అల్టిమేట్ పర్ఫామెన్స్ అందించే 'టయోటా ఇన్నోవా హైక్రాస్' రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

ఒకప్పటి నుంచి మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతూ ముందుకు వెళుతున్న టయోటా 2015లో క్వాలిస్ స్థానంలో ఇన్నోవాను తీసుకురావడం జరిగింది. ఇది మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి తిరుగులేని MPV గా ప్రసిద్ధి చెందింది. అయితే కాల క్రమంలో ఇది కొన్ని అప్డేటెడ్ మార్పులకు లోనైంది.

ఇందులో భాగంగానే 2016 లో ఇన్నోవా క్రిస్టా నేమ్‌ప్లేట్‌తో విడుదలైంది. ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు 'ఇన్నోవా హైక్రాస్' రూపంలో దేశీయ మార్కెట్లో ఇటీవలే అడుగుపెట్టింది. దాదాపు ఆరు సంవత్సరాల తరువాత చాలా అప్డేట్స్ తో ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉండే ఈ 'ఇన్నోవా హైక్రాస్' ను ఇటీవల మేము డ్రైవ్ చేసాము. దీని గురించి మరిన్ని వివరాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం.. రండి.

అల్టిమేట్ పర్ఫామెన్స్ అందించే టయోటా హైక్రాస్ రివ్యూ

టయోటా ఇన్నోవా హైక్రాస్ డిజైన్

ఇటీవల భారతీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన 'టయోటా ఇన్నోవా హైక్రాస్' చాలా ఆధునికంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం, ఆధునిక కాలంలో కొనుగోలుదారు కొత్త డిజైన్ కలిగిన వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న కారణంగా కంపెనీ డిజైనర్లు దీనికి అప్డేటెడ్ డిజైన్ అందించడం జరిగింది. ఇన్నోవా హైక్రాస్ యొక్క ముందు భాగంలో పెద్ద హెక్సాగోనల్ గ్రిల్ కలిగి ఎక్కువ భాగం క్రోమ్ ఉండటం చూడవచ్చు. ఇది ట్రిపుల్ ఎల్ఈడీ లైట్స్, ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్‌ వంటివి ఉన్నాయి.

అంతే కాకుండా కొంత పైభాగంలో గ్రిల్ ఇరువైపులా క్రోమ్ స్ట్రిప్‌తో కూడిన ఎడ్జీ ర్యాప్‌రౌండ్ హెడ్‌ల్యాంప్‌ కనిపిస్తుంది. కింది భాగంలో ట్రయాంగిల్ కటౌట్ కనిపిస్తుంది, ఇందులో డ్యూయల్-పర్పస్ LED DRLలు టర్న్ ఇండికేటర్‌లుగా కూడా పనిచేస్తాయి. ఇన్నోవా హైక్రాస్ లో ఉన్న పెద్ద ఎయిర్ డ్యామ్ రెండుగా విభజించి ఉండటం చూడవచ్చు. ఇందులో ఒక భాగం పైన ఉంటుంది, రెండవ భాగం కింద ఉంటుంది. దానికి రెండు చివర్లలో రెండు ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి.

సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ ప్రొఫైల్ కూడా చాలా కొత్తగా కనిపిస్తాయి. కొత్త ఇన్నోవా హైక్రాస్ సైడ్ ప్రొఫైల్ లో చంకీ వీల్ ఆర్చెస్ ఉన్నాయి. ఇవి 225/50 R18 టైర్‌లతో కూడిన పెద్ద 18-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పొందుతాయి. వెనుక భాగంలో ర్యాప్‌రౌండ్ LED టెయిల్‌లైట్స్ ఉంటాయి. ఇవి మందపాటి క్రోమ్ స్ట్రిప్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్, టెయిల్‌గేట్ పవర్డ్ యూనిట్ వంటివి ఇందులో అందుబాటులో ఉన్నాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫీచర్స్:

నిజానికి టయోటా కంపెనీ యొక్క దాదాపు అన్ని కార్లు ఆధునిక ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతాయి. కావున టయోటా హైక్రాస్ కూడా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల హైక్రాస్ లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఇందులో మల్టి లేయర్డ్ డ్యాష్‌బోర్డ్ కొంత సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ పొందుతుంది. హైక్రాస్ ఒక పెద్ద 10.1-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే కలిగి ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.

అల్టిమేట్ పర్ఫామెన్స్ అందించే టయోటా హైక్రాస్ రివ్యూ

స్టీరింగ్ వీల్ వెనుక 7-ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే ఇరువైపులా గేజ్‌లతో అమర్చబడి ఉంటుంది. ఇందులో ఎడమ వైపున హైబ్రిడ్ సిస్టమ్ గురించి వినియోగదారులకు వివరాలను అందిస్తుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు వెంటిలేషన్ ఫ్రంట్ సీట్లను పొందుతుంది. ఇందులో 9-యూనిట్ ఆడియో సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఉన్న పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ మరింత లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.

మూడవ వరుస సీట్లు కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కావున దూర ప్రయాణాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఇందులో మల్టిపుల్ ఛార్జింగ్ పోర్ట్‌లు, రియర్ సన్‌షేడ్‌లు, ఎలక్ట్రోక్రోమిక్ IRVM, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్‌లతో పాటు రిమోట్ ఇగ్నిషన్ స్టార్ట్/స్టాప్, రిమోట్ డోర్ లాక్/అన్‌లాక్, రిమోట్ AC కంట్రోల్ మరియు ఫోన్ మరియు స్మార్ట్‌వాచ్ ద్వారా కంట్రోల్ చేయడానికి అనుకూలంగా ఉండే దాదాపు 65 కి పైగా ఫీచర్స్ ఇందులో ఉంటాయి.

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు 360 డిగ్రీ కెమెరా వంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

అంతే కాకుండా టయోటా ఇన్నోవా హైక్రాస్ లో లేటెస్ట్ ADAS టెక్నాలజీ అందుబాటులో ఉంది. కావున డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేసిన కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రస్తుతం రెండు పవర్‌ట్రెయిన్‌ల ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్.

టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క సాధారణ 2.0 లీటర్ పెట్రోల్ మోడల్ 172 బిహెచ్‌పి పవర్ మరియు 205 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇక 150 బిహెచ్‌పి పవర్ మరియు 187 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ 111 బిహెచ్‌పి పవర్ మరియు 206 ఎన్ఎమ్ టార్క్‌ అందించే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. ఇది e-CVT గేర్‌బాక్స్‌కు జత చేయబడి ఉంటుంది. మొత్తం అవుట్‌పుట్‌ 186 బిహెచ్‌పి కి పరిమితం చేయబడింది.

మేము ఇటీవల టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క హైబ్రిడ్‌ మోడల్ డ్రైవ్ చేసాము. ఇందులో పవర్ డెలివరీ చాలా సరళంగా ఉంది. ఇది సరికొత్త మోనోకోక్ సెటప్‌ కలిగి ఉండటం వల్ల, దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. కావున ట్రిపుల్ డిజిట్ వేగానికి కూడా ఇది సులభంగా చేరుకుంటుంది.

ఇన్నోవా హైక్రాస్ మంచి సస్పెన్షన్ సెటప్‌ కలిగి ఉన్న కారణంగా ఎలాంటి రహదారిలో అయినా సజావుగా ముందుకు సాగుతుంది. అదే సమయంలో ఇది కొత్త మోనోకోక్ ఫ్రేమ్, మృదువైన సస్పెన్షన్ సెటప్‌ కారణంగా కొంచెం బాడీ రోల్ ఉంటుంది. కావున మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

'టయోటా ఇన్నోవా హైక్రాస్'పై మా అభిప్రాయం:

టయోటా కంపెనీ నుంచి యొక్క కొత్త 2022 హైక్రాస్ ఆధునిక కాలంలో కంపెనీకి తప్పకుండా మంచి వారసుడుగా నిలిచే అవకాశం ఉంది. ఇది కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కలిగి, విలాసవంతమైన ఇంటీరియర్‌లతో అందరినీ ఆకర్శించే విధంగా రూపొందించబడి ఉంటుంది. ఈ లేటెస్ట్ MPV వచ్చే సంవత్సరం ప్రారంభంలో అధికారికంగా భారతదేశంలో విడుదలకానుంది. ఈ MPV యొక్క ధరలు కూడా అప్పుడే వెల్లడవుతాయి. ఇన్నోవా హైక్రాస్ ధరల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Toyota innova hycross first drive review details
Story first published: Tuesday, December 6, 2022, 13:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X