2018 జెనీవా మోటార్ షో: టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్ ఆవిష్కరించిన టాటా

Written By:

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద వాహన ప్రదర్శనల్లో స్విట్జర్లాండులోని జెనీవా నగర వేదికగా జరిగే జెనీవా మోటార్ షో ఒకటి. 2018 జెనీవా మోటార్ షో ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడ ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నో కార్ల తయారీ సంస్థలు తమ నూతన ఆవిష్కరణలు మరియు ఫ్యూచర్ కాన్సెప్ట్ మోడళ్లను ప్రదర్శిస్తాయి. ఇదే వేదిక మీద దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది.

Recommended Video - Watch Now!
Auto Expo 2018: Tata Tamo Racemo & Racemo+- Details, Specifications - DriveSpark
టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్

టాటా మోటార్స్ గత 20 సంవత్సరాల పాటు వరుసగా జెనీవా మోటార్ షోలో పాల్గొంటూ వచ్చింది. జెనీవాతో ఉన్న 20 ఏళ్ల అనుబంధాన్ని పురస్కరించుకుని సరికొత్త ఎలక్ట్రిక్ ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్ కారును ప్రపంచ ఆవిష్కరణ చేసింది.

టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ విజన్ కార్ల తయారీ చేసే సంస్థలకు ధీటుగా టాటా తమ ఇ విజన్ కాన్సెప్ట్‌ను అభివృద్ది చేసింది. టాటా ఆల్ఫా ఫ్లాట్‍‌ఫామ్ మీద కాకుండా, టాటా వారి ఒమేగా ఫ్లాట్‌ఫామ్ మీద ఈ ఎలక్ట్రిక్ వెహికల్‌ను నిర్మించింది.

టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్

టాటా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న టాటా ఒమేగా ఫ్లాట్‌ఫామ్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్ నిర్మించేందుకు వినియోగించుకోగా, ఆల్ఫా మరియు ఏఎమ్‌పి ఫ్లాట్‌ఫామ్‌ల ఆధారంగా ఫ్యూచర్ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మరియు చిన్న ఎస్‌యూవీలను టాటా మోటార్స్ అభివృద్ది చేస్తోంది.

టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్

టాటా మోటార్స్ ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్లు మరియు కాన్సెప్ట్ వెర్షన్ మోడళ్ల మీద దృష్టి సారిస్తోంది. ప్రస్తుతానికి, ఒమెగా ఫ్లాట్‌ఫామ్ ఎలక్ట్రిక్ కార్లను నిర్మించడానికి అంత అనువుగా లేదు. అయినప్పటికీ, అద్భుతమైన పవర్ ట్రైన్ మరియు ఆకర్షణీయమైన ఇంటీరియర్‌తో ఫ్యూచర్ ఇ విజన్ కాన్సెప్ట్ మోడల్‌ను అభివృద్ది చేసింది.

టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్

చూడటానికి, టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్ డిజైన్ టాటా వారి అత్యాధునిక ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించినట్లు స్పష్టంగా గుర్తించవచ్చు. ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించిన టాటా హెచ్5ఎక్స్ మరియు 45ఎక్స్ కాన్సెప్ట్ మోడళ్లను కూడా ఇదే డిజైన్ లాంగ్వేజ్ ఆధారంతో నిర్మించారు.

టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్

టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్ ఫ్రంట్ డిజైన్ టాటా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఫ్రంట్ ప్రొఫైల్‌ను పోలి ఉంటుంది. కానీ హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్ ఫ్రంట్ ప్రొఫైల్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ ఉంది.

టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్

టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్ కారులో 21-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, చెక్కినట్లు కనిపించే అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఉన్నాయి.

టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్

టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్ ఇంటీరియర్‌లో అధిక నాణ్యత గల వుడ్ మరియు ప్రీమియమ్ మెటీరియల్స్‌తో నిర్మించిన డ్యాష్ బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ ఉన్నాయి. టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ కారు గురించి ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడించలేదు.

టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో రాణించే లక్ష్యంతో ఉన్న టాటా మోటార్స్‌ విజయం సాధించేందుకు ఇ-విజన్ సెడాన్ కాన్సెప్ట్ దోహదపడనుంది. అంతే కాకుండా, ఒమేగా ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా పలు ఫ్యూచర్ ఎలక్ట్రిక్ మోడళ్లను అభివృద్ది చేస్తోంది.

టాటా ఇ విజన్ సెడాన్ కాన్సెప్ట్

టాటా జెస్ట్ ప్రీమియో ఎడిషన్ విడుదల: ధర రూ. 7.53 లక్షలు

డీజిల్ రైలింజన్లు అస్సలు ఆఫ్ చేయరెందుకు?

భర్తకు మరచిపోలేని కానుకిచ్చిన అతిలోక సుందరి

English summary
Read In Telugu: 2018 Geneva Motor Show: Tata E Vision Sedan Concept Unveiled - Specs, Features & Images
Story first published: Wednesday, March 7, 2018, 14:01 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark