోని 1.4-లీటర్ పెట్రోల్ బేస్ వేరియంట్ ధర రూ. 15,49,405లుగా ఉంది. 7-స్పీడ్ డిఎస్‌జి ఆటేమేటిక్ గేర్‌బాక్స్ గల డీజల్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 22,89,573 లుగా ఉంది.

2017 స్కోడా ఆక్టావియా ఇండియన్ మార్కెట్లో రూ. 14.88 నుండి 18.67 లక్షల ధరల శ్రేణిలో లభించే టయోటా కరోలా ఆల్టిస్ మరియు రూ. 12.48 నుండి 18.46 లక్షల ధరల శ్రేణిలో లభించే హ్యుందాయ్ ఎలంట్రా ప్రీమియమ్ సెడాన్ లతో పోటీపడనుంది.

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

స్కోడా ఆక్టావియా పెట్రోల్ వేరియంట్ల ధర వివరాలు:

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధరలు
ఆక్టావియా ఆంబిషన్ 1.4 టిఎస్ఐ మ్యాన్యువల్ రూ. 15,49,405 లు
ఆక్టావియా స్టైల్ 1.4 టిఎస్ఐ మ్యాన్యువల్ రూ. 17,49,605 లు
ఆక్టావియా స్టైల్ 1.8 టిఎస్ఐ ఆటోమేటిక్ రూ. 18,59,429 లు
ఆక్టావియా స్టైల్ ప్లస్ 1.4 టిఎస్ఐ ఆటోమేటిక్ రూ. 20,89,900 లు
2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

స్కోడా ఆక్టావియా డీజల్ వేరియంట్ల ధర వివరాలు:

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధరలు
ఆక్టావియా ఆంబిషన్ 2.0 టిడిఐ సిఆర్ మ్యాన్యువల్ రూ. 16,89,974లు
ఆక్టావియా స్టైల్ 2.0 టిడిఐ సిఆర్ మ్యాన్యువల్ రూ. 18,95,608లు
ఆక్టావియా స్టైల్ 2.0 టిడిఐ సిఆర్ ఆటోమేటిక్ రూ. 20,49,619లు
ఆక్టావియా స్టైల్ ప్లస్ 2.0 టిడిఐ సిఆర్ ఆటోమేటిక్ రూ. 22,89,573లు

*గమనిక అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఇవ్వబడ్డాయి

2017 స్కోడా ఆక్టావియా రివ్యూ

తీర్పు

స్కోడా ఆక్టావియా ను రీఫ్రెష్డ్ మోడల్‌గా విడుదల చేయడంతో పాటు విశాలమైన క్యాబిన్ స్పేస్, లగ్జరీ ప్రీమియమ్ సెడాన్ ఫీల్ కలిగిస్తూనే అత్యుత్తమ ఫీచర్లను అందించింది. ప్రత్యేకించి ఆటోమేటిక్ పార్కింగ్ ఫీచర్ స్కోడా కస్టమర్లను ఆకట్టుకోనుంది.

ప్రీమియమ్ సెడాన్ కారును కోరుకునే కస్టమర్లు ఆక్టావియాను ఎంచుకోవచ్చు...

Most Read Articles

English summary
Read In Telugu: 2017 Skoda Octavia 1.8 TSI AT First Drive Review
Story first published: Wednesday, August 2, 2017, 17:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X