భారతీయ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ కార్లు: ఇందులో మీ కారు ఉందా?

By Anil

ఈ శతాబ్దంలో మరో సంవత్సరం గడిచిపోతోంది. 2015 భారతీయ వాహన పరిశ్రమ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పటికి తరువాత కొంత నిలదొక్కుకుంది. ఈ ఏడాదిలో ఎన్నో కొత్త కార్లు విడుదల అయ్యాయి. చాలా కార్లు విడుదల అయినప్పటి నుండి విపరీతమైన బుకింగ్స్‌ను నమోదు చేసుకున్నాయి. అందులో రెనొ క్విడ్,హ్యుందాయ్ క్రెటా కార్లు. మరిన్ని కార్లు గట్టి పోటిని తట్టుకుని మంచి అమ్మకాలను సాధించాయి.

Also Read: మీ నగరంలో మీకు నచ్చిన కార్ల ధరల గురించి తెలుసుకోండి.

అయితే ఈ ఏడాదిలో భారతీయ ప్రజలు ఎక్కుగా ఏ కార్లను ఎంచుకున్నారు. అత్యధికంగా అమ్మకాలను నమోదు చేసుకున్న కార్లు ఏవి అనే విషయం గురించి తెలుసుకుందాం. మీరు కారు కొనాలనుకుంటే ఆ కారు ఎన్నో స్థానంలో ఉంది, దానిని ఎంత మంది కొనుగోలు చేశారు, అది టాప్ -20 లో ఎన్నవ స్థానంలో ఉంది అనే విషయం తెలుసుకోవచ్చు. మీ సౌలభ్యం కోసం ప్రతి కారుకు చెందిన ముఖ్యమైన అంశాలను రెండు స్లైడర్‌ల ద్వారా అందించాము.

1. మారుతి సుజుకి ఆల్టో

1. మారుతి సుజుకి ఆల్టో

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి రూపొందించిన అలజడి అంతా ఇంతా కాదు. ప్రతి ఏడాది మారుతి సుజుకి ఆల్టో అమ్మకాల పరంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటోంది. అయితే 2015 సంవత్సరంలో 227,512 యూనిట్ల అమ్మకాలు జరిపింది. గత ఏడాదితో పోల్చుకుంటే 6.6 శాతం వృద్దిని నమోదు చేసుకుని మొదటి స్థానంలో నిలించింది.

2. ఆల్టో గురించి

2. ఆల్టో గురించి

మారుతి సుజుకి వారి ఎంట్రీ లెవల్ కారు ఆల్టో. ఇందులో 769సీసీ గల ఇంజన్ కలదు.ఇది దాదాపుగా 48 బిహెచ్‌పి పవర్ మరియు 69 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో గల 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 22.7 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడానికి సహాయపడుతుంది.

దీని ధర దాదాపు రూ. 2,46,170 ఎక్స్-షోరూమ్ గా ఉంది.

3. మారుతి సుజుకి డిజైర్

3. మారుతి సుజుకి డిజైర్

రెండవ స్థానంలో మారుతి సుజుకి డిజైర్ 200,422 యూనిట్లు అమ్మకాలు జరిపి రెండవ స్థానంలో నిలిచింది. గత ఏడాది 179,671 యూనిట్లు అమ్మి రెండవ స్థానంలో నిలిచింది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే 11.5 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

4. మారుతి డిజైర్ గురించి

4. మారుతి డిజైర్ గురించి

డిజైర్ కారు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించును. 1197సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ 83 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 1248 సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 74 బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ అత్యధిక టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

దీని ధర దాదాపుగా రూ. 5,16,074 ఎక్స్-షోరూమ్ గా ఉంది.

5.మారుతి సుజుకి స్విఫ్ట్

5.మారుతి సుజుకి స్విఫ్ట్

వరుసగా మారుతి సుజుకి మూడవ స్థానంలో ఉంది. ఈ ఏడాది 180,517 యూనిట్లు అమ్మకాలు జరిపింది, గత ఏడాది 167,521 యూనిట్ల అమ్మకాలు జరిపింది. అయితే రెండు సంవత్సరాలలో కూడా ఇది మూడవ స్థానంలో నిలిచింది అయితే వృద్దిలో 7.8 శాతం నమోదు చేసుకుంది.

6.మారుతి స్విఫ్ట్

6.మారుతి స్విఫ్ట్

  • ఇంజన్: 1197సీసీ పెట్రోల్, 1248 సీసీ డీజల్
  • పవర్: 83, 74 బిహెచ్‌పి
  • టార్క్: 115,190 ఎన్‌ఎమ్
  • మైలేజ్: 20.4 , 25.2 కి.మీ/లీ
  • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
  • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 4,58,321 మరియు డీజల్ వేరియంట్ 5,76,638 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
  • 7.మారుతి సుజుకి వ్యాగన్-ఆర్

    7.మారుతి సుజుకి వ్యాగన్-ఆర్

    మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ గత ఏడాదిలో 133,386 అమ్మగా ఈ ఏడాది 141,768 యూనిట్లు అమ్మి 6.3 శాతం వృద్దితో నాలుగవ స్థానంలో నిలిచింది.

    8. వ్యాగన్-ఆర్

    8. వ్యాగన్-ఆర్

    • ఇంజన్: 998 సీసీ పెట్రోల్, 998 సీసీ సియన్‌జి
    • పవర్: 67, 58 బిహెచ్‌పి
    • టార్క్: 90,77 ఎన్‌ఎమ్
    • మైలేజ్: 20.51 కి.మీ/లీ , 20.51 కి.మీ/కె.జి
    • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
    • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 3,64,262 మరియు సియన్‌జి వేరియంట్ 4,50,432 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
    • 9. హ్యుందాయ్ ఐ20

      9. హ్యుందాయ్ ఐ20

      హ్యుందాయ్ మోటార్స్ వారి నుండి అత్యధికంగా అమ్మాకాలు జరుపుతున్నవాటిలో హ్యుందాయ్ ఐ20 ఒకటి. ఈ ఏడాదిలో 109,631 యూనిట్లు అమ్మకాలు జరిపింది. గత ఏడాది కేవలం 49,219 ను మాత్రమే అమ్మకాలు జరిపింది. ఇది వృద్దిలో ఏకంగా 122.7 శాతం నమోదు చేసుకుని ఐదవ స్థానంలో నిలిచింది.

      10. హ్యుందాయ్ ఐ20

      10. హ్యుందాయ్ ఐ20

      • ఇంజన్: 1197 సీసీ పెట్రోల్, 1396 సీసీ డీజల్
      • పవర్: 82, 89 బిహెచ్‌పి
      • టార్క్: 115,220 ఎన్‌ఎమ్
      • మైలేజ్: 17.19 , 21.19 కి.మీ/లీ
      • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
      • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 6,38,844 మరియు డీజల్వేరియంట్ 7,63,484 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
      • 11. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

        11. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

        హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మోడల్ 109,631 యూనిట్ల అమ్మకాలు జరిపి 21.6 శాతం వృద్దితో ఆరవ స్థానంలో నిలిచింది. గత ఏడాదిలో కూడా ఆరవ స్థానంలో ఉంది.

        12. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

        12. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

        • ఇంజన్: 1086 సీసీ పెట్రోల్, 1396 సీసీ సియన్‌జి
        • పవర్: 68, 68 బిహెచ్‌పి
        • టార్క్: 99,99 ఎన్‌ఎమ్
        • మైలేజ్: 19.89 కి.మీ/లీ, 19.89 కి.మీ/కె.జి.
        • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
        • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 4,17,849 మరియు సియన్‌జి వేరియంట్ 4,98,680 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
        • 13. మహీంద్రా బొలెరో

          13. మహీంద్రా బొలెరో

          మహీంద్రా వారి బెస్ట్ యస్‌‌యువి అయిన బొలెరో 74,039 యూనిట్ల అమ్మకాలు జరిపింది. గత ఏడాది 85,997 యూనిట్లు అమ్ముడుపోయి ఐదవ స్థానంలో నిలవగా వృద్దిలో 13.9 శాతం క్షీణించి ఏడవ స్థానానికి పడిపోయింది.

          14. బొలెరో గురించి

          14. బొలెరో గురించి

          • ఇంజన్: 2523 సీసీ డీజల్
          • పవర్: 63 బిహెచ్‌పి
          • టార్క్: 180 ఎన్‌ఎమ్
          • మైలేజ్: 15.96 కి.మీ/లీ
          • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
          • ధర రూ : 6,33,026 డీజల్ వేరియంట్ (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
          • 15. హోండా సిటి

            15. హోండా సిటి

            హోండా వారి సెడాన్ ‌మోడల్‌లో ఉత్తమ సెడాన్ కారుగా పేరు మోసిన కారు హోండా సిటి ఇది ఈ ఏడాదిలో 70,204 యూనిట్ల అమ్మకాలు జరిపి ఎనిమిదవ స్థానంలో నిలిచింది. అయితే గత ఏడాది అమ్మకాలతో పోల్చుకుంటే 9.6 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

             16. హోండా సిటి గురించి

            16. హోండా సిటి గురించి

            • ఇంజన్: 1497 సీసీ పెట్రోల్, 1498 సీసీ డీజల్
            • పవర్: 117, 98 బిహెచ్‌పి
            • టార్క్: 145,200 ఎన్‌ఎమ్
            • మైలేజ్: 17.8 , 26 కి.మీ/లీ
            • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్
            • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 7,53,000 మరియు డీజల్ వేరియంట్ 8,75,000 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
            • 17. మారుతి సెలెరియో

              17. మారుతి సెలెరియో

              మారుతి సుజుకి వారి మరో కారు సెలెరియో 67,986 యూనిట్ల అమ్మకాలు జరిపి 9 వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 57,839 యూనిట్ల అమ్మకాలు జరిపి 10 వ స్థానంలో నిలిచింది. అయితే 17.5 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

              18. సెలెరియో కారు గురించి

              18. సెలెరియో కారు గురించి

              • ఇంజన్: 998 సీసీ పెట్రోల్, 793 సీసీ డీజల్
              • పవర్: 67, 46 బిహెచ్‌పి
              • టార్క్: 90,125 ఎన్‌ఎమ్
              • మైలేజ్: 23.1 , 27.6 కి.మీ/లీ
              • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
              • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 3,90,393 మరియు డీజల్ వేరియంట్ 4,65,393 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
              • 19. మారుతి సుజుకి ఓమ్ని

                19. మారుతి సుజుకి ఓమ్ని

                మారుతి ఓమ్ని 66,258 యూనిట్లు అమ్మి 10 వ స్థానంలో నిలించింది. గత ఏడాది కన్నా ఎక్కువ యూనిట్లు అమ్మి 8.6 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

                 20.మారుతి ఓమ్ని గురించి

                20.మారుతి ఓమ్ని గురించి

                • ఇంజన్: 796 సీసీ పెట్రోల్
                • పవర్: 33 బిహెచ్‌పి
                • టార్క్: 57 ఎన్‌ఎమ్
                • మైలేజ్: 16.8 కి.మీ/లీ
                • ట్రాన్స్‌మిషన్: 4-స్పీడ్ మ్యాన్యువల్
                • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 2,25,773 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
                • 21. హ్యుందాయ్ ఇయాన్

                  21. హ్యుందాయ్ ఇయాన్

                  గత ఏడాదిలో హ్యుందాయ్ ఇయాన్ 67,723 యూనిట్లు అమ్మడుపోయి ఏడవ స్థానంలో నిలవగా ఈ ఏడాది 58,103 యూనిట్ల అమ్మకాలు జరిపి 11 వ స్థానానికి చేరుకుంది. వీటి అమ్మకాల పరంగా వృద్ది 14.2 శాతం క్షీణించింది.

                  22.హ్యుందాయ్ ఇయాన్ గురించి

                  22.హ్యుందాయ్ ఇయాన్ గురించి

                  • ఇంజన్: 814 సీసీ పెట్రోల్, 814 సీసీ యల్‌పిజి
                  • పవర్: 55,55 బిహెచ్‌పి
                  • టార్క్: 75,75 ఎన్‌ఎమ్
                  • మైలేజ్: 21. , 21.1 కి.మీ/లీ
                  • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
                  • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 3,34,413 మరియు యల్‌పిజి వేరియంట్ 3,75,369 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
                  • 23. హోండా అమేజ్

                    23. హోండా అమేజ్

                    హోండా అమేజ్ ఈ ఏడాది 56,792 యూనిట్లు అమ్మి 12 స్థానంలో నిలిచింది గత ఏడాది 57,377 యూనిట్లు అమ్మింది. గత ఏడాదితో పోల్చుకుంటే అమ్మకాల పరంగా వృద్ది స్వల్పంగా క్షీణించింది.

                    24. హోండా అమేజ్

                    24. హోండా అమేజ్

                    • ఇంజన్: 1198 సీసీ పెట్రోల్, 1498 సీసీ డీజల్
                    • పవర్: 86, 98 బిహెచ్‌పి
                    • టార్క్: 109,200 ఎన్‌ఎమ్
                    • మైలేజ్: 18 , 25.8 కి.మీ/లీ
                    • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
                    • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 5,18,900 మరియు డీజల్ వేరియంట్ 6,20,500 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
                    • 25. టయోటా ఇన్నోవా

                      25. టయోటా ఇన్నోవా

                      టయోటా ఇన్నోవా 52,624 యూనిట్లను అమ్మి 13 స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా 13 వ స్థానంలో నిలిచింది. అయితే వీటి అమ్మకాల పరంగా వృద్దిలో 6.8 శాతం నమోదు అయ్యింది.

                      26. ఇన్నోవా గురించి

                      26. ఇన్నోవా గురించి

                      • ఇంజన్: 2494 సీసీ డీజల్
                      • పవర్: 101 బిహెచ్‌పి
                      • టార్క్: 200 ఎన్‌ఎమ్
                      • మైలేజ్: 12.99 కి.మీ/లీ
                      • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
                      • ధర రూ : డీజల్ వేరియంట్ 10,26,451 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
                      • 27. మారుతి సుజుకి ఇ ఎకొ

                        27. మారుతి సుజుకి ఇ ఎకొ

                        మారుతి సుజుకి ఇ ఎకొ మోడల్ కారు ఈ ఏడాది 50,951 యూనిట్లు అమ్ముడుపోగా, గత ఏడాది 40,278 యూనిట్లు అమ్మకాలు జరిగి 24.8 శాతం వృద్దిని నమోదు చేసుకుని 14 స్థానంలో నిలిచింది.

                        28. మారుతి సుజికి ఇ ఎకొ గురించి

                        28. మారుతి సుజికి ఇ ఎకొ గురించి

                        • ఇంజన్: 1196 సీసీ పెట్రోల్, 1196 సీసీ సియన్‌జి
                        • పవర్: 73, 73 బిహెచ్‌పి
                        • టార్క్: 101,101 ఎన్‌ఎమ్
                        • మైలేజ్: 15.1 కి.మీ/లీ, 20 కి.మీ/కె.జి.
                        • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
                        • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 3,09,519 మరియు సియన్‌జి వేరియంట్ 3,76,148 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
                        • 29 మారుతి సుజుకి ఎర్టిగా

                          29 మారుతి సుజుకి ఎర్టిగా

                          మారుతి సుజుకికు చెందిన మరొక కారు 48,575 యూనిటల అమ్మకాలు జరిగాయి, కాని గత ఏడాదిలో 51,270 యూనిట్ల అమ్మడుపోయాయి. 5.3 శాతం వృద్ది క్షీణించి 15 స్థానంలో నిలిచింది.

                          30. మారుతి సుజికి ఎర్టిగా కారు గురించి

                          30. మారుతి సుజికి ఎర్టిగా కారు గురించి

                          • ఇంజన్: 1373 సీసీ పెట్రోల్, 1248 సీసీ డీజల్
                          • పవర్: 94, 89 బిహెచ్‌పి
                          • టార్క్: 130,200 ఎన్‌ఎమ్
                          • మైలేజ్: 16.02 , 20.77 కి.మీ/లీ
                          • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
                          • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 5,99,521 మరియు డీజల్ వేరియంట్ 7,41,881 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
                          •  31. మహీంద్రా స్కార్పియో

                            31. మహీంద్రా స్కార్పియో

                            మహీంద్రా అండ్ మహీంద్రా ఇంతగా ఎదగడానికి కారణం స్కార్పియో. మహీంద్రా స్కార్పియె ఈ ఏడాదిలో 43,584 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది. అయితే వృద్దిలో ఏ మాత్రం మార్పు లేకుండా 16 వ స్థానంలో నిలిచింది.

                            32. స్కార్పియో యస్‌యువి గురించి

                            32. స్కార్పియో యస్‌యువి గురించి

                            ఇంజన్: 2523 సీసీ డీజల్

                            పవర్: 75 బిహెచ్‌పి

                            టార్క్: 200 ఎన్‌ఎమ్

                            మైలేజ్: 12.99 కి.మీ/లీ

                            ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్

                            ధర రూ : డీజల్ వేరియంట్ 8,78,242 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)

                            33.హ్యుందాయ్ జెంట్

                            33.హ్యుందాయ్ జెంట్

                            హ్యుందాయ్ జెంట్ కారు గత ఏడాది కన్నా కాస్త తక్కువ కార్లను అమ్మింది. 42,496 యూనిట్లను అమ్మి 17 వ స్థానంలో నిలించింది.

                            34. హ్యుందాయ్ జెంట్ సెడాన్ గురించి

                            34. హ్యుందాయ్ జెంట్ సెడాన్ గురించి

                            • ఇంజన్: 1197 సీసీ పెట్రోల్, 1120 సీసీ డీజల్
                            • పవర్: 81, 71 బిహెచ్‌పి
                            • టార్క్: 114,180 ఎన్‌ఎమ్
                            • మైలేజ్: 19.1 , 24.4 కి.మీ/లీ
                            • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
                            • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 5,01,489 మరియు డీజల్ వేరియంట్ 5,86,837 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
                            • 35. ఫోర్డ్ ఎకోస్పోర్ట్

                              35. ఫోర్డ్ ఎకోస్పోర్ట్

                              ఫోర్డ్‌ వారి ఎకోస్పోర్ట్ ఈ ఏడాది 37,305 యూనిట్లు అమ్మింది, గత ఏడాదిలో 43,861 యూనిట్ల అమ్మకాసలు జరిపింది. 14.9 శాతం వృద్ది క్షీణించి 18 వ స్థానంలో నిలిచింది.

                              36. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ గురించి

                              36. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ గురించి

                              • ఇంజన్: 1499 సీసీ పెట్రోల్, 1498 సీసీ డీజల్
                              • పవర్: 110, 89 బిహెచ్‌పి
                              • టార్క్: 140,204 ఎన్‌ఎమ్
                              • మైలేజ్: 15.8 , 22.7 కి.మీ/లీ
                              • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
                              • ధర రూ : పెట్రోల్ వేరియంట్ 6,75,000 మరియు డీజల్ వేరియంట్ 7,88,700 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
                              • 37. మహీంద్రా ఎక్స్‌యువి 5OO

                                37. మహీంద్రా ఎక్స్‌యువి 5OO

                                మహీంద్రా తమ యస్‌యువి కారు అయిన ఎక్స్‌యువి5OO 1,580 యూనిట్లు అమ్మడుపోయి 19 వ స్థానంలో నిలిచింది. గత ఏడాది అమ్మకాలతో పోల్చగా 4.3 శాతం నమోదు చేసుకుంది.

                                38. మహీంద్రా ఎక్స్‌యువి 5OO యస్‌యువి గురించి

                                38. మహీంద్రా ఎక్స్‌యువి 5OO యస్‌యువి గురించి

                                • ఇంజన్: 2179 సీసీ డీజల్
                                • పవర్: 140 బిహెచ్‌పి
                                • టార్క్: 330 ఎన్‌ఎమ్
                                • మైలేజ్: 16 కి.మీ/లీ
                                • ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ మ్యాన్యువల్
                                • ధర రూ : డీజల్ వేరియంట్ 11,20,668 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
                                • 39. టాటా ఇండికా విస్టా

                                  39. టాటా ఇండికా విస్టా

                                  టాటా వారి ఇండికా విస్టా కారు ఈ ఏడాదిలో 30,444 .యూనిట్ల అమ్మకాలు జరిపి 20 వ స్థానంలో నిలిచింది.

                                  40.టాటా ఇండికా విస్టా కారు గురించి

                                  40.టాటా ఇండికా విస్టా కారు గురించి

                                  • ఇంజన్: 1405 సీసీ డీజల్
                                  • పవర్: 70 బిహెచ్‌పి
                                  • టార్క్: 135.4 ఎన్‌ఎమ్
                                  • మైలేజ్: 19.1 కి.మీ/లీ
                                  • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
                                  • ధర రూ : డీజల్ వేరియంట్ 5,01,000 (ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా)
                                  • మరిన్ని ఇంట్రెస్టింగ్ విశయాలకు

                                    గమనిక: ఇందులో గల అన్ని ఇంజన్ స్పెసిఫికేషన్లు, ధర మరియు మైలేజ్ వంటి వివరాలు ఆ కార్ల యొక్క ప్రారంభ వేరియంట్లకు చెందినవి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశయాలకు: టైటానిక్ షిప్ మరియు టైటానిక్ సినిమా మధ్య గల వ్యత్యాసాలు

Most Read Articles

English summary
top 20 best selling cars in india in the year 2015
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X